Brahmamudi June 18th Episode: కిల్లర్‌తో బ్లాక్‌మెయిల్ గేమ్.. అప్పూ ఉచ్చులోకి యామిని, రుద్రాణిపైనే యామిని ఆశల
Photo Courtesy: JioHotstar
స్వప్న కళ్లుగప్పి తప్పించుకుని పారిపోతారు రాహుల్ - రుద్రాణి. అటు యామిని- రాజ్‌ల పెళ్లికి ఏర్పాట్లు చేస్తాడు శాస్త్రి. లోపలి నుంచి వైదేహి ఎంగేజ్‌మెంట్ రింగ్స్ తీసుకొస్తుండగా ఆమెను డైవర్ట్ చేసి ఉంగరాలు కొట్టేస్తుంది కనకం. తీరా ఉంగరాలు కనిపించకపోవడంతో యామిని -రాజ్‌లు పాత ఉంగరాలతో నిశ్చితార్ధం చేసుకుంటుండగా మరోసారి కనకం మేజిక్ చేసి రాజ్‌కి బదులుగా తాను ఉంగరాలు తొడిగేస్తుంది. ఇది చూసిన శాస్త్రి షాక్ అవుతాడు.
నిశ్చితార్ధం ఎలాగోలా గట్టెక్కినా పెళ్లిని ఎలా ఆపాలో అర్ధం కాక కనకం, అపర్ణ, ఇందిరలు బాధపడుతుంటారు. ఇంతలో అప్పూకి స్టేషన్ నుంచి కానిస్టేబుల్ ఫోన్ చేసి నిందితుల్లో ఒకడైన గుణ గురించి చెబుతాడు. రాజ్- కావ్యలపై అటాక్ చేయించింది యామినియే అని చెప్పడంతో అప్పూ షాకై కొత్త ప్లాన్ వేస్తుంది. ఇదే విషయాన్ని అపర్ణకి కూడా చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 18వ తేదీ ఎపిసోడ్ 751లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నిశ్చితార్ధం అయ్యిందని సంబరాలు చేసుకుంటున్నావా? అని రాజ్‌పై ఇందిర సెటైర్లు వేస్తుంది. దీంతో కామెడీగా ఉందా అంటూ పెద్దావిడ మీద కోప్పడతాడు రాజ్. ఇప్పుడు అనుకుని ఏం లాభం.. ఈ నిర్ణయం తీసుకోకముందు ఆలోచించాల్సింది అంటుంది అపర్ణ. కనకం గారు చెప్పినప్పటి నుంచి ఇంకా కంగారు పెరిగిందని చెబుతాడు రాజ్. వాళ్లు వీళ్లు చెప్పడం కాదు.. అసలు నీకు ఏం అనిపిస్తోందని ప్రశ్నిస్తుంది అపర్ణ. ఈ పెళ్లి వద్దంటే యామిని ఏం చేసుకుంటుందోనని భయంగా ఉందని నాకు ఏం చేయాలో అర్ధం కావడం లేదని అంటాడు రాజ్.
ఇంతలో వైదేహి వచ్చి యామినికి మెహందీ పెట్టమని రాజ్‌ను పిలుస్తుంది. ఈలోగా కావ్య అక్కడికి వస్తుంది. మీ చేతులతో మెహందీ పెట్టించుకోవాలని యామిని ఆశ పడుతోందని, వెళ్లి త్వరగా పెట్టండి అంటూ సెటైర్లు వేస్తుంది. నాకు మెహందీ పెట్టడం రాదని రాజ్ చెప్పగా.. ఇక్కడేం పోటీలు పెట్టడం లేదని చెబుతుంది వైదేహి. ఏదో ప్లాన్ చేశానని అన్నావ్.. ఏం చేశావని అప్పూని అడుగుతుంది అపర్ణ. ఇంతలో కిల్లర్ గుణని తీసుకుని యామిని ఇంటికి వస్తాడు కానిస్టేబుల్. కావ్య మీద అటాక్ చేయించింది యామినియే అని చెప్పాలని, అప్పుడే ఈ కేసులో నుంచి బయటపడతావని బెదిరిస్తాడు కానిస్టేబుల్.
నాకు మొత్తం గుర్తుందని మళ్లీ మళ్లీ బెదిరించొద్దని అంటాడు కానిస్టేబుల్. నా ఫోన్ నాకిస్తే నేను చూసుకుంటానని అంటాడు కిల్లర్. రాజ్ మెహందీ పెట్టే సమయానికి సరిగ్గా యామినికి ఫోన్ చేస్తాడు కిల్లర్. అది చూసిన యామిని షాక్ అవుతుంది. నేను బెయిల్ మీద పోలీస్ స్టేషన్ నుంచి బయటికొచ్చేశానని, నేను దేశం వదిలి పారిపోకపోతే నన్ను అరెస్ట్ చేస్తారని మీరే నాకు హెల్ప్ చేయాలని అంటాడు కిల్లర్. ఆ మాటలు విన్న యామిని ఏదేదో మాట్లాడుతుంది. నేను మీ ఇంటి బయటే ఉన్నానని.. మీరు వస్తే సెటిల్ చేసుకుందామని, లేదంటే నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి నా చేత ఆ పని చేయించింది యామినియేనని చెబుతానని బ్లాక్ మెయిల్ చేస్తాడు కిల్లర్. మీకోసం 5 నిమిషాలు వెయిట్ చేస్తానని.. ఆ తర్వాత వెళ్లిపోతానని చెప్పడంతో యామిని షాకై.. బయటికి వస్తున్నట్లు చెబుతుంది.
అన్ని కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని, కానీ దీనిని నువ్వే చెడగొట్టుకుంటున్నావని యామిని మీద సెటైర్లు వేస్తుంది ధాన్యలక్ష్మీ. వైదేహి కూడా ముందు ఈ కార్యక్రమం సంగతి చూడాలని అంటుంది. యామినికి కిల్లర్ పదే పదే ఫోన్లు చేస్తుండటంతో ఆ ఫ్రెండ్ ఎవరు? పెళ్లి చేసుకునే వాళ్ల మధ్య సీక్రెట్స్ ఉండకూడదని అంటుంది ధాన్యం. నిన్ను చూస్తుంటే ఏదో టెన్షన్ పడుతున్నట్లుగా ఉన్నావ్? అంత ముఖ్యమైన కార్యక్రమా? అని అప్పూ కూడా ఎగతాళి చేస్తుంది. నువ్వు వెళ్లిపోతే నాకంటే మెహందీ ఎక్కువ అయిపోయిందా అని రామ్ అనుకుంటాడని భయపెడుతుంది ధాన్యలక్ష్మీ. ఆ మాటలతో యామిని కోప్పడి.. నేను బయటికి వెళ్లడం చాలా ఇంపార్టెంట్ అని చెబుతుంది. ఎవరు అర్ధం చేసుకున్నా చేసుకోకపోయినా పర్లేదని నువ్వు చేసుకుంటే చాలాని రాజ్‌కి చెప్పి వెళ్లిపోతుంది యామిని. దాంతో ఆమె తల్లిదండ్రులు షాక్ అవుతారు.
యామిని వెళ్లిపోవడంతో అప్పూకి థ్యాంక్స్ చెబుతుంది అపర్ణ. అప్పుడే అయిపోలేదని ఇంకా చాలా కథ ఉందని చెబుతుంది అప్పూ.. బయటికి వెళ్లి మిగిలిన పని కూడా పూర్తి చేస్తానని అంటుంది. ఈలోపు కిల్లర్‌ని కలిసి మాట్లాడుతుంది యామిని. కావ్యని చంపమంటే పోలీసులకు దొరికిపోయి మా ఇంటికి వచ్చి నా పెళ్లిని డిస్ట్రబ్ చేస్తున్నావేంటీ అని మండిపడుతుంది యామిని. లోపల రాజ్- కావ్య ఉన్నారని.. నిన్ను కానీ వాళ్లు చూస్తే గుర్తుపట్టేస్తారని భయపడుతుంది. వారి మాటలను అప్పూ- కళ్యాణ్‌లు దొంగచాటుగా వింటారు. వాళ్ల మీద అటాక్ చేయించింది నేనే అని వాళ్లతో చెబితే నేను కూడా ఈ కేసులో ఇరుక్కుంటానని అంటుంది యామిని.
మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కిల్లర్‌కు చెబుతుంది యామిని. నేను అలా వెళ్లాలంటే మీరు నాకు కోటి రూపాయలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తాడు కిల్లర్. ఆ మాటలతో యామిని షాక్ అవుతుంది. మీరు ఈ కేసులో ఇరుక్కోకుండా వుండాలన్నా.. నా దారిన నేను ఫారిన్ వెళ్లిపోవాలన్నా కోటి రూపాయలు ఇవ్వాల్సిందేనని తేల్చిచెబుతాడు కిల్లర్. అవి ఏమైనా చెట్టు ఆకులు అనుకున్నావా? అని ప్రశ్నిస్తుంది యామిని. మీరు నాకు డబ్బులు ఇవ్వకుంటే సరాసరి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఇదంతా చేయించింది మీరేనని బెదిరిస్తాడు కిల్లర్. దాంతో వాడు అడిగినంత ఇవ్వడానికి ఒప్పుకుంటుంది యామిని. నా దగ్గర అంత డబ్బు లేదని కొంచెం టైం కావాలని అడుగుతుండగా ఈలోగా వైదేహి - రఘునాథ్‌లు రావడంతో యామిని షాక్ అవుతుంది.
రాహుల్ - రుద్రాణి తప్పించుకున్నారని స్వప్న చెప్పడంతో అప్పూ - కళ్యాణ్‌లు షాక్ అవుతారు. యామినిని వెతుక్కుంటూ రాహుల్ - రుద్రాణి తిరుగుతుంటారు. కావ్యని చంపమని సుపారీ ఇవ్వడమేంటని యామినిపై మండిపడతాడు రఘునాథ్. మరొకరిని తొక్కేసి, చంపేసి వాళ్ల నుంచి రాజ్‌ను దక్కించుకోవడం కరెక్ట్ కాదని అంటాడు. నీకోసం కోటి రూపాయలే కాదు.. ఇంకా ఎంతైనా ఇస్తానని చెప్పి వెళ్లిపోతాడు రఘునాథ్. ఇంతలో రుద్రాణి వచ్చి ఏం జరిగినా సరే ఈ పెళ్లిని ఆపుతానని యామినితో అంటుంది. యామిని పెళ్లికి కావ్య రెడీ అయి వస్తుండగా స్వప్న ఎదురవుతుంది. ఇంతలో రాజ్ వచ్చి కావ్యని చూసి పాట పాడతాడు.


Click it and Unblock the Notifications











