Brahmamudi June 12th Episode: ఇందూని ఇరికించేలా రేఖ కుట్ర.. లాస్ట్ మినిట్‌లో దుగ్గిరాల కంపెనీని కాపాడిన రాజ్

Photo Courtesy: JioHotstar

మీరంతా మీ మనవరాలిని అమాయకురాలని అనుకుంటున్నారు.. కానీ తనను సీఈవోని చేసేలా పరిస్ధితులు క్రియేట్ చేసింది ఇందూనే అని అంటాడు రాజ్. మీ మనవరాలి తెలివితేటలకి రేఖనే కాదు ఈ దేశాన్ని కూడా శాసించొచ్చని అంటాడు రాజ్. నేను రాజ్, కావ్యల కూతురిని, మీ మనవరాలిని.. నాలో ప్రవహించేది దుగ్గిరాల రక్తం.. మన కంపెనీలని, మనవాళ్లని నేనే కాపాడుకుంటానని చెబుతుంది ఇందూ. సీఈవో అంటే అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి, నిన్ను వెనక్కి లాగడానికి ఎంతోమంది ప్రయత్నిస్తారు.. వాటి నుంచి నీకు నువ్వే కాపాడుకోవాలని మనవరాలికి సలహా ఇస్తాడు సుభాష్.

తనను కిడ్నాప్ చేసినందుకు ఐశ్వర్యని లాగిపెట్టి కొడుతుంది ఇందూ. నువ్వంటే నాకు అసహ్యం.. నువ్వు సీఈవో కావడం నాకు ఇష్టం లేదని చెబుతుంది ఐశ్వర్య. నేనంటే ఎందుకంత కోపం.. నువ్వు అక్కవని నేను జాలి చూపిస్తూనే వచ్చాను. కానీ నువ్వు మాత్రం నా మీద ఇంత పగపెట్టుకున్నావని బాధపడుతుంది ఇందూ. ఇకపై నీ అప్పు నువ్వు తీర్చుకో, రేఖ ఆంటీ దగ్గరి నుంచి నీకు పైసా కూడా రానివ్వనని వార్నింగ్ ఇస్తుంది ఇందూ.

ఆ ఇందూని సీఈవో చేసినందుకు భ్రమరాంబ, భూషణ్‌లు రేఖపై మండిపడతారు. సింగపూర్ గ్రూప్ వాళ్లు ఇచ్చే దొంగ బంగారాన్ని మన కంపెనీలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాను, ఇప్పుడు ఇందూ నేను పంపించే పేపర్లపై సంతకం చేస్తే తనే ఇరుక్కుంటుందని అంటుంది రేఖ. ఒక్క దెబ్బతో మనకు డబ్బుతో పాటు ఆ ఇందూని అడ్డు తొలగించుకోవచ్చని ప్లాన్ చెబుతుంది రేఖ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 12వ తేదీ ఎపిసోడ్ 1057లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial June 12th 2026 Episode 1057 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రాజ్ బాధలో ఉన్నాడని తెలిసి అతనికి మందు తాగిస్తాడు శేషం. తను అనుకున్నట్లుగా ఇందూ చేత సంతకాలు పెట్టించాలని టైం కోసం చూస్తుంది రేఖ. భోజనాల సంగతి తర్వాత ఈ పేపర్ల మీద నీ వేలిముద్రలు వేస్తే మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చని రేఖ చెబుతుంది. అది ఏ డీల్, ఆ పేపర్లు ఏంటీ అంటూ సుభాష్, అపర్ణలు కంగారుపడతారు. మీరు ఎక్కడ వేలిముద్రలు వేయమంటే అక్కడే వేస్తానని ఇందూ చెబుతుంది. ఆ పేపర్స్‌లో ఏం ఉందో ఇందూ చూస్తుండగా.. నువ్వు చదువుకున్నట్లు ఫోజులు ఇవ్వొద్దని భ్రమరాంబ సెటైర్లు వేస్తుంది. ఇంతలో శేషం మద్యం మత్తులో ఇందూని చదనివ్వమని వాగుతాడు.

ఇందూని గరిటెలు, గిన్నెలు గురించి అడిగితే చెబుతుంది కానీ పేపర్లు, అక్షరాల గురించి అడిగితే ఏం చెబుతుంది. తనకు చిత్తుకాగితాలకు, బాండ్ పేపర్స్‌కి తేడానే తెలియదని సెటైర్లు వేస్తుంది భ్రమరాంబ. ముందు చదువుతున్నట్లు ప్రాక్టీస్ చేయ్.. ఆ తర్వాత వేలిముద్రలు వేయమని అంటాడు శేషం. ఆ పేపర్లు మొత్తం చదివిన ఇందూకి రేఖ ప్లాన్ మొత్తం తెలిసి షాక్ అవుతుంది. ఈ డీల్ చేస్తే కంపెనీ పరువు మొత్తం పోతుంది.. చాలా నష్టం కూడా వస్తుంది. రేఖ ఆంటీ కావాలనే నా చేత వేలిముద్రలు వేయించాలని చూస్తుంది. ఇప్పుడు నేను వేలిముద్రలు వేయకూడదు. ఏం చేయాలని మనసులో టెన్షన్ పడుతుంది ఇందూ.

ఇందూకి చదువురాదు కదా? ఎందుకు కంగారు పడుతుందని శేషం ప్రశ్నిస్తాడు. ఇంక్ ప్యాడ్ లేదు కదా అని ఇందూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా ఇంక్ ప్యాడ్ తీసుకొచ్చి ఇస్తుంది భ్రమరాంబ. ఇందూ వేలిముద్రలు వేయడానికి కంగారు పడుతుందంటే ఆ డీల్ చేయడం కరెక్ట్ కాదని అపర్ణకి అనుమానం వస్తుంది. ఎలా తప్పించుకోవాలో తెలియక ఇందూ టెన్షన్ పడుతుండగా రేఖ బలవంతంగా వేలిముద్రలు వేయించాలని చూస్తుంది. ఇంతలో రాజ్ మద్యం మత్తులో వచ్చి వన్ సెకన్ అంటాడు.

రాజ్ తాగొచ్చి గొడవ చేస్తుండగా ఐశ్వర్య చిరాకు పడుతుంది. నీ ఫేస్‌లో నవ్వుండదు, పాడు ఉండదు. నీ గురించి చేట భారతం ఉంది.. చదవడానికి, చెప్పడానికి అని సెటైర్లు వేస్తాడు రాజ్. నేను లేకుండా నా భార్య చేత వేలిముద్రలు వేయిస్తారా? కుట్ర, మోసం అంటాడు రాజ్. అసలు నీకు డీల్ గురించి ఏం తెలుసు.. ఇంతకుముందు ఏ సీఈవో దగ్గరైనా పనిచేశావా? నీకు తెలియడానికి అంటుంది భ్రమరాంబ. ఇంతకుముందు చేయకపోతే ఏంటీ? ఇప్పుడు చేస్తాను.. నేర్చుకుంటాను అని అంటాడు రాజ్. ఎవరి దగ్గర నేర్చుకుంటావని భ్రమరాంబ అడగ్గా.. నా ముద్దుల పెళ్లాం దగ్గర నేర్చుకుంటానని అంటాడు రాజ్.

ఇందూ, రాజ్‌లు డ్యాన్స్‌లు చేస్తుండగా రేఖ చిరాకు పడుతుంది. ఇదేమీ నీ బస్తీ కాదు .. మా రేఖ అడ్డా అని వార్నింగ్ ఇస్తుంది భ్రమరాంబ. అసలు నీకు మైండ్ ఉండా? ఏం మాట్లాడుతున్నావు అని ఫైర్ అవుతుంది రేఖ. అసలు సీఈవో ఇందూ.. తను సంతకం పెట్టేటప్పుడు నువ్వెందుకు ఉండాలని ప్రశ్నిస్తుంది రేఖ. నా భార్య సీఈవో అయితే.. నేను కూడా సీఈవో అయినట్లే అంటాడు రాజ్. ఊళ్లో భార్య సర్పంచ్ అయితే భర్తే కదా అన్ని దగ్గరుండి చూసుకుంటాడు. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసి తన భార్యతో సంతకం చేయిస్తాడు కదా? ఇక్కడ కూడా అలాగేనని రాజ్ అనడంతో రేఖ, భ్రమరాంబలు షాక్ అవుతారు. తను తప్పించుకున్నానని ఇందూ సంబరపడిపోతుంది.

ఇప్పుడు నువ్వు ఈ పేపర్స్ చెక్ చేసిన తర్వాతే ఇందూతో వేలిముద్రలు వేయిస్తావా అని భూషణ్ అడగ్గా.. అంతే అంటాడు రాజ్. తమ బండారం ఎక్కడ బయటపడిపోతుందోనని రాజ్ దగ్గరి నుంచి డాక్యుమెంట్స్ లాక్కోబోతుంది రేఖ. కంగారు పడొద్దు.. నన్ను చూడనివ్వు అంటాడు రాజ్. నా హ్యాండ్ పవర్ ఎలా ఉంటుందో ఒకసారి పిన్నికి చెప్పమని భ్రమరాంబతో అంటాడు. దాంతో భ్రమరాంబ రెండు చెంపలు పట్టుకుని భయపడుతుంది. అగ్రిమెంట్ పేపర్స్ మొత్తం చదివిన రాజ్‌కి మొత్తం రేఖ కుట్ర తెలిసిపోతుంది. దీనిలో ఇన్ని తప్పులు ఉన్నాయేంటీ? నువ్వు నాకు అడ్డుపడుతున్నాప్పుడే అనుకున్నాను.. ఇలాంటిది ఏదో ఉందని అంటాడు రాజ్. ఈ డీల్ చేసి కంపెనీ పేరు ప్రతిష్టలు పొగొట్టి నష్టం తెప్పించాలని అనుకుంటున్నారా అంటూ రేఖపై మండిపడతాడు రాజ్. ఇదంతా విన్న ఇందూ సంతోషిస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X