Brahmamudi June 12th Episode: రుద్రాణిని లాక్ చేసిన స్వప్న.. యామిని పెళ్లి ఆపడానికి అప్పూ సీక్రెట్ ప్లాన్

Photo Courtesy: JioHotstar

కావ్యతో పాటు దుగ్గిరాల కుటుంబాన్ని పెళ్లికి పిలవడంపై యామినిపై కోప్పడుతుంది వైదేహి. వాళ్లు అక్కడికొచ్చినా ఏం చేయలేరని, రాజ్‌కి గతం గుర్తుచేస్తే ఏం జరుగుతుందో కావ్యకి బాగా తెలుసని అంటుంది యామిని. రాజ్- యామినిల పెళ్లికి మమ్మల్ని ఎందుకు తీసుకోస్తానని చెప్పావని కావ్యపై సుభాష్ కోప్పడతాడు. ఆ దేవుడు వేసిన బ్రహ్మముడిని ఎవ్వరూ విప్పలేరని, రాజ్- యామినిల పెళ్లి జరగదని తేల్చిచెబుతుంది కావ్య.

యామినితో రాజ్ పెళ్లి జరిపించే పంతుల్ని అప్పూ ట్రాప్ చేస్తుంది. యామినితో పెళ్లి గురించి చెప్పాలని ఫోన్ చేయగా రాజ్‌ని తిడుతుంది కావ్య. నేరుగా విషయం కావ్యకి, దుగ్గిరాల ఫ్యామిలీకి చెప్పాలని రాజ్ బయల్దేరుతుండగా యామిని ఆపుతుంది. ఉదయాన్నే అపర్ణ, ఇందిరలు రాజ్ - యామినిల పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉండగా రుద్రాణి వచ్చి పెళ్లికి రెడీ అవ్వలేదా అని అడుగుతుంది. రాహుల్, రుద్రాణిలు పెళ్లికి వస్తే మనం వేసే ప్లాన్స్ చెడగొడతారని ఇందిర చెప్పడంతో వాళ్ల సంగతి నేను చూసుకుంటానని చెబుతుంది స్వప్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 12వ తేదీ ఎపిసోడ్ 746లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial June 12th 2025 Episode 746 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రుద్రాణి, దాని కొడుకుని పెళ్లికి రాకుండా ఆపాలని లేకపోతే మనం వేసే ప్లాన్‌కి అడ్డుపడుతూనే ఉంటారని అంటుంది ఇందిర. వాళ్ల గురించి మీరేం టెన్షన్ పడొద్దని, వాళ్లని ఎలా ఆపాలో నేను చూసుకుంటానని చెబుతుంది స్వప్న. నువ్వు పెళ్లికి రావా అని అపర్ణ అడగ్గా.. మీ స్వప్నం నెరవేరాలంటే ఈ స్వప్న రాకూడదని అంటుంది స్వప్న. అంతా సరేగానీ కావ్య ఎక్కడ అని ఇందిర అడగ్గా.. అప్పుడే రెడీ అయి కిందకి వచ్చి చీర ఎలా ఉందని అడుగుతుంది కావ్య. మనం షాపింగ్‌కు వెళ్లడం లేదని నీ మొగుడి పెళ్లికి వెళ్తున్నామని.. కొంచెం కూడా భయం కానీ, బాధ కానీ లేవా అని మండిపడుతుంది అపర్ణ.

మా ఇద్దరికీ ఆ బ్రహ్మదేవుడే బ్రహ్మముడి వేశాడని చెప్పాను కదా? ఆయనే చూసుకుంటాడని చెబుతుంది కావ్య. ఆ బ్రహ్మముడి పురాణం ఆపేయ్..ఈ కథ వింటూ కూర్చొంటే సాయంత్రం అవుతుందని మండిపడుతుంది ఇందిర. యామిని పెళ్లికి టైం అవుతుంటే నువ్వు బాత్‌రూంలో ఏం చేస్తున్నావని రాహుల్‌పై ఫైర్ అవుతుంది రుద్రాణి. పెళ్లి ఆగకుండా చూసుకుంటానని యామినికి మాటిచ్చానని.. వీళ్లేమో ఆ పెళ్లిని ఎలా ఆపాలా? అని ప్లాన్స్ వేస్తున్నారని అంటుంది. ఆ పెళ్లి కనుక ఆపితే ఆ యామిని మన ఊపిరి కూడా ఆపేస్తుందని వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి. ఆ పెళ్లిని ఆపడానికి వాళ్లెవరూ ఇంకా వెళ్లలేదు కదా.. 2 నిమిషాల్లో రెడీ అయి వచ్చేస్తానని అంటాడు రాహుల్. ఈ మాటలన్నీ విన్న స్వప్న.. మీరు వెళ్లి ఆ పెళ్లి జరిగేలా చేస్తారా? మీరు బయటికి ఎలా వస్తారో నేను చూస్తానని డోర్ లాక్ చేస్తుంది స్వప్న. రుద్రాణి వచ్చి డోర్ ఎంత తీసినా రాకపోవడంతో ఆమె టెన్షన్ పడుతుంది.

ఇంతలో రాహుల్ వచ్చి చూడగా.. ఇది రాదని, బయటి నుంచి ఎవరో లాక్ చేశారని అంటాడు. టైంకి మనం వెళ్లకపోతే ఆ యామిని మనల్ని చంపేస్తుందని రుద్రాణి టెన్షన్ పడుతుంది. రుద్రాణి తలుపు కొట్టి ఎవరైనా ఉన్నారా? అని అడుగుతుంది. ఆ వెంటనే స్వప్నకి ఫోన్ చేస్తుంది రుద్రాణి .. దాంతో స్వప్న కస్టమర్ కేర్ అమ్మాయిలా మాట్లాడుతుంది. యామిని ఇంట్లో పెళ్లి పనులు జోరుగా సాగుతుంటాయి. పట్టు చీరలో ఉన్న యామినిని చూసి వైదేహి, రఘునాథ్‌లు సంబరపడిపోతారు. పెళ్లి పనులు చూసిన రాజ్.. కళావతి నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, నేరుగా కావ్య దగ్గరికి వెళ్లి పెళ్లి గురించి చెప్పాలని అనుకుంటాడు.

పెళ్లి బట్టలు కట్టుకోలేదని రాజ్‌ని యామిని అడుగుతుంది. వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ అక్కడికి వస్తుంది. వాళ్లని చూసిన రాజ్ షాక్ అవుతాడు. వీళ్లెందుకు వచ్చారు? మీరెప్పుడు పిలిచారని అడుగుతాడు రాజ్. నిన్న నేను, యామిని బొట్టు పెట్టి మరీ పిలిచామని అందుకే వాళ్లు వచ్చారని చెబుతుంది వైదేహి. నీ ఫ్రెండ్‌ పెళ్లికి రాకుండా ఎలా ఉంటుంది? పెళ్లికి పిలవగానే ఫ్యామిలీతో కలిసి వస్తామని కళావతి చాలా హ్యాపీగా చెప్పిందని అంటుంది యామిని. నేను పెళ్లి చేసుకోబోతున్న విషయం కళావతికి ముందే తెలుసని, ఆ కోపంతోనే రాత్రి నాతో ఫోన్‌లో సరిగా మాట్లాడలేదని అనుకుంటాడు రాజ్.

పెళ్లికి వచ్చినందుకు కావ్యకి థ్యాంక్స్ చెబుతుంది యామిని. ఈ పెళ్లి మీకు, నాకు చాలా ఇంపార్టెంట్ అని నేను ఎందుకు రాకుండా ఉంటానని అంటుంది కావ్య. మా మీద ప్రేమను కూడా పెంచుకున్నాడని, కానీ పెళ్లికి మాత్రం పిలవలేదని మండిపడుతుంది ఇందిర. నిన్న రోజంతా ఫోన్ చేస్తూనే ఉన్నాం కానీ.. ఒక్క మాట కూడా చెప్పలేదని రగిలిపోతుంది అపర్ణ. మీరు మమ్మల్ని పిలవకపోయినా మేం బాధపడమని అంటుంది కావ్య. చూసి వెళ్లడమే కాదు .. దగ్గరుండి మా పెళ్లి జరిపించాలని అంటుంది యామిని. ఇంతలో శాస్త్రిగారు వచ్చి వీళ్లంతా ఎవరు? ఎవరి ముఖాల్లోనూ పెళ్లి కళ కనిపించడం లేదని అంటాడు. పెళ్లి కళ పెళ్లి కొడుకు ముఖంలో కనిపిస్తే చాలు కదా అంటుంది ఇందిర. నేను ముహూర్తం పెడితే ముక్కోటి దేవతలు వస్తారని అలాంటిది మీరు వాడిపోయిన పువ్వుల్లా ఉంటానంటే కుదరదని అంటాడు శాస్త్రి.

ఈ పెళ్లికి మీరే శ్రీకారం చుట్టాలని కావ్యని తీసుకుని వెళ్తుంది యామిని. రాజ్‌ తప్పించుకుని వెళ్లిపోతుండగా అపర్ణ, ఇందిరలు అడ్డుకుని లోపలికి తీసుకెళ్తారు. నువ్వు ఒక్క మాట మీద కూడా నిలబడలేదని.. నీకోసం మా ఇంటి ఆడబిడ్డని కాదని నీకు సపోర్ట్ చేస్తే ఇంత మోసం చేస్తావా? అని మండిపడతారు. కళావతిని ఇష్టపడితే యామిని విషయం ఏం చేస్తావని మేం మొదటి నుంచి అడుగుతూనే ఉన్నామని ప్రశ్నిస్తుంది అపర్ణ. నీ ప్రేమ విషయం చెప్పి.. ఈ పెళ్లిని ఆపమని చెబుతూనే ఉన్నామని, కానీ నువ్వు మమ్మల్ని మోసం చేశావని అంటుంది. మన అమ్మాయి సుఖపడుతుందని అనుకుంటే, నట్టింట్లో మంచేశాడని మండిపడుతుంది ఇందిర.

మీ ఇంట్లో వాళ్లకి మాట్లాడటం తప్పించి ఏం తెలియదా? కళావతి గారు కూడా మాట్లాడదామని ఎంత ప్రయత్నించినా అసలు నా మాట వినిపించుకోలేదని చెబుతాడు రాజ్. యామిని సూసైడ్ అటెంప్ట్ చేసిందని.. ఆ పరిస్ధితుల్లో నన్నేం చేయమంటారు? అని ప్రశ్నిస్తాడు రాజ్. చిన్నప్పటి నుంచి అమ్మానాన్నల్లాగా పెంచినవారి మాట కాదని యామిని ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి నా ప్రేమ విషయం బయటపెట్టమంటారా? అని అడుగుతాడు రాజ్. ఈ మాటలు విన్న ఇందిర.. అసలు వాళ్లు నీ ఫ్యామిలీయే కాదని, ఆ విషయం నీకు చెప్పలేమని మనసులో అనుకుంటుంది ఇందిర. నా వల్ల ఒకరు ప్రాణం తీసుకుంటే, జీవితాంతం కళావతితో ఎలా సంతోషంగా ఉండనని అడుగుతాడు. రాతలో లేనప్పుడు నేనేం చేయగలను.. జీవితాంతం కళావతిని తలచుకుని బతికేస్తానని అనడంతో అపర్ణ, ఇందిరలు షాక్ అవుతారు. ఇంతలో పెళ్లిరాట విరిగిపోయేలా అప్పూ ప్లాన్ చేస్తుంది. కొందరు జూనియర్ ఆర్టిస్టులని ముత్తయిదువులుగా తీసుకొస్తాడు కళ్యాణ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X