Brahmamudi June 23rd Episode: రాజ్- ఇందూల పెళ్లిపై అపర్ణలో అనుమానం.. మరోసారి లక్కీని ట్రాప్ చేస్తోన్న ఐశ్వర్య

Photo Courtesy: JioHotstar

స్వాతి, మదన్‌లు ఆడుకుంటూ అల్లరి చేస్తుండటంతో భ్రమరాంబ సంతోషిస్తుంది. మనం సంబరపడటమే కానీ ఈ పెళ్లికి రేఖ ఒప్పుకోదు కదా అని చెబుతాడు శేషం. అందుకే ఇప్పుడే నేను స్టేజ్ మీదకి వెళ్లి స్వాతి- మదన్‌ల పెళ్లి చేస్తున్నట్లు అనౌన్స్ చేస్తానని భ్రమరాంబ వెళ్లబోతుండగా రాజ్- లక్కీలు మందు కొడుతున్న వీడియో స్క్రీన్ మీద కనిపిస్తుంది. నాకు అసలు పెళ్లే కాలేదు.. ఇందూకి అద్దె మొగుడిగా నటిస్తూ డబ్బులు తీసుకుంటున్నానని చెబుతాడు రాజ్. ఆ మాటలు విన్న అంతా షాక్ అవుతారు.

మా అందరినీ ఫూల్స్‌ చేస్తావా? అసలు నీకు పెళ్లి జరిగిందా? లేదా అని రేఖ నిలదీస్తుంది. వీళ్లకి పెళ్లి జరగలేదు.. మిమ్మల్ని ఇందూ మోసం చేసిందని ఐశ్వర్య చెబుతుంది. ఈ వీడియో నమ్మొద్దని మాకు నిజంగానే పెళ్లి జరిగిందని ఇందూ చెబుతుంది. అయితే సాక్ష్యం ఏంటని రేఖ అడగ్గా.. ఇంతలో నందూ వచ్చి పోలీసుల సమక్షంలోనే రాజ్- ఇందూల పెళ్లి జరిగిందని మ్యారేజ్ సర్టిఫికెట్ చూపిస్తుంది. దాంతో ఐశ్వర్య షాక్ అవుతుంది. మరి ఈ వీడియో ఏంటని రేఖ అడగ్గా.. ఏఐ టెక్నాలజీతో ఐశ్వర్య ఇలా చేసిందని రాజ్ ఓ వీడియో తీసి నమ్మిస్తాడు. దాంతో ఐశ్వర్యకి క్లాస్ పీకుతుంది రేఖ. లాస్ట్‌ మినిట్‌లో వచ్చి తనను కాపాడినందుకు నందూకి థ్యాంక్స్ చెబుతుంది ఇందూ. మందు కోసం కక్కుర్తిపడి మన డీల్‌ గురించి బయటపెట్టేస్తావా అని రాజ్‌పై రగిలిపోతుంది ఇందూ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 23వ తేదీ ఎపిసోడ్ 1066లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial June 23rd 2026 Episode 1066 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

నేను అద్దె మొగుడినే అయినా మనిద్దరం పార్ట్‌నర్స్ కదా? అలాంటప్పుడు ఒకరినొకరం కాపాడుకోవాలి కదా అని ఇందూతో అంటాడు రాజ్. నేనేదో చేయరాని నేరం చేశాను అన్నట్లు ఎందుకిలా మాట్లాడుతున్నావని ఫైర్ అవుతుంది ఇందూ. నిన్ను అనవసరంగా తెచ్చిపెట్టుకున్నాను, నీ ముఖానికి నేను తప్ప వేరే దిక్కులేదని అంటుంది. ఇందూ- రాజ్ గొడవ పడుతుండగా అపర్ణ రావడంతో అంతా షాక్ అవుతారు. మీరిద్దరూ అలా తిట్టుకుంటూ గొడవపడుతున్నారు? బయట ఎవరైనా చూస్తే మీరిద్దరూ భార్యాభర్తలా? కాదా? అన్న అనుమానం వస్తుందని అంటుంది అపర్ణ. దాంతో మేం నిజంగానే భార్యాభర్తలం, నేను తన భర్తని కాబట్టే భుజంపై చేయి వేసినా ఏం అనడం లేదు, లేదంటే లాగిపెట్టి కొట్టేది కదా అని కవర్ చేస్తాడు రాజ్.

