Brahmamudi June 20th Episode: అప్పూ ప్లాన్ లీక్ చేసిన రుద్రాణి .. అరెస్ట్ తప్పించుకునేలా యామిని స్కెచ్
Photo Courtesy: JioHotstar
కావ్యకి రాజ్ తన మనసులోని మాటను చెప్పబోతుండగా యామిని వచ్చి అడ్డుకుంటుంది. పెళ్లికి స్వప్నకి రాహుల్- రుద్రాణిలు ఎదురై మమ్మల్ని గదిలో పెట్టి లాక్ చేసింది నువ్వేనని మాకు తెలుసని అంటారు. కిల్లర్ రఘుకి అప్పూ ఫోన్ చేసి యామినితో ఏం మాట్లాడాలో? ఎలా మాట్లాడాలో చెబుతుంది. సంగీత్ కార్యక్రమం మొదలవ్వగానే యామినికి ఫోన్ చేస్తాడు కిల్లర్. ఎంతమంది చెప్పినా రాజ్‌తో కలిసి డ్యాన్స్ వేయకుండా టెన్షన్‌గా బయటికి వెళ్లిపోతుంది యామిని.
రఘు అడిగిన కోటి రూపాయల డబ్బును అతనికి యామిని ఇస్తుండగా అప్పూ- కళ్యాణ్‌లు దానిని వీడియో తీస్తారు. వారిని చూసిన యామిని టెన్షన్ పడుతుంది. యామిని లేకపోవడంతో రామ్‌తో కలిసి బలవంతంగా కావ్యని నిల్చోబెట్టి డ్యాన్స్ చేయిస్తుంది దుగ్గిరాల ఫ్యామిలీ. సంగీత్ కార్యక్రమం ముగియగానే కావ్యతో ఏకాంతంగా మాట్లాడతాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 20వ తేదీ ఎపిసోడ్ 753లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
మనకు ఇష్టమైన వారు దూరంగా ఉంటే ఆ బాధ తట్టుకోలేమని కావ్యతో చెబుతాడు రాజ్. ఒక్కోసారి నా గుండె కొట్టుకోవడం ఎక్కడ ఆగిపోతుందోనని భయం వేస్తుందని అంటాడు. మీకు అలాంటిదేం అనిపించడం లేదా అని అడుగుతాడు. ఈ ఫీలింగ్స్ అన్ని నాకు ఒక్కడికే కలుగుతున్నాయా? లేక మీకు కూడా అలాగే ఉందా అని అంటాడు. లోలోపల బాధగా ఉన్నా పైకి నటిస్తున్నారు కదూ అని అంటాడు రాజ్. తెల్లారితే పెళ్లి పెట్టుకుని ఓ ఆడపిల్లని ఒంటరిగా పిలిచి ఇలాంటి మాటలు మాట్లాడతారా అని కావ్య ఫైర్ అవుతుంది. మీరు పెళ్లి చేసుకుంటుంటే నాకెందుకు బాధగా ఉంటుంది అని ప్రశ్నిస్తుంది.
యామినికి మాట ఇచ్చింది మీరు.. తనను పెళ్లి చేసుకుంటానని నిర్ణయం తీసుకుంది మీరు అని అంటుంది. నిర్ణయాలన్నీ మీరు తీసుకుని నన్ను ప్రశ్నిస్తారా అని కావ్య రగిలిపోతుంది. మీకు ఏం కావాలో మీకే క్లారిటీ లేకపోతే నేనేం చేస్తానని అంటుంది. మన గమ్యం సరిగా ఉన్నప్పుడే ప్రయాణం బాగుంటుందని, ఏదో ఒక దారిలో వెళ్తున్నాం కదా అని ట్రావెల్ చేస్తే జంక్షన్ వచ్చినప్పుడు ఇలాంటి కన్‌ఫ్యూజనే వస్తుందని చెబుతుంది. నా లైఫ్‌లో నాకేం కావాలో ఓ క్లారిటీ ఉందని, మీరు మీ మనసును అడిగి ఓ క్లారిటీ తెచ్చుకోండి అని అంటుంది కావ్య. ఆమె మాటలతో రాజ్ బాధపెడతాడు.
అపర్ణ, కనకం, ఇందిరలు కూర్చోని మాట్లాడుకుంటూ ఉండగా రుద్రాణి చూసి రాహుల్‌తో చెబుతుంది. ఇంతలో కళ్యాణ్ - అప్పూ రావడంతో వెళ్లినపని ఏమైందని అడుగుతుంది ఇందిర. మనం అనుకున్నట్లుగా ప్లాన్ సక్సెస్ అని కళ్యాణ్ చెబుతాడు. ఆ యామిని రౌడీకి డబ్బులు ఇస్తున్నప్పుడు సాక్ష్యం దొరికిందని చెప్పడంతో ఈ మాటలు విన్న రుద్రాణి షాక్ అవుతుంది. ఆ సాక్ష్యాన్ని కళ్యాణ్ తన ఫోనులో వీడియో కూడా తీశాడని స్వప్న చెబుతుంది. తర్వాత కళ్యాణ్ ఆ వీడియోను అందరికీ చూపిస్తాడు. ఈ సాక్ష్యంతో ఆ యామిని పీడ వదిలిపోతుందని చెబుతుంది అప్పూ. అరెస్ట్ చేసి లోపల వేశామంటే జీవితాంతం జైళ్లోనే చస్తుందని అంటుంది.
ఆ యామిని ఎవరికి దొరక్కూడదో డైరెక్ట్‌గా వాళ్లకే దొరికిందని రుద్రాణితో అంటాడు రాహుల్. ఆ అప్పూకి ఏ సాక్ష్యం దొరక్కపోతేనే వదిలిపెట్టదని, అలాంటిది ఇంత స్ట్రాంగ్‌గా సాక్ష్యం దొరికాక ఎలా వదిలిపెడుతుందని ప్రశ్నిస్తాడు. ముందు ఈ విషయాన్ని అర్జెంట్‌గా వెళ్లి యామినికి చెప్పాలని అంటుంది రుద్రాణి. సాక్ష్యం దొరికాక ఇంకా సైలెంట్‌గా ఉంటావేంటీ వెళ్లి ఆ యామినిని అరెస్ట్ చేయమని అప్పూతో అంటుంది కనకం. ఆ పని వెంటనే చేయలేనని, మా డిపార్టెంట్‌మెంట్‌కి ఓ ప్రొసిజర్ ఉంటుందని దాని ప్రకారమే అరెస్ట్ చేయాలని చెబుతుంది అప్పూ. ఆ మాటలతో కనకం, ఇందిర, అపర్ణలు షాక్ అవుతారు. మరి ఆ యామినిని ఎప్పుడు అరెస్ట్ చేస్తావని అడుగుతుంది కనకం.
ఆ కిల్లర్ .. యామిని నుంచి డబ్బులు తీసుకుని పారిపోతుండగా ఎయిర్‌పోర్ట్‌లో వాడిని అరెస్ట్ చేస్తామని అంటుంది. ఆ తర్వాత వాడిని మా స్టైల్‌లో ఎంక్వైరీ చేస్తే ఆ యామిని పేరు బయటపెట్టినట్లుగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వారెంట్ తీసుకోవాలని చెబుతుంది అప్పూ. ఈసారి మాత్రం ఆ యామిని లైఫ్‌లో బయటికి రాకుండా చేయమని అప్పూతో అంటుంది ఇందిర. అలాగే చేస్తానని మీరేం టెన్షన్ పడొద్దని, అక్కాబావని నేను కలుపుతానని చెబుతుంది అప్పూ.
అప్పూ ప్లాన్ గురించి యామినికి చెబుతారు రుద్రాణి- రాహుల్. నువ్వు ఆ రౌడీకి డబ్బులు ఇస్తుండగా వాళ్ల దగ్గర వీడియో సాక్ష్యం కూడా ఉందని చెబుతాడు రాహుల్. ఇప్పుడేం చేద్దాం? అరెస్ట్ కాకుండా ఎలా ఆగుతావని అడుగుతుంది రుద్రాణి. ఏం చేయొద్దని, వాళ్ల ప్లాన్‌కి అడ్డుతగలొద్దని.. అప్పూ ప్లాన్‌కి ఎలా కౌంటర్ వేయాలో నాకు తెలుసని అంటుంది యామిని. ఆమె మాటలతో రాహుల్- రుద్రాణి షాక్ అవుతారు. ఆ ప్లాన్ ఏంటో మాకు కూడా చెబితే మేం జాగ్రత్తగా ఉంటామని రాహుల్ అడగ్గా.. నా ప్లాన్స్ నాకు ఉన్నాయి, టైం వచ్చినప్పుడు నేనే చెబుతానని అంటుంది యామిని. ప్రస్తుతానికి వాళ్ల ప్లాన్ గురించి మీరేం వినలేదు.. నాకేం చెప్పలేదు మీరు సైలెంట్‌గా ఉంటే చాలని అంటుంది యామిని.
పెళ్లి పనుల దగ్గర అన్ని దగ్గరుండి చూసుకుంటున్న కావ్యని యామిని తండ్రి రఘునాథ్ చూస్తాడు. కానీ కావ్య ఆయనను పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. ఎప్పుడూ కళావతి అని పిలిచే మీరు ఈసారి కావ్య అని ఎందుకు పిలుస్తున్నారని అడుగుతుంది. అలా పిలిస్తే మీ కూతురి జీవితానికి ప్రమాదమని, ఈ మాట మీ అల్లుడు వింటే ఈ పెళ్లి కూడా ఆగిపోతుందని అంటుంది కావ్య.
ఈ పెళ్లి ఆగిపోకూడదనే నీ దగ్గరికి వచ్చానని.. చిన్నప్పటి నుంచి నా కూతురుని అతి గారాభంగా పెంచానని అడిగిన ప్రతిదానిని ఇచ్చానని కానీ ఈసారి ఇంకో ఆడపిల్ల మంగళసూత్రాన్ని అడిగిందని అంటాడు రఘునాథ్.
అది తప్పని తెలిసినా నా కూతురు సంతోషం కోసం చేయక తప్పడం లేదని వీలైతే నన్ను క్షమించమని చెబుతాడు. పశ్చాత్తాపంతో వచ్చారు అనుకున్నా నన్ను రిక్వెస్ట్ చేయడానికి వచ్చారా అని కావ్య ప్రశ్నిస్తుంది. మీ కూతురు ఎక్కడ బాధపడుతుందోనని ఓ తండ్రిగా ఆలోచించిన మీరు ఇంకో ఆడపిల్లకు అన్యాయం చేస్తున్నానని ఎందుకు అనుకోవడం లేదని అడుగుపెడుతుంది. నేను ఎట్టి పరిస్ధితుల్లోనూ ఈ పెళ్లిని ఆపనని అదే ఆగిపోతుందని కానీ మీ స్వార్ధానికి మాత్రం శిక్ష పడుతుందని అంటుంది కావ్య.
రాజ్‌ని రెడీ చేస్తుండగా కళ్యాణ్ బాధపడతాడు. ఈలోగా కావ్య వచ్చి బాసికం కట్టమని ఇస్తుంది. ఇంతలో అపర్ణ, కనకం, ఇందిరలు రావడంతో మీ మనవరాలు ప్రవర్తన నాకేం నచ్చడం లేదని అంటాడు రాజ్. ఈ పెళ్లి ఎట్టి పరిస్ధితుల్లోనూ జరగదని ఖచ్చితంగా ఆగిపోతుందని రాజ్‌తో కనకం అంటుంది. పెళ్లి పీటల మీదకు వెళ్తుండగా యామినికి కావ్య ఎదురొస్తుంది. యామిని - రాజ్‌లు పెళ్లి పీటల మీద కూర్చోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ బాధపడుతుంది. వాళ్లని రాహుల్ - రుద్రాణిలు చూస్తారు . మనం ఈ పెళ్లికి సపోర్ట్ చేస్తున్నట్లు కాకుండా రాజ్ - కావ్యల జీవితం నాశనం అయిపోతున్నట్లు నటించాలని రాహుల్‌తో అంటుంది రుద్రాణి. మనం వెళ్లి చెప్పినా వాళ్లు నమ్మరని అంటాడు రాహుల్. అయినప్పటికీ రుద్రాణి వెళ్లి ఇందిర, అపర్ణల ముందు ఏడుస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










