Brahmamudi July 8th Episode: నేనే అప్పూ కూతురిని.. దుగ్గిరాల ఆస్తిని కాపాడిన నందూ, షాక్‌లో రేఖ

Photo Courtesy: JioHotstar

రాజ్ దగ్గరికి వచ్చిన నందూ.. మా అక్క జీవితంతో నువ్వు ఆడుకుంటున్నావు, ఆమెను మోసం చేశావని మండిపడుతుంది. నీ వల్ల మా రేఖ ఆంటీ ఏం చేస్తుందో? మా కంపెనీ ఏమైపోతుందోనని బాధపడుతుంది. నువ్వేదో సొంత చెల్లెలిలా ఫీలైపోతున్నావని ఫైర్ అవుతాడు రాజ్. నేను సొంత చెల్లెలినే రాజ్ బాబాయ్ కొడుకు కూతురిని అని నందూ చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. మరి ఈ నిజం మీ అక్కకి తెలుసా? అని అడగ్గా.. తెలుసు, నీ పెళ్లి కూడా డ్రామా అని తెలుసు అని చెబుతుంది నందూ. మా అక్కని, ఆ ఇంటిని నువ్వే కాపాడాలని చెప్పి కోపంగా వెళ్లిపోతుంది.

అర్ధరాత్రి ఇందూని పిలిచిన రేఖ.. ఆ రాజ్‌గాడి పీడ వదిలిపోయింది. ఇకపై ఇలాంటి తప్పులు జరగకూడదంటే ఆస్తి మొత్తం నా పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ కావాలని చెబుతుంది. ఆ మాటలతో ఇందూ, అపర్ణలు షాక్ అవుతారు. నా మనవడి సంతకం లేనిదే ఈ ఆస్తి నీకు దక్కదని చెబుతుంది అపర్ణ. అందుకే రాజ్‌తో దొంగచాటుగా ఫైల్స్ మీద సంతకం చేయించుకున్నట్లు ఆస్తి పేపర్ల మీద సంతకం తీసుకున్నానని రేఖ చెప్పడంతో ఇందూ- అపర్ణలు ఉలిక్కిపడతారు. రేపే రిజిస్ట్రార్‌ని పిలిపిస్తాను.. సంతకం పెట్టమని చెబుతుంది రేఖ. రాజ్ ఒంటరిగా బాధపడుతుండటంతో లక్కీని పిలిపించిన చలపతి.. వాడితో మాట్లాడి ధైర్యం చెప్పమని అంటాడు. అద్దె మొగుడు క్యారెక్టర్ అయినా సరే ఇందూకి దూరంగా ఉండలేకపోతున్నానని లక్కీ దగ్గర బాధపడతాడు. ఇంతలో రాజ్‌కి అపర్ణ ఫోన్ చేసి రేఖ ఆస్తిని కొట్టేయబోతుందని చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 8వ తేదీ ఎపిసోడ్ 1079లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial July 8th 2026 Episode 1079 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఆస్తిని కొట్టేయడానికి రేఖ ఏర్పాట్లు చేస్తోందని అపర్ణ చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. నేను లేకుండా, నా సంతకం లేకుండా ఆ రేఖ ఎలా ఆస్తిని చేజిక్కించుకుంటుందని అడుగుతాడు రాజ్. నీతో ఆఫీస్‌లో ఫైల్స్ మీద సంతకం చేయించుకునే టైంలో దొంగతనంగా నీ సంతకం కొట్టేసిందని అపర్ణ చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఇందూ కూడా ఏం చేయలేవు, నువ్వు రాకపోతే రేఖ మన ఆస్తి కాజేస్తుంది. 20 ఏళ్లుగా ఈ ఆస్తి కోసం అనకొండలా ఎదురుచూస్తోంది, ఇప్పుడు మింగేయడానికి రెడీగా ఉంది. నువ్వే ఏదో ఒకటి చేయాలి.. లేకపోతే ఇందూ ఓడిపోతుంది, ఆ రేఖ గెలుస్తుందని అంటాడు రాజ్.

తను అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగిస్తుంది, రేఖ ఆస్తిని సాధిస్తే 20 ఏళ్లుగా నేను పడిన కష్టమంతా వృథా అయిపోతుందని అంటుంది అపర్ణ. స్వరాజ్- కావ్య కన్న కలలు ఆవిరి అయిపోతాయి, మా కంపెనీని నమ్ముకున్న ఎంతోమంది జీవితాలు రోడ్డు మీదకి వచ్చేస్తాయి, ఈ దుగ్గిరాల కుటుంబాన్ని, మమ్మల్ని నమ్ముకున్నవాళ్ల జీవితాల్ని నువ్వే నిలబెట్టాలి. నువ్వు లేకుండా ఇందూ ఏ నిర్ణయం తీసుకోలేదు, నువ్వే తన ధైర్యం, తన బలమని చెబుతుంది అపర్ణ. రేఖ పిన్ని ఎన్ని ఎత్తులు వేసినా అవి నా దగ్గర చెల్లవు, నేను చూసుకుంటానని ధైర్యం చెబుతాడు రాజ్. ఆ వెంటనే ఎవరికో ఫోన్ చేసి అర్జెంట్‌గా కలవాలని అంటాడు.

ఉదయాన్నే బ్రోకర్‌కి ఫోన్ చేసి బంజారాహిల్స్‌లో ఎకరం ల్యాండ్ కావాలి, కమీషన్ ఎంతైనా ఇస్తానని చెబుతుంది భ్రమరాంబ. ఇదంతా చూసిన శేషం.. కొంచెం ఓవర్ అయినట్లుగా ఉందని అంటాడు. మనకి కోట్లలో వచ్చే డబ్బంతా ఏం చేస్తాం.. ఎకరం కాదు ఇంకా ఎక్కువే కొంటామని అంటుంది భ్రమరాంబ. ఇంతలో అపర్ణ వచ్చి కలలు రాత్రిపూట కంటే నిజమయ్యే అవకాశం ఉంది, పగటిపూట కంటే నిజం కావని సెటైర్లు వేస్తుంది అపర్ణ. నీ ముఖం ఏంటి యాపిల్ పండులా వెలిగిపోతోంది? నీ మనవరాలు ఆస్తి పేపర్ల మీద సంతకం పెడుతుందన్న బాధ కూడా లేదా అని అంటుంది భ్రమరాంబ. జరగని వాటి గురించి ఎందుకు కంగారుపడాలని అపర్ణ కౌంటర్ వేస్తుంది.

ఇంతలో రేఖ వచ్చి ఆస్తి మాకు దక్కుతుందని మేం ఊహించుకుంటున్నామా? అది ఊహా కాదు నిజమని చెబుతుంది. ఆస్తిని నువ్వు దక్కించుకోలేవు.. ఈ ఆస్తి కోసం మీ అమ్మ కూడా చాలాకాలం పోరాడింది. ప్లాన్ల మీద ప్లాన్లు వేసింది చివరికి తనే పైలోకాలకు పోయింది కానీ ఆస్తి మాత్రం దక్కించుకోలేకపోయిందని అంటుంది అపర్ణ. ఈ ఆస్తి దుగ్గిరాల ఇంటి వారసురాలిది, దుగ్గిరాల కుటుంబం చెమటోడ్చి కూడబెట్టిన ఆస్తి.. ఎవరో దారినపోయే వాళ్లకి దక్కుతుందా అని ప్రశ్నిస్తుంది. అపర్ణ మాటలతో షాకైన భ్రమరాంబ.. మళ్లీ వీళ్లు ఏదైనా ప్లాన్ చేశారా అని అడుగుతుంది. వీళ్లకి అంత సీన్ లేదు, ఆస్తి మనకి దక్కకుండా ఎవరూ ఆపలేరని అంటుంది రేఖ. అయితే శేషం మాత్రం సీన్‌లోకి అల్లుడు ఎంట్రీ ఇస్తాడని అనుకుంటాడు.

ఇందూ ఆఫీస్‌కి రెడీ అవుతుండగా నువ్వు ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు ఫైల్స్ ఉండాలని అంటుంది అపర్ణ. రేఖ నుంచి ఆస్తిని రాజ్ కాపాడతాడని చెబుతుంది. ఈ విషయం రాజ్ బావకి తెలుసా అని స్వాతి అడగ్గా.. నేనే ఫోన్ చేసి విషయం చెప్పానని అంటుంది అపర్ణ. రాజు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు, నా మనవడి మీద నాకు ఆ నమ్మకం ఉందని చెబుతుంది. మనది కానీ బంధాల మీద మనం నమ్మకాలు పెట్టుకోకూడదని చెబుతుంది ఇందూ. నువ్వు కాదు అనుకుంటున్నా.. కొన్ని బంధాలు తెగిపోవని చెబుతుంది అపర్ణ. తనే బాధ్యత లేకుండా ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టేశాడని ఇందూ చెప్పగా.. తనేమీ కావాలని పెట్టలేదు కదా అంటుంది అపర్ణ. నీ మనవడు రాడు.. జరిగేదానిని ఆపలేడని అంటుంది ఇందూ. రాజ్ బావ ఆపుతాడని నువ్వు చెబుతున్నావు, అక్క మాత్రం బావ రాడని అంటుంది. మరి ఎలా ఆపుతాడు అని అడుగుతుంది స్వాతి. వస్తాడో, రాడో నువ్వే చూద్దువుగానీ అంటుంది అపర్ణ.

ఆస్తిని రిజిస్ట్రార్ చేయడానికి దుగ్గిరాల ఇంటికి రిజిస్ట్రార్ వస్తాడు. ఇందూ సంతకం పెట్టబోతుండగా అపర్ణ, స్వాతి, సుభాష్‌లు షాక్ అవుతారు. నువ్వు వేలిముద్రలు వేయాల్సిన పనిలేదు, ఆ రాజ్ గాడు నీకు సంతకం చేయించడం నేర్పించాడు కదా? సంతకమే పెట్టు అని అంటుంది భ్రమరాంబ. ఆస్తి తనకు దక్కడానికి వీల్లేదని సుభాష్ చెప్పినా ఇందూ వినిపించుకోదు. సరిగ్గా ఇందూ సంతకం పెట్టే సమయానికి నందూ వస్తుంది. ఎవరి ఆస్తి ఎవరు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటున్నారు అని అంటుంది. మా ఇందూ ఇష్టపూర్వకంగానే సంతకం పెడుతోంది తెలుసా? మేం బలవంతం చేయడం లేదని అంటుంది భ్రమరాంబ. తను పెడితే సరిపోతుందా? అని నందూ అడుగుతుంది. రాజ్ కూడా పెట్టాడని చెబుతుంది ఐశ్వర్య.

రాజ్ పెడితే సరిపోతుందా? అని నందూ ప్రశ్నించగా.. లేకపోతే నువ్వు కూడా పెట్టాలా అని అంటుంది భ్రమరాంబ. దానికి నందూ అవునని సమాధానం చెప్పడంతో అంతా షాక్ అవుతారు. అసలు నీ గొడవ ఏంటీ? ఈ ఆస్తికి నీకు సంబంధం ఏంటీ? నువ్వు ఈ ఇంటి మనిషివి కాదు కదా అని ప్రశ్నిస్తుంది రేఖ. నేనెవరో అప్పుడే మరిచిపోయారా? చిన్నప్పుడు ఈ ఇంట్లో ఇంకా ఎవరో ఉండాలి కదా అని అంటుంది నందూ. ఈ ఇంటి వారసురాలు ఇంకోకరు ఉండాలి నీకు గుర్తులేదా అని ప్రశ్నిస్తుంది. దుగ్గిరాల ప్రకాష్ - ధాన్యలక్ష్మీల మనవరాలు, కళ్యాణ్ - అప్పూల కూతురు చిన్నప్పుడు ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన నందూని నేనే అంటుంది. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు.

సుభాష్, అపర్ణలు మాత్రం సంతోషిస్తారు. ఈ ఆస్తిలో నాకు కూడా హక్కు ఉందా? లేదా అని నందూ నిలదీయడంతో అంతా షాక్ అవుతారు. ఇది వరకు నీ పేరు అప్పూ అని చెప్పావు, ఇప్పుడొచ్చి నందూ అని చెబితే మేం ఎందుకు నమ్ముతాం అని అంటుంది భ్రమరాంబ. నువ్వు, మీ నానమ్మ కలిసి కొత్త డ్రామా మొదలుపెట్టారా అని ఇందూపై ఫైర్ అవుతుంది. అసలు నువ్వే నందూ అనడానికి ప్రూఫ్ ఏంటీ అని అడుగుతుంది భ్రమరాంబ. చిన్నప్పుడు జరిగిన కొన్ని విషయాలు చెబుతానని అంటుంది నందూ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X