మీ మనవరాలు చీటికి మాటికీ కాలు దువ్వుతుంది.. కానీ నేను మాత్రం తగ్గను, పెళ్లాం చేతిలో కీలుబొమ్మను కాదు అంటాడు రాజ్. కొత్తగా పెళ్లయిన వారికి ఏవో ఒక అండర్‌స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగని తిట్టుకోవడం, కొట్టుకోవడం పరిష్కారం కాదు. ఒకరినొకరు అర్ధం చేసుకుని అడ్జెస్ట్ చేసుకోవాలని చెబుతుంది అపర్ణ. అబ్బాయి మనింట్లోనే ఉంటున్నాడు, నువ్వు కాస్త సర్దుకోవాలని చెబుతుంది. నువ్వు నా మీద ఎందుకు చేయి వేశావని ఇందూ అడగ్గా.. అలా వేయకపోతే నేను అద్దె మొగుడిని అని మీ నానమ్మకి తెలిసిపోయేదని అంటాడు రాజ్. అసలు నువ్వు ఆ లక్కీగాడి దగ్గర మన మేటర్ ఎందుకు లీక్ చేశావని ప్రశ్నిస్తుంది. ముందు ఆ క్లయింట్ ఇచ్చిన డీల్ గురించి ఆలోచించు.. నాకు డబ్బులు కావాలని అంటాడు రాజ్. నీ గురించి నా కన్నా ఎవరికీ ఎక్కువ తెలియదు, నువ్వు డబ్బు మనిషివి, స్వార్ధపరుడివి అని నానామాటలు అంటుంది ఇందూ.

చిన్నోడు ఇంటి కోసం కష్టపడుతుంటే.. పెద్దోడు ఇలా తయారయ్యాడని చలపతి బాధపడతాడు. నిజంగానే ఇందూ, రాజ్ కలిసి బిజినెస్ చేస్తున్నారా? లేకపోతే వాడికి గతం గెలిసి నిజాన్ని వెతుక్కుంటూ వెళ్లాడా అని భార్యను అడుగుతాడు. ఒకవేళ వాడికి గతం తెలిసి నిజాన్ని వెతుక్కుంటూ వెళ్తే వాడి ప్రాణానికే ప్రమాదమని అంటుంది లక్ష్మీ. ఒకవేళ ఇకపై నిజం తెలిస్తే పరిస్ధితి ఏంటీ అని భయపడతాడు చలపతి. వాడు బిజినెస్ అంటూ ఆ ఇంటి చుట్టూనే తిరుగుతున్నాడు కాబట్టి.. నిజం తెలిసే అవకాశం ఉందని చెబుతుంది లక్ష్మీ. అదే జరిగేతే వాళ్ల అమ్మ నాన్న చావుకి కారణమైన రేఖని అస్సలు వదిలిపెట్టడు. ఖచ్చితంగా ఎదురుతిరుగుతాడు, ఆ రేఖ మంచిది కాదు ఖచ్చితంగా మన రాజ్‌ని ఏదో ఒకటి చేస్తుందని భయపడుతుంది లక్ష్మీ. అలా జరగకూడదంటే ఆ ఇంటి ఛాయలకు వెళ్లేలా చేద్దాం, లేదంటే వాడు మనకి దక్కడని అనుకుంటారు.

మందు తాగించి నా నిజాలు బయటకు లాగుతావా అని లక్కీపై ఫైర్ అవుతాడు రాజ్. నాకంటే నిన్నే ఎక్కువ నమ్మాను, ఇంత నమ్మకద్రోహం చేస్తావా? ఎంతకు అమ్ముడుపోయావని నిలదీస్తాడు రాజ్. నేను నీకు అలా చేస్తానా? నువ్వు నా ప్రాణమని అంటాడు లక్కీ. ఆ రోజు ఐశ్వర్య నా దగ్గరికి వచ్చి.. ఇందూ గురించి రాజ్ మనసులో ఏముందో తెలుసుకో, కిడ్నాప్ చేసిన వాడే పెళ్లి చేసుకున్నాడంటే ఇందూ జీవితం బాగుంటుందో లేదోనని భయంగా ఉందని తెగ ఫీలైపోయింది. వాడి మనసులో ఏముందో తెలుసుకుంటే మంచిదే కదా అని నేను కూడా హెల్ప్ చేశానని చెబుతాడు లక్కీ. అది నన్ను బకరాని చేసిందని అంటాడు రాజ్.

ఆ ఐశ్వర్య నాకు హగ్ ఇచ్చిందని మురిసిపోతాడు లక్కీ. నీ వీక్‌నెస్ మీద కొట్టి నన్ను ఇరికించాలని చూసింది, నేను చెప్పినదంతా వీడియో రికార్డ్ చేసింది. ఆ వీడియోని పార్టీలో అందరి ముందు ప్లే చేసింది. సమయానికి నందూ రాకపోయుంటే ఇరుక్కుపోయే వాడిని అంటాడు రాజ్. అది పాములాంటిది తనని అస్సలు నమ్మొద్దని వార్నింగ్ ఇస్తాడు. సీఈవో అయ్యాక ఫస్ట్ కాంట్రాక్ట్ తీసుకోబోతున్నందుకు తాత, నానమ్మల ఆశీర్వాదాలు తీసుకుంటుది ఇందూ. ఆ రేఖ వాళ్ల మన కుటుంబం, మన కంపెనీ ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కానీ తనముందు నువ్వు భయపడుతున్నట్లు నటిస్తున్నావు, కాకపోతే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని మళ్లీ నిలబెట్టేలా చేయమని చెబుతుంది అపర్ణ.

కంపెనీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసిన తర్వాత మీకు ఆపరేషన్ చేయిస్తానని సుభాష్‌తో అంటుంది ఇందూ. ఇప్పుడు నేను నా కళ్ల మీద నిలబడటం కంటే నువ్వు సీఈవో పదవిలో నిలదొక్కుకోవడం చాలా అవసరం. సీఈవో పదవి ముళ్ల కిరీటం లాంటిది, ఏ సమస్య వచ్చినా పోరాడుతూ ముందుకు వెళ్లాల్సిందే, ధృడ సంకల్పంతో పట్టు వదలని విక్రమార్కుడిలా ఉంటే కాలం కూడా తలవంచక తప్పదు. నీ అంతట నువ్వే సొంత నిర్ణయాలు తీసుకోవాలని చెబుతాడు సుభాష్.

మళ్లీ తనను కలిసిన ఐశ్వర్యపై మండిపడతాడు లక్కీ. నన్ను పావుగా వాడుకుని నా ఫ్రెండ్‌ని ఇరికించాలని చూస్తావా అంటూ ఫైర్ అవుతాడు. నువ్వు మా ఇంటికి వచ్చి.. ఆ రోజు రాత్రి వాడు నీతో చెప్పినదంతా మా ఇంట్లో వాళ్లకి చెప్పాలని ఐశ్వర్య చెప్పడంతో లక్కీ షాక్ అవుతాడు. ఆ రోజు ఏం తాగానో నాకేం గుర్తులేదు అంటాడు. ఏం పర్లేదు.. నేను చెప్పినట్లు చెబితే చాలని మా ఇంటికొచ్చి చెబితే చాలని అంటుంది ఐశ్వర్య. రాజ్ గాడు నా ఫ్రెండ్.. నేను వాడిని మోసం చేయలేనని తేల్చేస్తాడు లక్కీ.

అందరూ సీఈవో అవ్వగానే ఇందూ తన సొంత నిర్ణయాలు తీసుకుంటుందని అనుకుంటున్నారు. కానీ ఆ ఇందూ ఈ రేఖ నీడలో బతుకుందన్న విషయం ఎవరికీ తెలియదని అంటుంది రేఖ. ఇందూ ఇన్నిరోజులు నువ్వు చెప్పింది చేసింది కానీ, ఈరోజు ఆ కాంట్రాక్ట్ మీద వేలిముద్రలు వేసిన తర్వాత డబ్బులు వచ్చాక.. అప్పుడు తోక జాడిస్తే ఏంటీ పరిస్ధితి అని భ్రమరాంబ ప్రశ్నిస్తుంది. డబ్బులు వస్తే ఎవరైనా మారిపోతారని భూషణ్ కూడా అంటాడు. ఎవరైనా మారతారు కానీ ఇందూ మారదు అంటుంది రేఖ. ఇందూకి చదువు రాదు ఎక్కడపడితే అక్కడ డబ్బు సంపాదించుకుందామని అనుకుంటే ఆ రాజ్‌గాడు అడ్డుపడ్డాడు. అలాంటిది ఈ ఇందూలో మార్పు రాదని ఏంటీ గ్యారంటీ అని ప్రశ్నిస్తుంది భ్రమరాంబ.

అది నాకు ఎదురుతిరగదు.. మన కంపెనీకి ఏ కాంట్రాక్టర్ అయినా చెక్కురూపంలోనే అడ్వాన్స్ ఇస్తాడు. ఇందూ ఆ చెక్ తీసుకొచ్చి నా చేతుల్లో పెడుతుందని అంటుంది రేఖ. మధ్యలో అల్లుడొచ్చి చెక్‌ని తీసుకుంటే అని శేషం అడుగుతాడు. మాటలు తప్పించి వాడేం చేయలేడని చెబుతుంది రేఖ. కిడ్నాప్ చేసిన ఇందూనే పెళ్లి చేసుకున్నాడు, నువ్వు అడ్డుపడకపోతే అల్లుడే సీఈవో అయ్యేవాడని అంటాడు శేషం. మనం అనుకున్నది ఏం జరగడంలేదు.. ