Brahmamudi July 5th Episode: రాహుల్ సెకండ్ సెటప్‌ని పట్టుకున్న స్వప్న.. ఆఫీస్‌లో రాజ్ పిచ్చి చేష్టలు
Photo Courtesy: JioHotstar
రాజ్‌కి కావ్య ఎండీగా ట్రైనింగ్ ఇస్తున్న విషయాన్ని పసిగట్టిన రుద్రాణి వెంటనే యామినికి లీక్ చేస్తుంది. మరేం పర్లేదని నేను చూసుకుంటానని.. ఆ కావ్య ఎత్తుకు పైఎత్తులు నేను వేస్తానని చెబుతుంది యామిని. అప్పూ నగలు తీసుకుని సీరియస్‌గా స్వప్న దగ్గరికి వస్తుంది. ఈ నగలు గిల్ట్ నగలని చెప్పడంతో స్వప్న షాకై అనుమానం వస్తుంది. ఈ నగల్ని రాహుల్ దొంగతనం చేయడం కాదు.. ఒరిజనల్ ప్లేసులో డూప్లికేట్ పెడుతుండగా నాకు దొరికిపోయాడని చెబుతుంది.
ఆ నగల్ని ఎవరికి ఇచ్చాడో కనుక్కోవాలని స్వప్న, అప్పూ ప్లాన్ చేస్తారు. ఇద్దరూ కలిసి రాహుల్ కనిపించేలా కబోర్డ్ తాళం పెట్టడంతో అతను ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కొట్టేస్తాడు. కావ్యను ఇంప్రెస్ చేసి తన మనసులో ఉన్న మాటను చెప్పాలని అనుకుంటాడు రాజ్. ఉదయాన్నే రాజ్ ఎండీ గెటప్‌లో ఆఫీస్‌కి వచ్చి స్టాఫ్ మీద అరుస్తుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 5వ తేదీ ఎపిసోడ్ 766లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఆఫీస్‌లో రాజ్ ప్రవర్తనతో ఉద్యోగులకు అనుమానం వచ్చి శృతిని ఏం జరిగిందని అడుగుతారు. మీకు సమాధానం కావాలంటే వెళ్లి ఆయన్నే పిలుచుకుని వస్తానని చెప్పడంతో స్టాఫ్ మొత్తం భయపడి పారిపోతారు. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా టిఫిన్ చేస్తుండగా కావ్యని చూసి రుద్రాణి వింతగా చూస్తుంది. దాంతో అందరూ రుద్రాణిని ఏం జరిగిందని అడుగుతారు. ఆస్తి గురించి ఆలోచించడం తప్పించి నాకు వేరే పనులు లేవని అనుకుంటున్నారా? రుద్రాణి అడుగుతుంది. నీ పని ఆ ఆస్తిని ఎలా కొట్టేయాలా? అనే కదా ఇక వేరే పని ఉంటుంది అని ప్రశ్నిస్తుంది అపర్ణ. ఈ ఇంటి వారసుడు రాజ్ ఎందుకు రాలేదంటని చూస్తున్నానని చెబుతుంది రుద్రాణి.
నిన్నంతా, నేను ఆయన ఏం మాట్లాడుకుంటున్నామో దొంగచాటుగా ఎందుకు విన్నారని నిలదీస్తుంది కావ్య. ఆవిడ తొంగి తొంగి చూస్తుంది.. వంగి వంగి చూస్తుంది, ఆవిడవి అన్ని దొంగ బుద్ధులు కదా అని అంటుంది స్వప్న. రాహుల్ పొద్దున్నే కంగారుగా వెళ్లిపోతుండటంతో కళ్యాణ్ ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. అర్జెంట్ మీటింగ్ ఉందని రాహుల్ చెప్పడంతో .. ఆఫీస్‌కి వెళ్లనివాడికి మీటింగ్ ఏంటి అని స్వప్న సెటైర్లు వేస్తుంది. మీటింగ్‌కి ఇలాంటి దసరా బుల్లోడు గెటప్‌లో వెళ్తారా? అని అప్పూ అడుగుతుంది. దాంతో రాహుల్‌ని ఫాలో చేయాలని అప్పూ, స్వప్నలు అనుకుంటారు.
కావ్యకి శృతి ఫోన్ చేసి రాజ్ సార్ ఆఫీస్‌కి వచ్చేశారని చెప్పడంతో కళావతి షాక్ అవుతుంది. రాజ్ సార్ వింతగా ప్రవర్తిస్తుండటంతో, సార్‌కి గతం గుర్తు లేదన్న విషయం ఆఫీసులో ఎవరికీ తెలియదని చెబుతుంది శృతి. మీరు తొందరగా రాకపోతే కొంపలు అంటుకునేలా ఉన్నాయని అంటుంది శృతి. కావ్య కంగారు పడటంతో ఏం జరిగిందని సుభాష్, అపర్ణ అడుగుతారు. మీ అబ్బాయిగారు ఆఫీస్‌కెళ్లి హడావుడి చేస్తున్నారని చెబుతుంది. రేపు అందరికీ సర్‌ప్రైజ్ ఇద్దామని నేను అనుకుంటే నాకే షాక్ ఇచ్చారని కావ్య టెన్షన్ పడుతుంది. ఈ దెబ్బతో కావ్య ప్లాన్ పూర్తిగా ఫ్లాప్ అయినట్లేనని రుద్రాణి సంబరపడిపోతుంది.
రాజ్ ఎండీ చైర్‌లో కూర్చొని పొంగిపోతుండగా మేనేజర్ వచ్చి ఆఫీస్‌కి సంబంధించిన వివరాలన్నీ చెబుతాడు. ఈరోజు మేడం వస్తారా అని అడగ్గా.. రాజ్ మండిపడతాడు. ఫైలు తీసుకుని సంతకం రైట్ హ్యాండ్‌తో పెట్టాలా? లెఫ్ట్ హ్యాండ్‌తో పెట్టాలా? అనేది అర్ధం కాక టెన్షన్ పడుతుంటాడు రాజ్. కావ్య చెప్పిన దానిని బట్టి ఆ బాస్ గాడు చాలా తేడా మనిషిలా ఉన్నాడని.. ఎందుకైనా మంచిదని లెఫ్ట్ హ్యాండ్‌తో సంతకం పెడతాడు. దానిని గమనించిన మేనేజర్ .. ఎప్పుడూ రైట్ హ్యాండ్‌తో సంతకం చేసేవారు కదా అని అంటాడు. ఇంతలో శృతి వచ్చి సార్ మల్టీ టాలెంటెడ్ అని రెండు చేతులతోనూ సంతకం పెట్టగలరని అంటుంది.
శృతి ఏంటీ నన్ను మేనేజ్ చేస్తుంది.. కళావతికి బాగా క్లోజ్ అనుకుంటా అని రాజ్‌కి అనిపిస్తుంది. వెంటనే వెళ్లి స్టాఫ్ అందరినీ పిలవమని రాజ్ చెప్పడంతో శృతి టెన్షన్ పడుతుంది. మిమ్మల్ని చూసి స్టాఫ్ అంతా భయపడుతున్నారని.. ఇప్పుడు వాళ్లంతా ఎందుకని అడుగుతుంది శృతి. ఇంటి పేపర్స్ తీసుకుని రాహుల్ తన ప్రియురాలికి ఇవ్వడంతో ఆమె సంబరపడిపోతుంది. ఇక నేను నీకు సొంతం ఏం కావాలన్నా ఆర్డర్ వేస్తే చాలని అంటుంది ప్రియురాలు. అప్పుడు నేనొచ్చి నీ ఒళ్లు చిల్లులు పడేలా చేస్తానని అంటుంది స్వప్న. స్వప్న, అప్పూలను చూసి రాహుల్ షాక్ అవుతాడు.
వీడిని నేనే నమ్మను.. నువ్వేలా నమ్మావని రాహుల్ ప్రియురాలిని అడుగుతుంది స్వప్న. ఈ డాక్యుమెంట్స్ ఇవ్వగానే నిన్ను నువ్వు సమర్పించుకోవడానికి రెడీ అయిపోయావా? అని నిలదీస్తుంది. ఇవి డూప్లికేట్ డాక్యుమెంట్స్ అని ..వాటితో నిన్ను ఫూల్‌ని చేశాడని అంటుంది స్వప్న. నన్నే చీట్ చేస్తావా అంటూ రాహుల్‌ని కొట్టబోతుండగా స్వప్న అడ్డుపడుతుంది. నా కళ్లముందే నా మొగుడిని కొడతావా? వాడిని నేనే కొట్టాలి.. నేనే తిట్టాలి, ఎవరుపడితే వాళ్లు చేయి ఎత్తితే చంపేస్తానని అంటుంది. నన్ను క్షమించమని రాహుల్ అనగా స్వప్న చీపురు కట్టతో రాహుల్‌ని చితకబాదుతుంది. రాహుల్ ప్రియురాలు పారిపోతుండగా అప్పూ పట్టుకుని ఏడు వారాల నగలు తీసుకుంటుంది.నా కొడుకు నిప్పు, తుప్పు అంటున్న వాళ్లమ్మ దగ్గరకి తీసుకెళ్లి కొట్టాలని అప్పూతో అంటుంది స్వప్న. మా అమ్మ దగ్గరికి మాత్రం తీసుకెళ్లొద్దని బతిమలాడతాడు రాహుల్.
ఆఫీస్‌లో స్టాఫ్ మొత్తంతో రాజ్ మీటింగ్ పెట్టడంతో శృతి కంగారుపడి కావ్యకి ఫోన్ చేస్తుండగా రాజ్ చూసి మండిపడతాడు. నేను మాట్లాడుతున్నంత వరకు నీకు ఫోన్ రాకూడదని స్విచ్ఛాప్ చేయిస్తాడు. ఆఫీస్‌లో ఒక్క ఫైల్ కూడా కరెక్ట్‌గా లేదని, నాలుగు రోజులు ఆఫీస్‌లో బాస్ లేకపోతే మీ ఇష్టం వచ్చినట్లు చేస్తారా? అని స్టాఫ్‌పై మండిపడతాడు రాజ్. మీరేం చేసినా నేనేం అనడం లేదు అనుకుంటున్నారా? ఏంటీ మీ ధైర్యం అని క్లాస్ పీకుతాడు. ఇలా పనులు డీలే చేస్తూ, డిజైన్స్‌లో తప్పులు చేస్తుంటే మనకి కొత్త ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయని అడుగుతాడు. మన కంపెనీకి లాభాలు ఎలా వస్తాయి? ఎలా నెంబర్‌వన్‌గా ఉంటుందని అనుకుంటున్నారు? అని నిలదీస్తాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











