Brahmamudi July 8th Episode: కావ్యతో రాజ్ రొమాన్స్.. రాహుల్‌తో కూలి పని చేయించిన స్వప్న
Photo Courtesy: JioHotstar
నా మాట ఎవ్వరూ వినడం లేదని.. మీ అందరినీ ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నానని రాజ్ చెప్పడంతో స్వరాజ్ గ్రూప్ కంపెనీ స్టాఫ్ ఉలిక్కిపడతారు. ఇంతలో కావ్య అక్కడికి వచ్చి స్టాఫ్‌ని భయపెట్టడానికి మీరు చేసిన ఫ్రాంక్ చాలని అంటుంది. ఆ మాటలతో స్టాఫ్ ఊపిరి పీల్చుకుంటారు. కారులో వెళ్తుండగా మీరు చేసిన పని నాకు నచ్చలేదని కావ్యపై కోప్పడతాడు రాజ్. రాహుల్‌ను ఇంటికి లాక్కొచ్చిన స్వప్న అతని సెకండ్ సెటప్ సంగతిని బయటపెడుతుంది.
ఆమె మాటల్ని రుద్రాణి నమ్మకపోవడంతో రాహుల్ సెకండ్ సెటప్‌ని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తుంది అప్పూ. రాహుల్ యవ్వారంపై మండిపడ్డ ఇందిర.. అతనికి పాకెట్ మనీ కట్ చేయడంతో పాటు ఇంట్లోనే ఉండాలని ఆర్డర్స్ వేస్తుంది. కొడుకుని లాగిపెట్టి కొట్టిన రుద్రాణి గట్టి వార్నింగ్ ఇస్తుంది. రాత్రంతా కళావతి దగ్గరే ఉండబోతున్నట్లు యామినికి రాజ్ ఫోన్ చేసి చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 8వ తేదీ ఎపిసోడ్ 768లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రాజ్‌కి కావ్య ట్రైనింగ్ కార్యక్రమం మొదలు పెడుతుంది. బెడ్‌పై ఫైల్స్ పడేసి వాటిని చదవమంటుంది. దాంతో రాజ్ నా వల్ల కాదని చేతులెత్తేస్తాడు. రాజ్‌కి ఒక్కో ఫైల్ గురించి వివరిస్తూ కావ్య నిద్రపోతుంది. అయినప్పటికి రాజ్ మాత్రం అన్ని ఫైల్స్ చదివి పూర్తి చేస్తాడు. ఉదయం అపర్ణ, ఇందిరలు వచ్చి చూసేసరికి కావ్య ఒడిలో రాజ్ నిద్రపోతూ కనిపిస్తాడు. ఇద్దరినీ లేపి ట్రైనింగ్ అని చెప్పి ఏం చేస్తున్నారని అడుగుతుంది ఇందిర. దాంతో సిగ్గుపడిన కావ్య ఆఫీస్‌కి రెడీ అవ్వాలనే వంకతో తప్పించుకుంటుంది. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉందో చూశారా? అని రాజ్ అడగ్గా.. రాత్రంతా నువ్వు ఫైల్స్‌తో కుస్తీ పడటం మొత్తం చూశామని అంటుంది ఇందిర.
అప్పూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లేందుకు రెడీ అవుతుండగా ఓ ఫోన్ వస్తుంది. యామిని మనుషులు డబ్బులు రెడీ చేశామని.. మీ చేతుల మీదుగానే ఇచ్చేస్తామని చెబుతాడు. అప్పూ ఫోన్ మాట్లాడుతూ విసుక్కుంటూ ఉండగా కళ్యాణ్ వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. దాంతో పోలీస్ స్టేషన్‌లో జరిగినదంతా కళ్యాణ్‌కి చెబుతుంది అప్పూ. నువ్వు అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నావ్ కానీ నా ప్రాబ్లమ్ మాత్రం సాల్వ్ చేయడం లేదని అంటాడు కళ్యాణ్. కొత్తగా పెళ్లయిన మొగుడు భార్యకి దూరంగా ఉండాల్సి రావడం ఎంత నరకమో నీకేం తెలుసు అని అడుగుతాడు కళ్యాణ్. ఫస్ట్ నైట్‌కి ఓకే చెప్పావ్ కానీ హనీమూన్‌కి వెళ్దామంటే మాత్రం ఒప్పుకోవని మండిపడతాడు.
కొత్తగా పెళ్లయిన జంట అంటే ఎలా ఉండాలి? భర్త ఎప్పుడు భార్య కొంగు పట్టుకుని తిరగాలి.. రాత్రి 6 గంటలు దాటితే గది లోపల ఉండాలని అంటాడు కళ్యాణ్. నువ్వు ఎప్పుడు డ్యూటీకి వెళ్తావో? ఎప్పుడు ఇంటికి వస్తావో తెలియదని బాధపడతాడు. నాలుగు రోజులు సెలవు పెడితే ఏ ఊటీకో, కొడైకెనాల్‌కో వెళ్దామని అడుగుతాడు కళ్యాణ్. నాకు లీవ్ దొరకడం చాలా కష్టమని, చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని మా సీఐ పర్మిషన్ ఇవ్వడని అంటుంది అప్పూ. హనీమూన్‌కి వెళ్లడం కుదరదా? అని కళ్యాణ్ బాధపడతాడు. కళ్యాణ్ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా అప్పూ వెళ్లిపోతుంది.
ఇంట్లో వాళ్లు వేసిన శిక్షతో రాహుల్ ఇంట్లో పనులన్నీ చేస్తుండగా స్వప్న వచ్చి అతనితో చెత్త వేయించడంతో పాటు కారు క్లీన్ చేయిస్తుంది. ఆ టార్చర్ తట్టుకోలేక రాహుల్ అలిసిపోతాడు. నాకొక కాఫీ కావాలని అడుగుతాడు. పని మొత్తం పూర్తి చేశాక అప్పుడు తీసుకొస్తానని అంటుంది స్వప్న. ఈ భయం సెకండ్ సెటప్ పెట్టినప్పుడు తెలియలేదా అని అడుగుతుంది. బుద్ధి గడ్డితిని అలా చేశానని.. ఇంతలా పనిష్ చేయాలా? అని అడుగుతాడు రాహుల్. తెలిసి చేసినా? తెలియక చేసినా? తప్పు తప్పే .. శిక్ష శిక్షే అని అంటుంది స్వప్న. అరగంట రెస్ట్ తీసుకుని పని చేస్తానని రాహుల్ అడగ్గా.. బయటివాళ్లు పనిచేయకపోతే డబ్బులు కట్ చేస్తాం, నువ్వు ఇంట్లో మనిషివి కాబట్టి ఫుడ్ కట్ చేస్తామని చెబుతుంది. ఆ దెబ్బతో రాహుల్ షాక్ అవుతాడు. అర్దగంట రెస్ట్ తీసుకుంటే మార్నింగ్ టిఫిన్ కట్, గంట రెస్ట్ తీసుకుంటే మధ్యాహ్నం లంచ్ కట్ అని అంటుంది.
రాహుల్ పనిచేస్తుండగా రుద్రాణి వచ్చి చూస్తుంది. స్వప్న బ్రహ్మ రాక్షసిలా నాచేత పనులన్నీ చేయిస్తుందని చెబుతాడు రాహుల్. కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు.. నువ్వు చేతులారా చేసుకున్నది ఇప్పుడు అనుభవిస్తున్నావని అంటుంది రుద్రాణి. స్వప్నకి దొరుకుతానని నేనేమైనా కలగన్నానా అని అంటాడు. దొరక్కపోతే ఇంకా కంటిన్యూ చేద్దామని అనుకున్నావా? మనలాగా ఆస్తి పిచ్చి ఉన్నవాళ్లకి, ఆడదాని పిచ్చి ఉండకూడదని చెబుతుంది రుద్రాణి. ఈ ఒక్కసారికి క్షమించి నన్ను ఈ నరకం నుంచి రక్షించమని అంటాడు రాహుల్. ఈ రోజు కంపెనీలో జరిగే బోర్డు మీటింగ్‌లో ఆ కావ్య పవర్స్ అన్ని పోతాయని, ఆపై వాళ్లు మనతో ఆడుకోవడం కాదు.. మనమే వాళ్లతో ఆడుకోవచ్చని చెబుతుంది రుద్రాణి.
బోర్డు మీటింగ్‌కి బయల్దేరిన సిద్ధార్ధ్‌కి యామిని ఫోన్ చేస్తుంది. ఆ కావ్య ఎండీగా పనికిరాదని అందరి ముందు ప్రూవ్ చేసి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని నా సొంతం చేసుకుంటానని అంటాడు సిద్ధార్ధ్. నేను ఇప్పుడు ఏం చెప్పినా వినే పరిస్ధితుల్లో లేనని సిద్ధార్ధ్ చెబుతుండగా.. రాజ్ బోర్డ్ మీటింగ్‌కి వస్తున్నాడని యామిని అంటుంది. ఆ మాటలతో అతను షాక్ అవుతాడు. రాజ్ చనిపోయాడు కదా? వాడు బోర్డ్ మీటింగ్‌కి రావడం ఏంటి అని అడుగుతాడు సిద్ధార్ధ్. అసలు రాజ్ చనిపోయాడన్న విషయం నాకెందుకు చెప్పలేదని అడుగుతాడు. వాడు ఉండగా నేను ఆ కంపెనీ వైపు చూస్తే నాకు లైఫ్ లేకుండా చేస్తాడని వణికిపోతాడు సిద్ధార్ధ్.
అలా జరిగే ఛాన్స్ లేదని, ఎందుకంటే రాజ్ గతం మొత్తం మరిచిపోయాడని చెబుతుంది యామిని. చనిపోయాడు అనుకున్నవాడు బతికి రావడం ఏంటీ? వాడికి గతం గుర్తురావడం ఏంటీ అని సిద్ధార్ధ్ షాక్ అవుతాడు. నాకు కావాల్సింది ఆ కావ్యని దెబ్బ కొట్టడమని అంటుంది యామిని. రాజ్‌కి యాక్సిడెంట్ జరిగిన వెంటనే తన గతాన్ని పూర్తి మరిచిపోయాడని, ఆ విషయం బయటికి రాకుండా ఆ ఫ్యామిలీ అతనిని దాచిపెట్టిందని చెబుతుంది. బోర్డు మీటింగ్ పెట్టి కావ్య ఎండీగా పనికిరాదని చెప్పావో అప్పుడే రాజ్‌ని బయటికి తీసుకొచ్చారని అంటుంది యామిని. రాజ్‌ను చూపించి కావ్యని రక్షించాలని ఆ ఫ్యామిలీ ప్రయత్నిస్తోందని.. వాడికి గతం గుర్తులేదని, కంపెనీని చూసుకోవడం చేతకాదని అందరి ముందు ప్రూవ్ చేస్తే కంపెనీ నీ సొంతం అవుతుందని చెబుతుంది.
నువ్వు చెప్పినట్లు ఆ రాజ్‌కి గతం గుర్తులేకపోతే నేను ఈజీగా హ్యాండిల్ చేయగలనని అంటాడు సిద్ధార్ధ్. కానీ వాడికి గతం గుర్తుందంటే మాత్రం నా దగ్గరున్న షేర్స్ కూడా వాడు లాగేసుకుంటాడని భయపడతాడు. రాజ్ ఇప్పుడు ఏమీ తెలియని చంటి పిల్లాడని, వాడికి ట్రైనింగ్ ఇచ్చి కావ్య తీసుకొస్తుందని చెబుతుంది యామిని. వాడిని మీటింగ్‌లో భయపెడితే చాలు మొత్తం విషయం అందరికీ తెలిసిపోతుందని అంటుంది. కావ్యని అవమానిస్తే ఏమొస్తుంది.. ఆ రాజ్‌ని అవమానిస్తేనే అసలైన కిక్ అని అంటాడు సిద్ధార్ధ్. పెళ్లిలో నన్ను అందరి ముందు అవమానించావ్.. ఈ రోజు కంపెనీలో నీకు, నీ ఫ్యామిలీకి అవమానం జరగబోతోందని అనుకుంటుంది యామిని. రాజ్ ఎండీగా రెడీ అయి కిందకి దిగి వస్తుండగా దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










