Brahmamudi June 10th Episode: ఇందూని ఇరికించేలా రేఖ కుట్ర... రాజ్‌కి పొంచి ఉన్న ప్రమాదం

Photo Courtesy: JioHotstar

ఇందూని విడిపించుకుని తీసుకెళ్తానని తాగుబోతు నారాయణ చెప్పడంతో అతనిపై సీరియస్ అవుతుంది ఐశ్వర్య. ఊరుకోక ఏం చేస్తావు.. నీ రౌడీలతో కొట్టిస్తావా? బయట ఇద్దరు పడిపోయారు, లోపల ఒకడు పడిపోయాడు.. నీ రౌడీలు నన్నేం చేయలేరని ఇందూ కట్లు విప్పేస్తాడు. ఇంకో 10 నిమిషాలలో నువ్వు అక్కడికి వెళ్లేసరికి సీఈవోని ఎన్నుకుంటారని ఐశ్వర్య అంటుంది. 10 నిమిషాలలో నువ్వు కారులో కూడా వెళ్లలేవని చెప్పడంతో అక్కడే ఉన్న బైక్‌పై ఇందూని జెట్ స్పీడ్‌తో ఆఫీస్‌కి తీసుకెళ్తాడు నారాయణ.

మీ సపోర్ట్ ఎవరికి రాజ్‌కా? నాకా అని రేఖ అడగటంతో టెన్షన్ పడతాడు పరంధామయ్య. ఇంతలో ఇందూ రావడంతో ఈ అమ్మాయి కావ్యలా ఉంది.. నా సపోర్ట్ ఈమెకు అని చెబుతాడు పెద్దాయన. దాంతో రాజ్‌ని సీఈవో కాకుండా చేయడానికి ఇందూని సీఈవో చేయడానికి ఒప్పుకుంటుది రేఖ. చివరికి అందరి సపోర్ట్‌తో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి సీఈవోగా ఇందూ ఎన్నిక అవుతుంది. కారులో వస్తుండగా నేను టైంకి రాకపోతే నువ్వు సీఈవో అవుదామని ప్లాన్ చేశావట అని రాజ్‌పై మండిపడుతుంది ఇందూ. వెంకీని డెలివరీ బాయ్‌ ఉద్యోగంలో చేర్పించడానికి ఓ చోటికి తీసుకొస్తుంది నందూ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 10వ తేదీ ఎపిసోడ్ 1055లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial June 10th 2026 Episode 1055 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

వెంకీకి ఉద్యోగం ఇప్పించడానికి ఓ చోటికి తీసుకెళ్తుంది నందూ. ఇతనిని చూస్తుంటే సాఫ్ట్‌గా మిల్క్‌బాయ్‌లా కనిపిస్తున్నాడు డెలివరీలు ఏం చేస్తాడని ప్రశ్నిస్తాడు ఓనర్. ఆన్‌లైన్‌లో ఫుడ్ డెలివరీకి చాలా యాప్స్ ఉన్నప్పటికీ చాలామంది నా క్లౌడ్ కిచెన్ ద్వారానే ఆర్డర్ పెట్టుకుంటారు. నేను క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తానని పర్టిక్యులర్‌గా నా క్లయింట్సే నాకున్నారు. అందుకే డెలివరీ బాయ్స్‌ని కూడా నేను పెట్టుకుంటానని చెబుతాడు ఓనర్. నేను టైమ్‌కే డెలివరీ ఇస్తానని అంటాడు వెంకీ.

అది మాటలు చెప్పినంత ఈజీ కాదు.. హైదరాబాద్ ట్రాఫిక్‌ని ఎదుర్కొని డెలివరీ ఇవ్వడం అంత ఆషామాషీ కాదు. నీకు హైదరాబాద్‌లో గల్లీ గల్లీ తెలుసుండాలని చెబుతాడు. నెలకు 10 వేలు జీతంతో పాటు ఒక్కో డెలివరీ 50 రూపాయలు ఇస్తానని అంటాడు ఓనర్. నువ్వు ఈ జాబ్ చేసుకుంటూ నీ ఫ్యామిలీకి అండగా నిలవొచ్చు, సాయంత్రం పూట చదువుకోవచ్చు అని వెంకీకి చెబుతుంది నందూ. నువ్వు మళ్లీ చనిపోదామన్న ఆలోచనలు చేయకుండా ఉంటే చాలని అంటుంది నందూ.

కంపెనీకి సీఈవో అయ్యాక ఇంటికొచ్చిన మనవరాలికి దిష్టి తీస్తుంది అపర్ణ. ఇందూ సీఈవో అయ్యిందని కొంతమంది కుళ్లుకుని చస్తుంటారని అంటాడు రాజ్. ఈ ఇందూని మనం సీఈవోని చేశామని తెలియక తన మనవరాలు ఏదో తన కష్టంతో సీఈవో అయ్యిందని పొంగిపోతోందిని భ్రమరాంబతో అంటుంది రేఖ. ఇన్నేళ్ల నిరీక్షణకు ఈరోజు ఫలితం దక్కింది, చాలా సంతోషంగా చెబుతాడు సుభాష్. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. ఒకప్పుడు మీ అమ్మానాన్నలు కంపెనీని ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్లారో ఇప్పుడు నువ్వు కూడా అదే స్థాయికి తీసుకెళ్తావని మేం నమ్ముతున్నామని అంటుంది అపర్ణ.

అది ఆ రేఖ కీలు బొమ్మని మనసులో అనుకుంటుంది భ్రమరాంబ. నేను ఇంత ప్లాన్ చేసినా దీనిని ఆపలేకపోయానని బాధపడుతుంది ఐశ్వర్య. ఇన్నేళ్లుగా రేఖ మన కంపెనీని సరిగా నడిపించలేదు. నెంబర్ వన్‌గా ఉన్న మన కంపెనీ డౌన్‌ఫాల్ అయిపోయింది. లాభాల్లో నడవాల్సిన కంపెనీ నష్టాల్లో నడుస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. నువ్వు మళ్లీ మన కంపెనీకి పూర్వ వైభవం తీసుకురావాలని చెబుతుంది అపర్ణ. ఖచ్చితంగా పూర్వ వైభవం తీసుకొస్తుంది. నేనుండగా ఇందూకి ఫెయిల్యూర్ అనేది ఉండదు. నేనే తన పక్కనుండి కంపెనీని లాభాల బాటలో పరిగెత్తిస్తానని అంటాడు రాజ్.

పరిగెత్తిస్తావో? పల్టీలు కొట్టి కిందపడిపోతావో కానీ నువ్వు సీఈవో అవ్వాలని చాలా ట్రై చేశావని ప్రశ్నిస్తుంది భ్రమరాంబ. చాలా ట్రై చేశాను, కానీ ఒకే ఒక్క ఓటుతో ఓడిపోయానని అంటాడు రాజ్. రేఖ పిన్ని వల్లే ఓడిపోయానని చెబుతాడు. ఇప్పటికైనా అర్ధమైందా మా రేఖని ఎదిరించి నువ్వేం చేయలేవని అంటుంది భ్రమరాంబ. రేఖ పిన్ని టాలెంట్ ఏంటో? పవర్ ఏంటో? ఎవరిని ఎక్కడుంచాలో? ఎవరిని ఎలా తొక్కాలో ఈరోజే తెలుసుకున్నానని చెబుతాడు రాజ్. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు.. అంతేకానీ చిరాకు, కోపమని బిల్డప్‌లు ఇవ్వొద్దని వార్నింగ్ ఇస్తుంది భ్రమరాంబ.

ఓడిపోయినా సరే అనుకున్నది సాధించే వరకు వదిలపెట్టను. మిడిల్ క్లాస్ నుంచి ఈ ఇంద్రభవనం వరకు వచ్చానని అంటాడు రాజ్. ఇందూ మీద మనసు పారేసుకున్న తక్షణమే తనకి ఇష్టం లేకపోయినా మూడు ముళ్లు వేశా, ఇప్పుడు తన మనసుని నా వైపుకు తిప్పుకున్నానని అంటాడు రాజ్. రేఖ పిన్ని కెపాసిటి తెలిశాక తనకి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను, అందుకే ఈ రోజు నుంచి తన అడుగుజాడల్లోనే నడుస్తాను అంటాడు. నీకంటూ ఓ గురి ఉంటుంది.. ఆ గురి తప్పదని నా నమ్మకమని చెబుతాడు శేషం. ఇప్పుడు తన గురి తప్పింది కదా అని అంటుంది భ్రమరాంబ.

అందుకే రేఖ పిన్ని అడుగుజాడల్లో నడుస్తాను అనేది.. అలా ఆ తర్వాత ఇన్నేళ్లుగా ఆ రేఖ పిన్ని ఎలా ఉందో, నేను కూడా అలాగే ఉంటానని రాజ్ అనడంతో భ్రమరాంబ షాక్ అవుతుంది. అంటే నువ్వు మా అందరినీ శాసిస్తావా అని భ్రమరాంబ అడగ్గా.. అంతేకదా అంటాడు రాజ్. రేఖ పిన్ని నుంచి నేర్చుకున్న విద్యల్ని మీ మీదే ప్రయోగిస్తానని చెబుతాడు రాజ్. అల్లుడు సీఈవో పోస్ట్ మిస్ అయ్యిందని టెంపర్‌తో ఉన్నాడు రెచ్చగొట్టొద్దని రేఖకి వార్నింగ్ ఇస్తాడు శేషం. నా సీఈవో పోస్ట్ లాక్కున్నారు.. కానీ నా ఈగో హర్ట్ చేస్తే మాత్రం బరస్ట్ అయిపోతానని అంటాడు రాజ్.

ఈ రోజు నీకో డాక్యుమెంట్ పంపిస్తాను దాని మీద సంతకం చేయమని చెబుతుంది రేఖ. దానికి ఇందూ సరేనని అనడంతో నీకు సైన్ చేయడం రాదు కదా? మరి సంతకం చేస్తానని అంటున్నావని ప్రశ్నిస్తుంది రేఖ. ఆ మాటలతో ఇందూ వణికిపోతుంది. తన దృష్టిలో సంతకం అంటే వేలిముద్రలని చెబుతాడు రాజ్. నాకు అక్షరం ముక్క కూడా రాదు.. అలాంటిది ఈ సీఈవో పనులేంటో నాకు తెలియదని అంటుంది ఇందూ. ఇప్పుడు చెప్పండి ఎవరు సీఈవో అని అపర్ణని ప్రశ్నిస్తుంది రేఖ. ఇందూ ఉందంటే ఉంది.. కానీ నువ్వే సీఈవో అంటుంది భ్రమరాంబ.

నువ్వు మాకు చెప్పిందేంటీ? నువ్వు చేసిందేంటీ అంటూ ఇందూపై మండిపడుతుంది అపర్ణ. ఆ రేఖ చేతిలో కీలుబొమ్మలా ఉంటావా? తను ఏ ఫైలు మీద సంతకం పెట్టమంటే అక్కడ పెడతావా? కంపెనీని సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తావు అనుకుంటే ఇలా చేశావేంటీ? దీని కోసమేనా నిన్ను చదివించింది, రేఖ చెప్పినట్లు నువ్వు చేస్తే ఎవరు సీఈవో అయితే ఏంటీ? అని ప్రశ్నిస్తుంది. మీరేం కంగారుపడొద్దు.. ఇప్పుడు ఇందూ కంపెనీకి సీఈవో అయ్యింది, మీరు అనుకున్నట్లే అన్నీ జరుగుతాయని అంటాడు రాజ్.

ఇందూ చదువుకుంటే ఎప్పటికైనా కంపెనీని లాక్కుంటుందని ఆ రేఖ చదువుకోనివ్వలేదు, కనీసం ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్లనివ్వలేదు. మా ఇంట్లోనే మా కళ్లముందే బందీని చేసింది, ఒక పనిమనిషిని చేసింది. కానీ మేమిద్దరం ఇందూని దొంగచాటుగా తనని చదివించామని చెబుతుంది అపర్ణ. ఇప్పుడు కనుక ఎదురుతిరిగితే ఆ రేఖ క్రూరంగా ప్రవర్తిస్తుంది. అసలే నా మనవరాలు అమాయకురాలు అంటుంది అపర్ణ. ఎవరు అమాయకురాలు.. మీరు తనని ఒకవైపు చూశారు, అది నాకు తెలుసు. గుడినే కాదు గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగేసే రకం నీ మనవరాలు. ఆ రేఖ ముందు, మీ అందరి ముందు మాత్రమే తను అమాయకురాలిగా నటిస్తుంది. కానీ తన మైండ్‌లో ఉన్న పథకాలు, ఎవరికి ఎలా ఫిటింగ్ పెట్టాలో బాగా తెలుసు అని అంటాడు రాజ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X