Brahmamudi June 15th Episode: రేఖ కుట్రతో ప్రమాదంలో స్వరాజ్ కంపెనీ... మాస్టర్ ప్లాన్‌తో ఇందూని కాపాడిన సుభాష్
Photo Courtesy: JioHotstar
నా భార్యతో వేలిముద్రలు వేయించి కంపెనీకి నష్టాలు తీసుకొద్దామని అనుకుంటున్నారా? ఆమెను సీఈవో పనికి రాదనే ముద్ర వేసి తప్పించాలని చూస్తారా అంటూ రేఖపై మండిపడతాడు రాజ్. ఈ డీల్‌కి నేను ఒప్పుకోనని రాజ్ చెప్పగా.. మా రేఖ ఆంటీ అన్నీ ఆలోచించే ఇలా చేస్తుందని నటిస్తుంది ఇందూ. అయితే కంపెనీ ఛార్టెర్డ్ అకౌంటెంట్‌ని పిలిపించు ఆయన ఓకే చెబితే ఎక్కడ కావాలంటే అక్కడ వేలిముద్రలు వేసుకోమని చెబుతాడు. ఆ మాటలతో రేఖ, భూషణ్‌లు ఏదో కవర్ చేయాలని చూస్తుండగా.. ఛార్టెర్డ్ అకౌంటెంట్ వచ్చే వరకు ఈ డీల్ జరగదని చెప్పి డాక్యుమెంట్స్ చింపేస్తాడు.
డీల్‌ని ఆపేసి కంపెనీని కాపాడాడని తనిని ఇందూ హత్తుకుని ఐ లవ్ యూ చెబుతున్నట్లు, ముద్దు పెడుతున్నట్లు కల కంటాడు రాజ్. ఇంతలో ఇందూ వచ్చి ఊహించుకున్నది చాలని క్లాస్ పీకి నేలపై పడుకోబెడుతుంది. రాజ్‌తో కలిసి మందు తాగిన శేషానికి చన్నీటితో స్నానం చేయిస్తుంది భ్రమరాంబ. డెలివరీ బాయ్ ఉద్యోగానికి వెళ్తున్న వెంకీ బాగా రెడీ అవుతాడు. అయితే క్యారియర్ వద్దని కిచెన్‌లో భోజనం పెడతారని చెప్పడంతో చలపతి, లక్ష్మీలు షాక్ అవుతారు. నేను డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నానని తెలియకూడదని అనుకుంటాడు వెంకీ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 15వ తేదీ ఎపిసోడ్ 1059లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
డెలివరి బాయ్‌గా జాయిన్ అవ్వడానికి వెళ్తుండగా బైక్ స్టార్ట్ కాకపోవడంతో టెన్షన్ పడతాడు వెంకీ. ఇంతలో ఓనర్ ఫోన్ చేసి ఫస్ట్ డేనే ఆలస్యంగా వస్తావా అని మండిపడతాడు. ఇందూకి కొరియర్ రావడంతో ఆమె చదువుతూ వస్తుంది అది చూసిన రేఖ, భ్రమరాంబ షాక్ అవుతారు. ఇందూకి అక్షరం ముక్క కూడా రాదు కదా అని శేషం అనడంతో రేఖ నవ్వుకుంటుంది. మీరంతా వెర్రి గొర్రెల్లా ఉన్నారు కదా? ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా అక్షరం ముక్క పొల్లు పోకుండా రాసేస్తుందని అనుకుంటాడు రాజ్. అదంతా చదివిన భూషణ్ షాకింగ్ న్యూస్ చెబుతాడు. మన కంపెనీకి రా మెటీరియల్ సప్లయ్ చేసేవాడు మనకు నోటీసు పంపించాడు. 3 నెలలుగా అమౌంట్ క్లియర్ చేయడం లేదు.. ఉన్నపళంగా ఆ డబ్బు క్లియర్ చేయాలి, లేకపోతే రా మెటీరియల్ ఆపేస్తున్నాను అని రాసుందని అంటాడు. ఆ మాటలు వినగానే ఇందూ షాక్ అవుతుంది.
కంపెనీకి రా మెటీరియల్ రాకపోతే మాన్యుఫాక్చరింగ్ ఆగిపోతుంది కదా అని అడుగుతుంది ఇందూ. మాన్యుఫాక్చరింగ్ ఆగిపోవడమే కాదు.. కంపెనీ కూడా క్లోజ్ అయిపోతుంది, ఇప్పటికిప్పుడు మనకి రా మెటీరియల్ సప్లయ్ చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు, మన కంపెనీ మీద ఎవ్వరికీ నమ్మకమే లేదని అంటుంది రేఖ. ఆ మాటలు విన్న అపర్ణ ఫైర్ అవుతుంది. ఇలా లక్షలు లక్షలు అందరికీ ఎగ్గొడితే మార్కెట్‌లో బ్యాడ్‌నేమ్ వస్తుంది. కంపెనీని రన్ చేయాలంటే అందరితో మంచిగా ఉండాలి, సరైన సమయంలో డబ్బులు కట్టాలని నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను. కానీ నువ్వు నా మాట వినలేదని మండిపడుతుంది.
రా మెటీరియల్‌కి డబ్బులు కట్టకుండా ఏం చేస్తున్నావని సుభాష్ ప్రశ్నించగా.. సినిమా చూస్తున్నానని సెటైర్లు వేస్తుంది రేఖ. మన కంపెనీ లాస్‌లో నడుస్తోందని తెలుసు కదా? ఎంప్లాయిస్‌కి 20 లక్షల రూపాయలు ఇవ్వలేని పరిస్ధితుల్లో ఉన్నాం. అలాంటిది రా మెటీరియల్‌కి ఎక్కడి నుంచి తెచ్చిస్తానని మండిపడుతుంది. ఇప్పుడు వాళ్లకి అమౌంట్ క్లియర్ చేయకపోతే కంపెనీయే మూసి వేయాల్సిన పరిస్ధితి వస్తుంది, అప్పుడు ఉద్యోగులు రోడ్డు మీద పడాల్సి వస్తుందని అంటుంది రేఖ. మీరే ఏదో ఒకటి చేసి కంపెనీ రన్ అయ్యేలా చేయమని అడుగుతుంది ఇందూ. ఇప్పుడు కంపెనీ సీఈవో నువ్వు, నీ బాధ్యతలన్నీ నీ మొగుడు తీసుకుని కంపెనీని సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తానని అన్నాడు కదా ఇప్పుడు నేనేందుకు జోక్యం చేసుకుంటానని పంచ్ వేస్తుంది రేఖ.
మాటలు చెప్పినంత ఈజీ కాదు బిజినెస్ చేయడం. రాత్రి నేను చెప్పిన డీల్ చేసుంటే అందులో డబ్బులు వచ్చేవి. ఆ డబ్బులు రా మెటీరియల్ వాడికి ఇచ్చేవాళ్లం. కానీ నువ్వు హీరోలా ఫోజ్ కొడుతూ ఆ డీల్ పేపర్స్ చించేశావని ఫైర్ అవుతుంది రేఖ. అదంతా వదిలేసి కంపెనీని కాపాడమని అడుగుతుంది ఇందూ. కానీ రేఖ మాత్రం ససేమిరా అంటుంది. ఏదో పాపం కష్టాల్లో ఉన్నారని.. కంపెనీ బాధ్యత తీసుకున్నాం, కంపెనీ అన్నాక లాభనష్టాలు సహజం. అంతమాత్రానికే మా రేఖకి బిజినెస్ చేయడం రాదని నానామాటలు అన్నారని భ్రమరాంబ మండిపడుతుంది.
కంపెనీని లాభాల బాట పట్టిస్తానని అన్నావు కదా చూపించమని రాజ్ మీద సెటైర్లు వేస్తుంది. ఎలా రా మెటీరియల్ వాడికి డబ్బులు ఇస్తావో? ఎలా కంపెనీ మూతపడకుండా ఆపుతావో నీ ఇష్టం. నిజంగానే నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వనని తేల్చేస్తుంది రేఖ. మా రేఖకి ఉన్న తెలివిలో వన్ పర్సెంట్ కూడా నీకు లేదు.. నువ్వు కష్టాల్లోంచి గట్టెక్కిస్తావా అని భ్రమరాంబ సెటైర్లు వేస్తుంది. ఇందులో నుంచి బయటపడటానికి ఏదో ఒక దారి ఉంటుందని అపర్ణకి రాజ్ ధైర్యం చెబుతాడు.
కంపెనీ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలా అని రాజ్, ఇందూలు ఆలోచిస్తూ గొడవ పడుతుంటారు. నువ్వు నా అందం గురించి తక్కువ చేసి మాట్లాడొద్దని అంటుంది ఇందూ. నీ ఫేస్ చంద్ర బింబంలా, కళ్లు చక్రల్లా ఉంటాయి. అలా ఒక చూపు చూస్తే ఎవరైనా పడిపోతారని చెబుతాడు రాజ్. ఇంతపెద్ద ప్రాబ్లమ్ పెట్టుకుని అందం గురించి ఆలోచిస్తున్నావా అని మండిపడతాడు. మీ రేఖ ఆంటీ చాలా పెద్ద కంత్రీది, రాత్రి అలా అన్నానో లేదో.. చాలా పెద్ద ప్రాబ్లమ్‌ని మన ముందు పెట్టేసిందని అంటాడు. ఏం చేయాలో అర్ధం కావడం లేదని ఇందూ బాధపడుతుండగా సుభాష్ వచ్చి మన ప్రాబ్లమ్ నుంచి బయటపడటానికి ఒక మార్గం ఉందని చెబుతాడు.
మన కంపెనీ క్లయింట్స్‌లో రేఖకి సపోర్ట్‌గా ఉండేవాళ్లు, రేఖకి సపోర్ట్‌గా ఉండేవాళ్లు ఎవరు అని తెలుసుకోవాలని చెబుతాడు సుభాష్. మనం ఒక్కొక్కరిని అడిగితే రేఖకి డౌట్ వస్తుంది. అలా కాకుండా ఓ పార్టీ ఏర్పాటు చేసి మన క్లయింట్స్‌ని ఇన్వైట్ చేద్దాం.. పార్టీకి వచ్చిన వాళ్లలో మన మనుషులు ఎవరు? రేఖ మనుషులు ఎవరు? అనేది ఈజీగా తెలుస్తుంది. మనకి సపోర్ట్‌గా ఉండేవాళ్లని కన్విన్స్ చేస్తే బిల్స్ వస్తాయి. అప్పుడు ఆటోమేటిక్‌గా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో రా మెటీరియల్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందని చెబుతాడు సుభాష్. పార్టీ జరగాలంటే రేఖ పిన్ని ఒప్పుకోదు... తనని రెచ్చగొడితే ఈజీగా ఒప్పుకుంటుంది.. దీని కోసం మీ ఫ్రెండ్ శకుంతలని రమ్మని చెప్పాలని అపర్ణతో అంటుంది ఇందూ. ఫుడ్ డెలివరీ జాబ్‌లో జాయిన్ అయిన వెంకీ సైకిల్ మీద ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications