Brahmamudi July 8th Episode: అనామిక నవ్వులపాలు కావొద్దు.. నాకు జైలుశిక్ష పడ్డా సరే.. కోర్టులో కావ్య సంచలనం

కోర్టులో అప్పుని హాజరపరచమని జడ్జిగారు ఆర్డర్ వేస్తారు. కనకం కూతుర్ని కోర్టుకు పంపించను అంటుంది. కానీ అప్పు తల్లికి నచ్చ చెప్తుంది. కావ్య అనామిక ఇంటికి వెళ్లి ఆమె మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది కానీ అనామిక వినిపించుకోదు. పైగా కళ్యాణ్ తన కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరాలని కోర్టులో డిమాండ్ చేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 8వ తేదీ ఎపిసోడ్ 456లో ఏం జరిగిందంటే..

అనామిక నుంచి నేను సాక్షాలు సేకరించాను కానీ నాకు జైలు శిక్ష పడినా పర్వాలేదు, అనామిక అందరి ముందు నవ్వుల పాలు కాకూడదని కవి గారు చెప్పటం తో ఆగిపోయాను అత్యవసర పరిస్థితులలో మాత్రమే ఈ సాక్ష్యం బయట పెట్టమని లాయర్ గారికి కూడా చెప్పాను అంటుంది కావ్య. అప్పుడు ఆమె ఇచ్చిన ఫుటేజ్ ని కోర్టులో అందరి ముందు ప్లే చేస్తారు. అందులో మీ అందరిని కావాలనే కేసులో ఇరికించాను అంటూ ఆ రోజు రాత్రి కావ్య తో మాట్లాడిన మాటలు అన్ని ఆ వీడియోలో ఉంటాయి.

Brahmamudi serial July 8th 2024 Episode of 456 Here is full story

దానిని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. కళ్యాణ్ తరుపు లాయర్ మాట్లాడుతూ ఆడవాళ్ళకి చట్టాలు అనుకూలంగా ఉన్నాయని ఇలాంటి కొందరు ఆడవాళ్లు చట్టాలతో ఆడుకుంటున్నారు. పైగా ఇందులో ఒక అమాయకపు ఆడపిల్లని కూడా ఇరికించారు అందుకే పరువు నష్టం కింద వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులు ఇప్పించమని, అలాగే కళ్యాణ్ ని మానసికంగా అతని కుటుంబాన్ని సామాజికంగా బాధపెట్టినందుకు వాళ్లకి కూడా కొంత డబ్బు చెల్లించాలని అలాగే కళ్యాణ్ కి విడాకులు ఇప్పించాలని కోరుతాడు.

జడ్జి మాట్లాడుతూ అనవసరంగా అప్పుని కేసులో విరిగించినందుకు వాళ్లకి లక్ష రూపాయలు కట్టమని జరీమానా విధిస్తాడు, అలాగే కళ్యాణ్ కుటుంబానికి రెండు లక్షలు కట్టమని జరిమానా విధిస్తాడు పైగా 15 రోజులు జైలుశిక్ష కూడా విధిస్తాడు.ఇక విడాకులు విషయం ఫ్యామిలీ కోర్టులో తేల్చుకోవాలని తీర్పునిచ్చి కేసు ముగిస్తాడు. కళ్యాణ్ ఆనందంగా కావ్య దగ్గరికి వచ్చి థాంక్స్ చెప్తాడు. ప్రకాష్ కూడా వదిన తల్లితో సమానమని మరొకసారి నిరూపించావు మేం చేయలేని పని నువ్వు చేసావు అంటూ ఆనందంగా కావ్య ని మెచ్చుకుంటాడు.

Brahmamudi serial July 8th 2024 Episode of 456 Here is full story

మా కుటుంబంలో గొడవలు కి అనవసరంగా నిన్ను ఇరికించాము క్షమించు అని అప్పుకి క్షమాపణ చెప్తాడు కళ్యాణ్. జరిగిందేదో జరిగిపోయింది ఇకమీదటైనా నువ్వు మా ఇంటికి రావద్దు అని కళ్యాణ్ ని హెచ్చరిస్తుంది కనకం. అప్పుడే పోలీసులు అనామికని తీసుకొని వెళ్తుంటే నేను చెప్తే వినిపించుకోలేదు ఈరోజు నీ చేతులతో నువ్వే నీ కాపురం నాశనం చేసుకున్నావు అని అనామిక తో అంటుంది కావ్య.

Brahmamudi serial July 8th 2024 Episode of 456 Here is full story

అప్పుడే మహిళా సంఘం అధ్యక్షురాలు అక్కడికి వచ్చి అనామిక తో నీలాంటి వాళ్ళు మేము కూడా సమాజం చేత తిట్లు తినవలసి వస్తుంది నిన్ను నమ్మి ఆ కుటుంబాన్ని ఎంతగా అవమానించాము అని చివాట్లు పెడుతుంది, తర్వాత రాజ్ కుటుంబానికి క్షమాపణ చెప్తుంది. మీలాంటి వాళ్ళు ఆడవాళ్లకు సాయం చేయటంలో తప్పులేదు కానీ ఇలాంటి ఆడవాళ్లు మిమ్మల్ని తప్పుతో పట్టిస్తున్నారు కాస్త గమనించండి చాలు అంటాడు రాజ్.

తర్వాత అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన కనకం వాళ్ళ దగ్గరికి పక్కింటి వాళ్ళు వచ్చి కోర్టులో ఏమైంది, ఏదో ఒకలాగా మూడో కూతుర్ని కూడా డబ్బున్న ఇంటికి కోడలు చేయాలనుకున్నావు కానీజరగలేదు, అప్పుడప్పుడు ఇలాంటివి తప్పవు ఈ ఇల్లు కాకపోతే వేరే గొప్ప ఇల్లు చూసుకోవచ్చులే అని వెటకారంగా మాట్లాడుతారు. నా కూతురు నిప్పు అని కోర్టు వాళ్ళే తీర్పు ఇచ్చారు మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు జాగ్రత్త.

Brahmamudi serial July 8th 2024 Episode of 456 Here is full story

ఈరోజు మా ఇంటి వరకు వచ్చిన సమస్య రేపు మీ ఇంటికి కూడా వస్తుంది అంటూ వాళ్లకి చివాట్లు పెట్టి పంపిస్తుంది కనకం. మరోవైపు పని చేసుకుంటున్న కావ్యని చూసి తనకి ఐ లవ్ యు చెప్పినట్లుగా ఊహించుకుంటాడు రాజ్. అది గమనించిన ఇందిరా దేవి అతడిని ఆట పట్టిస్తుంది. ఎప్పుడూ మనసులో అనుకోవటమేనా బయటపడి చెప్పేది ఏమైనా ఉందా అని అడుగుతుంది. టైం చేసుకొని చెప్తాను అంటాడు రాజ్.

కావ్య బయటికి రావటం గమనించి నువ్వేమీ మాట్లాడొద్దు అని హెచ్చరిస్తాడు. కావ్య బయటకు వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. ఏమీ లేదు నీకు థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అంటాడు రాజ్. నిజమేనా అమ్మమ్మ అని అడుగుతుంది కావ్య. నేను అబద్ధం చెప్పను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇందిరా దేవి. భర్త ప్రవర్తనకి నవ్వుకుంటుంది కావ్య. మరోవైపు తన గదిలోకి వచ్చిన కళ్యాణ్ తన పెళ్లి ఫోటోలు చూస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X