Brahmamudi July 7th Episode: ఇందూకి చెల్లెల్ని.. రాజ్‌కి నిజం చెప్పిన ఇందూ.. రాజ్ సంతకం కొట్టేసిన రేఖ
Photo Courtesy: JioHotstar
రాజ్‌ని ఎందుకు గెంటేశావు? నీపాటికి నిర్ణయాలు తీసుకుంటే ఇక పెద్దవాళ్లు మేమెందుకు అని ఇందూపై మండిపడుతుంది అపర్ణ. నేనే ఫోన్ చేసి రమ్మని చెబుతానని అపర్ణ ఫోన్ చేస్తుండగా ఇందూ ఫోన్ లాక్కుని వెళ్లిపోతుంది. తన ప్లాన్ వర్కవుట్ అయినందుకు రేఖ సంతోషిస్తుంది. ఇందూ గురించి బాధపడుతున్న రాజ్ దగ్గరికి వెంకీ వచ్చి వదిన విషయంలో నాన్న ఎందుకు అంత పట్టుదలగా ఉన్నాడో అర్ధం కావడం లేదని అంటాడు. బాగా డబ్బున్న వాళ్లకి శత్రువులు ఉంటారు, వాళ్లు నన్ను ఏమైనా చేస్తారని అమ్మానాన్న భయమని చెబుతాడు రాజ్.
రాజ్‌కి అపర్ణ ఫోన్ చేసి మా అందరినీ మధ్యలోనే వదిలేస్తావా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి నమ్మకాలు వమ్ము చేస్తావా అని బాధపడుతుంది. ఇందులో నా తప్పేం లేదు, మీ మనవరాలే నన్ను వెళ్లిపోమన్నదని అంటాడు రాజ్. మనవడిని పంపేయడంపై ఇందూకి సుభాష్- అపర్ణలు క్లాస్ పీకుతారు. నేను పంపించకపోతే రాజ్ వాళ్ల అమ్మానాన్నలకు దూరమవుతాడని అంటుంది. రాజ్ లేకపోవడంతో దుగ్గిరాల ఆస్తిని కొట్టేయాలని రేఖ ప్లాన్ చేస్తుంది. ఈ మాటలన్నీ విన్న స్వాతి వెంటనే వచ్చి ఇందూకి చెబుతుంది. నువ్వు వెంటనే ఫోన్ చేసి రాజ్ బావని రమ్మని చెబుతుంది స్వాతి. కానీ ఇందూ మాత్రం వినిపించుకోదు. నా కోసం తనను వాళ్ల కుటుంబానికి దూరం చేయలేనని అంటుంది ఇందూ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 7వ తేదీ ఎపిసోడ్ 1078లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రాజ్ దగ్గరికి వచ్చిన నందూ.. మా అక్క జీవితంతో ఆడుకుంటున్నావని వచ్చి మండిపడుతుంది. మా అక్కకి సపోర్ట్‌గా ఉంటానని చెప్పి ఆరోజు డబ్బులు తీసుకుని వాళ్లకి అప్పగించేశావు, ఇప్పుడు మీ అమ్మనాన్న వచ్చి తిట్టేసరికి నీ స్వార్ధంతో తనని మధ్యలోనే వదిలి వచ్చేశావు. అసలు మా అక్క నిన్ను నమ్మడం పెద్ద తప్పు, అది నిన్నే నమ్ముతుంది, దానిని ప్రతిసారి మోసం చేస్తున్నావు. ఆ రేఖ వాళ్లు మనుషులు కాదు రాబందులు, వాళ్లతో ఒంటరిగా పోరాడలేకే నీ సాయం తీసుకుంది. ఇప్పుడు తను ఒంటరిగా ఎలా పోరాడుతుంది. నీకు డబ్బు తప్పించి వేరే ఎమోషన్ లేదా? ఎదుటివాళ్ల మీద మానవత్వం లేదా అని మండిపడుతుంది నందూ.
నువ్వొక మోసగాడివి, నీ అవసరం కోసం ఏదైనా చేస్తావు, నీ అవసరం తీరాక వదిలేస్తావని అనడంతో నందూపై సీరియస్ అవుతాడు రాజ్. నేను అక్కడే ఉంటానని చెప్పినా వినిపించుకోకుండా మీ అక్కే కఠినంగా మాట్లాడి, నన్ను వెళ్లిపొమ్మని చెప్పింది, మీ అక్కే నన్ను అద్దె మొగుడిగా తెచ్చుకుందని రాజ్ అనడంతో ఈ విషయం నాకు తెలుసని అంటుంది నందూ. తను పంజరంలో ఒంటరిగా ఉంటే వేరే ఎవరినో కట్టపెట్టాలని చూశారు ఆ ఇంట్లో వాళ్లు, అందుకే వాళ్ల నుంచి తప్పించుకోవడానికి జంటగా నిన్ను తెచ్చుకుంది. కానీ రాబందుల మధ్యే వదిలేశావని ఫైర్ అవుతుంది నందూ.
నేనేం చేయగలను, డైలీ పేమెంట్ గాడిని కదా? తను చెప్పినట్లే చేయాలి కదా అంటాడు రాజ్. తన మనసులో ఏ భయం ఉండి అలా అన్నదో నువ్వే దానికి సర్దిచెప్పి అక్కడే ఉండాల్సింది. ఇప్పుడు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో? కంపెనీ ఏమైపోతుందోనని బాధపడుతుంది. ఇందూకి లేని బాధ నీకెందుకు? ఎందుకు నువ్వంత ఫీల్ అవుతున్నావు? ఆ ఇందూ గురించి ఎందుకంతలా ఆలోచిస్తున్నావు? అని ప్రశ్నిస్తాడు రాజ్. ఎందుకంటే ఇందూ మా అక్క కాబట్టి అని అంటుంది నందూ. తనని ఏదో అక్క అని పిలుస్తున్నావు అంతే.. సొంత అక్క అయినట్లే ఫీలైపోతున్నావని రాజ్ అనడంతో .. సొంత అక్కే అని సీరియస్ అవుతుంది నందూ.
ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. రాజ్- కావ్యలకు ఇందూ ఒక్కతే కూతురని విన్నాను అని అంటాడు. నేను కళ్యాణ్- అప్పూల కూతురిని, రాజ్ వాళ్ల బాబాయ్ కొడుకు కూతరిని అని నిజం చెబుతుంది నందూ. ఈ విషయం ఇందూకి తెలుసా అని రాజ్ అడగ్గా.. తెలుసు అని అంటుంది. మా రేఖ ఆంటి మంచిది కాదు, తను పెట్టే టార్చర్ భరించలేక చిన్నప్పుడే ఇంట్లోంచి బయటకు వచ్చేశాను. తనకి బుద్ధి చెప్పడానికే కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నానని చెబుతుంది నందూ. నేను నిన్ను నమ్మకున్నా మా అక్క నిన్ను నమ్మింది, కానీ ఇలా మధ్యలో వదిలేసి స్వార్ధపరుడివి అని అంటుంది నందూ.
నీకు ఎంత డబ్బులు కావాలో చెప్పు నేను ఇస్తానని ఆఫర్ చేస్తుంది. ఇది డబ్బు సమస్య కాదు.. మీ అక్కకి ఇష్టం లేకుండా నేను ఆ ఇంట్లోకి వెళ్లలేను, మా అమ్మనాన్న ఒప్పుకోనిదే మీ అక్క నన్ను పిలవదు. అలా అని మా అక్క జీవితం నాశనం చేస్తావా? మా రేఖ ఆంటీ గురించి తెలిసి కూడా నువ్విలా మొండిగా ఉంటున్నావా? మా అక్కకి ఏమైనా జరిగితే నిన్ను వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తుంది నందూ.
అర్థరాత్రి ఇందూని పిలిచిన రేఖ.. ఆ దేవుడి దయ వల్ల రాజ్‌గాడి పీడ వదిలింది, ఒకవేళ మళ్లీ వచ్చినా ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. నీకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదంటే ఒక పరిష్కారం ఉందని చెబుతుంది రేఖ. నీ పేరు మీదున్న ఆస్తి మొత్తం నా పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేయడం, నువ్వు చదువుకోలేదు కాబట్టి ఆస్తి నీ పేరు మీద ఉంటే నిన్ను ఈజీగా మోసం చేసేస్తారు. అదే నా దగ్గరే ఉంటే చాలా జాగ్రత్తగా కాపాడతానని రేఖ అంటుంది. ఆ మాటలతో ఇందూ, అపర్ణలు షాక్ అవుతారు.
నువ్వు ఈ బాధ్యతలు మోయలేవు, అదే రేఖ అయితే చదువుకుంది.. అన్ని తెలిసిన మనిషి. తనైతే చాలా జాగ్రత్తగా ఆస్తిని కాపాడుతుందని చెబుతుంది భ్రమరాంబ. మీ గుంటనక్క బుద్ధి గురించి మా దగ్గర చూపించొద్దు, దానిని బెదిరించి ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టించినా నా మనవడు సంతకం పెట్టడు కదా అంటుంది అపర్ణ. వాడు ఇప్పుడు సంతకం పెట్టాల్సిన అవసరం లేదు, వాడు ఎప్పుడో సంతకం పెట్టేశాడని అంటుంది రేఖ. నా మనవడు సంతకం పెట్టడని అపర్ణ అనగా.. నేనే పెట్టేలా చేశానని చెబుతుంది.
వాడు ఆఫీసులో ఉన్నప్పుడు ఏదో ఫైలు మీద సంతకం పెట్టిస్తున్నట్లుగా ఆస్తి పేపర్ల మీద కూడా సంతకం పెట్టించేశానని రేఖ చెప్పడంతో అపర్ణ, ఇందూలు షాక్ అవుతారు. రాజ్ సంతకం చేసిన ఆస్తి పేపర్లు చూసిన అపర్ణ అవాక్కువుతుంది. దాంతో ఆస్తిని ఎలా కాపాడుకోవాలి అని ఇందూ కంగారుపడుతుంది. దీనికి మేం ఒప్పుకోం, నువ్వు మాత్రం సంతకం పెట్టొద్దని చెబుతుంది అపర్ణ. మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానని ఇందూ చెప్పడంతో అపర్ణ భయపడుతుంది.
లక్కీని పిలిపించి రాజ్‌తో మాట్లాడమని చెప్పి డబ్బులు ఇస్తాడు చలపతి. దాంతో లక్కీ మందు బాటిల్ తీసుకొచ్చి ఎంజాయ్ చేద్దామని రాజ్‌తో చెబుతాడు. నాకు మూడ్ లేదని రాజ్ అనడంతో నువ్వు వదిలేసి వచ్చింది నీ నిజమైన భార్యని కాదు కదా? మీ నాన్నకి ఈ విషయం తెలియక తను బాధపడుతున్నాడు. ఇదంతా చేస్తున్నది డబ్బు కోసమే కదా అంటాడు లక్కీ. డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నాను, కానీ ఇందూకి దూరంగా ఉండలేకపోతున్నాను అంటాడు రాజ్. నువ్వు ఆ ఇందూని ప్రేమించావా? అని లక్కీ అడగటంతో రాజ్ షాక్ అవుతాడు. కిడ్నాప్ చేసి రేఖకి ఇందూని అప్పగించినా ఫీల్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఇందూనే వెళ్లిపోమ్మని చెప్పినా నాదే తప్పులా ఉందని బాధపడతాడు రాజ్. ఎలాగోలా నాన్నని ఒప్పించాలి, ఇందూకి హెల్ప్ చేయాలని చెబుతాడు.
ఇంతలో రాజ్‌కి అపర్ణ ఫోన్ చేసి రేఖ ఆస్తిని కొట్టేయబోతోందని, ఇందూతో రేపు సంతకం పెట్టించుకోబోతోందని చెబుతుంది. నేను లేకుండా, నా సంతకం లేకుండా ఆస్తిని తన పేరు మీదకి ఎలా రాయించుకుంటుంది అని ప్రశ్నిస్తాడు రాజ్. ఆఫీసులో ఫైల్స్ మీద సంతకం చేయిస్తున్నట్లు నీతో సంతకం చేయించుకుందని అపర్ణ చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications