Brahmamudi June 11th Episode: యామిని ఎత్తులు చిత్తు.. పూజారిని ట్రాప్ చేసిన అప్పూ.. దేవుడిపైనే కావ్య భారం

Photo Courtesy: JioHotstar

రాజ్‌కు ఫోన్ చేయకుండా ఐస్‌క్రీమ్ తింటూ కూర్చొన్న కావ్యపై మండిపడతారు అపర్ణ, ఇందిర. కావ్యకి ఫోన్ చేసిన యామిని.. రాజ్‌తో నా పెళ్లి త్వరలోనే జరగబోతోందని చెబుతుంది. నన్ను పెళ్లికి పిలవవా అని కావ్య అడగ్గా రేపే మీ ఇంటికి వచ్చి బొట్టు పెట్టి పిలుస్తానని అంటుంది యామిని. డూప్లికేట్ నగల్ని బ్యాంక్‌లో ఇస్తానని స్వప్న చెప్పడంతో రాహుల్ కంగారుపడతాడు. ఈ నెలలో చాలా ఫంక్షన్స్ ఉన్నాయని.. ఈ కార్యక్రమాలు ముగిశాక బ్యాంకులో ఇవ్వమని రాహుల్ చెప్పడంతో స్వప్న సరేనని అంటుంది.

దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కూర్చొని ఉండగా వైదేహిని వెంబెట్టుకుని వస్తుంది యామిని. మా బావతో రేపు నా పెళ్లి జరగబోతోందని మీరంతా తప్పకుండా రావాలని ఆహ్వానిస్తుంది. కావ్య కూడా మా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని వస్తానని చెబుతుంది. ఆ మాటలతో రుద్రాణి షాక్ అవుతుంది. యామిని- రాజ్‌ల పెళ్లి ఆపడానికి కావ్య ఏదైనా స్కెచ్ వేసిందా? అనుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 11వ తేదీ ఎపిసోడ్ 745లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial June 11th 2025 Episode 745 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

వద్దు అంటున్నా వినకుండా ఆ కావ్యకి ఫోన్ చేశావ్, ఇవాళ వాళ్లింటికే వెళ్లి బొట్టుపెట్టి మరి ఆ కావ్యని పిలిచావని యామినిపై మండిపడుతుంది వైదేహి. రేపు కావ్య వస్తే వాళ్లు సైలెంట్‌గా ఉంటారా? రామ్ మనసు మార్చి పెళ్లిని ఆపడానికి ప్రయత్నం చేస్తారని అంటుంది వైదేహి. రాజ్‌కి కావ్యే భార్య అని చెబుతారా? అలా చెప్పాలంటే గతం గుర్తుచేయాల్సి ఉంటుందని చెబుతుంది యామిని. గతం గుర్తు చేస్తే ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందో వాళ్లు ఆడ్రెడీ ఫేస్ చేశారని అంటుంది యామిని. చచ్చినా గతం గుర్తుచేసే ప్రయత్నం చేయరని తేల్చిచెబుతుంది.

యామిని వెళ్లిపోయిన తర్వాత కావ్యపై మండిపడతాడు సుభాష్. ఆ యామినికి మమ్మల్ని పెళ్లికి తీసుకొస్తానని మాట ఇచ్చేశావని నిలదీస్తాడు. నాకంతా అర్ధమైంది.. కావ్య అంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడిందంటే.. యామినితో రాజ్ పెళ్లిని ఆపడానికి ఏదో గట్టిగానే ప్లాన్ చేసిందని చెబుతుంది ఇందిర. ఈ మాటలతో రుద్రాణి - రాహుల్ షాక్ అవుతారు. నేను పెళ్లిని ఆపడానికి ఏ ప్లాన్ చేయలేదని అంటుంది కావ్య. ఆ మాటలతో కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు. పెళ్లి ఆపడానికి ప్లాన్ చేయకపోతే ఆ యామినితో వీరనారిలా ఎందుకు మాట్లాడావని నిలదీస్తుంది ఇందిర.

మీ అందరినీ నేను పెళ్లికి తీసుకెళ్తానని కావ్య చెప్పడంతో .. మేమంతా ఎందుకు రావాలి? అక్కడ మరో అమ్మాయి మెడలో వాడు తాళి కడుతుంటే చూసి అక్షింతలు వేయాలా? అని ప్రశ్నిస్తుంది అపర్ణ. ఆ పెళ్లి జరిగితే కదా మీరు ఆశీర్వదించేది అని అంటుంది కావ్య. దీంతో ఏం జరుగుతుందో అర్ధం కాక ఇంట్లో వాళ్లు మౌనంగా చూస్తుండిపోతారు. ఆ పెళ్లి జరగదని ఎలా చెప్పగలవని ప్రశ్నిస్తుంది రుద్రాణి. నాకు ఆ దేవుడి మీద నమ్మకం ఉందని.. మా ఇద్దరినీ కలిపిన ఆ దేవుడే మమ్మల్ని విడిపోకుండా కాపాడతాడని అంటుంది కావ్య. అసలు మా పెళ్లే జరగదని అనుకున్నాం.. కానీ చివరి నిమిషంలో మా ఇద్దరికీ ముడి వేశాడని చెబుతుంది. తాళి బంధంతో మా ఇద్దరినీ భార్యాభర్తలుగా మార్చాడని అంటుంది కావ్య.

ఆ యామిని లాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా ఆయన ఆశీర్వాదం ఉన్నంత వరకు ఆ బ్రహ్మముడిని విప్పలేరని తేల్చి చెబుతుంది కావ్య. ఆమె మాటలు విన్నాక ఈ పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుందని అంటుంది రుద్రాణి. కావ్యని నమ్ముకుంటే లాభం లేదని, ఈ పెళ్లిని ఆపాలంటే మనమే ఏదో ఒకటి చేయాలని అపర్ణతో అంటుంది ఇందిర. యామిని- వైదేహి కలిసి పెళ్లి జరిపించే పంతులు దగ్గరికి వస్తారు. మా అమ్మాయి పెళ్లికి కొన్ని గండాలు అడ్డొచ్చేలా ఉన్నాయని వైదేహి చెబుతుంది. సకల విద్యలు నేర్చుకున్నవాడిని, నవగ్రహాల్ని శాసించేవాడిని నేను పెట్టిన ముహూర్తానికి గండాలు ఎలా రాణిస్తానని అంటాడు పేరి శాస్త్రి. మీరేం కంగారు పడొద్దని, ఆ గండాల సంగతి నేను చూసుకుంటానని చెబుతాడు. ఎట్టి పరిస్ధితుల్లోనూ నా పెళ్లి ఆగకూడదని, ఏ గండాలు అడ్డురాకూడదని మీకు ఎంత కావాలంటే అంత ఇస్తానని చెబుతుంది యామిని.

యామినిని పెళ్లి చేసుకోబోతున్నట్లు నానమ్మకి చెబుదామని అనుకుంటాడు రాజ్. ఈ విషయాన్ని కళావతికి చెప్పేయాలని వెంటనే ఆమెకు ఫోన్ చేస్తాడు. అర్ధరాత్రి 11 గంటలకు ఒంటరిగా ఉన్న అమ్మాయికి కాల్ చేస్తారా? అని మండిపడుతుంది కావ్య. ఆడవాళ్లకి పొద్దున నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్ని పనులుంటాయో మీకు తెలుసా? అని నిలదీస్తుంది కావ్య. రాజ్ చెప్పేది వినిపించుకోకుండా ఏదేదో మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది కావ్య. దాంతో కావాలనే కళావతి నన్ను మాట్లాడకుండా డైవర్ట్ చేశారని అనుకుంటాడు రాజ్. నా పెళ్లి గురించి కావ్యకి చెప్పాలా? వద్దా అని తర్జన భర్జనలు పడతాడు రాజ్. కళావతికి విషయం చెప్పేసి వస్తానని బయల్దేరుతుండగా యామిని పిలుస్తుంది.

నీకు సర్‌ప్రైజ్ ప్లాన్ చేశానని రాజ్‌ని కళ్లు మూసుకోమని చెబుతుంది యామిని. అతనిని కళ్లు తెరవమని ఫోన్ చూపించగా అందులో పెళ్లి మంటపం ఉంటుంది. నువ్వు చెప్పిన సర్‌ప్రైజ్ ఇదేనా? ఇందులో ఏముందని అంటాడు రాజ్. రేపు నీకోసం పెద్ద సర్‌ప్రైజ్ ప్లాన్ చేశానని చెబుతుంది యామిని. అదేంటో చెప్పమని రాజ్ అడగ్గా.. సర్‌ప్రైజ్ సర్‌ప్రైజ్‌గానే ఉండాలని అంటుంది యామిని. ఒంటరిగా ఆలోచిస్తున్న ఇందిర దగ్గరికి అపర్ణ వచ్చి మాట్లాడుతుంది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది అన్నట్లు .. ఇంత ఆస్తి ఉన్నా? ఇంటి నిండా మనుషులున్నా నాకు ఆనందం మాత్రం దొరకడం లేదని బాధపడుతుంది ఇందిర. ఈ వయసులో కృష్ణా రామ అనుకుంటూ మునిమనవళ్లు, మునిమనవరాళ్లని ఎత్తుకోవాల్సిన నాతో ఇలా పెళ్లిళ్లు, పెటాకులు చేయించే కార్యక్రమం పెట్టిస్తున్నాడు నీ కొడుకు అంటుంది.

ఇన్ని రోజులు కావ్యకి ప్రపోజ్ చేస్తానని చెప్పి ఇప్పుడు ఆ యామినితో పెళ్లికి సిద్ధమైపోయాడని మండిపడుతుంది ఇందిర. ఆ మాటలతో రుద్రాణి తెగ సంతోషిస్తుంది. పెళ్లికి ఇలా సింపుల్‌గా వచ్చేస్తారా అని అంటుంది. దుగ్గిరాల ఫ్యామిలీకి ఒక స్టేటస్ ఉందని మీరు ఇలా వస్తే జనం ఏమనుకుంటారని ప్రశ్నిస్తుంది. ఈ పెళ్లికి వెళ్లడం నీకు చాలా ఆనందంగా ఉందా అని అడుగుతుంది ఇందిర. పెళ్లిని ఆపడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతుంది అప్పూ. ఈ పెళ్లి ఆపాలంటే రుద్రాణిని, దాని కొడుకుని పెళ్లికి రాకుండా ఆపాలని అంటుంది ఇందిర. లేదంటే మనం వేసే ప్రతి పనికి పంటి కింద రాయిలా అడ్డుపడుతుందని చెబుతుంది. మీరు ఆ పెళ్లి ఆపే పనిలో ఉండండి.. నేను ఆ తల్లికొడుకుల్ని ఆపేస్తానని అంటుంది స్వప్న. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X