Brahmamudi July 6th Episode: ఇందూ జ్ఞాపకాలలో రాజ్ నరకం.. దుగ్గిరాల ఆస్తి కొట్టేసేలా రేఖ కొత్త స్కెచ్
Photo Courtesy: JioHotstar
రాజ్‌కి ఎంత చెప్పినా దుగ్గిరాల వారి ఇంటిని వదిలి వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో అతనిపై కోప్పడుతుంది. నీకు కావాల్సింది డబ్బులే కదా అని ఫుల్ పేమెంట్ ఇచ్చి అతని చేతిలో పెడుతుంది. నా సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోమని ఇందూ చెప్పడంతో రాజ్ మనసు ముక్కలై ఇల్లు వదిలి వెళ్లిపోతాడు. రాజ్ వెళ్లిపోతుండటంతో మేడపై నుంచి ఏడుస్తూ చూస్తుంది. భారంగా తన ఇంటికి వచ్చిన రాజ్ లోపలికి వెళ్లబోతుండగా చలపతి అడ్డుకుంటాడు.
నువ్వు నా కొడుకుగా వచ్చావా? దుగ్గిరాల వారి ఇంటికి అల్లుడిలా వచ్చావా అని నిలదీస్తాడు. ఇందూ మీద ఎందుకంత కోపం.. ఇందూ చాలా మంచి అమ్మాయి.. మీరు బాధపడుతుండటం చూసి తనే నన్ను ఇక్కడికి పంపించింది. అయినా ఆ ఇంటికి నాకు ఏదో బంధం ఉందని అనిపిస్తోందని చెబుతాడు రాజ్. ఈ మాటలు విన్న చలపతి షాక్ అవుతాడు. భోజనానికి రాజ్ రాకపోవడంతో మనవడు ఎక్కడ అని అపర్ణ అడగ్గా.. తన ఇంటికి శాశ్వతంగా వెళ్లిపోయాడని ఇందూ చెప్పడంతో అపర్ణ షాక్ అవుతుంది. రాజ్ పీడ విరగడైందని రేఖ, భ్రమరాంబ, ఐశ్వర్యలు సంతోషిస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 6వ తేదీ ఎపిసోడ్ 1077లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రాజ్‌ని ఎందుకు గెంటేశావు? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావని ఇందూపై మండిపడుతుంది అపర్ణ. నువ్వు చెప్పగానే రాజ్ ఎందుకు వెళ్లిపోయాడు? ఏదైనా ఉంటే మాతో మాట్లాడాలి, పెద్దవాళ్ల అభిప్రాయాలు తీసుకోవాలని అంటుంది. తను ఎలా వచ్చాడో అలాగే వెళ్లిపోయాడు, దీని గురించి డిస్కషన్ ఎందుకు అంటుంది ఇందూ. నువ్వు కాదు.. నేనే ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెబుతానని రాజ్‌కి ఫోన్ చేస్తుండగా ఫోన్ లాక్కుంటుంది ఇందూ. నువ్వు నా గురించి ఎంత టెన్షన్ పడుతున్నావో, రాజ్ గురించి వాళ్ల అమ్మానాన్న కూడా అంతే బాధపడతారు. అందుకే వెళ్లిపోమ్మని చెప్పానని, ఇక ఈ విషయం ఎవరూ మాట్లాడొద్దని వెళ్లిపోతుంది ఇందూ.
తన ప్లాన్ వర్క్ అవుట్ అయినందుకు సంబరాలు చేసుకుంటుంది రేఖ. వాడు వెళ్లిపోగానే సరిపోదు, ఇంతకుముందులా నువ్వు చక్రం తిప్పాలి. మనకు వీళ్లంతా బానిసల్లా ఉండాలని అంటుంది ఐశ్వర్య. అన్ని నువ్వు అనుకున్నట్లుగా జరుగుతాయని చెబుతుంది ఐశ్వర్య. ఇందూ గురించి బాధపడుతున్న రాజ్ దగ్గరికి వెంకీ వచ్చి.. ఏం జరిగిందని అడుగుతాడు. నువ్వు ఇందూని పెళ్లి చేసుకోవడం ఏంటీ? ఈవెంట్ మేనేజర్‌గా తీసుకొచ్చావు.. అప్పటికే మీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అని అడుగుతాడు వెంకీ. మా ఇద్దరి మధ్య అప్పటికి ఏం లేదు.. కాకపోతే ఆ రోజు అమ్మానాన్న బలంగా కోరుకున్నారు, ఆ దేవుడు తథాస్తు అన్నాడు.. అందుకే పెళ్లి చేసుకున్నానని అంటాడు రాజ్.
మాకు చెప్పకుండా అంత సీక్రెట్‌గా పెళ్లెందుకు చేసుకున్నావు? నువ్వు వదినని ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు అమ్మానాన్న బాధపడుతున్నారని అంటాడు వెంకీ. నాకు హ్యాపీగానే ఉంది కానీ, అమ్మానాన్న బాధపడుతున్నారని చెబుతాడు. వదిన చాలా మంచిది, అందరికీ నచ్చింది. కానీ నాన్న మాత్రం ఎందుకో వదినని వదిలేయమంటున్నాడని బాధపడతాడు వెంకీ. ఆస్తులు ఉన్నవాళ్లకి శత్రువులు ఎక్కువగా ఉంటారు, వాళ్లు నన్ను ఏమైనా చేస్తారని ఆయన భయమని చెబుతాడు రాజ్. చావుకి భయపడి మన లక్ష్యాన్ని మార్చుకోకూడదని అంటాడు. నువ్వు జాబ్ చేయకపోయినా, ఖాళీగా తిరిగినా పట్టించుకోలేదు. కానీ ఈ విషయాన్ని మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. అమ్మానాన్న చాలా బాధపడుతున్నారని అంటాడు వెంకీ.
రాజ్‌కి అపర్ణ ఫోన్ చేసి నువ్వు నన్ను సొంత అమ్మమ్మలా ట్రీట్ చేసుంటే వెళ్లిపోయేవాడివా? అని అడుగుతుంది. మీ మనవరాలే నిర్ణయం తీసుకుంది, నన్ను వెళ్లిపోమ్మన్నది రాజ్ అంటాడు. అది చిన్న పిల్ల అది వాగేస్తే నువ్వు వెళ్లిపోతావా? మాతో చెప్పాలి.. నువ్వు తప్పు చేశావు, నిన్ను నమ్ముకున్నవాళ్ల కలల్ని తుంచేశావు అంటుంది అపర్ణ. నువ్వు వచ్చాకే ఇందూ జీవితం బాగుపడింది, పనిమనిషిగా ఒక మూలన ఉండాల్సిన తను ఈరోజు కంపెనీకి సీఈవో అయ్యింది, మీరిద్దరూ కలిసి కంపెనీ సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ఇలాంటి సమయంలో నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదని అంటుంది. ఇందూ జీవితంలో వెలుగులు నింపేది నువ్వే, మళ్లి తిరిగొచ్చి ఆ వెలుగులు అలాగే ఉంచుతావో లేదో నీ ఇష్టమని అంటుంది అపర్ణ.
రాజ్‌ని ఎందుకు పంపించేశావు, ఇదంతా ఎందుకు చేస్తున్నావని మండిపడుతుంది అపర్ణ. నేను ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్టేనని అంటుంది ఇందూ. పెళ్లంటే ఇద్దరు వ్యక్తులు ఒక్కటికావడం, వారి దారులు వేరైనా కలిసి బతకడమని చెబుతుంది అపర్ణ. రాముడులేని రాజభవనం కన్నా.. రాముడున్న అరణ్యమే గొప్పదని ఆయన వెంట నడిచింది, ఆడపిల్ల ఎక్కడున్నా భర్త వెంటే ఉండాలని చెబుతాడు సుభాష్. ఒకప్పుడు మీ నాన్నే మీ అమ్మని వద్దు అన్నా.. తను వెళ్లలేదు, ధైర్యంగా ఒంటరిగా నిలబడి పోరాడి.. ఈ కుటుంబం మొత్తాన్ని ఎదిరించి నిలబడింది. మళ్లీ మీ తాతయ్య వల్ల ఈ ఇంట్లో అడుగుపెట్టింది. తన మంచితనానికి మేమంతా మారిపోయాం.. తను గొప్పవ్యక్తిగా గుర్తించే కుటుంబానికి మీ అమ్మలా విలువ ఇవ్వాలి, నీలా కష్టం వచ్చిందని విడిపోకూడదని చెబుతుంది అపర్ణ.
వాళ్ల అమ్మానాన్నలు ఏదో అన్నారని రాజ్‌ను వదిలేసుకున్నావు, రేపు రేఖ ఏదైనా అంటే మమ్మల్ని కూడా వదిలేస్తావా అని అపర్ణ అడగటంతో ఇందూ షాక్ అవుతుంది. నేను చచ్చిన తర్వాత కూడా నాకు తలకొరివి పెట్టడానికి వీల్లేదని ఆయన అన్నారు కాబట్టే రాజ్‌ని పంపించేశారని చెబుతుంది ఇందూ. చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని కొడుకు మీద తండ్రికి కోపం ఉంటుంది. కానీ నువ్వు నీ భర్తతో నిలబడి మీ అత్తయ్య, మావయ్యల మనసు మారేలా చేయాలి, నీ మీద నమ్మకం కలిగేలా చేయాలని చెబుతుంది అపర్ణ. మాది నిజమైన పెళ్లయితే అలాగే చేసేదానిని, కానీ మాది పెళ్లే కాదు, అతను నా భర్త కాదు అందుకే ఆ నిర్ణయం తీసుకున్నానని అనుకుంటుంది ఇందూ. నా స్వార్ధం కోసం రాజ్‌కి వాళ్ల కన్నవాళ్లని దూరం చేయలేను, ఈ సమస్య నాది.. ఈ యుద్ధం నాది. నేనే ఒంటరిగా పోరాడుతానని తేల్చేస్తుంది ఇందూ.
రాజ్‌ని ఇంట్లో నుంచి గెంటేయడంతో రేఖను మెచ్చుకుంటుంది భ్రమరాంబ. అయితే రేపు రాజ్ మళ్లి తిరిగొస్తే ఏం చేస్తావని ప్రశ్నిస్తుంది. అల్లుడు ఖచ్చితంగా వస్తాడని శేషం కూడా అంటాడు. వాడు వచ్చేసరికి పుణ్యకాలం పూర్తయిపోతుందని అంటుంది రేఖ. వాడు మళ్లీ ఇంట్లోకి అడుగుపెట్టేలోపు.. ఇందూ చేతిలో ఉన్న పవర్ మొత్తం నేనే లాగేసుకుంటాను. తన పేరు మీదున్న ఆస్తి మొత్తం నా పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటానని ప్లాన్ చెబుతుంది రేఖ. దానికి తన భర్త సంతకం కూడా కావాలని లాయర్ గారు చెప్పారు కదా అని చెబుతుంది భ్రమరాంబ. నాకన్నీ గుర్తున్నాయి.. ఆస్తి నా పేరు మీదకి రాయించుకుంటానని చెబుతుంది రేఖ.
వీరి మాటలన్నీ దొంగచాటుగా విన్న స్వాతి.. ఈ విషయాన్ని ఇందూకి చెబుతుంది. రాజ్ బావ ఇక్కడున్నాడు కాబట్టి రేఖ ఆంటీ ఆటలు సాగలేదు. రాజ్ బావ నీ భర్త మాత్రమే కాదు నీ బలం, నీ ధైర్యం. నిన్ను కాపాడుకుంటూ వచ్చిన మంచి మనిషి. నువ్వు రాజ్ బావని ఇంట్లో నుంచి పంపించి చాలా పెద్ద తప్పు చేశావు, బావకి ఫోన్ చేసి మళ్లీ రమ్మని చెప్పమని అంటుంది స్వాతి. ఆస్తి నా పేరు నుంచి ట్రాన్స్‌ఫర్ కావాలంటే రాజ్ సంతకం కావాలని చెబుతుంది ఇందూ. కానీ రేఖ ఆంటీ చాలా పెద్ద ప్లాన్ చేసింది, అది జరగకూడదంటే బావ ఇక్కడే ఉండాలని అంటుంది స్వాతి. నేను ఫోన్ చేస్తే రాజ్ వెంటనే వచ్చేస్తాడు.. తను ఇక్కడికొస్తే తన కుటుంబానికి దూరమవుతాడు, నా కోసం తనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని అంటుంది ఇందూ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications