Brahmamudi June 1st Episode: రేఖ టాబ్లెట్ మార్చేసిన భ్రమరాంబ.. ఇందూ అందానికి కంట్రోల్ తప్పిన రాజ్
Photo Courtesy: JioHotstar
తన దగ్గర తీసుకున్న మొత్తం 5 లక్షల రూపాయలు తీర్చమని వడ్డీ వ్యాపారి డెడ్‌లైన్ పెట్టడంతో లక్ష్మీ- చలపతిలు షాక్ అవుతారు. త్వరలోనే బాకీ మొత్తం తీర్చేస్తానని చెబుతాడు చలపతి. అదేం కుదరదు ఇప్పటి వరకు మీ అబ్బాయికి ఉద్యోగం ఉంది కాబట్టి వడ్డీ కట్టారు. ఇకపై ఎలా కడతారని వడ్డీ వ్యాపారి నానామాటలు అంటాడు. ఈ మాటలన్నీ విన్న వెంకీ బాధపడతాడు. ఇందూ- రాజ్‌ల శోభనానికి పెళ్లి ముహూర్తం పెట్టించడానికి పంతులుగారు రావడంతో రేఖ షాక్ అవుతుంది.
ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడు అర్జెంట్‌గా వాళ్ల శోభనం జరిపించడం అవసరమా? అని రేఖ మండిపడుతుంది. నా మనవడు- మనవరాలు కలిసుండటం నీకు ఇష్టం లేనట్లుగా ఉందని సుభాస్ మండిపడతాడు. రాజ్ కూడా తగులుకోవడంతో రేఖ సైలెంట్ అవుతుంది. రాజ్- ఇందూల ఫస్ట్ నైట్ జరగకుండా ఆపుతానని భూషణ్‌తో అంటుంది రేఖ. ఏం జరిగినా సరే వాళ్లిద్దరినీ ఒక్కటి చేస్తానని శేషంతో భ్రమరాంబ చెబుతుంది. భోజనం చేస్తుండగా వడ్డీ వ్యాపారి అన్న మాటలు గుర్తొచ్చి వెంకీ బాధపడుతుండగా కొడుకుని లక్ష్మీ, చలపతిలు ఓదారుస్తారు. నందూ ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా వెంకీ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 1వ తేదీ ఎపిసోడ్ 1047లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఇందూ- రాజ్‌ల ఫస్ట్ నైట్ ఆపడానికి రేఖ ప్లాన్ చేస్తుంది. నిద్రమాత్రలు వేసిన పాలు రాజ్‌కి ఇచ్చేలా ప్లాన్ చేస్తుంది. ఆ టాబ్లెట్ వేయగానే నిద్రపోతాడు, మల్లెపూల మత్తే కాదు ఏనుగులు వచ్చి చెవిలో ఘీంకరించినా లేవలేడు, రేపు 10 గంటల వరకు నిద్రలోనే ఉంటాడని చెబుతాడు భూషణ్. వాళ్ల శోభనం జరగకూడదని నువ్వు అనుకుంటే డైరెక్ట్‌గా చెబితే సరిపోతుంది కదా, నీ మాటకి ఎదురు చెప్పేవాళ్లు ఎవరున్నారు అని అంటాడు భూషణ్. మనం గట్టిగా చెబితే ఒక్కరు కూడా నోరు విప్పేవాళ్లుండరు. కానీ అన్ని పనులు భయపెట్టి చేయాల్సిన పనిలేదు.. సామ దాన భేద దండోపాయాలు ఉంటాయి.
ఆ ఇందూ ఈ శోభనం జరిపించమని బతిమలాడిందని చెబుతుంది రేఖ. ఇందూకి వాడంటేనే ఇష్టం లేదు కదా అని భూషణ్ చెప్పగా.. వాళ్ల నానమ్మ వాళ్లు బాధపడకూడదని ఇందూ ఒప్పుకుంది, అలా అని ఫస్ట్ నైట్ కోసం కాదు, జస్ట్ గదిలోకి వెళ్లడం వరకు మాత్రమే ఒప్పుకుంది. ఆ ఇందూని మన గ్రిప్ప్‌లో పెట్టుకోవాలంటే తను అడిగే చిన్న చిన్న కోరికలు తీర్చాలని అంటుంది రేఖ. భూషణ్ ఇచ్చిన మత్తు టాబ్లెట్‌ని పక్కన పడేసి.. వాడు గుర్రుపెట్టి నిద్రపోయేలా కాదు, గుర్రంలా పరిగెత్తే టాబ్లెట్ వేస్తా. ఈ దెబ్బతో ఇందూకి నెల తిరిగేసరికి కడుపులో కాయ కాయడం, ఇందూ తల్లి కావడం అన్నీ జరిగిపోతాయి. ఆ తర్వాత నువ్వు వాళ్లిద్దరినీ ఎప్పటికీ విడదీయలేదు. ఆ రాజ్ గాడికి ఇందూ పూర్తిగా సొంతమైపోతే నీ కొడుకు మదన్‌కి నా కూతురే దిక్కని అనుకుంటుంది భ్రమరాంబ.
ఇందూని అందంగా రెడీ చేస్తుంది స్వాతి. రాజ్ బావ ఇంటికొచ్చినప్పటి నుంచి నీలో చాలా సంతోషం కనిపిస్తోంది. నువ్వుండే స్థాయి మారింది, నీ స్థానం మారింది. ఎక్కడో స్టోర్ రూమ్‌లో ఉన్న నిన్ను చూసినప్పుడల్లా నాకు చాలా బాధ వేసేది. కానీ ఏం చేయలేకపోయేదానిని.. రాజ్ బావ నీకంటూ ఓ రూమ్ వచ్చేలా చేశాడని అంటుంది స్వాతి. రాజు వచ్చిన తర్వాత నువ్వు చాలా సంతోషంగా ఉంటున్నావని చెబుతుంది అపర్ణ. మీ ఇద్దరి దగ్గరా ఒక నిజం దాచాను, తను కేవలం నాకు అద్దెమొగుడు మాత్రమే.. టైం వచ్చినప్పుడు మీకు విషయం చెబుతానని అనుకుంటుంది ఇందూ.
ఇంతలో భ్రమరాంబ పాలు తీసుకుని రావడంతో అపర్ణ షాక్ అవుతుంది. నేనే పాలు తీసుకురాకూడదా? ఇదేమైనా పెద్ద పనా? అని అంటుంది భ్రమరాంబ. నువ్వు ఇందూ అక్క కోసం ఇంత కష్టపడుతుంటే నాకు డౌట్ వస్తుందని చెబుతుంది స్వాతి. నువ్వు గదిలోకి వెళ్లేటప్పుడు పాలు తీసుకెళ్లు.. మరిచిపోకుండా ఇద్దరూ పాలు తాగమని ఇందూకి భ్రమరాంబ చెబుతుంది. ఇన్నిసార్లు ఈ పాలు గురించి మాట్లాడుతున్నావు.. కొంపతీసి ఇందులో ఏమైనా కలిపావా? అని అపర్ణ డౌట్ పడుతుంది. పంచదార కలిపాను, త్వరగా గదిలోకి తీసుకెళ్లమని చెబుతుంది భ్రమరాంబ.
మరోవైపు.. శేషం కూడా చేతికి మల్లెపూలు చుట్టుకుని డ్యాన్స్ వేస్తుంటాడు. భ్రమరాంబ రాగానే ఆమెతో కలిసి డ్యాన్స్ వేస్తాడు. ఇంతకీ వాళ్లిద్దరికీ శోభనం జరుగుతుందా? లేదా? అని భ్రమరాంబ అడగ్గా.. ఎలా జరుగుతుందో ఊహించి చెబుతాడు శేషం. అక్కడ గదిలో ఉన్న ఫ్రూట్స్, స్వీట్స్, మంచంపై డెకరేషన్ చేసి ఉండటం చూసి సంబరపడిపోతాడు. శోభనం కోసం ఇంత ఖర్చుపెట్టారు.. మాకు పెళ్లి కాలేదని మాకు తెలుసు కానీ, వీళ్లెవరికీ తెలియదు కదా? ఓరేయ్ రాజుగా ఈరోజు నీకు ఫస్ట్ నైట్ అని సంబరపడిపోతుంటాడు. ఇంతకంటే అదృష్టం ప్రపంచంలో ఏ మగాడికి రాదనుకుంటా? అస్సలు రాదు.. పెళ్లి అవ్వకుండానే దానికి మొగుడిని అయ్యాను, ఇప్పుడు పెళ్లి కాకుండానే ఫస్ట్ నైట్ జరగబోతోందని అనుకుంటాడు రాజ్.
