Brahmamudi 6th July episode: కోర్టు బోనులో కావ్య.. కంగారులో రాజ్

అనామిక కళ్యాణ్ పై పోలీస్ కేసు పెడుతుంది. అప్పు కళ్యాణ్ దగ్గరికి వెళ్తానంటే కనకం అడ్డుకుంటుంది. కానీ కోర్టులో అప్పుని హాజరపరచమని జడ్జిగారు ఆర్డర్ వేస్తారు. కనకం కూతుర్ని కోర్టుకు పంపించను అంటుంది. కానీ అప్పు తల్లికి నచ్చ చెప్తుంది. కావ్య అనిత ఇంటికి వెళ్లి ఆమె మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది,ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 6వ తేదీ ఎపిసోడ్ 455లో ఏం జరిగిందంటే..

అప్పుకి కళ్యాణ్ కి శిక్ష పడితీరాలి వాళ్ల గురించి ప్రపంచానికి తెలియాలి అంటుంది అప్పు. కళ్యాణ్ అభిప్రాయం చెప్పమంటాడు జడ్జి. నాకు విడాకులు కావాలి అంటాడు కళ్యాణ్. ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలని లేదా అంటాడు జడ్జి. నేను అనామికని పెళ్లి చేసుకోవడం తెలిసి చేసిన అపరాధం, జీవితాంతం ఆమెతో కలిసి ఉండటం కంటే మీరు వేయబోయే శిక్ష చాలా చిన్నది అంటాడు కళ్యాణ్. నాకు విడాకులు ఇచ్చి ఈ కళ్యాణ్ ఆ అప్పుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అంటుంది అనామిక.

Brahmamudi serial July 6th 2024 Episode of 455 Here is full story

విడాకులు ఇచ్చిన తర్వాత నీ అభిప్రాయంతో పనేముంది, అతను ఎవరిని చేసుకున్నా నీకు అనవసరం అంటాడు జడ్జి. తర్వాత డిఫెన్స్ లాయర్ తో మాట్లాడుతూ ఆమె కోర్ట్ నుంచి ఏమి కోరుకుంటుందో స్పష్టంగా అర్థం అయ్యేలాగా చెప్పమని చెప్తాడు జడ్జి. సరే అంటూ కళ్యాణ్ తరపు లాయర్ అనామిక దగ్గరికి వచ్చి అడిగిన ప్రశ్ననే అడుగుతూ అనామిక కి చిరాకు తెప్పిస్తాడు. అడిగిందే అడిగి ఎందుకు చిరాకు తెప్పిస్తారు అంటుంది అనామిక.

మరి నీ భర్తకి కూడా చిరాకు వస్తుంది కదా అతను అప్పుతో కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది అని చెప్తూనే వచ్చాడు కానీ అప్పుతో సంబంధం ఉంది అని చెప్పిందే చెప్తూ ప్రతి పూట అతనితో గొడవ పెట్టుకుని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. చివరికి కోర్టు వరకు వచ్చింది అంటాడు లాయర్. అప్పుడు అనామిక తరపు లాయర్ వాళ్ళిద్దరి మధ్యన ఉన్నది స్నేహం అయితే హోటల్లో ఎందుకు దొరికిపోయారు అంటూ ఎవిడెన్స్ ని చూపిస్తుంది.

Brahmamudi serial July 6th 2024 Episode of 455 Here is full story

అయితే కళ్యాణ్ తరపు లాయర్ అందులో సగం ఇన్ఫర్మేషన్ ఉంది, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది అంటూ వెయిటర్ డోర్ వేయటం, మీడియా వచ్చేసరికి డోర్ తీయడం ఉన్న సిసి ఫుటేజ్ చూపిస్తాడు. ఇదంతా అనామిక ప్లాన్ ప్రకారం చేసింది అని నిరూపిస్తాడు. అప్పుడు అనామిక తరపు లాయర్ మాట్లాడుతూ కానీ కళ్యాణ్ కి అప్పుతో సంబంధం ఉన్న మాట నిజం, మీరు అనుమతిస్తే అప్పు ని కొన్ని ప్రశ్నలు వేస్తాను అంటుంది.అప్పు బోన్ లోకి వచ్చి నిలబడిన తర్వాత నీకు ఆ కళ్యాణ్ కి సంబంధం ఉందా అని అడుగుతుంది లాయర్.

లేదు అంటుంది అప్పు. రుజువు చేయగలవా అంటుంది లాయర్. చేస్తాను అంటుంది అప్పు. అప్పుడే డిఫెన్స్ లాయర్ లేచి అప్పుకి కళ్యాణ్ కి ఏ సంబంధం లేదని ఈ అనామిక యే ఒప్పుకుంది అంటూ అనామిక అప్పు తో రోడ్డుమీద ఆర్గుమెంట్ వీడియో చూపిస్తాడు. అందులో అనామిక మాట్లాడుతూ మీ ఇద్దరికీ సంబంధం లేకపోయినా ప్రపంచానికి సంబంధం ఉంది అని నిరూపించాను అంటుంది. ఆ వీడియో చూసి కోర్టులో అందరూ షాక్ అవుతారు. ఇప్పటికైనా అనామిక ఉద్దేశం ఏమిటో మీకు అర్థం అయి ఉంటుంది అని జడ్జి గారితో అంటాడు డిఫెన్స్ లాయర్.

Brahmamudi serial July 6th 2024 Episode of 455 Here is full story

అప్పుడు అనామిక లాయర్ మాట్లాడుతూ మరి కళ్యాణ్ అనామిక ని పెట్టిన చిత్రహింసల మాటేమిటి అంటుంది. అప్పుడు డిఫెన్స్ లాయర్ మాట్లాడుతూ ఈ కేసుకి సంబంధించి బలమైన సాక్ష్యం సంపాదించిన కావ్య ని బోన్ లోకి ప్రవేశ పెట్టవలసిందిగా కోరుతాడు. అప్పుడు కావ్య బోను లోకి వచ్చి నా మరిది చాలా మంచివాడు, అతనికి కవిత్వం గురించి తప్పితే మరేమీ తెలియదు అలాంటి వ్యక్తిని ఈ అనామిక కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అది నాకు నిన్న రాత్రే పూర్తిగా అర్థమైంది.

అనామిక ని కలిసి రాజీ కుదర్చాలని నిన్న రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్లాను. కానీ నేను దాడి చేయడానికి వెళ్లాను అని ఆరోపిస్తుందేమో అని ఆమెకి తెలియకుండా ఆమెతో మాట్లాడినదంతా రికార్డు చేయించాను అంటుంది కావ్య. అదంతా ఇందులో పూర్తిగా రికార్డ్ అయింది అంటూ ఎవిడెన్స్ జడ్జికి ఇస్తాడు లాయర్. ఇన్నాళ్లు వాళ్ళిద్దర్నీ కలపటానికి ప్రయత్నించాను కానీ నిన్న రాత్రి ఇలాంటి మనిషి నా మరిది జీవితంలో ఉండకూడదనే అభిప్రాయానికి వచ్చాను అంటుంది కావ్య.

తరువాయి భాగంలో రాజ్ తన భార్యకి ఐ లవ్ యు చెప్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X