Brahmamudi June 19th Episode: అప్పూకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన యామిని.. రాజ్ నిర్ణయంతో కావ్య మనసు ముక్కలు

Photo Courtesy: JioHotstar

నిశ్చితార్ధం పూర్తి కావడంతో యామిని- రాజ్‌లకు మెహందీ ఫంక్షన్‌కు ఏర్పాట్లు చేస్తారు. వైదేహి వచ్చి రాజ్‌ను మెహందీ పెట్టమని అడుగుతుంది. రాజ్ ఆ యామినికి మెహందీ పెట్టడం చూడలేనని అప్పూతో చెబుతుంది. ఈ మెహందీ కార్యక్రమం జరగదని జరిగేది చూస్తూ ఉండమని అంటుంది అప్పూ. ఆ వెంటనే కానిస్టేబుల్‌.. ఆ కిల్లర్‌ను తీసుకుని యామిని ఇంటికి తీసుకుని వస్తాడు. మేం చెప్పినట్లు చేస్తేనే నువ్వు ఈ కేసులో నుంచి బయటపడతావని చెబుతాడు కానిస్టేబుల్.

రాజ్ మెహందీ పెడుతున్న సమయంలో యామినికి కిల్లర్ ఫోన్ చేసి తాను బయటే ఉన్నానని చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. మెహందీని పక్కనపెట్టి కిల్లర్‌తో మాట్లాడటానికి వెళ్తుంది యామిని. తాను దేశం విడిచి వెళ్లిపోతానని తనకు కోటి రూపాయలు ఇవ్వాలని లేదంటే మీరే రాజ్- కావ్యల మీద అటాక్ చేయించారని చెబుతానని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. వీరిద్దరి మాటలను అప్పూ- కళ్యాణ్‌లు చాటుగా వింటారు. కావ్యని చంపమని ఎందుకు సుపారీ ఇచ్చావంటూ యామినిపై రఘునాథ్ క్లాస్ పీకుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 19వ తేదీ ఎపిసోడ్ 752లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial June 19th 2025 Episode 752 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

మీ అమ్మగారు వచ్చి నీ గురించి కొన్ని విషయాలు చెప్పారని కావ్యతో అంటాడు రాజ్. మా అమ్మ మాటలు నమ్మొద్దని.. ఆవిడ ఎక్కువ అబద్ధాలే చెబుతుందని అంటుంది కావ్య. ఏ తల్లైనా తన బిడ్డ భవిష్యత్ బాగుండాలనే అబద్ధం చెబుతుందని, బిడ్డ గురించి మాత్రం ఎప్పటికీ అబద్ధాలు చెప్పదని అంటాడు రాజ్. ఇంతలో యామిని వచ్చి సంగీత్‌కు టైమ్ అవుతోందని చెబుతుంది. కావ్యకి సారీ చెప్పి నీ నుంచి మా బావని తీసుకెళ్లిపోతున్నానని అంటుంది. నువ్వు ఎక్కడికి తీసుకెళ్లినా తిరిగి ఆయన నా దగ్గరకే వస్తారని మనసులో అనుకుంటుంది కావ్య.

రాహుల్- రుద్రాణిలకు స్వప్న ఎదురై కోపంగా చూస్తుంటారు. మీ కోసం ఇంటి దగ్గర చాలా సేపు ఎదురు చూశానని మీరు కనిపించకపోవడంతో పెళ్లికి వెళ్లిపోయారేమోనని నేను వచ్చేశానని అంటుంది స్వప్న. కానీ ఇక్కడికి వచ్చాక మీరు ఎక్కడా కనిపించలేదని చెబుతుంది. ఓవరాక్షన్ చేయొద్దని, మేం గదిలో ఇరుక్కుపోయేలా చేసింది నువ్వేనని మాకు తెలుసని రాహుల్- రుద్రాణి అంటారు. అసలు నీలాంటి నెగిటివ్ మనుషుల్ని ఇలాంటి కార్యక్రమాల దారిదాపుల్లోకి కూడా రానివ్వకూడదని అంటుంది స్వప్న. కానీ ఏం చేస్తాం పంది కొక్కుల్లా కన్నాలు వేసుకుని మరీ వచ్చేశారని సెటైర్లు వేస్తుంది. వచ్చామా? తిన్నామా? వెళ్లామా? అన్నట్లుగా ఉండాలని.. అలా కాదని తోకలు జాడించాలని చూస్తే కట్ చేస్తానని వార్నింగ్ ఇస్తుంది స్వప్న.

అప్పూ కోసం అపర్ణ, ఇందిర, కనకం వెయిట్ చేస్తుంటారు. అన్ని ఏర్పాట్లు చేసేశానని, ఆ కిల్లర్ ఫోన్ చేస్తే చాలని అంటుంది అప్పూ. ఇంతలో అప్పూకి కిల్లర్ ఫోన్ చేసి రెడీగా ఉన్నట్లు చెబుతాడు. నేను చెప్పిన చోట డబ్బులు తీసుకోవాలని.. నేను ఎప్పుడు చెబితే అప్పుడే ఆ యామినికి కాల్ చేయాలని అంటుంది అప్పూ. ఇంతలో సంగీత్ కార్యక్రమం మొదలై ప్రకాశం- ధాన్యలక్ష్మీలు డ్యాన్స్ వేసి అలరిస్తారు. ఆ వెంటనే అప్పూ- కళ్యాణ్‌లు కూడా డ్యాన్స్ చేస్తారు. మరోవైపు.. యామినికి ఆ కిల్లర్ పదే పదే ఫోన్ చేస్తుండటంతో ఆమె కంగారు పడుతుంది.

నాకు ఫ్లైట్‌కి టైం అయిపోతోందని, నేను త్వరగా వెళ్లాలని కిల్లర్ చెబుతాడు. డబ్బులు తీసుకుని మీరు బయటికి వస్తారా? లేక నన్నే లోపలికి రమ్మంటారా? అని యామినిని బెదిరిస్తాడు. లోపలికి వస్తే చంపేస్తానని.. బయటే వెయిట్ చేయమని అంటుంది యామిని. డబ్బు కోసం వెళ్లిన వాళ్లు ఇంకా రాలేదని కొంచెం వెయిట్ చేయమని చెబుతాడు రఘునాథ్. అందరి వంతూ అయిపోయిందని.. ఇంకా డ్యాన్స్ చేయాల్సింది ఎవరు అని ఇందిర అడుగుతుంది. రామ్- యామినిని డ్యాన్స్ చేయమని ఇందిర చెప్పడంతో యామిని కంగారు పడుతుంది. నేను బావతో డ్యాన్స్ చేస్తే ఆ కిల్లర్ గాడు లోపలికి వస్తాడని అంటుంది.

డ్యాన్స్ చేయమంటే అలా కంగారు పడతావేంటీ అని అడుగుతుంది అపర్ణ. మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలు కదా డ్యాన్స్ చేస్తే సూపర్‌గా ఉంటుంది అని చెబుతుంది అపర్ణ. ఇప్పుడు నాకు టైం లేదు.. తర్వాత చేస్తానని యామిని తప్పించుకుంటుంది. అదేం కుదరదు ముంద మీరు చేయాలి, ఆ తర్వాతే అందరూ చేస్తారని అంటుంది ఇందిర. ఇంతలో యామినిని అప్పూ బలవంతంగా స్టేజ్ మీదకి లాక్కొస్తుంది. నేను ఇప్పుడు డ్యాన్స్ చేయలేనని వెళ్లిపోతుంది యామిని. ఆమె కంగారు చూసి ఇందిర, అపర్ణలు నవ్వుకుంటారు.

రామ్- యామిని కలిసి డ్యాన్స్ చేస్తారనుకుంటే యామిని వెళ్లిపోయిందని.. మరి ఇప్పుడు రామ్ ఎలా డ్యాన్స్ చేస్తాడని స్వప్న అడుగుతుంది. యామిని లేకపోతే ఏముంది నా మనవరాలు కళావతితో కలిసి డ్యాన్స్ చేస్తుందని అంటుంది ఇందిర. ఆయన పక్కన నేను డ్యాన్స్ చేయనని, పరాయి మగాడితో డ్యాన్స్ చేయడం ఏంటని ప్రశ్నిస్తుంది కావ్య. నా మనవడితో డ్యాన్స్ చేస్తే నలుగురూ ఏమనుకుంటారనే కదా? అన్న ఇందిర .. కావ్యని బలవంతంగా స్టేజ్ మీదకి పంపిస్తుంది. ఇంతలో రఘునాథ్‌ చేతికి డబ్బులు అందడంతో యామినికి ఇస్తాడు. వాటిని తీసుకుని కిల్లర్‌కి ఇస్తుంది యామిని.

టైం కోసం ఎదురుచూస్తున్న అప్పూ- కళ్యాణ్‌లు వారిద్దరిని వీడియో తీస్తారు. నీ డబ్బు నీకు ఇచ్చేశాను కదా? ఇంకోసారి ఇటువైపు వచ్చావంటే చంపేస్తానని కిల్లర్‌కు వార్నింగ్ ఇస్తుంది యామిని. నాకు రావాల్సింది నాకు వచ్చింది కదా? మీ కంటికి కూడా కనిపించనని చెప్పి కిల్లర్ వెళ్లిపోతాడు. ఇంతలో అప్పూ- కళ్యాణ్‌లను చూసిన యామిని షాక్ అవుతుంది. ఏదో తప్పు చేసినట్లు మమ్మల్ని చూడగానే అలా భయపడి పోతున్నారేంటీ అని అడుగుతుంది స్వప్న. మీ ముఖం మీద ఆ చెమటలు ఏంటీ? అని కళ్యాణ్ నిలదీస్తాడు. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పమని మా అప్పూ పోలీస్ అని హెల్ప్ చేస్తుందని చెబుతుంది స్వప్న. నాకు మీ సాయం అక్కర్లేదని కోపంగా వెళ్లిపోతుంది యామిని.

సంగీత్ కార్యక్రమం ముగిసిన తర్వాత కావ్య- రాజ్‌లు మాట్లాడుకుంటూ ఉంటారు. తెల్లారితే యామిని మెడలో నేను తాళి కడతానని, మీకు దూరంగా వెళ్లాల్సి వస్తుందిని గుర్తొచ్చినప్పుడల్లా మనసులో ఏదో తెలియని బాధ అని చెబుతాడు రాజ్. మనం ఇష్టపడ్డ మనిషికి దూరంగా వెళితే ఎంత బాధగా ఉంటుందో ఇప్పుడే అర్ధమవుతుందని చెబుతాడు. రాజ్ మాటలతో కావ్య కంటతడి పెడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X