ఇంతలో ఇందూ అందంగా రెడీ అయి గదిలోకి రావడంతో రాజ్ సిగ్గుపడుతుంటాడు. పాల గ్లాస్ చేతికి ఇవ్వమని రాజ్ సైగలు చేస్తుండటం చూసిన ఇందూ పాలు తీసుకెళ్లి డస్ట్‌బిన్‌లో పడేస్తుంది. అది చూసిన రాజ్ షాక్ అవుతాడు. పాలు ఎందుకు వేస్ట్ చేశావు? ఎందుకిలా చేశావని మండిపడతాడు రాజ్. మరేం చేయాలని ఇందూ అడగ్గా.. రాజ్ గులాబీ పూలు తీసుకుని సిగ్గుపడతాడు. నువ్వు సిగ్గుపడుతూ నా దగ్గరికి వచ్చి పాలు ఇస్తే పాలు తాగి సగం పాలు నీకు ఇస్తాను, నువ్వు పాలు తాగేసి జీవితాన్ని పాలు పంచుకోవాలని మన పెద్దలు పెట్టిన ఆచారం అంటాడు రాజ్. నీకు ఆచారాల గురించి బాగా తెలుసా? అని ఇందూ అడగ్గా.. అప్పుడప్పుడు నేను ముసలివాళ్ల దగ్గర టైం స్పెండ్ చేసేవాడిని, వాళ్లు అన్ని ఇలాంటి విషయాలే చెప్పేవారని అంటాడు రాజ్.
వెళ్లి మళ్లీ పాలు తీసుకురమ్మని రాజ్ అనగా.. ఇందూ సీరియస్ అవుతుంది. పాలు కాదు ఇంత విషం తీసుకొస్తానని అంటుంది. బయట అందరి ముందు అలా సిగ్గుపడుతున్నట్లు నటించాను, వాళ్లకి ఏ డౌట్ రాకూడదని చెబుతుంది ఇందూ. మరి నాతో ఫస్ట్ నైట్‌కి ఎందుకిలా రెడీ అయ్యావని ప్రశ్నిస్తాడు రాజ్. మా నానమ్మ కోసమని చెబుతుంది ఇందూ. మీ నానమ్మ కోరిక నువ్వు తీరుద్దామని అనుకున్నావా? అందులో రిస్క్ ఉంటే అని రాజ్ అడుగుతాడు. అయినాసరే తీరుస్తానని అంటుంది ఇందూ. మీ నానమ్మ కోరిక తీర్చాలంటే సగం సగం పంచుకుని మనం ఒక్కటవ్వాలని అంటాడు.
ఇందూ వద్దు వద్దు అంటున్నా రాజ్ మీదకి రావడంతో ఆమె కోప్పడుతుంది. మల్లెపూల వాసన చూసి ఒళ్లు పులకరించి పోతోందని అంటాడు రాజ్. వామ్మో వీడెంటీ ఇలా బిహేవ్ చేస్తున్నాడని భయపడుతుంది ఇందూ. ముట్టుకుంటే కందిపోయేలా ఉన్నావు.. నీ కళ్లలో ఏదో మాయ ఉంది, చూస్తుంటే మత్తు ఎక్కేస్తుందని ఐ లవ్ యూ చెబుతాడు రాజ్. దాంతో ఇందూ షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications