Brahmamudi June 16th Episode: రేఖని మాటలతో రెచ్చగొట్టిన అపర్ణ ఫ్రెండ్... ఇందూ గాలానికి చిక్కిన రేఖ
Photo Courtesy: JioHotstar
వెంకీ డెలివరీ బాయ్‌గా జాయిన్ అవ్వడానికి వెళ్తుండగా బైక్ స్టార్ట్ కాదు.. దీంతో ఓనర్ ఫోన్ చేసి నానామాటలు అంటాడు. దాంతో చేసేదేం లేక సైకిల్ మీద వెళ్తాడు వెంకీ. ఇందూకి కొరియర్ రావడంతో అది చదువుకుంటూ వస్తుంది. ఏదో బాగా చదువుకున్న దానిలా వస్తున్నావేంటీ అంటూ భ్రమరాంబ అనడంతో ఇందూ షాక్ అవుతుంది. ఇందులో ఏముందో చదివి వినిపించమని రేఖను అడుగుతుంది ఇందూ. అది చదివిన భూషణ్.. మన కంపెనీకి రా మెటీరియల్ సప్లయ్ చేసే ఓ క్లయింట్‌కి 3 నెలల నుంచి పేమెంట్ ఇవ్వకపోవడంతో వాడు డబ్బులు కట్టాలని నోటీసులు పంపించాడని భూషణ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు.
రా మెటీరియల్ సప్లయ్ చేయకపోతే మాన్యుఫాక్చరింగ్ ఆగిపోతుంది.. కంపెనీని మూసేయాల్సి వస్తుందని రేఖ చెప్పడంతో.. ఎలాగైనా దీని నుంచి కాపాడమని ఇందూ బతిమలాడుతుంది. మీ ఆయన అన్నీ చూసుకుంటాను అన్నాడు కదా? మధ్యలో నాకెందుకు అని వెళ్లిపోతుంది. కంపెనీకి వచ్చిన సమస్యని ఎలా పరిష్కరించాలా అని ఇందూ, రాజ్ ఆలోచిస్తుండగా సుభాష్ వచ్చి ఓ ప్లాన్ చెబుతాడు. కంపెనీలో ఉన్న మన క్లయింట్స్‌తో ఓ పార్టీ ఏర్పాటు చేసి మనకు అనుకూలంగా ఉన్న వారి నుంచి రా మెటీరియల్ సప్లయ్ చేయమని అడుగుదామని అంటాడు. పార్టీకి రేఖను ఒప్పించడానికి అపర్ణ ఫ్రెండ్ శకుంతలని రంగంలోకి దించమని చెబుతుంది ఇందూ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 16వ తేదీ ఎపిసోడ్ 1060లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
వెంకీ సైకిల్ మీద డెలివరీలు చేస్తుండటంతో కస్టమర్లు కోప్పడుతుంటారు. ఈ విషయాన్ని ఓనర్‌కి ఫోన్ చేసి చెప్పడంతో అతను మండిపడతాడు. ఆ వెంటనే ఓనర్ ఫోన్ చేసి నానామాటలు అంటాడు. ఉదయాన్నే ఇందూ అనుకున్న ప్లాన్ ప్రకారం అపర్ణ స్నేహితురాలు శకుంతల వచ్చి ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావని అడుగుతుంది. నీ ఇంట్లో లాగా .. నా ఇంట్లో పరాయి వాళ్ల పెత్తనం కాదు కదా? అక్కడ నేనేం చెబితే అదే ఫైనల్ అంటుంది శకుంతల. ఆమెను పిలిచి భోజనం పెట్టమని రాజ్ చెప్పడంతో సరేనని అంటుంది అపర్ణ. ఇదేదో సత్రం అయినట్లు అందరికీ భోజనం పెడుతున్నారని రేఖ అనడంతో అంతా షాక్ అవుతారు.
మీ కొడుకు, కోడలు ఉన్నప్పుడు మీ ఇల్లు ఎంతో సంతోషంగా కళకళలాడుతూ ఉండేది, ఎవరి దిష్టి తగిలిందో ఏంటో మీ జీవితాలు ఇలా మారిపోయాయి. ఈ అబ్బాయి మన రాజ్‌లాగే ఉన్నాడని శకుంతల అడగ్గా.. నా మనవడు అంటుంది అపర్ణ. అంటే నీ కూతురి కొడుకా అని ఆమె అడగ్గా అంతా షాక్ అవుతారు. ఈ ఇంటి అల్లుడు, ఇందూకి మొగుడు అని శేషం చెప్పడంతో ఇందూకి పెళ్లయిందని నాకు చెప్పలేదని ఫైర్ అవుతుంది శకుంతల. మీకే కాదు, మాకు కూడా ఎవరికీ పెళ్లయ్యే వరకు తెలియదని భ్రమరాంబ సెటైర్లు వేస్తుంది.
మా ఇందూ- రాజ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారని శేషం చెబుతాడు. నువ్వు ఏం చేస్తుంటావని శకుంతల అడుగుతుంది. ఎక్కడా అవి ఇవి చేయకుండా దుగ్గిరాల ఆస్తి కాపాడుకుంటే చాలని అంటుంది శకుంతల. నేను కూడా అదే పనిలో ఉన్నానని చెబుతాడు రాజ్. డ్రామా స్టార్ట్ చేయమని ఇందూ సిగ్నల్ ఇవ్వడంతో నువ్వు కూడా కూర్చొని భోజనం చేయ్, ఇప్పుడు నువ్వు స్వరాజ్ కంపెనీకి సీఈవో కదా అని రాజ్ అనడంతో శకుంతల షాక్ అవుతుంది. ఇందూ కంపెనీకి సీఈవో అయ్యిందా? అని ఆమె ప్రశ్నిస్తుంది.
