Brahmamudi July 4th Episode: రాజ్‌ని గెంటేసిన ఇందూ... రాజ్‌ని ఇంట్లోకి రానివ్వని చలపతి, రేఖ సంబరాలు
Photo Courtesy: JioHotstar
నీకు మేం కావాలా? భార్య కావాలా అని రాజ్‌ను నిలదీస్తాడు చలపతి. నాన్నని జాగ్రత్తగా చూసుకోమని లక్ష్మీతో రాజ్ అనడంతో ఇద్దరూ షాక్ అవుతారు. నీలాంటి కొడుకుని కన్న తల్లిదండ్రులు రోజూ ఏడుస్తూ బతకాల్సిందే. కోట్లా ఆస్తిని చూసి నువ్వు నా కొడుకువన్న విషయం కూడా మరిచిపోయావు, మేం నీ మీద పెట్టుకున్న ఆశల్ని నిలువునా కూల్చేశావని బాధపడతాడు చలపతి. నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు అని నీకు తెలిసేసరికి ఈ తండ్రి ఉండడు, నేను చస్తే నా తలకొరివి పెట్టడానికి కూడా నువ్వు రావొద్దని అంటాడు. తల్లిదండ్రులకు బిడ్డను దూరం చేశావని ఇందూపై కోప్పడి భార్యని తీసుకుని వెళ్లిపోతాడు చలపతి.
ఇంటి దగ్గర రాజ్ కోసం చలపతి, లక్ష్మీ ఏడుస్తుంటారు. మనం ఏ ఇంటికి వాడు వెళ్లకూడదని అనుకున్నామో ఆ దుగ్గిరాల ఇంటికే వెళ్లాడు, ఆ ఇంటి వారసురాలినే పెళ్లి చేసుకున్నాడు. ఎలాగైనా రాజ్‌ను అక్కడి నుంచి తీసుకొచ్చేయాలని భార్యతో చెబుతాడు చలపతి. రాజ్ గాడిని వాళ్ల అమ్మనాన్న ఇంటికి తీసుకెళ్లిపోతారని అనుకుంటే ఇలా జరిగిందేంటీ అని రేఖపై మండిపడతారు భ్రమరాంబ, భూషణ్. మరేం పర్లేదు, ఆ ఇందూయే రాజ్‌ని గెంటేస్తుందని చెబుతుంది రేఖ. నా కారణంగా మీ అమ్మనాన్నలకు నువ్వు దూరం అవ్వడం నాకు ఇఫ్టం లేదు. చిన్నప్పటి నుంచి అమ్మనాన్నల లేక నేను నరకం చూశానని చెబుంది ఇందూ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 4వ తేదీ ఎపిసోడ్ 1076లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
మీ అమ్మానాన్న చాలా మంచోళ్లు మనసులో ఎంతో బాధ ఉంటేనే అలా మాట్లాడతారని రాజ్‌తో చెబుతుంది ఇందూ. మా నాన్న మాటలు వింటుంటే చాలా పాపం అనిపించింది. కొడుకు కోసం వాళ్లిద్దరూ ఎంత తాపత్రయపడుతున్నారో నేను చూశాను, ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెబుతుంది ఇందూ. నాకు అక్కడికి వెళ్లడం కంటే ఇక్కడ ఉండటమే ముఖ్యమని అంటాడు రాజ్. వాళ్ల బాధలు కంటే ఇక్కడున్న బాధ్యతలే ముఖ్యమని చెబుతాడు రాజ్. నేను ఒకసారి ఏదైనా పని మొదలుపెడితే మధ్యలో వదిలేసి వెళ్లిపోయే అలవాటు లేదు. ఇప్పుడు మా అమ్మనాన్నల దగ్గరికి వెళ్లలేనని తేల్చేస్తాడు రాజ్.
నువ్వు మనిషివేనా, నీకు కొంచెం కూడా మనస్సాక్షి లేదా? నువ్వు వాళ్ల కన్నీళ్లు చూసి కూడా ఎలా మాట్లాడుతున్నావని మండిపడుతుంది. డబ్బు కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావని నాకు తెలుసు అని ఇందూ మండిపడుతుంది. నీకు డబ్బంటే ఇష్టమని తెలుసు కానీ, మరీ ఇంత చీప్ క్యారెక్టర్ అనుకోలేదు. లక్షల జీతం వదులుకుని అమ్మానాన్నలతో కలిసుండటానికి వచ్చినవాళ్లని చూశాను. అమ్మనాన్నల మాట కోసం అడవులకు వెళ్లిన కథల్ని చూశాను, కానీ నువ్వు మాత్రం డబ్బు కోసమే అమ్మానాన్నల్ని వదిలేస్తున్నావని ఫైర్ అవుతుంది. నీలాంటి క్యారెక్టర్ని ఏ పుస్తకంలోనూ చూడలేదని అంటుంది ఇందూ.
నేను క్యారెక్టర్ లేనివాడిని, నాకు ఎమోషన్స్ లేవు. ఏమైనా ఉంటే మేము మేము తేల్చుకుంటాం, నువ్వు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని వార్నింగ్ ఇస్తాడు రాజ్. ఇది నా కుటుంబం.. ఈ ఇంట్లో వచ్చే కష్టం నాది, దానిని నేను ఆరుస్తానో, తీరుస్తానో నీకు అనవసరం.. నువ్వు కూడా ఈ ఇంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు, వెళ్లిపోమని ఇందూ చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. నేనే రమ్మన్నాను కాబట్టి.. నేనే వెళ్లిపోమ్మని చెబుతున్నాను అంటుంది ఇందూ. మనిద్దరి మధ్య ఉన్న బంధం అని రాజ్ అడగ్గా ఇందూ షాక్ అవుతుంది.
ఒప్పందాలు లేవు, ఒప్పంద పాత్రలు లేవు.. నీ అద్దె మొగుడు క్యారెక్టర్ చాలు. నీకు పేమెంట్ ఇవ్వాలి కదా అని డబ్బు తీసుకొచ్చి రాజ్ చేతిలో పెడుతుంది ఇందూ. అది చూసి రాజ్ షాక్ అవుతాడు. ఒక్క పైసా కూడా పోనివ్వవు కదా అని బ్యాగ్ తీసుకొచ్చి విసిరేస్తుంది. ఇక నీతో పనైపోయింది వెళ్లిపోమ్మని చెబుతుంది ఇందూ. కాదు కూడదు అని నువ్వు ఇక్కడే ఉంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వనని తేల్చేస్తుంది ఇందూ. నేను మోసం చేశానని అనుకుంటున్నావా అని రాజ్ అడుగుతాడు. దాంతో ఇందూ చేతిలో డబ్బులు పెట్టి బ్యాగ్ తీసుకుని వెళ్లిపోతాడు. రాజ్ వెళ్లిపోతుంటే తల్లడిల్లిపోతూ ఏడుస్తుంది ఇందూ. ఇద్దరికి ఇంట్లో జరిగిన విషయాలన్నీ గుర్తొస్తాయి.
నన్ను క్షమించు రాజు.. నిన్ను బాధపెడితే తప్ప నువ్వు ఇక్కడి నుంచి వెళ్లవని నాకు తెలుసు. నువ్వు నా విషయంలో, ఈ కుటుంబం విషయంలో ఎంత బాధ్యతగా ఉన్నావో నాకు తెలుసు. నన్ను వదిలి వెళ్లడానికి నీకు మనసు రాదు, అందుకే అవమానకరంగానే మాట్లాడాను. మీ అమ్మనాన్నల బాధల్ని పోగొట్టాలనే, నన్ను క్షమించమని మనసులో బాధపడుతుంది ఇందూ. ఇంట్లోకి వెళ్లబోతున్న రాజ్‌ని గుమ్మం దగ్గరే ఆపేస్తాడు చలపతి. వాడు నన్ను నాన్న అని పిలవాలన్నా, ఈ ఇంట్లో అడుగుపెట్టాలన్నా.. ఆ ఇంటిని పూర్తిగా వదిలేసిన తర్వాతే జరుగుతుందని తేల్చేస్తాడు చలపతి. వాడు ఆ ఇంటిని వదిలేసి వచ్చాడా? లేక మనం చచ్చామో బతికామో తెలుసుకుందామని వచ్చావా అని అడుగుతాడు.
నువ్వు మళ్లీ ఆ ఇంటికి వెళ్లకూడదని అంటాడు చలపతి. అమ్మని మధ్యలోనే వదిలేయమంటే నువ్వు వదిలేస్తావా అని మండిపడతాడు రాజ్. మరి నా గుండె ఎలా తట్టుకుంటుంది.. అమ్మని నువ్వు పెళ్లి చేసుకున్నావు, తన పూర్తి బాధ్యత నీదే. కష్టమైనా సంతోషమైనా తను జీవితాంతం నీతోనే ఉంటుంది. మరి నేను కూడా ఇందూని పెళ్లి చేసుకున్నాను కదా? తన పూర్తి బాధ్యత నాదే అవుతుంది కదా? తనని మధ్యలో వదిలేయమంటే ఎలా వదిలేస్తాను. ఇందూకి కోట్ల ఆస్తి ఉన్నా, తనకి ఇంట్లో అంతమంది ఉన్నా.. తను ఎవ్వరినీ నమ్మలేదు, నన్ను నమ్మిందని చెబుతాడు రాజ్. ఆ ఇంటి గేటు ముందు నిలబడే అర్హత లేని నన్ను.. ఆ కోటకి అల్లుడిని చేసింది, తనను మధ్యలోనే వదిలేసి వస్తే నేనొక స్వార్ధపరుడిని అవుతాను కదా అని అంటాడు రాజ్.
నాకు నువ్వు మాత్రమే ముఖ్యం.. ఎవరు ఎలా పోయినా నాకు అనవసరమని తేల్చేస్తాడు చలపతి. ఆ అమ్మాయి ఏ పాపం చేసింది? నువ్వు కోరుకున్న అమ్మాయే మీ ఇంటికి కోడలు అయ్యింది? తను గొప్పింటి బిడ్డ అని తెలిసి బంధాన్ని వదులుకోమని చెబుతున్నావా అని మండిపడతాడు. నన్ను ఏదో శక్తి ఆపుతోంది.. ఆ కుటుంబంతో ఏదో బంధం ఉందని అనిపిస్తోంది. అపర్ణ దేవి, సుభాష్ గారితో మాట్లాడుతుంటే నా మనసుకి ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతోందని అంటాడు. ఆ కుటుంబం నా సొంత కుటుంబం అనిపిస్తోంది, వాళ్ల కష్టం నా కష్టం అనిపిస్తోంది.. వాళ్లను కాపాడటం నా బాధ్యత అనిపిస్తోంది.
నేను లేకపోతే వాళ్లు ఏమైపోతారోనని భయంగా ఉంది. ఇప్పుడు కూడా నేను నేరుగా ఇక్కడికి రాలేదు. పాపం ఆ ఇందూ.. తనెంత మంచిది అంటే మనం బాధపడితే తన కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అందుకే మీరు బాధపడుతున్నారని తను ప్రమాదంలో ఉందని తెలిసి కూడా నన్ను అవమానించి మీ కోసం నన్ను ఆ ఇంట్లో నుంచి పంపేసింది. అలాంటి మనిషిని ఎలా వదిలేయమంటున్నారు. తనకు తోడుగా ఉంటూ తన సమస్యల్ని తీరుస్తానని తనకు మాటిచ్చాను, ఖచ్చితంగా నేను నా మాటను నిలబెట్టుకుంటానని అంటాడు రాజ్. అంటే మమ్మల్ని వదిలేసుకుంటావా అని ప్రశ్నిస్తాడు చలపతి. నాకు మీరెంత ముఖ్యమో, ఆ అమ్మాయి కూడా అంతే ముఖ్యం. మీరే నన్ను ఆ ఇంటికి వెళ్లమనే వరకు నేను ఇక్కడే ఉంటాను, మీరు చెప్పే వరకు నేను ఆ ఇంటికి వెళ్లనని అంటాడు రాజ్. అది ఎప్పటికీ జరగదని తేల్చేస్తాడు చలపతి. నువ్వే నన్ను పంపిస్తావని నాకు నమ్మకం ఉందని అంటాడు రాజ్.
మరోవైపు.. మనవడిని భోజనానికి పిలవమని ఇందూతో చెబుతుంది అపర్ణ. ఇంట్లో ఉన్నవాళ్లని పిలవొచ్చు కానీ, లేనివాళ్లను ఎలా పిలవాలని అంటుంది ఇందూ. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. రాజ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని చెబుతుంది ఇందూ. తను ఫోన్ చేసినా రాడు, ఇంట్లో నుంచి పర్మినెంట్‌గా వెళ్లిపోయాడని ఇందూ చెప్పడంతో రేఖ, భ్రమరాంబలు సంతోషిస్తారు. వెళ్లేటప్పుడు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదని అపర్ణ బాధపడుతుండగా.. నేనే పంపించేశానని అంటుంది ఇందూ. వాళ్ల అమ్మనాన్న ఇంటికొచ్చి బాధపడ్డారు కదా? అని చెబుతుంది. నీకంటే తెలియదు, నువ్వు చెప్పగానే రాజ్ ఎలా వెళ్లిపోయాడు.. ఏదైనా ఉంటే మాతో మాట్లాడాలని చెబుతుంది అపర్ణ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications