Brahmamudi June 20th Episode: దుగ్గిరాల వారి పార్టీకి చలపతి- లక్ష్మీ... రాజ్‌పై రేఖలో అనుమానం

Photo Courtesy: JioHotstar

రోజంతా డెలివరీలు చేసి చేసి అలిసిపోయిన వెంకీ భోజనం చేద్దామని కారియర్ తీసేసరికి అది వాసన వస్తుంది. దాంతో మంచినీళ్లు తాగి కడుపు నింపుకుంటాడు. ఇదంతా చూసిన నందూ.. బయటికి వెళ్లి ఛాట్ తిందామని చెప్పి తీసుకెళ్తుంది. పవర్ బిల్ కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామని కరెంట్ ఆఫీసర్ బెదిరించడంతో లక్ష్మీ, చలపతి టెన్షన్ పడతారు. ఇంతలో వెంకీ వచ్చి బిల్లు కట్టేస్తాడు. నీ శాలరీ ఫస్ట్ తారీఖున వస్తుంది కదా? ఈ డబ్బు ఎక్కడిదని అడుగుతాడు చలపతి. టిప్ వచ్చిందని వెంకీ చెప్పడంతో.. లక్ష్మీ, చలపతి షాక్ అవుతారు. నువ్వు ఏదైనా హోటల్ బేరర్‌గా పనిచేస్తున్నావా? అని తండ్రి అడుగుతాడు. నేను మంచి ఐడియా చెప్పినందుకు కంపెనీ వాళ్లు ఇచ్చారని కవర్ చేస్తాడు వెంకీ.

ఇందూని సీఈవోగా అనౌన్స్ చేస్తున్న పార్టీలో సీతారామయ్య ఫోటో ఉండటంతో రేఖ రగిలిపోతుంది. ఇది ఎవరు పెట్టారు? దీనిని తీసిపారేయమని భ్రమరాంబకి చెబుతుంది రేఖ. దానిని నేనే పెట్టాను.. ఈ కంపెనీకి సీతారామయ్య గారు ఫౌండర్ ఆయన ఫోటో ఉంటే నీకే మంచిది, క్లయింట్స్ దృష్టిలో నీ మీద మంచి పాజిటివ్ ఓపీనియన్ వస్తుందని చెబుతాడు రాజ్. ఇంతలో కొందరు క్లయింట్స్ వచ్చి సీతారామయ్య గారి ఫోటోకి దండం పెట్టుకుంటారు. దాంతో చేసేదేం లేక రేఖ కూడా ఆ ఫోటోకి దండం పెట్టుకుంటుంది. ఇదంతా చూసిన సుభాష్, అపర్ణ, ఇందూలు సంతోషించి రాజ్‌కి థ్యాంక్స్ చెబుతారు. పార్టీలో ఎవరు రేఖ పార్టీయో, ఎవరు దుగ్గిరాల కుటుంబానికి మంచి చేసే వ్యక్తులో తెలుసుకుంటారు రాజ్, కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 20వ తేదీ ఎపిసోడ్ 1064లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial June 20th 2026 Episode 1064 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

లక్కీని వెతుక్కుంటూ లక్ష్మీ- చలపతి వచ్చి రాజ్ గురించి చెప్పమని అడుగుతారు. రాజ్ ఎక్కడున్నాడో నాకు తెలియదు, మీరు కంగారు పడతారని అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అని చెప్పేవాడిని అని కవర్ చేస్తాడు లక్కీ. వాడు నీకు తెలియకుండా ఏ పనిచేయడు, డ్రాయిర్‌లు కొనుక్కోవడానికి కూడా మీరిద్దరూ కలిసే వెళ్తారని అంటాడు చలపతి. మీలాగా నేను కూడా ఆలోచిస్తున్నాను, వాడు నన్ను కలవక చాలా రోజులు అవుతోంది, ఏదైనా ఫోన్ రింగ్ అయినా వాడేమోనని ఆత్రుతతో చూస్తున్నానని ఫోన్ చూపించగా అప్పుడే రాజ్ ఫోన్ చేయడంతో చలపతి, లక్ష్మీలు షాక్ అవుతారు. ఈరోజు పార్టీ ఉందని చెప్పాను కదా? త్వరగా రమ్మన్నాను కదా త్వరగా వచ్చేయ్ అంటూ రాజ్ చెబుతాడు. ఆ మాటలన్నీ విన్న చలపతి రగిలిపోతాడు. వాడు ఎక్కడున్నాడో లోకేషన్ పెట్టమని చలపతి చెప్పడంతో చచ్చినట్లు పెడతాడు లక్కీ. ఈ విషయం మనకి తెలియని విధంగానే ఉందామని లక్కీగాడు అనుకుంటాడు.

స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కి కొత్త సీఈవోగా ఇందూని అనౌన్స్ చేస్తుంది రేఖ. స్వరాజ్ కంపెనీని సీతారామయ్య గారు చాలా మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు, రాజ్ - కావ్యలు ఈ కంపెనీని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేశారు. దుగ్గిరాల కంపెనీకి ఒక బ్రాండ్ తీసుకొచ్చారు, కానీ మన దురదృష్టం కొద్ది ఆరోజు జరిగిన ప్రమాదంలో వాళ్లు ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. అలాంటి కష్టకాలంలో నేను కంపెనీ బాధ్యతల్ని తీసుకున్నాను, ఇన్నిరోజులు నేను ముందుండి కంపెనీని ముందు తీసుకెళ్లాను. ఇప్పుడు కావ్య పోలికలతో పుట్టిన ఇందూ.. అన్ని బాధ్యతల్ని తీసుకోవడానికి ముందుకొచ్చింది. ఈరోజు నుంచి కంపెనీ బాధ్యతలన్నీ ఇందూకి అప్పగిస్తున్నానని ప్రకటిస్తుంది రేఖ. మా ఇందూకి సీఈవో బాధ్యతల్ని అప్పగించడం నాకు చాలా సంతోషంగా ఉందని చెబుతుంది.

ఇందూ మాట్లాడుతూ.. మా రేఖ ఆంటీకి థ్యాంక్స్. ఈ పార్టీకి వచ్చిన మీ అందరికీ పేరు పేరునా థ్యాంక్స్. నేను మా అమ్మలాగా కంపెనినీ నడిపించగలనా? లేదా? అని మీ అందరికీ సందేహాలు ఉండొచ్చు. ఎందుకంటే నా గురించి మీకు తెలియదు కాబట్టి, కానీ మీరు నమ్మండి మీ నమ్మకాన్ని నేను నిలబెడతాను. మన స్వరాజ్ కంపెనీని నేను ముందుకు తీసుకెళ్తాను అని చెబుతుంది ఇందూ. నీకు ఎక్స్‌పీరియన్స్ లేదు కదా అని క్లయింట్స్ అడగ్గా.. మా రేఖ ఆంటీ నన్ను ట్రైన్ చేశారని చెబుతుంది. మా అమ్మనాన్న ఉన్నప్పుడు ఎలాగైతే స్వరాజ్ కంపెనీతో డీల్ చేసుకున్నారో ఇక మీదట కూడా అలాగే కొనసాగుతారని నేను అనుకుంటున్నానని అంటుంది ఇందూ.

మా కంపెనీని మీరు నమ్ముకోవడం వల్ల ఈరోజు ఉన్నత స్థాయికి ఉన్నామని ఇక్కడున్న చాలామంది చెప్పారు.. అదే నమ్మకంతో మాతో మీరు బిజినెస్ చేయండి, తప్పకుండా మీ అందరికీ లాభాలు తీసుకొస్తామని చెబుతుంది. ఇంతలో హర్ష అనే ఒక క్లయింట్ మాట్లాడుతూ.. మీ అమ్మగారంటే నాకు చాలా రెస్పెక్ట్. మీ అమ్మనాన్న బతికున్నప్పుడు రెగ్యులర్‌గా ఆఫీస్‌కి వస్తూ ఉండేవాడిని. కానీ ఈ రేఖ గారు కంపెనీ బాధ్యతని తీసుకున్నాక ఆమె మీద నమ్మకం లేక మీ కంపెనీతో బిజినెస్ చేయడం పూర్తిగా మానేశాను, ఇప్పుడు కంపెనీని మీరు హ్యాండోవర్ చేసుకున్నారు. మీ మాటలు నమ్మశక్యంగా ఉన్నాయి. అందుకే మీతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలని అనుకుంటున్నామని చెబుతాడు. మీరు అనుకున్న టైంకి పూర్తి చేయగలిగితే కంటిన్యూగా మీతోనే బిజినెస్ చేస్తానని చెబుతాడు. మనం అనుకున్నట్లుగానే ఇందూ మన పేరు నిలబెడుతుందని అపర్ణ, సుభాష్ చాలా సంతోషిస్తారు.

ఇంతలో రాజ్‌ని వెతుక్కుంటూ చలపతి- లక్ష్మీ అక్కడికి రావడం చూసిన అపర్ణ చూసి షాక్ అవుతుంది. మా అబ్బాయి రాజ్ ఇక్కడే ఉన్నాడని తెలిసి వచ్చామని చెబుతాడు చలపతి. ఇది మా ఇల్లు అని తెలియకుండా వచ్చారు, ఇందూకి రాజ్‌కి పెళ్లయినట్లు ఇందూ తనతో చెప్పిందని అపర్ణ జాగ్రత్త పడుతుంది. మీ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు.. నేను పంపిస్తానని చెబుతుంది అపర్ణ. రాజ్ పక్కన ఇందూని చూసి చలపతి - లక్ష్మీ షాక్ అవుతారు. మీ అమ్మానాన్న వచ్చారని అపర్ణ చెప్పడంతో రాజ్ అవాక్కవుతాడు.

నువ్వు ఈ ఇంట్లో ఏం చేస్తున్నావు? అసలు ఈ ఇల్లు ఎవరిదో నీకు తెలుసా అని చలపతి అడుగుతాడు. ఆ ఇందూ నీతో ఉందేంటీ అని అడుగుతాడు. ఈ విషయం అమ్మానాన్నలకి తెలియదు కాబట్టి అర్జెంట్‌గా వీళ్లని ఇక్కడి నుంచి పంపేయాలని అనుకుంటాడు రాజ్. ఈ ఇల్లు దుగ్గిరాల వాళ్లదని నీకు తెలసా అని చలపతి అడగ్గా.. తెలుసు అని చెబుతాడు రాజ్. అంటే నీకు నిజం తెలిసిపోయిందా అని లక్ష్మీ అడగ్గా.. ఏ నిజమని రాజ్ ప్రశ్నిస్తాడు. చలపతి దానిని కవర్ చేస్తూ నువ్వు ఏం బిజినెస్ చేస్తున్నావని అడుగుతాడు. దుగ్గిరాల ఫ్యామిలీకి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయని నీకు తెలుసు కదా? ఈరోజు ఇక్కడ బిజినెస్ పార్టీ జరుగుతోందని వచ్చానని చెబుతాడు రాజ్.

నువ్వు చెప్పేది నిజమేనా? లేక మా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని ప్రశ్నిస్తుంది లక్ష్మీ. ఇందూ నేను పెద్ద కాంట్రాక్ట్ కుదుర్చుకుంటున్నాం.. నేను బాగానే ఉన్నానని చెబుతాడు రాజ్. ఇలాంటి పెద్దవాళ్లతో మనకెందుకు? మంచిగా ఉన్నన్ని రోజులు కాంట్రాక్ట్స్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు కానీ తేడా వస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరని వార్నింగ్ ఇస్తాడు చలపతి. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని మండిపడతాడు చలపతి. ఈ బిజినెస్‌లు వదిలేసి ఇంటికొస్తే నీ తమ్ముడికి కొంచెం సాయంగా ఉంటుందని అంటాడు. మన కష్టాలు తీర్చడానికే నేను ఇంటికి రాకుండా కష్టపడుతున్నానని, ఇంటికొచ్చి మిగతా విషయాలు చెబుతానని అంటాడు రాజ్. ఈ మాటలన్నీ విన్న రేఖ.. వాళ్లిద్దరూ ఎవరు? నీ కోసం ఎందుకొచ్చారు అని అడుగుతుంది. వాళ్లు మా అమ్మానాన్న నా కోసమే వచ్చారని చెబుతాడు రాజ్. అయితే బయటి నుంచి బయటే పంపించేస్తున్నావని మండిపడుతుంది రేఖ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X