Brahmamudi June 23rd Episode: దుగ్గిరాల ఫ్యామిలీకి షాక్.. యామిని పెళ్లికి కావ్య గ్రీన్ సిగ్నల్.. రాజ్ ట్విస్ట్
Photo Courtesy: JioHotstar
రాజ్- యామినిల పెళ్లి జరుగుతుండగా దుగ్గిరాల ఫ్యామిలీకి, కావ్యకి సపోర్ట్ చేస్తున్నట్లుగా రుద్రాణి డ్రామా మొదలు పెడుతుంది. రాజ్‌ని ఆ యామిని పెళ్లి చేసుకుంటుంటే నువ్వేం మాట్లాడవేంటీ అని కావ్యని ప్రశ్నిస్తుంది రుద్రాణి. దాంతో ఆమె బ్రహ్మముడి కథ చెప్పడంతో రుద్రాణికి చిరాకు వేస్తుంది. కాసేపట్లో యామిని మెడలో రాజ్ తాళి కట్టబోతుండగా దుగ్గిరాల ఫ్యామిలీ టెన్షన్ పడుతుంది. దాంతో కానిస్టేబుల్‌కి ఫోన్ చేసి కిల్లర్ రఘుని త్వరగా యామిని ఇంటికి తీసుకురమ్మని చెబుతుంది అప్పూ.
యామిని మెడలో రాజ్ తాళి కడుతుండగా రుద్రాణి పెళ్లి ఆపమని గట్టిగా కేకలు పెడుతుంది. ఇంతలో పోలీసులు వచ్చి రాజ్ - కావ్యలపై అటాక్ చేయించినందుకు గాను యామినిని అరెస్ట్ చేస్తామని చెబుతారు. అసలు వాడెవడు? నేనెందుకు కావ్య- రాజ్‌ల మీద అటాక్ చేయిస్తానని అడుగుతుంది యామిని. నువ్వు రఘుకి డబ్బులు ఇస్తుండగా వీడియో తీశామని అప్పూ చెప్పడంతో దానిని చూపించమంటాడు రాజ్. అయితే కళ్యాణ్ ఫోన్‌లో ఆ వీడియోను రాహుల్ డిలీట్ చేయడంతో అప్పూ సైలెంట్ అయిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 23వ తేదీ ఎపిసోడ్ 755లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
యామినిపై నువ్వు చేసిన ఆరోపణలు ప్రూవ్ చేసుకోలేకపోతున్నావేంటీ? అని అప్పూని రాజ్ నిలదీస్తాడు. యామిని సుపారీ ఇచ్చి మా మీద అటాక్ చేయించింది అన్నావ్.. అతనేమో యామినిని ఇప్పుడే చూశానని అంటున్నాడని చెబుతాడు. చేయని తప్పుకి మా అమ్మాయిని ఇరికించి ఈ పెళ్లిని ఆపాలని అప్పూ ప్రయత్నించిందని వైదేహి అంటుంది. మీరు అప్పూ మేడంపై నిందలు వేయొద్దని, ఈ కిల్లర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ వల్లే ఇక్కడికి తీసుకొచ్చామని అంటాడు కానిస్టేబుల్. పూర్తి సాక్ష్యం లేకుండా అతనిని ఇక్కడికి తీసుకురావడం మనదే తప్పని, రఘుని తీసుకెళ్లమని చెబుతుంది అప్పూ.
నువ్వు చాలా నటిస్తున్నావని, అసలు నాకు మీ ఫ్యామిలీ మీదే అనుమానంగా ఉందని అంటుంది వైదేహి. పెళ్లి పనులు మొదలు పెట్టినప్పటి నుంచి అన్ని ఆటంకాలే వస్తున్నాయని, ఇప్పుడు ఈ డ్రామా చూస్తుంటే ఆ అటాక్ కూడా మీ వాళ్లే చేయించారని అనిపిస్తోందని చెబుతుంది. అసలు నేను మీకు ఏం ద్రోహం చేశానని ఇలా అందరిముందు నన్ను దోషిగా నిలబెట్టాలని అనుకుంటున్నారని యామిని అంటుంది. మా బావ కోమాలోకి వెళ్లి నన్ను గుర్తుపట్టకపోయినా, ఆ బాధనంతా నా గుండెల్లోనే దాచుకుని నా ప్రేమనంతా ఆయనకి ఇవ్వాలని అనుకుంటున్నానని చెబుతుంది.
