Brahmamudi June 19th Episode: రేఖతో సీతారామయ్య ఫోటోకి మొక్కించిన రాజ్... ఐశ్వర్య చేతిలో ఇందూకి గండం
Photo Courtesy: JioHotstar
వెంకీ కాలికి చలపతి, లక్ష్మీలు వెన్న రాస్తారు. త్వరలోనే మంచి జాబ్ వస్తుంది.. ఈ కష్టాలు ఎక్కువ రోజులు ఉండవని అంటాడు వెంకీ. అయితే నువ్వు చేస్తున్నది సాఫ్ట్‌వేర్ జాబ్ కాదా? అని చలపతి అడగ్గా.. ఏఐ టెక్నాలజీ నేర్చుకుంటున్నాను కదా మంచి జాబ్ వస్తుందని చెబుతాడు వెంకీ. చిన్నోడు మన కుటుంబం కోసం ఎంతో కష్టపడుతున్నాడు, కానీ పెద్దోడు మాత్రం బిజినెస్ బిజినెస్ అంటూ తిరుగుతున్నాడని చలపతి బాధపడతాడు. మందు పార్టీకి రాజ్‌ని పిలిచిన లక్కీ.. అతని నుంచి ఇందూతో పెళ్లి ఎలా జరిగిందో నిజాలు రాబడతాడు.
మా ఇద్దరికీ పెళ్లి కాలేదు.. నేను తనకి అద్దె మొగుడిగా నటిస్తున్నాను, ఇందుకు డబ్బులు కూడా తీసుకుంటున్నానని రాజ్ చెప్పడంతో లక్కీ, ఐశ్వర్యలు షాక్ అవుతారు. ఇంట్లో వాళ్లు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, దాని నుంచి తప్పించుకోవడానికి నాతో పెళ్లయినట్లుగా ఇందూ నాటకం ఆడిందని రాజ్ చెబుతాడు. ఈ మాటలన్నీ ఫోన్‌లో రికార్డ్ చేసిన ఐశ్వర్య.. ఈ విషయం పార్టీలో బయటపెట్టాలని అనుకుంటుంది. పార్టీ కోసం రెడీ అవుతున్న రాజ్‌కి చలపతి పదే పదే ఫోన్ చేస్తాడు. కానీ రాజ్ మాత్రం ఫోన్ కట్ చేస్తూనే ఉంటాడు. ఇది గమనించిన ఇందూ.. రాజ్‌కి క్లాస్ పీకుతుంది. మా నాన్న సాధించడానికే ఫోన్ చేస్తున్నాడు.. చిన్నప్పటి నుంచి అలవాటేనని అంటాడు రాజ్. రోజంతా ఫుడ్ డెలవరీలు చేసి చేసి వెంకీ అలసిపోతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 19వ తేదీ ఎపిసోడ్ 1063లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
డెలివరీలు చేసి చేసి అలిసిపోయి భోజనం చేద్దామని కూర్చొన్న వెంకీకి .. తల్లి పంపిన క్యారియర్ వాసన వస్తుండటంతో నీళ్లు తాగి కడుపు నింపుకుంటాడు. ఇదంతా చూసిన నందూ.. ఛాట్ తిందామని చెబుతుంది. కరెంట్ బిల్లు కట్టకపోవడంతో పవర్ కట్ చేస్తానని కరెంట్ ఆఫీసర్ చలపతికి వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో వెంకీ వచ్చి ఏం జరిగిందో తెలుసుకుని బిల్లు మొత్తం కట్టేస్తాడు. నీకు శాలరీ వచ్చేది ఇప్పుడు కాదు కదా? ఈ డబ్బులు ఎక్కడివి అని అడుగుతాడు చలపతి. నాకు టిప్పు వచ్చిందని వెంకీ చెప్పడంతో లక్ష్మీ - చలపతిలు షాక్ అవుతారు. నువ్వేదో రెస్టారెంట్‌లో బేరర్‌గా పనిచేస్తున్నట్లు మాట్లాడుతున్నావు అని అడుగుతాడు తండ్రి. మా కంపెనీలో మంచి ఐడియా ఇస్తే ఇలా టిప్ ఇస్తుంటారని కవర్ చేస్తాడు వెంకీ. పెద్దోడు కూడా కొంచెం కష్టపడితే చిన్నోడికి బాధలు తగ్గుతాయని అంటాడు చలపతి. అసలు వాడు ఎక్కడున్నాడు అని లక్ష్మీని అడగ్గా.. లక్కీగాడికి తెలిసే ఛాన్స్ ఉందని ఆమె చెప్పడంతో చలపతి సరేనని చెబుతాడు.
ఇందూ కోసం రేఖ ఇచ్చిన పార్టీలో సీతారామయ్య ఫోటో ఉండటం చూసిన రేఖ షాక్ అవుతుంది. ఈ ముసలోడి ఫోటో ఇక్కడ ఎందుకుందని అపర్ణ, ఇందూలని నిలదీస్తుంది. దుగ్గిరాల కుటుంబానికి చెందిన ఏ ఫోటోలు పార్టీలోనే కాదు, ఇంట్లోనే పెట్టడానికి వీల్లేదని చెప్పాను కదా? అయినాసరే పెట్టారంటే నేనంటే భయం పోయిందా? అని మండిపడుతుంది. నేను కానీ, నానమ్మ కానీ ఈ ఫోటో పెట్టలేదని చెబుతుంది ఇందూ. అయితే ఎవరు పెట్టారని అడుగుతుంది రేఖ.
నేనే పెట్టాను.. మంచి పనులు చేయడానికి పర్మిషన్ కావాలా అని కౌంటర్ వేస్తాడు రాజ్. సీతారామయ్య గారు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి ఫౌండర్.. ఈరోజు మనమంతా ఇంత దర్జాగా బతుకుతున్నామంటే దానికి కారణం మా తాతగారే కదా అని అంటాడు. ఈ ఇంట్లో అడుగుపెట్టడానికి ముందే నాకు అన్ని విషయాలు తెలుసు, అందరి విషయాలు తెలుసు. అయినా మనం ఈ పార్టీ పెట్టింది.. కంపెనీ డెవలప్‌మెంట్ కోసమే. అలాంటప్పుడు కంపెనీ ఫౌండర్ అయిన తాతయ్య గారి ఫోటో ఉండాలి కదా అని చెబుతాడు రాజ్.
ఆ ముసలోడిని నీ సొంత తాతయ్యలా ఫీల్ అవుతున్నావా అని రేఖ సీరియస్ అవుతుంది. నాకు కాకపోవచ్చు.. నా పెళ్లానికి సొంత తాతయ్యే కదా అని అంటాడు రాజ్. ఇలాంటివి చేయొద్దని మీరైనా చెప్పాలని అపర్ణపై మండిపడుతుంది రేఖ. ఆ ఫోటో తీసి బయటపడేయమని భ్రమరాంబకు చెబుతుంది. దాంతో రాజ్ వార్నింగ్ ఇస్తాడు. నీ ఆలోచనలు, నీ పనులు బిజినెస్ చేయడానికి అస్సలు పనికిరావు, ఇప్పుడు ఇక్కడికి క్లయింట్స్ అంతా వస్తున్నారు. సీతారామయ్య గారికి పాజిటివ్ ఓపీనియన్ ఉంది కదా? మనకు డీల్స్ కావాలంటే ఆయన ముఖమే చూపించాలని చెబుతాడు రాజ్. బిజినెస్ రన్ కావాలంటే తాతయ్య గారి ఫోటో పార్టీలో ఉండాలని అనిపిస్తోందని ఇందూ కూడా చెప్పడంతో రేఖ షాక్ అవుతుంది.
ఇంతలో క్లయింట్స్ అంతా వచ్చి సీతారామయ్య గారి ఫోటోకి దండం పెడుతూ, ఆయన గురించి చెబుతుండటంతో అపర్ణ, సుభాష్, ఇందూలు సంతోషిస్తారు. ఇప్పటికైనా మీకు డబ్బులు కావాలా? ఇక్కడి నుంచి తాతయ్య ఫోటో తీసేయాలా అని అడుగుతాడు రాజ్. భ్రమరాంబ ఆ ఫోటో తీసేస్తుండగా రేఖే అడ్డుకుంటుంది. నువ్వు కూడా వెళ్లి తాతయ్య ఫోటోకి దండం పెట్టుకో.. క్లయింట్స్ అందరికీ నీ మీద పాజిటివ్ అభిప్రాయం వస్తుందని చెబుతాడు రాజ్. భ్రమరాంబ, శేషం కూడా అదే చెప్పడంతో రేఖ చచ్చినట్లు సీతారామయ్య ఫోటోకి దండం పెట్టుకుంటుంది. ఇదంతా చూసిన అపర్ణ, సుభాష్‌లు చాలా సంతోషించి రాజ్‌కి థ్యాంక్స్ చెబుతారు.
మా నాన్న గారి జ్ఞాపకాలు, నా అనుకున్న వాళ్ల జ్ఞాపకాలు ఏం లేకుండా చేసేసింది ఆ రేఖ.. ఇన్నాళ్లూ మాలో మేమే కుమిలిపోయాం, ఇలా అందరిలో మా నాన్నగారి ఫోటో చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందని రాజ్‌కి సుభాష్ థ్యాంక్స్ చెబుతాడు. ఆ రేఖని రాబోయే రోజుల్లో ఎలా దెబ్బకొడతానో మీరే చూస్తారు కదా అంటాడు రాజ్. లక్కీతో రాజ్ మాట్లాడిన మాటల్ని పార్టీలో అందరి ముందు ప్లే చేయాలని బయల్దేరుతుంది ఐశ్వర్య. ఇందూ ఇచ్చిన ఐడియా బాగుంది.. ఈ పార్టీలో నీ మీద మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, పార్టీకి పెట్టిన ఖర్చు మొత్తం రాబట్టాలని రేఖతో అంటుంది భ్రమరాంబ.
రాజ్, ఇందూలు పార్టీలో క్లయింట్స్ మాట్లాడుకునే మాటల్ని వింటారు. ఇందూ చాలా మంచిది, వాళ్లమ్మగారి లాగే చాలా తెలివైనది. రాజ్- కావ్యల మాదిరిగానే కంపెనీని రన్ చేయాలని అనుకుంటోందని క్లయింట్స్‌కి చెబుతాడు రాజ్. మీరు సపోర్ట్ చేస్తే కంపెనీకి పూర్వ వైభవం వస్తుందని చెప్పడంతో వాళ్లు కూడా సరేనని అంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications