Brahmamudi June 13th Episode: రేఖ ప్లాన్ తిప్పికొట్టిన రాజ్.. ఇందూతో రొమాన్స్ చేస్తున్నట్లు రాజ్ కల

Photo Courtesy: JioHotstar

సీఈవో పదవి చేజారిపోవడంతో బాధపడుతున్న రాజ్‌కి మందు పోస్తాడు శేషం. ఇద్దరూ మందు తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇందూ దగ్గరికి వచ్చిన రేఖ.. నేను చెప్పిన డీల్ కోసం నీ వేలిముద్రలు వేయాలని చెప్పి పేపర్స్ ఇస్తుంది. అదంతా చదివిన ఇందూకి రేఖ ప్లాన్ ఏంటో అర్ధమవుతుంది. సంతకం పెడితే కంపెనీ పేరు పోవడంతో పాటు భారీగా నష్టం వస్తుందని గ్రహిస్తుంది. కానీ రేఖ వేలిముద్రలు వేస్తావా లేదా అని బెదిరించడంతో ఎలా ఆపాలో తెలియక టెన్షన్ పడుతుండగా రాజ్ పీకలదాకా తాగి గొడవ చేస్తాడు.

భార్య సర్పంచ్ అయితే ఆమె భర్త ముందుగా పేపర్స్ చదివి అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయంటేనే సంతకం పెట్టిస్తాడు. ఇప్పుడు నేను కూడా అంతే. ఇందూ సంతకం చేయడానికి ముందు అన్ని పేపర్స్ నేనే చూడాలి, నా పర్మిషన్ కావాలని మండిపడతాడు. రేఖ ఇచ్చిన డాక్యుమెంట్స్ చదివిన రాజ్‌కి మొత్తం అర్ధమైపోతుంది. ఆ విషయాన్ని చెప్పగా అంతా షాక్ అవుతారు. రేఖ బారి నుంచి వేలిముద్రలు వేయకుండా రాజ్ కాపాడటంతో ఇందూ సంతోషిస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 13వ తేదీ ఎపిసోడ్ 1058లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial June 13th 2026 Episode 1058 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఈ డీల్ చేసి కంపెనీ పేరు ప్రతిష్టలు పోయేలా చేసి నష్టాలు తెప్పిద్దామని అనుకుంటున్నారా? నా భార్య సీఈవోగా వేలిముద్రలు వేసింది కాబట్టి.. తను సీఈవోగా పనికిరాదని దింపేద్దామని అనుకుంటున్నారా? ఎంత క్రిమినల్ మైండ్ నీది.. ఈ డీల్ క్యాన్సిల్, దీనికి నేను అస్సలు ఒప్పుకోను అంటాడు రాజ్. ఒప్పుకోకపోవడానికి నువ్వెవరు, మా రేఖ ఆంటీ ఏం చెబితే అదే నేను చేస్తానని డ్రామా ఆడుతుంది ఇందూ. కరెక్ట్ అయితేనే మా ఆంటీ డీల్ కుదుర్చుకుంటారు.. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీర్చుకోదని ఇందూ అంటుంది. నువ్వు మీ రేఖ ఆంటీని నమ్ముతున్నావా? రేపు ఛార్టెర్డ్ అకౌంటెంట్‌ని పిలిపిద్దాం.. తను ఈ డీల్ కరెక్ట్‌గా ఉందంటే నేను కూడా ఒప్పుకుంటాను, ఎక్కడ కావాలంటే అక్కడ వేలిముద్రలు వేసుకోమని చెబుతాడు రాజ్.

అంటే నీ ఉద్దేశం ఏంటీ? మా రేఖ ఆంటీ డీల్ కరెక్ట్ కాదా? మీ నిర్ణయం కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి? రేపు ఆ ఛార్టెర్డ్ అకౌంటెంట్‌ని పిలిపించండి, వాళ్లెవరు మీ గురించి తప్పుగా చెప్పడానికి అని ఇందూ చెప్పడంతో రేఖ షాక్ అవుతుంది. నువ్వు బాగానే చెబుతున్నావు కానీ మీ ఆంటీ ఏంటీ? సైలెంట్‌గా ఉండిపోయిందని సెటైర్లు వేస్తాడు రాజ్. ఛార్టెర్డ్ అకౌంటెంట్ ఇక్కడ లేడు.. తిరిగి రావడానికి ఇంకో రెండు మూడు రోజులు పడుతుందని భూషణ్ చెబుతాడు. తను వచ్చాకే డీల్ ఫినిష్ చేద్దామని రాజ్ చెప్పగా.. ఇప్పుడే ఫినిష్ చేయాలని పట్టుబడుతుంది రేఖ. ఈ రాజ్ గాడి మాటంటే మాటే.. డీల్ కుదుర్చుకునేటప్పుడు మళ్లీ కొత్త డాక్యుమెంట్స్ తెచ్చుకోండి అంటాడు.

ఇవి ఉన్నాయి కదా అని భూషణ్ చెప్పగా.. వాటిని నేను చింపేస్తానని చింపేస్తాడు రాజ్. అది చూసి రేఖ, భ్రమరాంబలు షాక్ అవుతారు. ఇక నుంచి ఇంట్లోనే కాదు, ఆఫీస్‌లో కూడా మీరు ఏ డీల్ చేయాలన్నా ముందు నా పర్మిషన్ తీసుకోవాలి, ఇందూకి నేనున్నాను, తనకి చదువు రాదు కాబట్టి తనకి ఆడియో నేను వినిపిస్తాను, తనకి ప్రతక్షణం తోడుగా ఉంటాను. ఎవరైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలని చూస్తే ఊరుకోనని వార్నింగ్ ఇస్తాడు రాజ్. మందు తాగి గోల గోల చేసిన శేషంపై నీళ్లు పోసి బడితపూజ చేస్తుంది. మేం సంతకం పెట్టిద్దామని అనుకుంటుంటే ఆ పేపర్ చదువు చదువు అని గోల చేయకపోతే ఇందూ ఆ డాక్యుమెంట్స్ మీద వేలిముద్రలు వేసేదని రగిలిపోతుంది భ్రమరాంబ. బంగారం లాంటి అవకాశాన్ని చెడగొట్టారు.. వాడు మావయ్య అనగానే వాడికి వత్తాసు పలుకుతారా అని మండిపడుతుంది. ఆ రాజ్ గాడు మిమ్మల్ని పరిగెత్తిస్తాడని అనుకుంటాడు శేషం.

నేను తాగేసి గొడవ చేశానని అనుకుంటున్నారు, మన పర్ఫార్మెన్స్‌కి ఇందూ ఇంప్రెస్ అయిపోయి ఉంటుంది. ఆ డీల్ నుంచి కాపాడానని నా దగ్గరికి వస్తుందని మురిసిపోతాడు. ఇంతలో ఇందూ వచ్చి రాజ్‌ని హత్తుకుని థ్యాంక్స్ చెబుతుంది. నువ్వు కనుక లేకపోయుంటే నేను ఖచ్చితంగా వేలిముద్రలు వేయాల్సి వచ్చేది. ఆ డీల్ ఓకే చేస్తే కంపెనీ చాలా పెద్ద ప్రమాదంలో పడిపోయేది. నేను సీఈవోగా బాధ్యతలు తీసుకున్న ఫస్ట్ డీల్‌లోనే ఇలాంటి తప్పు చేసుంటే నాకు చాలా బ్యాడ్ నేమ్ వచ్చేది, నువ్వు సడెన్‌గా ఎంట్రీ ఇచ్చి నన్ను సేవ్ చేశావు. నువ్వు డబ్బు మనిషివి అనుకున్నాను, నీకు కూడా మనసు, మానవత్వం ఉంటాయని అర్ధమైందని అంటుంది ఇందూ. ఆ వెంటనే రాజ్‌కి ఐ లవ్ యూ చెబుతుంది. ఆ వెంటనే ఇందూకి ముద్దు పెట్టుకుంటున్నట్లు కల గంటాడు రాజ్.

ఏదో ఊహల్లో ఊరేగిపోతున్నావని సెటైర్లు వేస్తుంది ఇందూ. నువ్వు నన్ను హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నట్లు ఊహించుకున్నానని అంటాడు రాజ్. ఓవర్‌గా ఊహించుకుంటే నీ పేమెంట్ కట్ చేస్తానని వార్నింగ్ ఇస్తుంది ఇందూ. మీ రేఖ ఆంటీ నిన్ను అంత పెద్ద దెబ్బ కొట్టాలని చూస్తే నేనే కదా నిన్ను కాపాడింది. అందుకు హగ్ లేకపోయినా కానీ థ్యాంక్స్ చెప్పాలి కదా అని అంటాడు రాజ్. దాంతో థ్యాంక్స్ చెబుతుంది ఇందూ. ఇప్పుడు ఎంప్లాయిస్‌కి శాలరీలు ఇవ్వాలి కదా దాని గురించి ఆలోచించమని అంటుంది ఇందూ. ఎంప్లాయిస్‌కి శాలరీలు క్లియర్ చేస్తాను, కంపెనీని లాభాల్లో పరిగెత్తిస్తానని నోటికొట్టినట్లు వాగావు కదా? అందుకే శాలరీలు క్లియర్ చేయాల్సింది కూడా నువ్వేనని అంటుంది ఇందూ. ఈ బెడ్ మీద పడుకుని ఆలోచిస్తానని రాజ్ చెప్పగా.. నాకు మాత్రం బాగోదని మండిపడుతుంది ఇందూ. నేను ఓవనర్‌ని నువ్వు వర్కర్‌వి, కింద పడుకోమని అంటుంది.

డెలివరీ బాయ్‌గా వెళ్లబోతూ.. ఆఫీస్‌కి రెడీ అవుతున్నట్లుగా ల్యాప్‌టాప్‌ని బ్యాగ్‌లో పెట్టుకుని బాధపడతాడు వెంకీ. నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది.. జాబ్ పోయిందన్న డిప్రెషన్‌లో నుంచి చాలా త్వరగా బయటపడ్డావని మెచ్చుకుంటాడు చలపతి. నువ్వు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవ్వడానికే పుట్టావు.. ఇప్పుడే కాదు, నువ్వు ఆ జాబ్ ఎప్పుడూ చేస్తూనే ఉంటావని అంటాడు. మీరు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు, కానీ నేను ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ని కాదు డెలివరి బాయ్‌ని అని బాధపడతాడు వెంకీ. వాడెవడో నిన్ను రిజెక్ట్ చేసినంత మాత్రాన నీకు టాలెంట్ లేకుండా పోతుందా? నీ టాలెంట్‌కి, నీ మంచితనానికి వెంటనే జాబ్ వచ్చిందని అంటాడు చలపతి.

సాఫ్ట్‌వేర్ కాకుండా వేరే ఏదైనా జాబ్ వస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నానని వెంకీ చెప్పగా.. నువ్వు సాఫ్ట్‌వేర్ అని అందరికీ గొప్పగా చెప్పుకున్నాను, దానిని అలాగే ఉంచమని అంటాడు చలపతి. నేను డెలవరి బాయ్‌గా చేస్తున్నానని తెలిస్తే మీరు తట్టుకోలేరు.. మీకు విషయం తెలియకుండా జాగ్రత్త పడాలని అనుకుంటాడు వెంకీ. తల్లి లంచ్ బాక్స్ ఇస్తుండగా.. బాక్స్ అక్కర్లేదని, కిచెన్‌లో వాళ్లే పెడతారని వెంకీ అనడంతో భార్యాభర్తలిద్దరూ షాక్ అవుతారు. నువ్వెప్పుడూ ఇంటి నుంచే బాక్స్ తీసుకెళ్తావు కదా అని అంటుంది లక్ష్మీ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X