Brahmamudi June 22nd Episode: రాజ్- ఇందూలని కాపాడిన నందూ.. AI టెక్నాలజీతో ఐశ్వర్యని ఇరికించిన రాజ్

Photo Courtesy: JioHotstar

స్వరాజ్ కంపెనీకి అందరి ముందు ఇందూని సీఈవోగా అనౌన్స్ చేస్తుంది రేఖ. ఇప్పటి వరకు ఈ కంపెనీని నేను నడిపించాను, ఇకపై ఇందూనే చూసుకుంటుందని చెబుతుంది. ఇందూ మాట్లాడుతూ.. కంపెనీని అద్భుతంగా నడిపిస్తానని, దీనికి మీ సపోర్ట్ కావాలని అడుగుతుంది. దానికి ఒక క్లయింట్ స్పందిస్తూ మీ అమ్మనాన్నలు ఉన్నప్పుడు మీ కంపెనీతోనే నేను డీల్ చేసుకున్నాను. రెగ్యులర్‌గా ఆఫీస్‌కి కూడా వచ్చాను, కానీ రేఖ వచ్చాక బిజినెస్ మానేశానని చెబుతాడు క్లయింట్. మీ మాటలు నమ్మేలా ఉన్నాయని మీతో నేను డీల్ కుదుర్చుకుంటానని చెప్పడంతో అంతా సంతోషిస్తారు.

రాజ్‌ను వెతుక్కుంటూ లక్కీ దగ్గరికి వెళ్తారు చలపతి - లక్ష్మీ. రాజ్ ఎక్కడున్నాడో నాకు తెలియదని లక్కీ డ్రామాలు ఆడుతుండగా రాజ్ ఫోన్ చేసి పార్టీకి రమ్మని చెప్పడంతో ఇరుక్కుంటాడు. రాజ్ ఎక్కడున్నాడో లక్కీ లోకేషన్ చెప్పడంతో దుగ్గిరాల వారి ఇంటికి వెళ్తారు చలపతి - లక్ష్మీ. వారిని చూసిన అపర్ణ వాళ్లని పలకరించి రాజ్‌తో చెబుతుంది. దాంతో అమ్మానాన్నల దగ్గరికి వెళ్లి ఏదో మాటలు చెప్పి అక్కడి నుంచి పంపేస్తాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 22వ తేదీ ఎపిసోడ్ 1065లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial June 22nd 2026 Episode 1065 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

మదన్, స్వాతిలు ఐస్‌క్రీమ్ కోసం కొట్టుకుంటూ ఉండటం చూసిన భ్రమరాంబ సంబరపడిపోతుంది. ఎంత ముచ్చటపడినా వాళ్లిద్దరి పెళ్లికి రేఖ ఒప్పుకోదని అంటాడు శేషం. అయితే నేను ఇప్పుడే వెళ్లి స్వాతికి, మదన్‌కి పెళ్లి చేయబోతున్నామని అనౌన్స్ చేసేస్తానని అంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఐశ్వర్య.. పెన్‌డ్రైవ్‌ ఇచ్చి రాజ్- లక్కీలు మందుకొడుతున్న వీడియోని ప్లే చేయమని చెబుతుంది. అదంతా చూసిన క్లయింట్స్, రాజ్- ఇందూలు షాక్ అవుతారు. అసలు మాకు పెళ్లే జరగలేదు.. మా పెళ్లి అనేది అబద్ధం, నేను డబ్బులు తీసుకుని ఈ అద్దె మొగుడు పాత్ర పోషిస్తున్నానని రాజ్ చెప్పిన మాటలు విన్న అంతా షాక్ అవుతారు.

నేను అప్పుడే అనుకున్నాను.. కిడ్నాప్ చేసినవాడు పెళ్లి చేసుకోవడం ఏంటని, పేమెంట్ కోసం అద్దె మొగుడుగా నటిస్తున్నావా? అంటూ భ్రమరాంబ మండిపడుతుంది. మమ్మల్ని అంతా వెర్రివాళ్లని చేశావు కదా? భూషణ్ ఫైర్ అవుతాడు. ఈ పెళ్లి అబద్ధమా? అని అపర్ణ, సుభాష్‌లు సైతం నిలదీస్తారు. మమ్మల్ని మోసం చేశారా? మీకు పెళ్లి కాలేదా? తను నీకు అద్దె మొగుడా అని రేఖ నిలదీయడంతో ఇందూ, రాజ్‌లు షాక్ అవుతారు. ఇంతలో ఐశ్వర్య వచ్చి.. ఇందూకి రాజ్‌కి పెళ్లి జరగలేదు అన్నది నిజం, తను అద్దె మొగుడిగా నటిస్తున్నారన్నది కూడా నిజం. వీళ్లిద్దరికీ పెళ్లి జరగలేదని నాకు డౌట్‌గా ఉందని చెప్పినా మీరు నమ్మలేదు. అందుకే ఇలా వీడియో తీసి అందరి ముందు ప్లే చేశానని చెబుతుంది ఐశ్వర్య.

నీ ఫ్రెండ్ నాలుగు పెగ్గులు పోయగానే మొత్తం కక్కేశాడని అంటుంది ఐశ్వర్య. మీరు ఐషూ మాటలు నమ్మొద్దు.. మా పెళ్లి నిజమని చెబుతుంది ఇందూ. మీకు పెళ్లి జరగలేదని నేను సాక్ష్యం చూపించాను, మీకు పెళ్లి జరిగిందని నువ్వు సాక్ష్యం చూపిస్తావా అని ఐశ్వర్య నిలదీస్తుంది. ఇంతలో నందూ వచ్చి సాక్ష్యం ఉందని మ్యారేజ్ సర్టిఫికెట్ చూపిస్తుంది. పోలీసుల సమక్షంలో వీళ్ల మ్యారేజ్ రిజిస్టర్ అయ్యిందని అంటుంది నందూ. ఇందూ గారు నన్ను పార్టీకి ఇన్వైట్ చేశారు, నేను ఈ సర్టిఫికెట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేద్దామని అనుకున్నాను. కానీ ఇక్కడ ఏదో డిస్కషన్ జరుగుతోందని అర్ధమైందని అంటుంది నందూ.

వీళ్లిద్దరికీ పెళ్లి జరిగిందంటే నేను నమ్మను, ఇందూ మామూల్దీ కాదు... వాళ్లమ్మ లాగే అందరినీ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తోంది. సీఈవో ఛైర్ నుంచి మిమ్మల్ని దించి అది కూర్చొందని రేఖతో అంటుంది ఐశ్వర్య. సర్టిఫికెట్ ఓకే మరి ఈ వీడియో ఏంటీ అని రేఖ నిలదీస్తుంది. అయితే ఏఐ జనరేటెడ్ వీడియో అని ఇందూ అంటుంది. ఆ వీడియో నిజమే కానీ ఆడియో అబద్ధమని కవర్ చేస్తాడు రాజ్. తనే ఆ వీడియో తీసి ఏఐ టెక్నాలజీ ద్వారా తనకు అనుకూలంగా మాటల్ని మార్చేసిందని అంటాడు. నా పెళ్లిని పెళ్లి కాదని నేనెందుకు అంటాను, మొగుడిని అద్దె మొగుడు అని ఎందుకు చెప్పుకుంటాను అంటాడు రాజ్.

నేను నా ఫ్రెండ్‌తో చాలాకాలం తర్వాత సిట్టింగ్ వేసుకుని కబుర్లు చెప్పుకుంటుంటే దొంగచాటుగా వీడియో తీయడం ఏంటీ? నా కాపురం పాడు చేయాలని చూడటం ఏంటీ? అని ఐశ్వర్యని ఫోటో తీసి దానిని ఏఐ టెక్నాలజీ ద్వారా రేఖ గురించి ఐశ్వర్య తప్పుగా మాట్లాడినట్లు వీడియో సృష్టిస్తాడు రాజ్. అది చూసిన రేఖ షాక్ అవుతూ.. ఐశ్వర్యపై మండిపడుతుంది. వాళ్ల విషయం వదిలేయమని చెప్పినా, నీ వల్ల నా పరువు పోయిందని ఫైర్ అవుతుంది. అందరూ వెళ్లిపోయిన తర్వాత ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ ఎలా ప్లాన్ చేశావని ఇందూని అడుగుతుంది ఐశ్వర్య. దాంతో ఐశ్వర్య వీడియో చూస్తుండగా తాను చూశానని చెబుతుంది ఇందూ.

ఆ రోజు రేఖ ఆంటీని నా రూమ్‌కి తీసుకొచ్చినప్పుడే నాకు అర్ధమైంది.. నన్ను ఇరికిస్తావని, అందుకే నిన్ను అబ్జర్వ్ చేస్తున్నానని అంటుంది ఇందూ. నన్ను కిడ్నాప్ చేసినప్పుడే నీకు వార్నింగ్ ఇచ్చాను, అయినా కూడా బుద్ధి రాలేదా? ఇంకోసారి నా విషయంలో జోక్యం చేసుకుంటే ఊరుకోనని చెబుతుంది ఇందూ. నిన్ను కూడా నేను వదిలిపెట్టను, నీకు ఆ రాజ్‌గాడికి పెళ్లి కాలేదని ఎలాగైనా బయటపెడతానని అనుకుంటుంది ఐశ్వర్య. నువ్వు కనుక సమయానికి రాకపోయుంటే నేను పూర్తిగా ఇరుక్కుపోయే దానిని అని నందూకి థ్యాంక్స్ చెబుతుంది. నువ్వు నా అక్కవి, నిన్ను కాపాడుకోవడం చెల్లెలిగా నా బాధ్యత అంటుంది నందూ.

స్క్రీన్ మీద ఆ వీడియో చూసి నా గుండె ఆగిపోయింది, నేను ఇన్నిరోజులుగా చేస్తున్నదంతా వృథా అయిపోతుందని భయం వేసిందని అంటుంది ఇందూ. నువ్వు మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకురాకపోయుంటే రేఖ ఆంటీ నన్ను, నానమ్మని, తాతయ్యని ఏం చేసేదో ఏంటోనని బాధపడుతుంది ఇందూ. నీకోసం నేను ఏదైనా చేస్తానని చెబుతుంది నందూ. ఐశ్వర్యకి నేనంటే అస్సలు పడటం లేదు, నేను సీఈవో అయ్యాక నా మీద ఇంకా ద్వేషం పెంచుకుంది. ఆ రాజ్‌గాడు తాగి వాగడంతో దానిని ఐశ్వర్య వీడియో తీసిందని చెబుతుంది ఇందూ. ఈ విషయంలో నానమ్మకి ఎంతో కొంత డౌట్ ఉండే ఉంటుందని నందూ చెప్పడంతో ఇందూ షాక్ అవుతుంది.

రాజ్‌ ఇంటికి వెళ్లేసరికి ఇందూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మందు తాగి చాలాకాలం అయ్యింది, అందుకే వెళ్లాను. కానీ ఐశ్వర్య వెనుక నుంచి వీడియో తీస్తుందని నాకేం తెలుసు అంటాడు రాజ్. మందు పడితే నిజాలు వాటికవే బయటికి వచ్చేస్తాయని చెబుతాడు. నువ్వు మనిషివేనా? కొంచెం కూడా కామన్‌సెన్స్ లేదా? మన డీల్ గురించి ఎవ్వరికీ చెప్పొద్దని కండీషన్ పెట్టుకున్నాం కదా? మరెందుకు బ్రేక్ చేశావని ఫైర్ అవుతుంది ఇందూ. నువ్వే నన్ను ముంచేశాలా ఉన్నావు.. తిండి, డబ్బు ఉంటే చాలా అని మండిపడుతుంది. మొన్న మీ రేఖ ఆంటీ నీ చేత వేలిముద్రలు వేయించబోతుంటే నేనే కాపాడాను, ఇప్పుడు ఈ ప్రమాదం నుంచి నువ్వు కాపాడావు. మనం భార్యాభర్తలం కాకపోయినా పార్ట్‌నర్స్ కదా అని అంటాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X