Brahmamudi June 21st Episode: కావ్యకి రుద్రాణి షాక్.. కళ్యాణ్ ప్లాన్ తిప్పికొట్టిన యామిని.. అప్పూ కంటతడి

Photo Courtesy: JioHotstar

తెల్లవారితే మామినితో పెళ్లి జరగబోతుండగా కావ్యను కన్విన్స్ చేయాలని చూస్తాడు రాజ్. కానీ ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. పెళ్లి ఎలా ఆపాలో అపర్ణ, ఇందిర, కనకంలు ఆలోచిస్తుండగా అప్పూ- కళ్యాణ్‌లు వచ్చి ఆ యామినిని ఇరికించడానికి సాక్ష్యం దొరికిందని చెబుతారు. కిల్లర్‌కు యామిని డబ్బులు ఇస్తుండగా తాము వీడియో తీశామని వారికి వీడియో చూపిస్తాడు కళ్యాణ్. ఈ విషయాన్ని చాటుగా విన్న రుద్రాణి- రాహుల్‌లు వెంటనే యామినికి విషయం చెబుతాడు.

అప్పూ స్కెచ్ గురించి తెలుసుకున్న యామిని ఏమాత్రం కంగారుపడకుండా ఏం జరిగినా నేను చూసుకుంటానని చెప్పడంతో రాహుల్, రుద్రాణిలు షాక్ అవుతారు. యామిని పెళ్లి ఆపొద్దని ఆమె తండ్రి.. కావ్యకి రిక్వెస్ట్ చేస్తాడు. నేను ఈ పెళ్లి ఆపనని, కానీ ఈ వివాహం జరగదని తేల్చి చెబుతుంది కావ్య. పెళ్లి పీటలపైకి తీసుకొస్తుండగా.. కావ్య ఎదురవ్వడంతో ఆమెను నానామాటలు అంటుంది యామిని. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 21వ తేదీ ఎపిసోడ్ 754లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial June 21st 2025 Episode 754 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

యామినిని రాజ్ పెళ్లి చేసుకుంటుంటే మీరు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అపర్ణ, ఇందిరలపై మండిపడుతుంది రుద్రాణి. నువ్వు కూడా ఈ పెళ్లిని ఆపకుండా సైలెంట్‌గా ఎందుకు కూర్చొన్నావని కావ్యని నిలదీస్తుంది. అసలు పెళ్లిని ఆపాలన్న ఆలోచనే నాకు లేదని కావ్య చెప్పడంతో రాహుల్, రుద్రాణిలు షాక్ అవుతారు. నేను ఈ పెళ్లిని అస్సలు ఆపనని, కానీ ఈ పెళ్లి జరగదని అంటుంది కావ్య. ఇంతలో అప్పూ- కళ్యాణ్‌లు బయటికి వెళ్లి కానిస్టేబుల్ శేషుకు ఫోన్ చేసి త్వరగా రమ్మని చెబుతారు.

పెళ్లి పీటలపై కావ్యను చూస్తూ బాధపడతాడు రాజ్. ఆ వెంటనే పంతులుగారు తాళిని రాజ్ చేతికి ఇచ్చి యామిని మెడలో కట్టమని చెప్పడంతో దుగ్గిరాల కుటుంబం షాక్ అవుతుంది. ఆ వెంటనే పోలీసులు రావడం చూసి రుద్రాణి దుగ్గిరాల కుటుంబానికి సపోర్ట్ చేస్తున్నట్లుగా డ్రామా స్టార్ట్ చేస్తుంది. రాజ్ తాళి కడుతుండగా.. ఆపమని అంటుంది రుద్రాణి. ఈ మాటలతో అంతా షాక్ అవుతారు. అంతా అయిపోయింది ఇక ఈ పెళ్లి జరగదని పంతులు మనసులో అనుకుంటాడు. ఇప్పటి వరకు కనకం వాళ్లేనని అనుకున్నా, ఇప్పుడు ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు అని ఆలోచిస్తుంటాడు.

ఎందుకు పెళ్లిని ఆపమన్నావ్? అని రుద్రాణిని వైదేహి అడుగుతుంది. పెళ్లి మంటపం అంటే ముత్తయిదువులు ఉండాలి కానీ ఇలా పోలీసులు ఎందుకు వస్తున్నారని నిలదీస్తుంది రుద్రాణి. ఏమైంది? ఎందుకొచ్చారు? అని రఘునాథ్ పోలీసులను అడుగుతాడు. యామిని గారిని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. అరెస్ట్ చేయడానికి నేనేం చేశానని యామిని నిలదీయగా.. ఒక మనిషిని చంపడమే కాదు, చంపాలని అనుకోవడం కూడా నేరమేనని అంటాడు కానిస్టేబుల్. అటెంప్ట్ టూ మర్డర్ కేసు కింద మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెబుతాడు కానిస్టేబుల్.

ఓ మనిషిని నేను చంపించాలని చూశానా? అని యామిని అడగ్గా.. రెండ్రోజుల క్రితం రామ్ - కళావతిలను చంపడానికి మీరు రఘు అతనికి సుపారీ ఇచ్చారని కానిస్టేబుల్ చెబుతాడు. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా కోడలిని చంపాలని చూస్తావా? అని అపర్ణ రగిలిపోతుంది. యామిని కళావతిని చంపాలని ఎందుకు అనుకుంటుందని నిలదీస్తుంది రుద్రాణి. రామ్ - కళావతి ఇద్దరూ ఫ్రెండ్స్.. ఆ సంగతి యామినికి కూడా తెలుసు కదా అని అంటుంది. ఎక్కువ మాట్లాడావంటే పళ్లు రాలిపోతాయని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది కనకం. నా కూతురికి కళావతిని చంపాల్సిన అవసరం ఏముందని అడుగుతుంది వైదేహి. జరిగింది ఏంటో ముందు మీరు తెలుసుకుంటే తర్వాత ఏం చేయాలో నేను చెబుతానని అప్పూ అంటుంది.

నువ్వు, యామిని కలిసి రిసార్ట్‌కి వెళ్లారా? అని రాజ్‌ని అడుగుతుంది అప్పూ. అదే రిసార్ట్‌కి ఆఫీస్ పని మీద నువ్వు కూడా వెళ్లావు కదా? అని కావ్యని కూడా అడుగుతుంది. కళావతితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి కలిసి వెళ్లాలని నేను అనుకున్నానని రాజ్ అంటాడు. అప్పుడే అసలు ప్రాబ్లం మొదలైందని.. మీతో కలిసి సరదాగా గడపాలనుకున్న యామిని దానిని తట్టుకోలేకపోయిందని చెబుతుంది అప్పూ. తనతో కాకుండా నువ్వు మా అక్కతో కలిసి వెళ్లడం బాల్కనీలో నుంచి చూసిందని అంటుంది. ఈ విషయాన్ని యామిని కూడా అంగీకరిస్తుంది. నీతో ఉండాల్సిన రామ్.. మా అక్కతో ఉండటం చూసి నువ్వు తట్టుకోలేకపోయావని అంటుంది అప్పూ.

నీకు రామ్ గారు ఎక్కడ దూరం అవుతారోనని భయపడ్డ నువ్వు.. తనను చంపితే నీ ప్రాబ్లమ్ తీరిపోతుందని అనుకున్నావ్? అందుకే ఆ రౌడీకి నువ్వు సుపారీ ఇచ్చావని అంటుంది అప్పూ. మా ఇంటి కోడలిని యామిని చంపాలని అనుకుందని అలాంటి మనిషిని నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా? అని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. వాళ్లు అన్ని మాటలు అంటుంటే నువ్వెందుకు సైలెంట్‌గా ఉన్నావని యామినిని నిలదీస్తాడు రాజ్. ఇంతలో కిల్లర్ రఘుని పిలిపించి జరిగిందంతా చెప్పమని అంటుంది అప్పూ. అసలు యామిని ఎవరు అని రఘు అనడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది.

నువ్వు ఇక్కడికి రావడం, యామిని నీకు కోటి రూపాయలు ఇవ్వడం నేను మొత్తం చూశానని అంటుంది అప్పూ. నేనెవరో వాడికి తెలియదని చెబుతుంటే నేను కోటి రూపాయలు ఇవ్వడం ఏంటని మండిపడుతుంది యామిని. నువ్వు వాడికి కోటి రూపాయలు ఇస్తుండగా నేను, అప్పూ కళ్లారా చూశామని దానిని వీడియో కూడా తీశామని కళ్యాణ్ చెబుతాడు. నువ్వు ఓవరాక్షన్ చేయొద్దు, ఇప్పుడు ఆ వీడియోకి ఏం సమాధానం చెబుతావో చెప్పమని అంటుంది కనకం. అయితే ఆ ఫోన్‌లో వీడియో లేకపోవడంతో అప్పూ, కళ్యాణ్‌లు షాక్ అవుతారు. యామిని.. రుద్రాణి, రాహుల్ వంక చూసి నవ్వుకుని జరిగినది గుర్తుచేసుకుంటుంది. అప్పూ- కళ్యాణ్‌లు నిద్రపోతుండగా వారి గదిలోకి రాహుల్ దొంగచాటుగా వచ్చి కళ్యాణ్ ఫోన్‌లో ఉన్న వీడియోను డిలీట్ చేస్తాడు.

ఇప్పటి వరకు జరిగింది చాలని.. ఇంకా ఇలాగే ఉంటే నేనే నీ రూమ్‌లోకి వచ్చి ఆ వీడియోను నేనే డిలీట్ చేశానని అంటావని అప్పూపై కోప్పడుతుంది యామిని. అప్పూ చెప్పిన మాటలు విని నన్ను హంతకురాలిలా చూశారు.. ఈ సోసైటీలో ఉండటానికే అర్హత లేదని పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చారని ఇప్పుడేం మాట్లాడరేంటీ అని అంటుంది యామిని. నువ్వు చెప్పింది ఏది ప్రూవ్ చేసుకోలేకపోయావ్? యామిని మీద ఇంత పెద్ద నేరం ఎందుకు మోపావని అప్పూని నిలదీస్తాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X