Brahmamudi June 18th Episode: మద్యం మత్తులో ఐశ్వర్యకి దొరికిపోయిన రాజ్.. ప్రమాదంలో ఇందూ

Photo Courtesy: JioHotstar

ఇందూ- రాజ్‌లు వేరు వేరుగా పడుకోవడం, తిట్టుకోవడం చూసిన ఐశ్వర్య వీరిద్దరికీ నిజంగానే పెళ్లి జరిగిందా? లేక నాటకాలు ఆడుతున్నారా అని డౌట్ పడుతుంది. వెంటనే వెళ్లి రేఖ దగ్గరికి వెళ్లి రాజ్- ఇందూల తీరుపై నాకు అనుమానంగా ఉందని చెప్పి రేఖని రాజ్ గదిలోకి తీసుకొస్తుంది. అయితే అక్కడ చాప లేకపోవడంతో ఐశ్వర్యపై మండిపడుతుంది రేఖ. వెంటనే ఆమెను తీసుకుని గార్డెన్‌లోకి తీసుకెళ్తుంది. అక్కడ ఇందూని రాజ్ బుజ్జగిస్తూ, పాటలు పాడుతూ ఉంటాడు. వాళ్లిద్దరూ నిజంగా భార్యాభర్తలే ఇంకోసారి ఇలాంటి వేషాలు వేయొద్దని ఐశ్యర్యకి రేఖ వార్నింగ్ ఇస్తుంది.

రాజ్- ఇందూల మధ్య ఏదో జరుగుతోంది.. అదేంటో తెలుసుకోవాలని వెంటనే లక్కీకి ఫోన్ చేసి పిలిపిస్తుంది. అతనితో ప్రేమగా ఉన్నట్లు నటిస్తూ.. రాజ్- ఇందూల పెళ్లి గురించి అడుగుతుంది. రాజ్‌గాడికి పెళ్లయ్యిందని నాకు ఎవరో చెబితేనే తెలిసిందని అంటాడు లక్కీ. రాజ్ గురించి, అతని ప్రవర్తన గురించి నేను తెలుసుకోవాలి.. వాడు నా చెల్లెలికి అన్యాయం చేయకూడదని నటిస్తుంది ఐశ్వర్య. రాజ్‌కి ఫోన్ చేసి సిట్టింగ్ వేసి నిజాలు రాబట్టమని చెబుతుంది. దాంతో రాజ్‌కి లక్కీ ఫోన్ చేసి సిట్టింగ్ వేద్దామని పిలుస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 18వ తేదీ ఎపిసోడ్ 1062లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial June 18th 2026 Episode 1062 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

వెంకీ కాలికి చలపతి, లక్ష్మీలు వెన్న రాస్తారు. ఈ కష్టాలు ఎక్కువ రోజు ఉండవు.. త్వరలోనే మంచి జాబ్ వస్తుందని చెబుతాడు వెంకీ. నువ్వు చేస్తున్నది మంచి జాబ్ కాదా? అని చలపతి ప్రశ్నించగా.. నేను ఇప్పుడు ఏఐ టెక్నాలజీ మీద కోచింగ్ తీసుకుంటున్నాను కదా? అది పూర్తయితే మంచి జాబ్ వస్తుందని కవర్ చేస్తాడు వెంకీ. రాజ్ వద్దన్నా వినిపించుకోకుండా ఎక్కువగా పీకలదాకా మందు తాగిస్తాడు లక్కీ. నీకు నా ఫ్రెండ్‌షిప్ కంటే మీ అత్తారింటి వాళ్లు, మీ ఆవిడే ఎక్కువైపోయారని అంటాడు లక్కీ. నేను అక్కడికి వెళ్లిపోవడం వల్ల నిన్ను కొంచెం దూరం పెట్టాల్సి వచ్చింది. నీకంటే నీ ఫ్రెండ్‌షిప్ కంటే ఎవ్వరూ ఎక్కువ కాదని చెబుతాడు రాజ్.

నీ లైఫ్‌లో ఉన్న ట్విస్ట్‌లు మామూలివి కాదని అంటాడు లక్కీ. మనవి మిడిల్ క్లాస్ జీవితాలు.. ఏ ట్విస్ట్‌లు, మిరాకిల్స్ ఏం ఉండవని చెబుతాడు రాజ్. నీ పెళ్లి పెద్ద మిరాకిల్ కదా? మనం డబ్బు కోసం ఒకమ్మాయిని కిడ్నాప్ చేయడం ఏంటీ? మీ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడం ఏంటీ? మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఏంటీ? ఆ అమ్మాయి ఎలా ఒప్పుకుంది? అసలు ఆ ఇంట్లో వాళ్లని ఎలా కన్విన్స్ చేశావని అడుగుతాడు లక్కీ. ఇదంతా చూస్తుంటే నీకు మిరాకిల్‌గా అనిపించడం లేదా? అని ప్రశ్నిస్తాడు. నీకు నిజం తెలియదు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది.. నాకు తెలుసు కాబట్టి నాకేం అనిపించడం లేదని చెబుతాడు రాజ్.

అసలు ఇందూతో నాకు పెళ్లే జరగలేదు. మా పెళ్లి అనేది అబద్ధం, నిజాలు చేదుగా ఉంటాయని అంటాడు రాజ్. నీకు పెళ్లి కాలేదు అంటున్నావు, కానీ మీరిద్దరూ భార్యాభర్తలుగా ఉంటున్నారు కదా అని అడుగుతాడు లక్కీ. నువ్వు, నీలాంటి వాళ్లు, వాళ్లింట్లో వాళ్లు.. అందరూ మా ఇద్దరినీ భార్యాభర్తలు అనుకోవాలనే అలా నటిస్తున్నామని చెబుతాడు రాజ్. అసలు అలా నటించాల్సిన అవసరం ఏంటీ? నువ్వు వాడికి భర్తగా, ఆమె నీకు భార్యగా ఎందుకు నటించాలని అనుకుంటున్నారు అని ప్రశ్నిస్తాడు లక్కీ.

అవసరాల కోసం మనుషులు రకరకాల పాత్రలు వేస్తుంటారు. అందులో నేను వేస్తున్న పాత్ర పేరు అద్దె మొగుడు. ఆ పాత్రకి పేమెంట్ ఎక్కువ వస్తుందని చెబుతాడు రాజ్. నేను డబ్బులు తీసుకుని అద్దె మొగుడు పాత్ర పోషిస్తున్నానని చెబుతుంది. మరి ఆ ఇందూ ఎందుకు ఇలా చేస్తోందని లక్కీ అడగ్గా.. ఆ ఇందూకి ఇష్టం లేని పెళ్లి చేస్తుండటంతో దాని నుంచి తప్పించుకోవడానికి నాతో ఇలా నాటకం వేయించిందని చెబుతాడు రాజ్.

ఆ మాటలు విన్న ఐశ్వర్య షాక్ అవుతుంది. నీకు అన్ని అనుమానాలు క్లియర్ అయ్యాయా? నువ్వు తప్పించి నాకు ఈ ప్రపంచంలో ఎవడూ లేడని చెబుతాడు రాజ్. ఈ మాటలన్నీ వీడియో తీసిన ఐశ్వర్య.. ఇప్పుడు దొరికావురా, ఇన్ని రోజులు ఇందూతో కలిసి ఎన్ని డ్రామాలు ఆడావు.. ఇద్దరూ కలిసి నన్ను ఎంత టార్చర్ పెట్టారు. మీ మొగుడు పెళ్లాలకి సెపరేట్ రూమ్ కావాలని నా రూమ్ కబ్జా చేస్తారా? మిమ్మల్ని ఈజీగా వదలను.. ఈసారి ఆంటీకి మాత్రమే కాదు, అందరికీ తెలిసేలా పార్టీలో ఈ వీడియో బయటపెడతానని అనుకుంటుంది.

ఉదయాన్నే వెంకీకి ఓనర్ ఫోన్ చేసి టైంకి రమ్మని చెబుతాడు. ఏసీలో కూర్చొని హాయిగా పనిచేసుకునే వాడిని.. అలాంటిది ఇలా అయిపోయింది బతుకు అనుకుని బాధపడతాడు వెంకీ. కంగారుగా బయటికి వెళ్తున్న కొడుకుని చూసి అసలు నువ్వు చేసేది సాఫ్ట్‌వేర్ జాబేనా? అని అడుగుతాడు చలపతి. ఆ మాటలు విన్న వెంకీ షాక్ అవుతాడు. కొత్త జాబ్ కదా? ఇది కూడా పోతుందని భయంగా ఉందని అలా ఉన్నానని అంటాడు వెంకీ. మన కోసం వాడు చాలా కష్టపడుతున్నాడని లక్ష్మీ అంటుంది. చిన్నోడు ఇంత కష్టపడుతుంటే.. పెద్దోడు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదని మండిపడతాడు చలపతి.

పార్టీకి రెడీ అవుతున్న రాజ్‌కి చలపతి పదే పదే ఫోన్ చేయగా పక్కనే ఇందూ ఉండటంతో కట్ చేస్తాడు. మీ నాన్న అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేసి మాట్లాడమని చెబుతుంది ఇందూ. మీ అమ్మానాన్నలు నీలాగా డబ్బు మనుషులు కాదు.. చాలా మంచి వాళ్లు అంటుంది ఇందూ. నువ్వు జీరో బడ్జెట్‌లో పెళ్లిరోజు సెలబ్రెట్ చేశావని మా ఇంట్లో వాళ్లు సంబరపడిపోతున్నారు. ఇప్పుడు నీ గురించి తెలిస్తే .. ఈ అద్దె మొగుడు కాస్తా, నీ మొగుడు అయిపోతాడని అంటాడు రాజ్. మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి తెలుసు.. ఆయన నన్ను సాధించడమే పనిగా పెట్టుకున్నాడని అంటాడు. వెంకీ ఎంతో కష్టపడి డెలివరీలు చేసేస్తాడు. కానీ అన్నం పాడైపోవడంతో బాక్స్ మొత్తం కడిగేసి నీళ్లు తాగి కడుపు నింపుకుంటాడు. ఇదంతా చూసిన నందూ బాధపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X