Brahmamudi June 17th Episode: రేఖ నుంచి తప్పించుకున్న ఇందూ.. రాజ్ సీక్రెట్స్ ఐశ్వర్యకి చెప్పేసిన లక్కీ

Photo Courtesy: JioHotstar

వెంకీ సైకిల్ మీద డెలివరీలు చేస్తుండటంతో కస్టమర్లంతా తిట్టుకుంటూ ఓనర్‌కి ఫోన్ చేయడంతో అతను వెంకీని పిలిపించి నానామాటలు అంటాడు. లేటైతే నేను అస్సలు ఊరుకోను.. అయినా సైకిల్ మీద డెలివరీలు చేయడం ఏంటి ఈ క్షణం నుంచే నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాను అంటాడు ఓనర్. బైక్ లేకపోయినా సైకిల్ మీద కష్టపడి అన్ని డెలివరీలు ఇచ్చానని వెంకీ చెప్పడంతో ఒక చివరి అవకాశం ఇస్తాడు ఓనర్. ఇందూ ప్లాన్‌లో భాగంగా దుగ్గిరాల ఇంటికి అపర్ణ ఫ్రెండ్ శకుంతల వస్తుంది. ఎలా ఉండే దానివి ఎలా అయిపోయావు? అయినా ఈ ఇంటికి ఏదో దిష్టి తగిలిందని రేఖ ముందే సెటైర్లు వేస్తుంది శకుంతల.

శకుంతలను తీసుకొచ్చి భోజనం పెడుతుండగా రేఖ నానామాటలు అనడంతో ఆమెకు గట్టిగా కౌంటర్ వేస్తుంది శకుంతల. ఈ అబ్బాయి మన రాజ్‌లాగే ఉన్నాడని ఆమె అడగ్గా.. వాడు నా మనవడు, ఇందూ భర్త అని అపర్ణ చెబుతుంది. ఇందూకి పెళ్లయిపోయిందా? పెళ్లేంటీ.. సీఈవో కూడా అయిపోయిందని రాజ్ అనడంతో శకుంతల షాక్ అవుతుంది. ఈ రేఖ ఉండగా నువ్వు సీఈవో అయ్యావంటే నమ్మలేకపోతున్నానని అంటుంది శకుంతల. మా ఆంటీయే నన్ను సీఈవోని చేసిందని ఇందూ చెబుతుంది, నాకు నమ్మబుద్ధి కావడం లేదని శకుంతల వెళ్లిపోతుంది. ఇలాంటి వాళ్ల నోరు మూయించాలంటే వెంటనే మనం పార్టీ ఏర్పాటు చేసి అందరినీ పిలిచి మా రేఖ ఆంటీయే నన్ను సీఈవో చేసిందని చెప్పాలని అంటుంది ఇందూ. ప్లాన్ బాగుందని దానికి సరేనని చెబుతుంది రేఖ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 17వ తేదీ ఎపిసోడ్ 1061లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial June 17th 2026 Episode 1061 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఇందూ - రాజ్ వేరు వేరుగా పడుకోవడం, తిట్టుకుంటూ ఉండటం చూసిన ఐశ్వర్యకి అనుమానం వస్తుంది. వెంటనే ఈ విషయం చెప్పి వీళ్ల తిక్క కుదుర్చాలని అనుకుని రేఖ దగ్గరికి పరిగెడుతుంది. ఆ రాజ్ - ఇందూలు మనల్ని మోసం చేస్తున్నారు. మీకు విషయం తెలియక ఇందూని సీఈవోని చేశారు. నేను చాలా ఇరిటేషన్‌లో ఉన్నాను, అనవసరమైన మేటర్‌ చెప్పొద్దని మండిపడుతుంది. అసలు ఆ రాజ్- ఇందూలు భార్యాభర్తలేనా అని అనుమానంగా ఉందని అంటుంది ఐశ్వర్య. ఆ మాటలు విన్న రేఖ షాక్ అవుతుంది. ఇందూకి ఇష్టం లేకపోయినా పెళ్లి జరిగిపోయింది. వాడే దాని మెడలో మూడు ముళ్లు వేశాడు కదా అంటుంది రేఖ. కానీ మనం ఎవ్వరూ చూడలేదు? భార్యాభర్తల్లా నటిస్తున్నారేమో ఎవరికి తెలుసు అని ప్రశ్నిస్తుంది ఐశ్వర్య.

నటించాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్లిద్దరికీ నిజంగానే పెళ్లి జరిగింది, నిజంగానే వారిద్దరూ భార్యాభర్తలని అంటుంది రేఖ. కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలు ఎలా ఉంటారు? ఇద్దరూ కలిసి ఒకే బెడ్ మీద పడుకుంటారు కదా? అసలు వాళ్లది సంసారం కాదు అనిపిస్తోంది. మొత్తం నటనలా ఉందని అంటుంది ఐశ్వర్య. కొత్తగా పెళ్లయిన వాళ్లకి గిలిగిలి కజ్జికాయలు ఉంటాయి కదా అని అంటుంది. అది గిలిగిలి కజ్జికాయలో, బెల్లం కజ్జికాయలో కాదు.. గిల్లి కజ్జాలు అంటుంది రేఖ. ఇద్దరి మధ్య ప్రేమ లాంటివి కనిపించడం లేదు. పైగా రాజ్ గాడేమో నేల మీద పడుకున్నాడు.. ఇందూ ఏమో మహారాణిలా బెడ్ మీద పడుకుంటోందని చెబుతుంది ఐశ్వర్య.

అంటే ఇందూ చెప్పింది నిజమే.. ఆ రాజ్ గాడిని దూరం పెడుతోంది, మనకి కావాల్సింది కూడా ఇదేనని అనుకుంటుంది రేఖ. వాళ్లు ఎలా ఫోతే మనకెందుకు అని ప్రశ్నిస్తుంది. దీనిని లైట్ తీసుకోవద్దు.. ఇందూలో ఏదో తిరకాసు ఉందని లాక్కెళ్లి మరి చూపిస్తుంది. లోపలికి వెళ్లి చూసేసరికి చాప కనిపించకపోవడంతో ఐశ్వర్య షాక్ అవుతుంది. ఇంతలో ఇందూ, రాజ్‌ల మాటలు వినిపించడంతో గార్డెన్ వైపు వెళ్తారు రేఖ, ఐశ్వర్య. నేను చెప్పింది నువ్వు చేయడం లేదని రాజ్‌పై మండిపడుతుంది ఇందూ. నేను చెప్పినట్లు చేస్తేనే వస్తానని అంటుంది. ఈ మాటలు విన్న రేఖ.. ఇందూ వాడికి భయపడి నటిస్తుందా? లేక ఐశ్వర్య చెప్పింది నిజమేనా అని ఆలోచిస్తుంది.

వాళ్లిద్దరూ ఏదో పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే ఎందుకు తీసుకొచ్చావు అని ఐశ్వర్యపై మండిపడుతుంది రేఖ. ఇందూని బతిమలాడటానికి రాజ్ పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ చివరికి ముద్దు పెడతాడు. అది చూసి రేఖ, ఐశ్వర్యలు షాక్ అవుతారు. నువ్వంటే నాకు ప్రాణం.. నాకు నీలా కోట్ల ఆస్తి లేకపోవచ్చు, నేను నీలాగా సీఈవో కాకపోవచ్చు. కానీ నీకోసం ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ ఉంది. నీ చేతిలో చేయి వేసి చెబుతున్నాను.. కడదాకా నీ చేయి వదలను, ప్రతిక్షణం నీతోనే ఉంటానని అంటాడు రాజ్. ఆ మాటలతో ఇందూ నవ్వుకుంటుంది. నీకు నేనంటే ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేసుకున్నానని ఇందూని హగ్ చేసుకుంటాడు. ఇదంతా చూసిన రేఖ.. నా టైం మొత్తం వేస్ట్ చేశావంటూ ఐశ్వర్యపై మండిపడుతుంది. వీళ్లద్దరూ ఏదో డ్రామాలు ఆడుతున్నారు.. ఏం చేస్తే తెలుస్తుందని ఆలోచిస్తుండగా లక్కీ గుర్తుకురావడంతో అతనిని పిలిపించాలని అనుకుని అతనికి ఫోన్ చేస్తుంది ఐశ్వర్య.

మా వాడు డబ్బులు ఇవ్వలేదని ఫోన్ చేశావా? అని లక్కీ ప్రశ్నిస్తాడు. వాడు డబ్బులు ఇవ్వకపోతే నువ్వేం చేస్తావని అంటుంది ఐశ్వర్య. అయితే ఇందులో నా ఇన్వాల్వ్‌మెంట్ ఏం లేదని అర్ధమైంది కదా అని చెబుతాడు లక్కీ. నిన్ను ఒకసారి అర్జెంట్‌గా కలవాలని ఐశ్వర్య చెప్పడంతో లక్కీ పొంగిపోతూ ఆమె చెప్పిన ప్లేస్‌కి వెళ్తాడు. నువ్వు నాకు ఫోన్ చేసి అర్జెంట్‌గా కలవాలని చెప్పగానే నాకు నమ్మబుద్ధి కాలేదని అంటాడు లక్కీ. ఇందూని కిడ్నాప్ చేసినప్పడు ఏం జరిగింది? ఇందూ మీతో ఎలా ఉండేది అని అడుగుతుంది ఐశ్వర్య. వారిద్దరూ పెళ్లి ఎలా చేసుకున్నారు? అని ఐశ్వర్య అడగ్గా.. వాళ్లిద్దరూ ఎప్పుడు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ గొడవ పడుతూ ఉండేవారు. సడెన్‌గా పెళ్లి చేసుకున్నట్లు ఎవరో చెబితే నాకు తెలిసిందని చెబుతాడు లక్కీ.

వీడికి కూడా ఏం తెలియదు, మరి రాజ్- ఇందూల మేటర్ ఎలా కనుక్కోవాలని ఆలోచిస్తుంది ఐశ్వర్య. నాకో హెల్ప్ చేస్తావా అని ప్రేమగా అడగటంతో లక్కీ బుట్టలో పడిపోతాడు. ఇందూని రాజ్ ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసుకోవాలని ఐశ్వర్య చెప్పడంతో ఆ విషయాలు నీకెందుకు అని అడుగుతాడు లక్కీ. ఇందూ నా చెల్లెలు.. అసలు ఇందూ గురించి రాజ్ ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని అనుకుంటున్నానని అంటుంది ఐశ్వర్య. నాకు కొంచెం టైం ఇస్తే తెలుసుకుంటానని లక్కీ చెప్పగా.. రాజ్‌తో నువ్వు సిట్టింగ్ వేసి రెండు పెగ్గులు కొట్టించావంటే అన్నీ చెప్పేస్తాడని సలహా ఇస్తుంది ఐశ్వర్య. ఆ వెంటనే రాజ్‌కి లక్కీ ఫోన్ చేసి సిట్టింగ్ వేద్దామని పిలవడంతో సరేనని అంటాడు. దాంతో లక్కీకి ఐశ్వర్య హగ్ ఇస్తుంది.

సైకిల్ తొక్కి తొక్కి వెంకీకి బాగా పెయిన్ వచ్చినా తల్లీదండ్రుల ముందు కవర్ చేస్తాడు. సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే ఎంత ప్రెజర్ ఉంటుందో నాకు తెలుసని చలపతి అంటాడు. అయితే సైకిల్ తొక్కి తొక్కి వెంకీ కాళ్లు కందిపోవడంతో అది చూసిన లక్ష్మీ కంటతడి పెడుతుంది. అసలు నువ్వు సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నావా? లేక రోడ్డు మీద తిరిగే పని చేస్తున్నావా అని అడుగుతాడు చలపతి. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి వెంకీకి వెన్నరాయడంతో అతను కంటతడి పెడతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X