Brahmamudi June 11th Episode: ఇందూ వేలిముద్రలతో రేఖ కుట్ర... మనవరాలికి సుభాష్ వార్నింగ్

Photo Courtesy: JioHotstar

వెంకీకి డెలివరీ బాయ్‌గా ఉద్యోగం ఇప్పించడానికి ఓ చోటికి తీసుకొస్తుంది నందూ. హోటల్ ఓనర్ కండీషన్స్ అన్ని చెప్పి నెలకు 10 వేల రూపాయలు, డెలివరీ మీద 50 రూపాయలు కమీషన్ ఇస్తానని అంటాడు. సీఈవోగా గెలిచి ఇంటికొచ్చిన ఇందూకి అపర్ణ దిష్టి తీసి లోపలికి పిలుస్తుంది. మనమే ఇందూని సీఈవోని చేశామని తెలియక ముసల్ది పొంగిపోతుందని రేఖతో అంటుంది భ్రమరాంబ. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది.. మీ అమ్మానాన్నలు కంపెనీని ఎంత గొప్పస్థాయికి తీసుకెళ్లారో నువ్వు కూడా అలాగే కంపెనీని నడిపించాలని చెబుతుంది అపర్ణ.

నేను పక్కనే ఉండి ఇందూకి తోడుగా ఉంటాను, కంపెనీని లాభాల బాటలో నడిపిస్తానని అంటాడు రాజ్. నువ్వు కూడా సీఈవో అవ్వాలని ట్రై చేశావు కదా? ఏం జరిగిందని అడుగుతుంది భ్రమరాంబ. రేఖ పిన్ని టాలెంట్ ముందు, ఆమె పవర్ ముందు నేను నిలబడలేకపోయా ఆమెకి ఫ్యాన్ అయిపోయానని అంటాడు రాజ్. నా సీఈవో పోస్ట్ లాక్కున్నారు.. కానీ నా ఈగోని హర్ట్ చేస్తే మాత్రం ఊరుకోనని వార్నింగ్ ఇస్తాడు. నేను ఒక డాక్యుమెంట్ పంపిస్తాను దాని మీద వేలిముద్రలు వేయమని రేఖ చెప్పగా ఇందూ సరేనని అంటుంది. ఇన్నాళ్లూ నువ్వు సీఈవో కావాలని కలలు కన్నది, నిన్ను కష్టపడి చదివించింది ఆ రేఖ చేతిలో కీలు బొమ్మ కావడానికి కాదని ఇందూకి క్లాస్ పీకుతుంది అపర్ణ. మీ మనవరాలు మీరు అనుకున్నంత అమాయకురాలు కాదని చెబుతాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 11వ తేదీ ఎపిసోడ్ 1056లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial June 11th 2026 Episode 1056 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

మీరంతా ఆ రేఖ మీ మనవరాలిని సీఈవో చేసిందని అనుకుంటున్నారు? ఆ రేఖ కూడా అలాగే ఫీల్ అవుతోంది. కానీ రేఖ తనంతట తానుగా ఇందూని సీఈవోని చేసేలా పరిస్ధితులు క్రియేట్ చేసింది మీ మనరాలేనని రాజ్ చెప్పడంతో సుభాష్, అపర్ణలు షాక్ అవుతారు. నేను సీఈవో అవ్వాలని అనుకోలేదు.. ఇందూనే సీఈవో అవ్వడానికి నన్ను పావులా వాడుకుందని అంటాడు రాజ్. మీ మనవరాలికి ఉన్న తెలివితేటలకు ఈ రేఖనే కాదు.. ఈ దేశాన్ని కూడా శాసిస్తుందని చెబుతాడు రాజ్. నువ్వు ఎలా సీఈవో అయ్యావో మాకు తెలియదు, కానీ కంపెనీలని మాత్రం జాగ్రత్తగా కాపాడమని చెబుతుంది అపర్ణ.

నేను మీ మవనరాలిని, రాజ్- కావ్యల కూతురిని. నాలో మా అమ్మ తెగింపు, ధైర్యం ఉన్నాయని చెప్పింది నువ్వు. అవి ఉన్నంత వరకు కంపెనీలకి, మనల్ని నమ్ముకున్న వాళ్లకి అండగా ఉంటానని చెబుతుంది ఇందూ. మేం రూపంలోనే కాదు.. ఆలోచనల్లోనూ రాజ్- కావ్యల లక్షణాల్ని పుణికి పుచ్చుకున్నామని అంటాడు రాజ్. వాళ్లకంటే బాగా కంపెనీని లాభాల్లోకి తీసుకెళ్తామని చెబుతాడు. మీ చేతుల్లో బుల్లి మునిమనవడిని పెడతామని రాజ్ అనడంతో అతని కాలు తొక్కుతుంది ఇందూ. నువ్వు సీఈవో అయినప్పటి నుంచి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఈ రేఖతో పాటు చాలామంది నిన్ను వెనక్కి లాగేందుకు ప్రయత్నిస్తుంటారు. రెప్పపాటులో నిర్ణయాలు తీసుకోవాలి, అవి మంచివి అయ్యుండాలని మనవరాలికి సలహా ఇస్తాడు సుభాష్.

తనను సీఈవో కాకుండా కిడ్నాప్ చేసిన ఐశ్వర్యని లాగిపెట్టి కొడుతుంది ఇందూ. నేను నీకు ఏం చేశాను.. నన్నెందుకు ఇలా అడ్డుకున్నావు, అక్కవి అయిపోయావు లేకపోతే మరోలా బుద్ధి చెప్పేదాన్ని అంటుంది ఇందూ. నీ తరపున మాట్లాడి ఆ రాకేష్ అప్పు మొత్తం తీర్చేస్తానని చెప్పాను.. నీ కోసం ఇంత చేస్తే నన్నే కిడ్నాప్ చేస్తావా? నువ్వు నా అక్కవేనా? అని మండిపడుతుంది. నువ్వు నన్ను అక్కలా ఫీల్ అయినా, నేను మాత్రం నిన్ను చెల్లెలిగా ఫీల్ అవ్వడం లేదు.. నువ్వు నా శత్రువువి అంటుంది ఐశ్వర్య. నేనంటే నీకు అంత కోపం దేనికి నీకు నేను ఏం అన్యాయం చేశానని ప్రశ్నిస్తుంది ఇందూ.

ఇలా పొగరు చూపిస్తావనే నిన్ను సీఈవో కాకుండా ఆపాలని చూశాను.. టైంకి ఆ ముసలోడు వచ్చి నా ప్లాన్ మొత్తం పాడు చేశాడు. నువ్వు ఇప్పుడు సీఈవోవి ఇక నుంచి నా నెత్తిమీద డ్యాన్స్ చేయాలని చూస్తావని అంటుంది ఐశ్వర్య. నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమించాను, ఇప్పుడు కూడా నిన్ను కొట్టింది ఇలాంటి తప్పులు చేయకూడదని... ఇక నుంచైనా నా మాట వినమని చెబుతుంది ఇందూ. నీ యాక్టింగ్ నా దగ్గర పనిచేయదు.. ఒకప్పుడు మీ అమ్మ కూడా ఈ ఇంట్లో అడుగుపెట్టి ఏం తెలియని అమాయకురాలిలా నటిస్తూ కంపెనీ మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. ఇప్పుడు నువ్వు కూడా అదే చేస్తున్నావని ఫైర్ అవుతుంది ఐశ్వర్య.

మీ అమ్మ మాటలు నమ్మి మా అమ్మ మోసపోయింది.. నేనేమీ అమాయకురాలి కాదు, అక్షరం ముక్క రాకుండా సీఈవో ఛైర్‌లో కూర్చోన్నావంటే నువ్వు మామూలు దానివి కాదు. నిన్ను ఇలాగే వదిలేస్తే నీ పొగరుతో ఆడుకుంటావని అంటుంది ఐశ్వర్య. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్ధం కాదు.. నువ్వు రాకేష్‌కి ఇవ్వాల్సిన పది లక్షల రూపాయల అప్పు నేను తీర్చనని ఇందూ చెప్పడంతో ఐశ్వర్య షాక్ అవుతుంది. నీకు నా మీద ఇంత ద్వేషం ఉందని తెలిశాక కూడా నీకు సాయం చేస్తే నా అంతట తెలివి తక్కువది ఈ లోకంలో ఉండదు. నీ మీద నా ప్రేమ, జాలి అన్ని నిజమే.. కానీ ఇక నుంచి అక్క అనే సానుభూతి పనిచేయదు. నీ ఖర్చులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనివ్వనని చెబుతుంది ఇందూ.

ఇందూ సీఈవో అయ్యింది కదా అది మన మాట వింటుందా అని భ్రమరాంబ, భూషణ్‌లు రేఖని ప్రశ్నిస్తారు. కలలో కూడా ఇందూ నన్ను ఎదిరించే సాహసం చేయదు, ఎందుకంటే ఆ ముసలోళ్ల జీవితాలు ఏమవుతాయో దానికి బాగా తెలుసు అంటుంది రేఖ. ఇప్పటి వరకు దొంగ బంగారాన్ని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో పెట్టాలని చాలా ట్రై చేస్తున్నాం. కానీ దొరికిపోతామేమోనని ఆ సింగపూర్ వాళ్ల గ్రూప్‌తో డీల్ కుదుర్చుకోవడం లేదు. ఇప్పుడు ఇందూ సీఈవో అయ్యింది కాబట్టి.. ఆ డీల్ కుదుర్చుకున్నట్లు ఇందూ చేత సంతకం పెట్టించి దొంగ బంగారాన్ని కంపెనీ చేతిలోకి వచ్చేలా చేస్తాను. దానికి చదువు రాదు కాబట్టి.. అందులో ఏముందో తెలియకుండా వేలిముద్రలు వేస్తుంది, ఈ డీల్ చేస్తే మనకి చాలా డబ్బులు వస్తాయని అంటుంది రేఖ.

ఇందూ కొట్టిన దెబ్బని చూసి ఐశ్వర్య రగిలిపోతుంది. ఇంతలో స్వాతి వచ్చి నీ చెంప అంతలా కందిపోయింది, ఎవరైనా కొట్టారా అని సెటైర్లు వేస్తుంది. జరిగినదంతా చూశాను.. ఇంకా కోపం తెచ్చుకోకు అని పంచ్‌లు విసురుతుంది. నువ్వు సీఈవో అవుతావని ఎన్నో కలలు కన్నానని రాజ్‌తో చెబుతాడు శేషం. ఇందూ దగ్గర పీఏగా జాయిన్ అవ్వమని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X