Brahmamudi july 9th episode: తల్లిపై విరుచుకుపడిన కళ్యాణ్.. మంట పెట్టి చోద్యం చూస్తున్న రుద్రాణి!

కనకం కూతుర్ని కోర్టుకు పంపించను అంటుంది. కానీ అప్పు తల్లికి నచ్చ చెప్తుంది. కావ్య అనామిక ఇంటికి వెళ్లి ఆమె మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది కానీ అనామిక వినిపించుకోదు. పైగా కళ్యాణ్ తన కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరాలని కోర్టులో డిమాండ్ చేస్తుంది. కానీ తప్పంతా అనామికదే అని కోర్టులో నిరూపిస్తుంది కావ్య. కోర్టులో శిక్ష పడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 9వ తేదీ ఎపిసోడ్ 457లో ఏం జరిగిందంటే..

తన గదిలోకి వచ్చిన కళ్యాణ్ అనామిక అన్న మాటలు, కోర్టులో జరిగిన అవమానం అన్ని గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. అనామిక చేసిన అన్యాయం భరించలేక పెళ్లి ఫోటోలు తీసుకెళ్లి తగలబెట్టేస్తాడు. కళ్యాణ్ ని వెతుకుతూ వచ్చిన కావ్య పెళ్లి ఫోటోలు కాలిపోతూ ఉండడం చూసి మంచి పని చేశారు లేదంటే వాటిని చూసిన ప్రతిసారి మీకు అనామిక చేసిన అన్యాయమే గుర్తొస్తుంది అంటుంది.తర్వాత కళ్యాణ్ ని భోజనానికి పిలుస్తుంది కావ్య. భోజనం చేయాలని లేదు అంటాడు కళ్యాణ్.

Brahmamudi serial July 9th 2024 Episode of 457 Here is full story

ఇప్పుడు మీరు మీకోసం కాదు, ఈ కుటుంబం కోసం భోజనం చేయాలి మీరు భోజనం చేయకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరూ భోజనం చేయరు అని కళ్యాణ్ ని ఒప్పించి భోజనానికి తీసుకువస్తుంది కావ్య. భోజనం చేయకుండా కళ్యాణ్ దిగులుగా కూర్చుంటాడు అతనికి అందరూ ధైర్యం చెబుతూ ఉంటారు. కానీ రుద్రాణి మాత్రం వాడు బాధపడుతున్నది అనామికకి విడాకులు ఇచ్చినందుకు కాదు అప్పుకి అన్యాయం జరిగినందుకు, వాడు ఇంకా అప్పు కోసమే ఆలోచిస్తున్నాడు అంటుంది.

ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా అంటూ కోప్పడతారు కావ్య, స్వప్న. అందరూ కలిసి నన్ను అంటారు ఏంటి అయినా ఈ గొడవలన్నీ అప్పు వల్లే కదా, అప్పు అనేదే లేకపోతే అనామిక కళ్యాణ్ తోనే ఉండేది. గొడవలన్నీటికి కారణం అప్పు కాదు అని ధాన్యలక్ష్మిని చెప్పమనండి అంటుంది రుద్రాణి. ధాన్యలక్ష్మి కూడా జరిగిన గొడవలకి అప్పుయే కారణం అంటుంది ఇక ఆవేశం పట్టలేకపోతాడు కళ్యాణ్. అసలు జరిగిన గొడవలన్నింటికీ కారణం నువ్వు, నీ మూర్ఖత్వం.

Brahmamudi serial July 9th 2024 Episode of 457 Here is full story

మొదటి నుంచి నువ్వు నీ కోడల్ని వెనకేసుకొచ్చావు, అప్పుకి నాకు సంబంధం అంట కడుతూ వచ్చావు దానివలన అప్పు ఎంత బాధ పడిందో ఆలోచించలేకపోయావు. ఇకమీదట నేను అప్పు గురించే ఆలోచిస్తాను ఏం చేసుకుంటావో చేసుకో అని ఆవేశంగా భోజనం మానేసి వెళ్ళిపోతాడు కళ్యాణ్. కావ్య భోజనానికి తీసుకు వస్తే నువ్వు వాడిని తినకుండా పంపించేసావు అని భార్య పై కోప్పడతాడు ప్రకాష్.

కావ్య అప్పు గురించి వాడికి జాలిగా చెప్పి ఉంటుంది అందుకే వెళ్ళిపోయాడు అంటుంది ధాన్యలక్ష్మి. అలా మాట్లాడినందుకు తోటికోడల్ని మందలిస్తుంది అపర్ణ. ధాన్యలక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా, శుభ్రంగా కడుపునిండా తినండి, మీరు కోరుకున్నది ఇదే కదా అని భర్తకి అత్తకి గడ్డి పెడుతుంది స్వప్న. ఆ తర్వాత కావ్య కళ్యాణ్ దగ్గరికి వచ్చి ధైర్యం చెప్తుంది. నా వలన అప్పు కి మచ్చ పడింది అని ఫీల్ అవుతాడు కళ్యాణ్.

నిజమే కానీ అది అందరిలాంటి ఆడపిల్ల కాదు, ఆ బాధ నుంచి త్వరగానే కోలుకుంటుంది. పైగా దానికి మేమందరం సపోర్ట్ గా ఉన్నాము ఇకమీదట మీరు ఎవరి గురించి ఆలోచించవలసిన పనిలేదు మీ గురించి మీరు ఆలోచించి కొత్త జీవితాన్ని ప్రారంభించండి మళ్లీ కథలు రాయటం ప్రారంభించండి అని మరిదికి ధైర్యం చెప్పి వచ్చేస్తుంది కావ్య. అక్కడ రాజ్ కళ్యాణ్ గురించి అడుగుతాడు. ఎన్నడూ లేనిది చాలా ఆవేశంగా ఉన్నారు అంటుంది కావ్య.

Brahmamudi serial July 9th 2024 Episode of 457 Here is full story

అప్పు జీవితం బాగుందంటే కళ్యాణ్ బాగుంటాడేమో అప్పు కోసం నేను ఏమైనా చేయగలనా అంటాడు రాజ్. నిజమే కానీ మాకు ఎవరైనా సాయం చేస్తే నచ్చదు అంటుంది కావ్య. దీన్నే కొన్ని ఊర్లలో పొగరు అంటారు అంటాడు రాజ్. వాళ్ళిద్దరూ గొడవపడుతూ ఉండగానే ఫోన్లో రేపు తల్లిదండ్రుల పెళ్లిరోజు అని రిమైండర్ లో వస్తుంది. అది చూసిన రాజ్ నేను రిమైండర్ లో పెట్టలేదే అని అంటాడు. నేనే పెట్టాను అంటుంది కావ్య.

తరువాయి భాగంలో సుభాష్ కి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తారు రాజ్ దంపతులు. అతనికి ఒక గిఫ్ట్ ఇచ్చి మీరు ఇచ్చినట్లుగా అత్తయ్య గారికి ఇవ్వండి అంటుంది కావ్య. సుభాష్ అనుమానంగానే భార్యకి గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్ట్ తీసుకుంటుంది అపర్ణ. సుభాష్ ఆనందంగా బయటికి వచ్చి కొడుకుని హాగ్ చేసుకుంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X