దాని వెనుక చాలా పెద్ద కథ నడిచిందని రాజ్ చెప్పడంతో అసలు ఇందూ సీఈవో కావడం ఏంటీ? ఈ రేఖ ఉండగా.. ఇది కలా నిజమా అని ప్రశ్నిస్తుంది శకుంతల. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను, నిజంగానే నీ పదవి పోయిందా? ఇప్పుడు కంపెనీ సీఈవో ఇందూనా? అని ప్రశ్నిస్తుంది శకుంతల. దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు.. లేకపోతే ఇలా జరగడం ఏంటీ? ఇందూని గడప దాటడానికి కూడా వీల్లేదని కండీషన్ పెట్టి ఇంట్లో బానిసగా చేసుకున్నావు? ఇప్పుడు ఏమైందని ప్రశ్నిస్తుంది శకుంతల.
మా రేఖ ఆంటీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. నన్ను బానిసలా చూడలేదు మా ఆంటీ. ఇన్నాళ్లూ నా సెక్యూరిటీ కోసం నన్ను జాగ్రత్తగా చూసుకుంది. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి నన్ను సీఈవోని చేసింది అంటుంది ఇందూ. రేఖ నిన్ను సీఈవోని చేసిందా? అసలు నువ్వు సీఈవో అవ్వడమే షాకింగ్ అనుకుంటే.. ఈ రేఖ నిన్ను సీఈవోని చేయడం ఫుల్ షాక్. నీకు ఇలాంటి మంచి బుద్ధులు వచ్చాయి.. నువ్వు పెద్ద శాడిస్ట్‌వి కదా అని నానామాటలు అంటుంది శకుంతల. మా ఫ్రెండ్‌ని, దాని మనవరాలిని రాచి రంపాన పెట్టేదానివి కదా? అని చెబుతుంది.
మా రేఖ ఆంటీ చాలా మంచిది, తనని తప్పుపడితే నాకు చాలా కోపం వస్తుంది. మీరు మా నానమ్మ ఫ్రెండ్ కదా అని నేను ఊరుకుంటున్నానని అంటుంది ఇందూ. నీకు మీ రేఖ ఆంటీ గురించి తెలుసు కదా అని ఫైర్ అవుతుంది శకుంతల. రేఖ ఆంటీ గురించి అలా మాట్లాడితే మీరు వెంటనే వెళ్లిపోమ్మని చెబుతుంది ఇందూ. ఇంటికొచ్చిన మనిషిని నోరుమూయించి పంపేశావు, బయట కూడా చాలా మంది శకుంతల గారిలాగే మాట్లాడుకుంటారు. అందరి నోళ్లు మూయించేస్తావా అని ఫైర్ అవుతాడు సుభాష్.
అందరి నోళ్లు ఎలా మూయించాలా నాకు బాగా తెలుసు.. నేను సీఈవో అయిన సందర్భంగా మన క్లయింట్స్ అందరినీ పిలిచి పార్టీ ఇద్దామా అని రేఖని అడుగుతుంది ఇందూ. మన రేఖ ఆంటీ మీదున్న ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు కూడా తొలగిపోతాయి. అందరూ రేఖ ఆంటీ నన్ను బానిసలా చూసుకుంటుందని అనుకుంటున్నారు, ఇప్పుడు పార్టీలో అందరి ముందే తనే నన్ను సీఈవోని చేసిందని చెబితే అప్పుడు అందరికీ రేఖ ఆంటీ నన్నెంత బాగా చూసుకుందో తెలిసిపోతుందని అంటుంది ఇందూ. దానికి రేఖ కూడా ఒప్పుకుని, ఈరోజే పార్టీ ఏర్పాటు చేద్దామని చెబుతుంది. తమ ప్లాన్ సక్సెస్ కావడంతో ఇందూ, రేఖ, సుభాష్, రాజ్‌లు సంతోషిస్తారు. మరోవైపు.. సైకిల్ మీద డెలివరీలు చేసినందుకు వెంకీ మీద మండిపడతాడు ఓనర్. బైక్ పాడైపోయింది, రేపటి నుంచి సరిగ్గా చేస్తానని వెంకీ చెప్పగా.. నీ జాబ్ తీసేశాను అంటాడు ఓనర్. వెంకీ బతిమలాడటంతో ఒక ఛాన్స్ ఇస్తాడు ఓనర్.
పార్టీ ఎలా చేయాలా అని ఇందూ, రాజ్ ఆలోచిస్తారు. నేను రేఖ ఆంటీ పక్కనే ఉంటాను, నువ్వు మాత్రమే రేఖ ఆంటీ మనుషులు ఎవరు? మన మనుషులు ఎవరు? అని కనుక్కోవాలని రాజ్‌కి చెబుతుంది. ఇదంతా జరుగుతున్నప్పుడు రేఖ ఆంటీకి డౌట్ వస్తే ఏం చేస్తావని రాజ్ అడుగుతాడు. నీ ఓవరాక్షన్‌తో నువ్వే దొరికిపోతావని అంటుంది ఇందూ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications