Brahmamudi June 14th Episode: శాస్త్రి వీక్‌నెస్ మీద కొట్టిన కనకం.. యామిని- రాజ్‌ల పెళ్లి ఆపడానికి డీల్
Photo Courtesy: JioHotstar
యామిని- రాజ్‌లు పెళ్లి రాటకు పూజ చేస్తుండగా ప్లాన్ ప్రకారం దానిని విరగ్గొడతారు అపర్ణ- ఇందిర. అప్పటికే కళ్యాణ్ సెట్ చేసిన ముత్తయిదువలు ఇలా జరగడం అరిష్టమని, వెంటనే ఈ పెళ్లి ఆపేయాలని అంటారు. అపర్ణ - ఇందిరలు కూడా ఇలాంటివి మా జీవితంలో చూడలేదని ఈ పెళ్లి జరగకూడదని చెబుతారు. దాంతో శాస్త్రి జోక్యం చేసుకుని అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ పెళ్లి జరుగుతుందని చెబుతాడు. దాంతో అపర్ణ- ఇందిరలు శాస్త్రిపై రగిలిపోతారు.
శాస్త్రి దూకుడుకు అడ్డుకట్ట వేయగలిగింది కనకం మాత్రమేనని అనుకోగానే వాళ్ల ముందు ఆమె ప్రత్యక్షం అవుతుంది. నా కూతురి కోసం ఏమైనా చేస్తానని అంటుంది. ఆ వెంటనే కావ్య దగ్గరికి వెళ్లి మరో ఆడది నీ ఐదోతనాన్ని లాక్కుంటుంటే ఇక్కడి వరకు ఎందుకు తెచ్చుకున్నావని మండిపడుతుంది. ఈ పెళ్లిలో నువ్వేం పిచ్చి ప్లాన్లు వేయొద్దని తల్లికి వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 14వ తేదీ ఎపిసోడ్ 748లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
యామిని పెళ్లి చేయించే శాస్త్రి మా కాలనీలోనే ఉంటాడని, వాడికి ఓ వీక్‌నెస్ ఉందని దాని మీదే దెబ్బ కొడదామని అంటుంది కనకం. ఇంతకీ ఆ వీక్‌నెస్ ఏంటీ? అని అపర్ణ అడగ్గా.. కనకాంబరం అని చెబుతుంది కనకం. నీ కోసం కనకాంబరం వెయిట్ చేస్తోందని చెప్పి గదిలోకి తీసుకురండి.. అక్కడ వాడితో కబడ్డీ ఆడిద్దామని అంటుంది కనకం. ప్లాన్ ప్రకారం శాస్త్రి దగ్గరికి వెళ్లి మీ కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారని చెబుతారు అపర్ణ, ఇందిర. నా కోసం వెయిట్ చేస్తున్నారా? ఎవరు వాళ్లు? అని శాస్త్రి అడగ్గా.. కనకాంబరం అని అంటుంది ఇందిర. పైన గదిలో వెయిట్ చేస్తోందని వెళ్లండి అని చెప్పడంతో శాస్త్రి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తాడు. తమ ప్లాన్ వర్కవుట్ అవ్వడంతో అపర్ణ, ఇందిరలు సంబరపడిపోతారు.
శాస్త్రి పైకి వెళ్లేసరికి అక్కడ కనకం ఉండటంతో మీరెవరు అని అడుగుతాడు. తన పేరు కనకాంబరం కాదు కనకం అని చెబుతుంది ఇందిర. మరి నన్నెందుకు ఇక్కడికి రమ్మని పిలిచారని అడుగుతాడు శాస్త్రి. ఇక్కడ జరిపిస్తున్న పెళ్లిని ఆపడానికి మాకు సాయం చేయాలని ఇందిర చెబుతుంది. మేం చెప్పినట్లు చేస్తే మీరు అడిగినంత డబ్బులు ఇస్తామని కనకం ఆశ పెడుతుంది. డబ్బుతో నన్ను కొనేయాలని పథకం వేస్తున్నారా? మీ పప్పులేం ఉడకవ్ ఇక్కడ అని అంటాడు శాస్త్రి. నేను డబ్బుకు లొంగే మనిషి కాదని, నేను ఒక్కసారి పంచాంగం తీసి ముహూర్తం పెట్టానంటే ప్రళయం వచ్చినా సరే ఆ కార్యక్రమం ఆగనివ్వనని చెబుతాడు.
ఆ వెంటనే ఇందిరను శాస్త్రి బెదిరిస్తున్నట్లుగా ఉన్న ఫోటోలను తీస్తుంది కనకం. మీరు కనుక మా డీల్‌కు ఒప్పుకోలేదంటే ఆ ఫోటోల్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి ఇస్తామని బెదిరిస్తుంది ఇందిర. నన్ను చంపుతానని బెదిరిస్తున్నారని కంప్లయంట్ చేస్తానని వార్నింగ్ ఇస్తుంది ఇందిర. ఆ మాటలతో శాస్త్రి కంగారు పడిపోతాడు. మీకు నాకు వైరం ఏంటీ? అయినా మీ వయసుకు మాట్లాడాల్సిన మాటలేనా? ఇవి అని శాస్త్రి ప్రశ్నిస్తాడు. పోలీసులు నమ్మకపోవచ్చు.. కానీ కనకాంబరం నమ్ముతుంది కదా అని అంటుంది ఇందిర. అప్పుడు నాకు మల్లెపూలతో పాడె సిద్ధం చేస్తుందని, అసలే మా ఆవిడ అనుమానపు పక్షి అని వణికిపోతాడు శాస్త్రి.
అలా జరగకుండా ఉండాలంటే నువ్వు మేం చెప్పినట్లు చేయాలని అంటుంది అపర్ణ. ఈ పెళ్లి ఆపితే ఆ యామిని నన్ను చంపేస్తుందని భయపడతాడు శాస్త్రి. ఆపకపోతే మేం నిన్ను చంపేస్తామని వార్నింగ్ ఇస్తుంది కనకం. ఏం చేయాలో కూడా నువ్వే డిసైడ్ చేయమని అంటుంది ఇందిర. దాంతో ముగ్గురికి ప్లాన్ చెబుతాడు శాస్త్రి. కళావతికి విషయం చెప్పాలని రాజ్ బాధపడుతుంటాడు. కావ్య కనిపించడంతో ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు రాజ్. ఇందాక మీకు విషయం చెబుదామనే లోపు యామిని వచ్చిందని అంటాడు. నేను చాలా బిజీగా ఉన్నానని.. మీరు ప్రతి 10 నిమిషాలకు వచ్చి అరిగిపోయిన టేప్ రికార్డర్‌లా మళ్లీ మళ్లీ ప్లే చేస్తానని అంటున్నారని మండిపడుతుంది కావ్య.
యామినిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకున్నానని చెబుతారు అంతేకదా అని అంటుంది కావ్య. అదొక్కటే కాదు.. ఇంకా చాలా జరిగిందని అంటాడు రాజ్. అవతల యుద్ధం జరుగుతున్నట్లు అలా వెళ్లిపోతారేంటీ అని రాజ్ మండిపడతాడు. కావ్య చేతిని తన గుండెలపై పెట్టి .. నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించడం వల్లే ఈ పెళ్లికి ఒప్పుకున్నానని చెబుతాడు రాజ్. ఆ మాటలలో కావ్య షాక్ అవుతుంది. నాకు ఈ పెళ్లే ఇష్టం లేదని, నా వల్ల ఒక ప్రాణం పోకూడదని నా మనసును చంపుకుని ఈ పెళ్లి చేసుకుంటున్నానని చెబుతాడు రాజ్. ఈ విషయం గురించి చెప్పాలనే మీ వెంట పడుతున్నానని అంటాడు.
ఈ పెళ్లికి ఒప్పుకోవడంలో నా తప్పేమైనా ఉందా? అని కావ్యని ప్రశ్నిస్తాడు రాజ్. చనిపోతానని బెదిరిస్తే పెళ్లి చేసేసుకుంటారా? అని మండిపడుతుంది కావ్య. రేపు ఇంకో అమ్మాయి వచ్చి నన్ను పెళ్లి చేసుకోకపోతే చనిపోతాననని చెబితే ఆమెను కూడా పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నిస్తుంది కావ్య. ఏం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారో మీ మనసును అడిగి తెలుసుకోండి అని చెబుతుంది. రాహుల్ - రుద్రాణి బయటకు రాకుండా స్వప్న డోర్ దగ్గరే కాపలా కూర్చొంటుంది. నాకు బాగా ఆకలి వేస్తోందని, నేను తట్టుకోలేనని స్వప్నని రిక్వెస్ట్ చేస్తాడు రాహుల్. దాంతో రుద్రాణి మండిపడుతుంది. పెళ్లికి రాకపోవడంతో రుద్రాణికి యామిని ఫోన్ చేస్తుంది.
నా పెళ్లి ఆగకుండా చూసుకుంటానని చెప్పావ్ కదా? ఇంకా ఇంటికి ఎందుకు రాలేదని నిలదీస్తుంది యామిని. నేను నీ పెళ్లి దగ్గరే ఉన్నానని.. టైం చూసి ఎంటర్ అవుతానని అంటుంది రుద్రాణి. దాంతో యామిని కూల్ అవుతుంది. ఇంట్లో నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క దారిని చెడగొట్టావ్.. ఇప్పుడు ఎలా బయటపడాలని రుద్రాణిపై మండిపడతాడు రాహుల్. శాస్త్రిని తీసుకుని కిందకి వస్తుండగా అపర్ణ, ఇందిరలకు కావ్య ఎదురవ్వడంతో వాళ్లంతా భయపడతారు. ఇందులో నా తప్పేం లేదని శాస్త్రి చెప్పబోతుండగా దానికేం తెలియదు, మీరు నోరు జారొద్దని గిల్లి చెబుతుంది కనకం. వీళ్లు మిమ్మల్ని బెదిరిస్తున్నారా? అని కావ్య శాస్త్రిని అడుగుతుంది. తర్వాత యామినితో కలిసి పూజ చేయిస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











