Brahmamudi June 10th Episode: యామినిని రెచ్చగొట్టిన కావ్య.. దుగ్గిరాల ఫ్యామిలీకి షాకిచ్చిన యామిని, రాజ్ కంటతడి
Photo Courtesy: JioHotstar
ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని తనకు కొంతకాలం సమయం కావాలని రాజ్ చెప్పడంతో రఘునాథ్ - వైదేహిలు షాక్ అవుతారు. బావ లేకుండా నేను బతకనంటూ యామిని కత్తితో మణికట్టు నరం కట్ చేసుకుంటుంది. దాంతో రాజ్ ఆమెను లాగికొట్టి గాయానికి కట్టు కడతాడు. చనిపోవడం తప్ప యామినికి మరో దారి లేదని రఘునాథ్ - వైదేహిలు చెప్పడంతో రాజ్ తప్పనిసరి పరిస్ధితుల్లో పెళ్లికి ఓకే చెబుతాడు.
రాజ్ వచ్చి కావ్యకి ప్రపోజ్ చేస్తాడని దుగ్గిరాల ఫ్యామిలీ ఎదురుచూస్తుంటుంది. ఇందిర ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాజ్ లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబ సభ్యులు టెన్షన్ పడతారు. ఇంతలో రుద్రాణి వచ్చి రాజ్ ఎప్పటికీ ఫోన్ లిఫ్ట్ చేయడని యామినితో పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడని చెప్పడంతో ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతుంది. కావ్య చేత రాజ్‌కి ఫోన్ చేయించాలని అపర్ణ, ఇందిరలు ప్లాన్ చేసి కళావతి దగ్గరికి వచ్చేసరికి ఆమె ఐస్‌క్రీమ్ తింటూ కనిపిస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 10వ తేదీ ఎపిసోడ్ 744లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రాజ్‌కు ఫోన్ చేయనని చెప్పిన కావ్యపై అపర్ణ, ఇందిరలు కోప్పడతారు. నీ మొగుడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని, నీ జీవితం నాశనం అవుతుంటే ఇలా సైలెంట్‌గా ఉంటావేంటీ అని అపర్ణ మండిపడుతుంది. జరిగే పెళ్లి గురించి భయపడాలి కానీ, జరగని పెళ్లి గురించి టెన్షన్ పడటం ఎందుకు అని ప్రశ్నిస్తుంది కావ్య. వాళ్ల మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకో ఐస్‌క్రీమ్ తింటానని వెళ్లిపోతుంది. మరోవైపు.. రాజ్ ఒంటరిగా బాధపడుతుండగా యామిని, వైదేహిలు పెళ్లి బట్టలు తీసుకుని వచ్చి నీకు ఏది నచ్చిందని అడుగుతుంది యామిని. నీకు ఏది నచ్చితే అదే ఫైనల్ చేయమని అంటాడు రాజ్.
యామిని- రాజ్‌ల పెళ్లిని ఎలా ఆపాలో తెలియక ఇందిర- అపర్ణలు బాధపడుతుంటారు. వాళ్లని చూసి రుద్రాణి సంతోషిస్తుంది. చేయి కోసుకున్న యామినిని ఎలా ఉందని అడుగుతుంది వైదేహి. బావ కోసం చేతులే కాదు అవసరమైతే ప్రాణాలైనా తీసుకుంటానని అంటుంది యామిని. నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నామని కొంచెం మా గురించి కూడా ఆలోచించమని అంటుంది వైదేహి. రాజ్- నేను ఎల్లుండి పెళ్లి చేసుకోబోతున్నామని కావ్యకి ఫోన్ చేస్తుంది యామిని. ఈ పెళ్లికి ఆయన ఒప్పుకుని ఉండరని, నువ్వే ఏదో మాయ చేసి ఆయన ఒప్పుకునేలా చేసుంటావని అంటుంది కావ్య.
నువ్వు సూపర్ కావ్య.. బావని పెళ్లికి ఒప్పించడానికి నేను నాటకం ఆడాల్సి వచ్చిందని చెబుతుంది యామిని. బావని బ్లాక్‌మెయిల్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటానని తన నోటితోనే చెప్పేలా చేశానని అంటుంది. పెళ్లిని కూడా ఏదో ఒక గుడిలో దొంగతనంగా ప్లాన్ చేసి ఉంటావు కదా అని ప్రశ్నిస్తుంది కావ్య. దొంగతనంగా చేసుకోవాల్సిన అవసరం నాకు లేదని దర్జాగా, అందరికీ తెలిసేలాగే పెళ్లి చేసుకుంటానని చెబుతుంది యామిని. అంత ధైర్యంగా చేసుకునే దానివైతే నాకెందుకు చెప్పలేదు? భయం వేసిందా? అని ప్రశ్నిస్తుంది కావ్య.
మీ పెళ్లి విషయం నాకు తెలిస్తే నేను ఎక్కడ అడ్డుపడతానోనని, మీ పెళ్లిని పీటల మీద ఎక్కడ ఆపేస్తానోనని కొంచెం కంగారు పడుంటావని సెటైర్లు వేస్తుంది. నా బావే పెళ్లికి ఒప్పుకున్నాక అస్సలు భయపడనని చెబుతుంది యామిని. మరి పెళ్లికి మమ్మల్ని ఎందుకు పిలవలేదని ప్రశ్నిస్తుంది కావ్య. మీకు ఆల్రెడీ కార్డ్ ఇచ్చి పెళ్లికి పిలిచాను కదా అని అంటుంది యామిని. మాకు సవాలక్ష పనులు.. మాకు ఎక్కడ గుర్తుంటుందని చెబుతుంది కావ్య. నేనే మీ ఇంటికొచ్చి బొట్టు పెట్టి మరి పిలుస్తానని అంటుంది యామిని.
డూప్లికేట్ నగల్ని స్వప్న చెక్ చేసుకుంటూ ఉండగా రాహుల్ చూసి టెన్షన్ పడతాడు. నగల్ని దొంగతనం చేయడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నావా? అని ప్రశ్నిస్తుంది స్వప్న. ఈ ఒరిజినల్ నగలు కొట్టేసి వీటి ప్లేస్‌లు డూప్లికేట్ చేయించాలని ప్లాన్ చేస్తున్నావా? అని అడుగుతుంది. లాస్ట్ టైం అమ్మమ్మగారు చెప్పారు కాబట్టి వదిలేశాను.. ఈసారి అలాంటి ప్లాన్ వేస్తే మాత్రం భర్తవని కూడా చూడనని వార్నింగ్ ఇస్తుంది. నీ గురించి తెలిశాక కూడా అలాంటి ప్లాన్స్ ఎందుకు వేస్తానని అంటాడు రాహుల్. ఆల్రెడీ ట్రైలర్ చూపించావ్ కదా.. సినిమా చూడాలని ఎందుకు అనుకుంటానని అంటాడు రాహుల్. దాని నగలు కొట్టేస్తానన్న డౌట్ వచ్చినందుకే నన్ను చంపేస్తానని అంటుంది.. ఆ నగలు గిల్ట్ నగలని తెలిస్తే నా పేగులతో గిటారు వాయిస్తుందని టెన్షన్ పడతాడు రాహుల్.
ఈ నగల్ని బయటికెందుకు తీశావ్ అని అడగ్గా.. రేపు బ్యాంకులో పెట్టడానికని స్వప్న చెప్పడంతో రాహుల్ టెన్షన్ ఉలిక్కిపడతాడు. బ్యాంక్ వాళ్లు చెక్ చేసినప్పుడు ఇవన్నీ గిల్ట్ నగలని స్వప్నకి తెలిసిపోతుందని, వీటిని బ్యాంక్‌కి తీసుకెళ్లకుండా ఆపాలని అనుకుంటాడు రాహుల్. ఈ నగలన్నీ బ్యాంక్‌లో పెట్టడం అవసరమా? అని ప్రశ్నిస్తాడు. అప్పూ శోభనం అయిపోయింది కదా? అందుకే తిరిగి వీటిని బ్యాంక్‌లో పెడదామని అనుకుంటున్నానని చెబుతుంది స్వప్న. ఇంటిలో ఉంటే ఎవరు కొట్టేస్తారోనని భయంగా ఉంది.. అదే బ్యాంక్‌లో అయితే భద్రంగా ఉంటాయని అంటుంది. మనకి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కదా అందుకే వద్దని చెప్పానని అంటాడు రాహుల్. ఆ మాటలతో బ్యాంక్‌కి వెళ్లకుండా ఆగిపోతుంది స్వప్న.
దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కావ్య ఇచ్చిన కాఫీ తాగి స్వర్గంలో ఉందని మెచ్చుకుంటుంది ఇందిర. దానిపై ప్రకాశం, ధాన్యలక్ష్మీలు పంచ్ వేస్తారు. ఇంతలో యామిని, వైదేహిలు దుగ్గిరాల వారింటికి వస్తారు. వాళ్లిద్దరినీ చూడగానే అంతా షాక్ అవుతారు. ఎల్లుండి నాకు, మా బావకి పెళ్లి జరగబోతోందని మీరంతా తప్పకుండా రావాలని చెబుతుంది యామిని. ఆ మాటలతో అంతా రగిలిపోతుంటారు. యామినిని కొట్టి చంపేస్తానని అపర్ణ అనగా ఇందిర ఆపుతుంది. కావ్యని పెళ్లికి రావాల్సిందిగా బొట్టుపెట్టి ఆహ్వానిస్తుంది యామిని. ఖచ్చితంగా వస్తానని, నేనే కాదు మా ఫ్యామిలీ అంతా పెళ్లికి వస్తుందని చెబుతుంది కావ్య. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. కావ్య ఏదైనా ప్లాన్ వేసిందా? ఇలాంటి ట్విస్ట్ ఇచ్చిందేంటీ? అని మనసులో అనుకుంటుంది రుద్రాణి. మీరంతా రావడమే నాక్కూడా కావాలని అంటుంది యామిని. కావ్యని పెళ్లికి పిలవడంపై యామిని మీద కేకలు వేస్తుంది వైదేహి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











