Brahmamudi July 7th Episode: రాజ్ నుంచి స్టాఫ్‌ని కాపాడిన కావ్య.. రాహుల్‌కి దుగ్గిరాల ఫ్యామిలీ శిక్ష

Photo Courtesy: JioHotstar

రాజ్ ఎండీ గెటప్‌లో కంపెనీకి రావడంతో ఉద్యోగులంతా షాక్ అవుతారు. రాజ్ ప్రవర్తన చూసి ఈయన ఏదో ఒక పెంట చేస్తాడని శృతికి ముచ్చెమటలు పడతాయి. రాజ్ ఆఫీస్‌కి వచ్చిన విషయాన్ని వెంటనే కావ్యకి ఫోన్ చేసి చెబుతుంది. ఆ మాటలు విన్న కావ్య కంగారుగా ఆఫీసుకి పరుగులు తీస్తుంది. ఆ యామిని గేమ్ స్టార్ట్ చేసిందని రుద్రాణి సంబరపడుతూ ఉంటుంది. స్వప్న తన తాళం చెవిని కనిపించేలా పెట్టడంతో దాని సాయంతో ఇంటి డాక్యుమెంట్స్ కొట్టేస్తాడు రాహుల్.

అవి తీసుకుని తన ప్రియురాలి దగ్గరికి బయల్దేరగా అతనిని అప్పూ, స్వప్నలు ఫాలో అవుతారు. తన సెటప్‌కి ఇంటి పేపర్స్ ఇచ్చి ఆమెను ఇంప్రెస్ చేస్తాడు రాహుల్‌. ఇక నేను నీ ఒడిలో వాలిపోతానని రాహుల్‌తో అతని ప్రియురాలు చెబుతుండగా స్వప్న, అప్పూలు ఎంట్రీ ఇవ్వడంతో వారిద్దరూ షాక్ అవుతారు. అక్కడికక్కడే రాహుల్‌ని చీపురుకట్టతో చితకబాది.. అతని ప్రియురాలి నుంచి ఒరిజినల్ నగలు తీసుకుంటారు అప్పూ, కావ్య. ఆఫీస్‌లో స్టాఫ్‌తో మీటింగ్ పెడతాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 7వ తేదీ ఎపిసోడ్ 767లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial July 7th 2025 Episode 767 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

నేనన్నా నా మాటన్నీ వీళ్లెవరికీ లెక్క లేకుండా పోతుందని.. వీళ్లందరినీ ఉద్యోగాల నుంచి తీసేస్తున్నానని అంటాడు రాజ్. ఆ మాటలతో స్వరాజ్ కంపెనీ ఉద్యోగులంతా షాక్ అవుతారు. ఇంతలో కావ్య వచ్చి చప్పట్లు కొడుతుంది. మీరేం కంగారు పడొద్దని.. ఇదంతా నిజం కాదని చెబుతుంది కావ్య. ఇదంతా వీళ్లని అలర్ట్ చేయడానికి చేసిన ఫ్రాంక్ అని అంటుంది. అందరినీ బయటికి పంపించి రాజ్‌పై కేకలు వేస్తుంది కావ్య. బాస్ అంటే స్ట్రిక్ట్‌గా ఉంటారని మీరే చెప్పారు కదా.. అందుకే అందరినీ కంట్రోల్‌లో పెడుతున్నానని చెబుతాడు రాజ్. మీరు ఇక్కడే ఉంటే కొంపలు అంటించేలా ఉన్నారని రాజ్‌ని ఆఫీస్ నుంచి బయటికి తీసుకొచ్చేస్తుంది.

కారులో వెళ్తూ ఈ లోకంలో కళాకారులకు విలువ లేకుండా పోతోందని మండిపడతాడు రాజ్. ఒక్క క్షణం నేనే వాళ్ల నిజమైన బాస్ అని వాళ్లంతా ఎలా వణికిపోయారో తెలుసా.. స్టాఫ్‌ని కంట్రోల్‌లో పెడదామని అనుకుంటే మీరొచ్చి మొత్తం పాడు చేశారని అంటాడు. నాకు చెప్పకుండా ఆఫీస్‌కి ఎందుకు వచ్చారని నిలదీస్తుంది కావ్య. నా నటనతో మిమ్మల్ని ఇంప్రెస్ చేద్దామని అనుకున్నానని అంటాడు రాజ్. మీరు నన్ను ఇంప్రెస్ చేయడానికి వచ్చినట్లు లేదు.. ఇరికించడానికి వచ్చినట్లుగా ఉందని అంటుంది కావ్య. మీ మీద ఎవరికైనా డౌట్ వచ్చినా అది సిద్ధార్ధ్‌కి తెలిసిపోయేదని చెబుతుంది. దాంతో అతను జాగ్రత్తపడి మీ మీద ఫోకస్ పెట్టేవాడని, మీరు నిజమైన బాస్ కాదని తెలిస్తే మన ప్లాన్ రివర్స్ అవ్వడమే కాకుండా కంపెనీ అతని చేతుల్లోకి వెళ్లిపోయేదని అంటుంది కావ్య.

రాహుల్‌ని తీసుకొచ్చి రుద్రాణి కాళ్ల మీద పడేస్తుంది స్వప్న. దాంతో రుద్రాణి రగిలిపోతుంది.. ఎంత ధైర్యముంటే నా కొడుకుని ఇలా చేస్తావని స్వప్నపై మండిపడుతుంది. కట్టుకున్న మొగుడు కాబట్టే ఇంటికి తీసుకొచ్చి మీ అందరి ముందు నిలబెట్టానని, అదే వేరొకరు ఇలాంటి పనిచేస్తే అక్కడే చంపేసే దాన్నని అంటుంది స్వప్న. 24 గంటలు నా కొడుకు మీద పడి ఏడవటం తప్పించి మీకు వేరే పని లేదా అని రుద్రాణి మండిపడుతుంది. మీరిద్దరూ పెద్ద సెలబ్రెటీలు మీ మీద పడి ఆటోగ్రాఫ్‌లు తీసుకోవాలా? అని ఫైర్ అవుతుంది స్వప్న. అసలేం జరిగింది? ఎందుకలా అరుస్తున్నావ్? అని అడుగుతుంది ఇందిర.

ఏం జరిగిందో మీ మనవడినే అడగండి.. ఆ దరిద్య్రాన్ని నా నోటీతో చెప్పాంటేనే అసహ్యాంగా ఉందని అంటుంది స్వప్న. రాహుల్ మళ్లీ ఏదో ఎదవ పని చేసుంటాడు అందుకే స్వప్నకి కోపం వచ్చి ఉంటుందని ప్రకాశం సెటైర్లు వేస్తాడు. ఇంట్లో తిట్టడానికైనా, కొట్టడానికైనా తేరగా దొరికేది మేమే కదా అని అంటుంది రుద్రాణి. అసలు నీ కొడుకేం చేశాడో తెలిస్తే ఇంట్లో వాళ్లంతా చెప్పు తీసుకుని కొడతారని చెబుతుంది స్వప్న. ఆ రోజు మీ అందరి ముందు నా నగలు కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పాను కదా అని అంటుంది. ఈసారి నిజంగానే దొంగతనం చేశాడా? మళ్లీ ఇంకో కొత్త కథ చెప్పు, వినడానికి తిట్టడానికి ఇంట్లో వాళ్లంతా రెడీగా ఉంటారని చెబుతుంది రుద్రాణి.

నగల్ని దొంగిలించలేదని.. నా నగల్ని తీసుకెళ్లి ఉంచుకున్నదానికి ఇచ్చాడని అంటుంది స్వప్న. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఆ రోజు మీ అందరికీ నేను చూపించిన నగలు గిల్ట్‌వని, ఒరిజినల్ నగల ప్లేస్‌లో డూప్లికేట్‌వి పెట్టాడని చెబుతుంది స్వప్న. నువ్వు చెబితే నేను నమ్మాలా? అసలే నా కొడుకంటే నీకు ముందు నుంచి కోపమని అంటుంది రుద్రాణి. అందరి ముందు వాడి పరువు ఎప్పుడు తీద్దామా? అని ఎదురు చూస్తుంటావని చెబుతుంది. ఇంతలో అప్పూ వచ్చి రాహుల్ సెటప్‌ని తీసుకొస్తుంది. నేనేం అడగలేదని .. నా మీద ప్రేముందని, పెళ్లి చేసుకుంటానని ఏడు వారాల నగలు తీసుకొచ్చి ఇచ్చాడని చెబుతుంది రాహుల్ సెటప్. మన సార్ అక్కడితో ఆగలేదని, తాతయ్య గారు నాకిచ్చిన ఆస్తిని కూడా దీని పేరు మీద రాసేద్దామని చూశాడని అంటుంది స్వప్న. నగలు ఇవ్వాలని అనుకున్న మాట నిజమేనని, కానీ ఆస్తి ఇవ్వాలని అనుకోలేదని అంటాడు రాహుల్.

సొంత భార్యని మోసం చేసినవాడితో కలిసి కాపురం ఎలా చేయమంటారని అడుగుతుంది స్వప్న. మొగుడు చెడు తిరుగుల్లు తిరుగుతున్నాడంటే భార్యదే తప్పని, వాడిని నీ గ్రిప్‌లో పెట్టుకోకుండా ఇప్పుడు మాట్లాడుతున్నావా అంటుంది రుద్రాణి. రాహుల్‌కి ఎవ్వరూ పాకెట్ మనీ ఇవ్వడానికి వీల్లేదని, కంపెనీ నుంచి కూడా అతనికి ఇచ్చే డబ్బుని రద్దు చేస్తున్నానని చెబుతుంది ఇందిర. నువ్వు ఇక నుంచి ఇంట్లో పనులు కూడా చేయాలని ఆర్డర్స్ వేస్తుంది. రాజ్ ఇంటికి వెళ్లబోతుండగా కావ్య ఆపి మీ ట్రైనింగ్ పూర్తి కాలేదని రాత్రికి ఇక్కడే ఉండమని చెబుతుంది.

రాహుల్‌ని లాగిపెట్టి కొడుతుంది రుద్రాణి. ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మారడం లేదని, నీకు ఎండీ కావాలన్న కోరిక లేదా అని ప్రశ్నిస్తుంది. యామినికి రాజ్ ఫోన్ చేసి రాత్రికి నేను ఇంటికి రావడం లేదని చెబుతాడు. నైట్ మొత్తం కళావతి గారితోనే గడపబోతున్నానని చెప్పడంతో యామిని షాక్ అవుతుంది. తాను ఎండీగా నటిస్తున్న విషయం కూడా యామినికి చెప్పేస్తాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X