మీరెంటో, మీ ఫ్యామిలీ ఏంటో నాకు బాగా తెలుసని అంటుంది కనకం. మా అల్లుడుగారి గురించి ఆలోచిస్తున్నానని, లేకపోతే మీరు చేసిన పనికి మీకు ఇత్తడి అయిపోయేదని వార్నింగ్ ఇస్తుంది. నా కూతురి జీవితం నాశనమవుతుంటే ఎలా ఊరుకుంటానని ప్రశ్నిస్తుంది. ఆవేశంలో అన్ని నిజాలను మా అమ్మ బయటపెడుతుందని కావ్య భయపడుతుంది. వెంటనే నువ్వు ఒక్క మాట మాట్లాడినా నా మీద ఒట్టని అనడంతో కనకం సైలెంట్ అయిపోతుంది. తెలివిగా మీ అమ్మని, అప్పూని ఇక్కడి నుంచి పంపించేశావ్.. మరి నా కూతురి మీద వేసిన నింద సంగతేంటని ప్రశ్నిస్తుంది వైదేహి.
మీకు పెళ్లి కావాలా? వద్దా అని కావ్య ఆమెను ప్రశ్నిస్తుంది. యామిని ఏ తప్పూ చేయలేదని మీరు నమ్ముతున్నారా అని రాజ్‌ను అడుగుతుంది. నమ్ముతున్నానని చెప్పడంతో ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావ్ సంతోషంగా పెళ్లి చేసుకోండని కావ్య అంటుంది. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఇప్పటి వరకు మీరంతా చేసింది చాలని, ఇకపై ఎవరూ ఏం మాట్లాడొద్దని అంటుంది కావ్య. వెంటనే యామిని వచ్చి కావ్యని కౌగిలించుకుని ఇక రాజ్ నీ భర్త అన్న సంగతి మరిచిపో.. ఇక నన్ను, మా బావని ఎవ్వరూ విడదీయలేరని అంటుంది. ఈ పెళ్లి జరగదని నేను నమ్ముతున్నానని కావ్య చెప్పడంతో యామిని షాక్ అవుతుంది.
యామిని మెడలో తాళి కట్టబోతుండగా కావ్యతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటాడు రాజ్. దుగ్గిరాల ఫ్యామిలీ అయితే పెళ్లి జరగకూడదని టెన్షన్‌తో దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఆ వెంటనే రాజ్ చేతిలో నుంచి తాళి జారిపోయి యామిని ఒడిలో పడుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. యామినికి సారీ చెప్పి ఈ పెళ్లి మనిద్దరికి మంచిది కాదని అంటాడు రాజ్. నేను లేకపోతే చచ్చిపోతానని నువ్వు నిర్ణయించుకున్నావ్.. కానీ ఇష్టం లేని పెళ్లి ఇద్దరం చేసుకుని జీవితాంతం చస్తూనే ఉండాలని అంటాడు. దానికంటే ఈ పెళ్లి ఇక్కడే ఆపేయడం మంచిదని రాజ్ చెప్పడంతో యామిని షాక్ అవుతుంది. ఆ మాటలతో కనకం విజిల్స్ వేస్తుంది. యామినికి క్షమాపణలు చెప్పి పెళ్లి మంటపం నుంచి వెళ్లిపోతాడు రాజ్.
నీ నమ్మకమే నిజమైందని, నీ బ్రహ్మముడి సంకల్పమే ఫలించిందని కావ్యతో అంటారు అపర్ణ, ఇందిర. పెళ్లి ఆగిపోవడంతో కావ్య వైపు కోపంగా చూస్తుంది యామిని. దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఇంట్లో డ్యాన్స్ చేస్తారు. ఈ దరిద్రాన్ని చూడటానికా మనం ఇంత కష్టపడిందని రాహుల్, రుద్రాణిల ఫేస్ మాడిపోతుంది. యామినికి అన్ని కలిసొచ్చినా సరే రాజ్ చివరిలో హ్యాండ్ ఇచ్చాడని రుద్రాణి రగిలిపోతుంటుంది. ఇంతలో కావ్య వచ్చి మ్యూజిక్ ఆపేస్తుంది. మీరు కూడా ఈ వయసులో డ్యాన్స్‌లు చేస్తున్నారని ఇందిరని అడుగుతుంది. ఈ ఇంట్లో శుభాలు జరిగి, శుభవార్తలు విని ఎన్ని రోజులైంది.. అందుకే డ్యాన్స్ చేస్తున్నామని అంటుంది ఇందిర.
రాజ్ పెళ్లిని ఆపడమంటే మామూలు విషయమా? దానిని మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందేనని చెబుతుంది అపర్ణ. మనం పెళ్లి ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏది వర్కవుట్ కాలేదని, ఇక తాళి కట్టేస్తాడనుకున్న సమయంలో వాడే ఆపేశాడని అంటాడు ప్రకాశం. ఏం జరిగినా సరే ఈ పెళ్లి జరగదని నమ్మకంతో ఉందని చెబుతుంది ఇందిర. బ్రహ్మముడి అని డైలాగులు చెబుతుంటే మనం విసుక్కున్నామని అంటుంది అపర్ణ. నేను టెన్షన్ పడుతుంటే మీకు కామెడీగా ఉందా అంటూ ఫ్యామిలీపై మండిపడుతుంది కావ్య. మీకు పెళ్లి ఆగిపోయిన విషయం మాత్రమే కనిపిస్తోందని, ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు అర్ధం కావడం లేదని అంటుంది.
ఏం జరుగుతుందని యామినిని వదిలేసి రాజ్ మనింటికి వచ్చేస్తాడని చెబుతుంది ధాన్యలక్ష్మీ. ఇవన్నీ జరుగుతాయని ఎందుకు అనుకుంటున్నారు అని ప్రశ్నిస్తుంది కావ్య. ఈ పెళ్లి కోసం కావ్య ఇన్ని రోజులు ఎదురుచూసిందని, ఇప్పుడు పెళ్లి ఆగిపోతే ఊరుకుంటుందా అని నిలదీస్తుంది. యామిని తలుపు వేసుకోవడంతో రాజ్, వైదేహి, రఘునాథ్‌లు కంగారుపడతారు. నేను చెప్పేది విను కూర్చొని మాట్లాడుకుందామని అంటాడు రాజ్. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నీ కోసమే బతుకుతూ.. నీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకున్న దాని ఆశల్ని చంపేశావని రాజ్‌పై మండిపడుతుంది వైదేహి.
ఇప్పుడు అది ప్రాణాలు తీసుకోవడానికి కారణమయ్యావని, మీ అమ్మనాన్న చనిపోయిన నాటి నుంచి కన్నబిడ్డలా పెంచుకున్నామని అంటుంది. యామిని ఆశపడిందని ఇద్దరికీ పెళ్లి చేయాలనుకున్నామని, కానీ ఇప్పుడు మా బిడ్డ మాకు దక్కేలా లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దానికి ఏమైనా అయితే జీవితాంతం ఏడుస్తూనే బతుకుతామని, దీనింతటికీ కారణం నువ్వునని మండిపడుతుంది వైదేహి. మా అమ్మాయి ఏం తప్పు చేసిందని పెళ్లి వద్దు అని చెప్పావని ప్రశ్నిస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










