Brahmamudi July 9th Episode: లంచం కేసులో అప్పూని ఇరికించిన యామిని.. కావ్యకి దెబ్బ మీద దెబ్బ

Photo Courtesy: JioHotstar

నైట్ అంతా రాజ్‌ని తన ఇంట్లో ఉంచుకున్న కావ్య అతనిని నిద్రపోనివ్వకుండా ఫైల్స్ మొత్తం చదివిస్తుంది. ఉదయాన్నే ఇందిర, అపర్ణలు వచ్చి చూసేసరికి కావ్య ఒడిలో రాజ్ నిద్రపోతూ కనిపిస్తాడు. పెద్దవాళ్లని చూసి ఇద్దరూ సిగ్గుతో పరుగులు తీస్తారు. అప్పూతో హనీమూన్‌కు వెళ్దామని అడుగుతాడు కళ్యాణ్. నాకు మా సీఐ సెలవు ఇవ్వడని, పెండింగ్ కేసులు చాలా ఉన్నాయని చెబుతుంది అప్పూ. ఇంట్లో వాళ్లు పాకెట్ మనీ కట్ చేయడంతో పనిమనిషిగా మారతాడు రాహుల్.

భర్తను భయపెడుతూ అతనితో అన్ని పనులు చేయిస్తుంది స్వప్న. నా పెళ్లాం పెట్టే టార్చర్ నుంచి రక్షించమని తల్లిని వేడుకుంటాడు రాహుల్. ఈరోజు జరిగే బోర్డ్ మీటింగ్ తర్వాత కావ్యకి పవర్స్ అన్ని పోతాయని అప్పుడు మన టైం మొదలవుతుందని అంటుంది రుద్రాణి. బోర్డ్ మీటింగ్ కోసం కారులో బయల్దేరిన సిద్ధార్ధ్‌కు రాజ్ ఆఫీసుకు వస్తున్న విషయంతో పాటు అక్కడ ఏం చేయాలో చెబుతుంది యామిని. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 9వ తేదీ ఎపిసోడ్ 769లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial July 9th 2025 Episode 769 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఆఫీసుకి వెళ్లేందుకు కిందకి వచ్చేందుకు రాజ్‌ను అంతా వింతగా చూస్తారు. నేనేమైనా వేరే గ్రహం నుంచి వచ్చానా? అని అడుగుతాడు. ఈ ఇంట్లో వంట చేస్తున్న లక్ష్మీ సరిగా పనిచేయడం లేదు అందుకే ఆమెను వంట మనిషి పోస్ట్ నుంచి తోటమాలిని చేస్తున్నానని అంటాడు. రాజ్‌ మాటతీరు, ప్రవర్తన అన్ని గతంలో మాదిరిగా ఉండటంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. వీడు కొత్త రాజా.. పాత రాజా అని ఇందిరను అడుగుతుంది అపర్ణ. వీడు మాటతీరు, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఏదో ట్రైనింగ్ ఇచ్చినట్లుగా లేదని వాడికి గతం గుర్తొచ్చిందా అని డౌట్ వస్తుంది. ఆ వెంటనే రాజ్ నవ్వేస్తాడు.

అందరూ భయపడ్డారు కదా అని అంటాడు రాజ్. నేనే కళావతి గారి నిజమైన బాస్‌ని అని అంతా నమ్మేశారు కదా? అని అంటాడు. ఒక్క క్షణం పాటు వదిన బాస్ మనింటికి వచ్చారా అనిపించింది అని చెబుతారు కళ్యాణ్ , స్వప్న. మనం సింగిల్ టేక్ ఆర్టిస్ట్ .. ఒక్కసారి ఎలా చేయాలో చెబితే చాలు అల్లుకుపోతానని అంటాడు రాజ్. కొన్నిసార్లు మన గురించి మనమే చెప్పుకోవాలి.. లేదంటే గుర్తింపు ఉండదని అంటాడు. ఇక మీరేం టెన్షన్ పడొద్దని మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తానని కావ్యతో చెబుతాడు రాజ్. మనల్ని చూస్తే ఎవడైనా నమ్మేస్తాడని అంటాడు. ఇందిర ఆశీర్వాదం తీసుకుని ఆఫీస్‌కి బయల్దేరతాడు.

బోర్డ్ మీటింగ్‌ కోసం అందరూ ఆఫీస్‌లో సిద్ధంగా ఉంటారు. ఎండీ అంటే టైంకి రావాలని ఇక్కడ చూస్తే ఆ పరిస్ధితి లేదని మండిపడతాడు సిద్ధార్ధ్ . ఈరోజు మా బాస్ ఆఫీసుకి వస్తున్నాడని.. ఆయన కోసం కొంచెం వెయిట్ చేయమని అంటాడు మేనేజర్. ఇంతలో కావ్య, రాజ్‌‌లు ఆఫీసుకి వస్తారు. నిన్న ఆఫీస్‌కి రావడం వల్లే నాలో భయం పోయి కాన్ఫిడెన్స్ వచ్చిందని చెబుతాడు రాజ్. మా బాస్ ఇలాంటి డైలాగ్స్ చెప్పకుండా పనిచేస్తాడని అంటుంది కావ్య. ఈరోజు మీరు మాట్లాడే దానిని బట్టి ఈ కంపెనీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెబుతుంది.

రాజ్‌తో కలిసి కావ్య ఆఫీసుకి వెళ్తుండగా యామిని ఫోన్ చేస్తుంది. నేను ఫోన్ మాట్లాడి వస్తానని మీరు వెళ్లి మీటింగ్ స్టార్ట్ చేయమని రాజ్‌తో చెబుతుంది కావ్య. మీరు లేకుండా నా వల్ల కాదని కావ్యతో రాజ్ అంటాడు. ఇంతలో శృతి వచ్చి త్వరగా రమ్మని చెబుతుంది. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం తీసుకున్నావేంటీ అంటూ సెటైర్లు వేస్తుంది యామిని. తప్పు చేసినవాళ్లు ఎవరైనా సరే ఓడిపోతారని చెబుతుంది కావ్య. కానీ ఈరోజు గెలిచేది నేనే అని, రాజ్‌కు గతం గుర్తులేదన్న విషయం చెప్పేశానని యామిని అంటుంది. రామ్‌కి రాజ్‌లా ట్రైనింగ్ ఇచ్చి ఆఫీస్‌కి తీసుకెళ్తున్న విషయం నాకెలా తెలిసిపోయిందా అని ఆశ్చర్యపోతున్నావా? అని ప్రశ్నిస్తుంది.

ఎదుటివాళ్ల జీవితాల్ని ఇలా ఆడుకోవాలని చూసే నీకు ఇవన్నీ తెలియకుండా ఎలా ఉంటాయని కావ్య అంటుంది. నీ మొగుడిని నా సొంతం చేసుకోవడానికి ఈ కష్టాలన్నీ తప్పడం లేదని చెబుతుంది. ఈరోజు నీకు కంపెనీ దూరమవుతుంది.. రేపు ఫ్యామిలీ దూరమవుతుంది.. చివరిగా నీ మొగుడు కూడా దూరమైపోతాడని అంటుంది యామిని. నువ్వు అనుకున్న దానిలో ఒక్కటి కూడా జరగదని ఈరోజు నిరూపిస్తానని కావ్య సవాల్ చేస్తుంది. ఈరోజు బోర్డ్ మీటింగ్‌తో పాటు ఇంకో సర్‌ప్రైజ్ ప్లాన్ చేశానని, అది ఏంటో నీ మీదకి ఎలా రాబోతుందో నువ్వే కనుక్కుని ఆపడానికి ట్రై చేయమంటుంది యామిని.

యామిని మాటలతో భయపడ్డ కావ్య.. వెంటనే స్వప్నకి ఫోన్ చేసి ఇంట్లో వాళ్లంతా సేఫ్‌గానే ఉన్నారా? అని అడుగుతుంది. ఆ యామిని ఏదో ప్లాన్ చేసిందని కొంచెం జాగ్రత్తగా ఉండమని అంటుంది కావ్య. ఆ వెంటనే అప్పూకి ఫోన్ చేసి ఆ యామిని మళ్లీ ఏదో ప్లాన్ చేసిందని జాగ్రత్తగా ఉండమని చెబుతుంది కావ్య. నువ్వు బోర్డ్ మీటింగ్‌కి వెళ్లకుండా ఇలా టైం వేస్ట్ చేయాలని తను అనుకుంటుందేమో అని చెబుతుంది అప్పూ. యామిని మనుషులు అప్పూని ఇరికించడానికి ఆమె లంచం అడిగిందని ఏసీబీ ఆఫీసర్లకి ఫిర్యాదు చేస్తారు. ఇంతలో ఏసీబీ వాళ్లు వచ్చి ఆవిడ నిజంగానే లంచం అడిగిందా అని అడుగుతారు. షాప్ పెట్టుకోవడానికి అప్పూ లక్ష 20 వేల రూపాయలు లంచం అడిగిందని చెబుతారు యామిని మనుషులు.

అప్పూ లంచం అడిగిందా అంటే డౌట్‌గా ఉందని ఏసీబీ ఆఫీసర్లు అనుకుంటారు. మన డ్యూటీలో ఎవ్వరినీ నమ్మకూడదని, కళ్లతో కాదు సాక్ష్యాలతో పనిచేయాలని ఆఫీసర్ చెబుతాడు. అప్పూని కలిసిన యామిని మనుషులు డబ్బుని ఆమెకు ఇవ్వబోతుండగా ఏసీబీ ఆఫీసర్లు రావడంతో అప్పూ షాక్ అవుతుంది. మీరు వీరి దగ్గర లక్షా 20 వేల రూపాయలు లంచం అడిగారని మాకు కంప్లయంట్ వచ్చిందని, అందుకే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని చెబుతారు ఆఫీసర్లు. దాంతో అప్పూ జరిగినదంతా వారికి చెబుతుంది. ఆఫీసర్‌ను చూడగానే అలా మాట మార్చేస్తున్నారని అంటాడు యామిని మనిషి. ఆ మాటలతో అప్పూ షాక్ అవుతుంది. ఏసీబీ ఆఫీసర్లు ఇచ్చిన కరెన్సీ నోట్లపై ఉన్న నెంబర్స్.. అప్పూ చేతిలో ఉన్న కరెన్సీ నోట్ల నెంబర్స్ మ్యాచ్ కావడంతో ఆమె దొరికిపోతుంది.

వీళ్లు నన్ను కావాలనే ఇరికిస్తున్నారని, వీరి వెనుక ఎవరో ఉన్నారని అంటుంది అప్పూ. ఈ మధ్యే పోస్టింగ్ తీసుకుని, అప్పుడే లంచం తీసుకోవడం మొదలు పెట్టారా? అని ఏసీబీ ఆఫీసర్ మండిపడతాడు. ఇప్పుడు నేనేం చెప్పినా మీకు అర్ధం కాదని.. నిజం బయటికి వచ్చినప్పుడు నా నిజాయితీ ఏంటో మీకే తెలుస్తుందని అంటుంది అప్పూ. కానిస్టేబుల్ శేషుని పిలిచి అప్పూపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సెల్‌లో కూర్చోపెట్టాలని ఆర్డర్స్ వేస్తాడు ఏసీబీ ఆఫీసర్. సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు రావాలని యామిని మనుషులకు చెబుతాడు. బోర్డ్ మీటింగ్‌కి రాజ్ రావడంతో అతనిని చూసి సిద్ధార్ద్ వణికిపోతాడు. ఎప్పుడు లేని రాని అనుమానాలు మీలో ఎందుకు వస్తున్నాయని అడుగుతాడు రాజ్. రాజ్ కనిపించగానే ఎందుకు సైలెంట్ అయ్యారని బోర్డ్ మెంబర్స్‌ని అడుగుతాడు సిద్ధార్ధ్. గత ఆరు నెలలుగా కంపెనీ టర్నోవర్ బాగా తగ్గిపోయిందని లాభాల కంటే నష్టాలు బాగా పెరిగిపోయాయని అందుకే ఎండీని మార్చాలని అనుకుంటున్నారని చెబుతాడు సిద్ధార్ధ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X