Brahmamudi july 5th episode: విఫలమైన కావ్య రాయబారం.. కళ్యాణ్ తన కాళ్లు పట్టుకోవాలంటున్న అనామిక!
అనామిక తల్లిదండ్రులని ఇంటికి పిలిపించి పంచాయతీ పెట్టడంతో తల్లిదండ్రులతో సహా ఆమెని బయటికి పొమ్మంటాడు కళ్యాణ్. తరువాత అనామిక కళ్యాణ్ పై పోలీస్ కేసు పెడుతుంది. అప్పు కళ్యాణ్ దగ్గరికి వెళ్తానంటే కనకం అడ్డుకుంటుంది. కానీ కోర్టులో అప్పుని హాజరపరచమని జడ్జిగారు ఆర్డర్ వేస్తారు. కనకం కూతుర్ని కోర్టుకు పంపించను అంటుంది. కానీ అప్పు తల్లికి నచ్చ చెప్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 5వ తేదీ ఎపిసోడ్ 454 లో ఏం జరిగిందంటే..
ఆలోచనలో ఉన్న రాజ్ దగ్గరికి వచ్చిన కావ్య ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. సమస్యకి పరిష్కారం దొరకనప్పుడు అంతా శూన్యంగానే కనిపిస్తుంది అంటాడు రాజ్. ఇంట్లో అందరూ కవిగారికి శిక్ష పడుతుందేమో అని భయపడుతున్నారు, మనం వెళ్లి ఒకసారి అనామిక తో మాట్లాడదామా అని అడుగుతుంది కావ్య. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు, ఇంకా వాళ్ళని కలపాలని చూస్తున్నావా అని అడుగుతాడు రాజ్.

కలపడం, కలపకపోవడం పక్కన పెట్టండి ఇప్పుడు కవి గారికి శిక్ష పడకుండా చేయటం కోసం ఏమైనా చేయాలి అంటుంది కావ్య. ఇప్పుడు మనం వెళ్లి అడిగితే తనకి మనమే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అయినా తను కళ్యాణ్ డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది ఆ విషయం మనం గ్రహించలేకపోయాము, పెళ్లి సమయంలో రెండు కోట్లు అప్పు తీర్చమనే విశ్వాసమైనా వాళ్లకి లేదు. అసలు వాళ్ళ తల్లిదండ్రులు మనుషులేనా, కూతురు కాపురాన్ని చేజేతులా నాశనం చేస్తున్నారు. నేనైతే మాట్లాడటానికి రాను కావాలంటే నువ్వు వెళ్లి మాట్లాడు అంటాడు రాజ్.
నెక్స్ట్ సీన్ లో కావ్య అనామిక దగ్గరికి వెళుతుంది. కావ్య ని చూసిన అనామిక నేను అనుకున్నాను రాయబారానికి ఎవరో ఒకరు వస్తారని అంటుంది. కనీసం తనని కూర్చోమని కూడా అనకుండా మాట్లాడుతున్న అనామికాతో నువ్వు నాతోనే ఇలా మాట్లాడుతున్నావంటే అత్తింటికి వచ్చే ఉద్దేశం నీకు లేదని అర్థమవుతుంది అంటుంది కావ్య. నేనెందుకు వస్తాను ఆ కళ్యాణే నా ఇంటికి వస్తాడు అంటుంది అనామిక. నీ భర్త నీ ఇంటికి రావాలి అనుకుంటే మరి ఈ కోర్టులు, కేసులు ఏమిటి నీ భర్త నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓపిగ్గానే ఎదురుచూసాడు కదా అంటుంది కావ్య.

ఓపిక ఎవరికి కావాలి అతను ఆఫీస్ కి వెళ్లి కోట్లు సంపాదించి నా ముందు కుమ్మరించాలి అంటుంది అనామిక. కావ్య చాలాసేపు అనామికని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది కానీ అనామిక రేపు కోర్టులోనే తేల్చుకుందాం అని తల బిరుసుగా మాట్లాడి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం కోర్టు దగ్గరికి అప్పు వాళ్ళు వస్తారు. అప్పటికే అక్కడ రెడీగా ఉన్న మీడియా వాళ్ళు అప్పుని ఎన్నాళ్ళుగా మీకు ఈ అక్రమ సంబంధం సాగుతుంది, కళ్యాణ్ మీకు ఎంత డబ్బు ఇచ్చాడు అని అసహ్యంగా మాట్లాడుతారు.
ఆడవాళ్ళై ఉండే మరొక ఆడదానితో ఇలాగైనా మాట్లాడతారు అంటుంది కనకం. మేము మీ అమ్మాయిలాగా తప్పు చేయలేదు నిజాన్ని ప్రజలకు నిరూపించాలనుకుంటున్నాము అంటారు మీడియా వాళ్ళు. మీకు తెలిసింది సగమే తెలియని దాన్ని మీ దగ్గర నేను నిరూపించలేను అంటూ కూతురిని తీసుకొని కోర్టులోకి వెళ్ళిపోతుంది కనకం. కళ్యాణ్ బోను దగ్గరికి వెళ్లిన అనామిక చూసావా నిన్ను ఎక్కడ వరకు తీసుకొచ్చానో అంటుంది.

చూశాను, కాపురాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నా నిన్ను చూసి జాలి పడుతున్నాను, నాదేముందే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నాను అంటాడు కళ్యాణ్. పక్కనున్న పోలీసు జడ్జిగారు వచ్చే టైం అయింది ఇక్కడ వాదనలు చేయకూడదు వెళ్లి బోన్లో నిలబడమని అనమికాతో చెప్తే ఆమె తన బోనులోకి వెళ్ళిపోతుంది. అప్పుడే జడ్జిగారు వస్తారు. లాయర్ ఏదో మాట్లాడబోతుంటే నేను మాట్లాడతాను అంటూ జడ్జి గారు మాట్లాడటం ప్రారంభిస్తారు.
నిజానికి ఇలాంటి కేసులు కోర్టు వరకు రాకుండా ఉంటేనే మంచిది, అయినా వచ్చింది ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి మీ ఇద్దరికీ కలిసి ఉండాలని లేదా, ఒకరికి ఒకరు అక్కర్లేదా అని అడుగుతాడు జడ్జిగారు. నాకు మా ఆయన కావాలి అంటుంది అనామిక. కానీ ఇంత సింపుల్గా కాదు, అప్పు తో సంబంధం పెట్టుకున్నందుకు నా భర్త నాకు కాళ్ళు పట్టుకోవాలి, అదే సమయంలో ఆ అప్పుకి శిక్షపడేలాగా చేయాలి అని డిమాండ్ చేస్తుంది అనామిక.

తరువాయి భాగంలో అనామిక కళ్యాణ్ వలన పడిన చిత్రహింసల మాటేమిటి అని అడుగుతుంది ఆమె తరపు లాయర్. ఈ కేసుకి సంబంధించి ఒక బలమైన సాక్ష్యాన్ని సేకరించిన సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతున్నాను, ఆమె మరెవరో కాదు కావ్య అంటాడు కళ్యాణ్ తరపు లాయర్. కావ్య బోను లోకి వస్తుంది.


Click it and Unblock the Notifications











