Brahmamudi July 9th Episode: రాజ్‌ని తిరిగి తీసుకురాను.. ఇందూ నిర్ణయంతో సుభాష్, అపర్ణ కంటతడి
Photo Courtesy: JioHotstar
ఆస్తిని కొట్టేయడానికి రేఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మా దుగ్గిరాల కుటుంబాన్ని, ఆస్తిని, కంపెనీని అందరినీ కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు నీ మీదే ఉందని రాజ్‌కి చెబుతుంది అపర్ణ. ఏం జరిగినా సరే ఆస్తిని కాపాడతానని అమ్మమ్మకి రాజ్ మాటిస్తాడు. ఉదయాన్నే ఒక బ్రోకర్‌కి ఫోన్ చేసి బంజారాహిల్స్‌లో ల్యాండ్ కొనాలని అనుకుంటున్నానని చెబుతుంది భ్రమరాంబ. పగటి కలలు కనొద్దని మీరేం చేసినా నా మనవడు రాజ్ ఈ దారుణాన్ని అడ్డుకుంటాడని చెబుతుంది అపర్ణ. ఆ మాటలు విన్న భ్రమరాంబ, రేఖలు షాక్ అవుతారు.
ఆఫీస్‌కి రెడీ అవుతున్న ఇందూ దగ్గరికి వచ్చిన అపర్ణ.. నువ్వేం కంగారుపడొద్దు, నా మనవడు రాజ్ ఈ ఆస్తిని కాపాడుతాడని చెబుతుంది. అక్క పిలవకుండా బావ రాడు కదా అని అంటుంది స్వాతి. ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు కదా అని అంటుంది అపర్ణ. ఆస్తిని రిజిస్ట్రర్ చేయించడానికి రిజిస్ట్రార్ ఇంటికి వస్తాడు. దాంతో ఇందూని పిలిచి ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టించబోతుండగా నందూ ఎంట్రీ ఇస్తుంది. ఈ ఆస్తి ఇందూదే కాదు, నాది కూడా.. నాకు కూడా హక్కుందని అంటుంది. అసలు నువ్వెవరు? నీకు ఈ ఇంటికి సంబంధం ఏంటని రేఖ ప్రశ్నిస్తుంది. దుగ్గిరాల ప్రకాష్ - ధాన్యలక్ష్మీల మనవరాలిని, అప్పూ- కళ్యాణ్‌ల కూతురిని నందూని అని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 9వ తేదీ ఎపిసోడ్ 1080లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నువ్వే నందూ అనడానికి ప్రూఫ్ ఏంటి మాకు అని అడుగుతుంది భ్రమరాంబ. అయితే చిన్నప్పుడు జరిగిన కొన్ని విషయాలు గుర్తుచేస్తానని చెబుతుంది నందూ. నా చిన్నప్పుడు మదన్ గాడి దగ్గర బొమ్మ లాగేసుకున్నందుకు నువ్వు నన్ను కొట్టావు కదా అని అంటుంది. మాకు అక్షరాభ్యసం చేస్తున్నప్పుడు మా ముఖాలకు చదువు ఎందుకు అని మా పలకల్ని విరగ్గొట్టావు కదా? ప్రతి చిన్న విషయానికి మీరిద్దరూ నన్ను తిట్టారు. నన్ను రాచి రంపానా పెట్టారు కదా? మమ్మల్ని పనిమనుషుల్లా చూశారు కదా? నేను కోపంతో పిన్ని చేయి కొరికినప్పుడు నువ్వే కదా నన్ను ఆపావు అని శేషంతో అంటుంది నందూ. అప్పుడు కనుక నేను ఆపకపోతే నీ చేతిమీద పెద్ద మచ్చ ఉండేది, ఇప్పుడు నువ్వే నందూవి అనడానికి క్లారిటీ వచ్చేసిందని అంటాడు శేషం.
ఏవో చిన్నప్పటి నాలుగు విషయాలు తెలుసుకుని, నేనే వారసురాలిని అంటే నమ్మేస్తామని అనుకుంటున్నావా? అని ప్రశ్నిస్తుంది రేఖ. నువ్వు ఇలాగే అడుగుతావని నేను పక్కా ప్రూఫ్‌తో వచ్చానని ఫోన్‌లో ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తుంది. నేను తప్పించుకుని పారిపోయిన తర్వాత ఒక పెద్దాయన నన్ను చేరదీశాడు, ఆయన పోలీస్. ఆయనే నన్ను పెంచి పెద్ద చేశాడు. ఇలాంటి రోజు వస్తుందని ఆయన ముందే ఊహించారు. అందుకే ముందస్తుగా నా కేస్‌ని ఎఫ్ఐఆర్ చేసి, మిస్సింగ్ కేస్‌గా రిజిస్టర్ చేశారు. ఇప్పుడు అది నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది సరిపోతుందా? లేకపోతే? పోలీసులు, కోర్టు అని పబ్లిక్ చేయమంటారా అని నందూ బెదిరిస్తుంది.
ఈ ఆస్తి మీ పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ అవ్వాలంటే ఇందూ అక్కతో పాటు నేను కూడా సంతకం పెట్టాలని అంటుంది నందూ. ఇన్నేళ్లుగా రేఖ, భ్రమరాంబలు ఆస్తి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతిసారి ఎవరో ఒకరు రావడం ఆగండి అనడం జరుగుతోందని అంటాడు శేషం. ఇకపై మిమ్మల్ని వెయిట్ చేయించను సంతకం పెట్టేస్తాను అని డాక్యుమెంట్స్ చింపేసి రేఖ ముఖాన కొడుతుంది నందూ. నేను సంతకం పెట్టడం అనేది ఎప్పటికీ జరగదు, చిన్నప్పుడు నువ్వు పెట్టిన టార్చర్ తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయాను. అందుకే చదువుకుని పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరాను, నీకు బుద్ధి చెప్పడం కోసం, సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాను, కానీ నువ్వు మా అక్క దగ్గర ఆస్తి లాక్కోవాలని అనుకుంటున్నావని తెలిసింది. ఇక ఈ ఇంటికి దూరంగా ఉండటంలో ప్రయోజనం లేదని అనిపించింది, అందుకే వచ్చేశానని అంటుంది నందూ. ఇప్పటి వరకు మా అక్కని అమాయకురాలని చేసి ఆడుకున్నావు, కానీ ఇకపై అలా చేస్తే నేను ఊరుకోను, మా అక్కకి నేను ఉన్నానని చెబుతుంది నందూ.
ఈ ఇంటిని, నానమ్మని వదిలేసి ఎలా వెళ్లావని నందూని అడుగుతుంది అపర్ణ. నీ కోసం ఎంతో వెతికామని సుభాష్, అపర్ణలు బాధపడతారు. తను ప్రాణాలతోనే ఉందా? ఏదైనా జరగరానిది జరిగిందా అని ప్రతిక్షణం బాధపడుతూనే ఉన్నామని అంటాడు సుభాష్. ఆ రోజు ఇందూ కిడ్నాప్ అయినప్పుడు నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా? అప్పుడైనా చెప్పాలని అనిపించలేదా అని అపర్ణ నిలదీస్తుంది. ఇందూ అక్కకి తెలుసు.. నేనే నందూని అని అక్కకి చెప్పాను అంటుంది నందూ. ఆ మాటలు విన్న అపర్ణ, సుభాష్ షాక్ అవుతారు. ఇన్నిరోజులు అక్కకి నేను ఒక్కదానిని మాత్రమే సపోర్ట్‌గా ఉండేదానిని, మధ్యలో రాజ్ బావ వచ్చాడు .. వెళ్లిపోయాడు. కానీ ఇప్పుడు నేనొక్క దానినే అక్కకి ఎలా సపోర్ట్ చేయాలని అనుకుంటున్న టైంలో నువ్వు వచ్చావని అంటుంది స్వాతి.
రేఖ ఆంటీ ఇలా ప్లాన్ చేసిందని నీకు నేను చెప్పలేదు కదా? నీకు ఎలా తెలిసిందని ఇందూ అడుగుతుంది. బావ నన్ను కలిసి విషయం చెప్పాడని అంటుంది నందూ. నువ్వు తనని ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి కంపెనీకి సీఈవో అయ్యేలా చేశావని మా అక్క నిన్ను మెచ్చుకుంటుందని చెబుతుంది నందూ. ఆ రాబందులు మీ అక్క ఆస్తిని తన్నుకుపోవాలని చూస్తున్నారని నందూతో అంటాడు రాజ్. నీ సంతకం కూడా ఉండాలి కదా అని నందూ అడగ్గా.. నాకు తెలియకుండా సంతకం పెట్టించుకుంది, ఇప్పుడు నేను వెళ్లినా ఉపయోగం లేదని అంటాడు. అందుకు నువ్వే వెళ్లాలని చెబుతాడు రాజ్. నువ్వు కూడా ఆ ఇంటికి వారసురాలివి, అప్పుడు మీ ఇద్దరి సంతకాలు ఉండాలి.. నువ్వు వెళ్తేనే దుగ్గిరాల కుటుంబాన్ని కాపాడగలవని చెబుతాడు రాజ్. నువ్వు ఆ ఇంటికి వెళ్లడానికి ఇదే కరెక్ట్ టైం.. అది మీ అమ్మనాన్నల కుటుంబం, ఇకపై మీ అక్కకి దూరంగా ఉండాల్సిన అవసరం లేదని బావ అన్నాడని జరిగినదంతా చెబుతుంది నందూ.
థ్యాంక్స్ చెప్పాల్సింది బావకి అంటుంది నందూ. బావ రాకుండానే నందూ అక్కని పంపించి ఆపించాడని చెబుతుంది స్వాతి. నీ గురించి మన గురించి రాజ్ ఆలోచిస్తుంటాడు, నువ్వు చేసుకున్న పుణ్యం వల్లే రాజ్ నీకు భర్తగా దొరికాడు. మగ దిక్కుగా లేని ఈ ఇంటికి అండగా నిలబడ్డాడని అంటారు అపర్ణ, సుభాష్. వాళ్ల అమ్మనాన్నల కోసం భయపడి నువ్వే తనను దూరం చేసుకున్నావు. తను నీతో ఉంటేనే నీ జీవితం, ఈ ఇల్లు బాగుంటాయి.. తనని చూస్తుంటే పరాయివాడిలా అనిపించడం లేదు. సొంత మనిషిలా అనిపిస్తోంది, ఎక్కడో ఏదో మూలన వాడు నా సొంత మనవడని అనిపిస్తుంది అంటుంది అపర్ణ. తను ఈ ఇంటి వారసుడిలా అన్ని బాధ్యతలు తీసుకున్నాడు, రాజ్ ఏదో రకంగా తన అమ్మానాన్నల్ని ఒప్పిస్తాడని చెబుతుంది. రాజ్ ఉంటేనే రేఖని ఎదుర్కోగలమని అపర్ణ, సుభాష్ అంటారు. రాజ్‌ను రమ్మనలేనని తేల్చేస్తుంది ఇందూ. ఈ ఊబిలోకి తనని లాగడం నాకు ఇష్టం లేదు.. మేం అక్కచెల్లెళ్లం కాబట్టి రేఖ ఆంటీ ఏం చేసినా ఎదురు నిలబడాలి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications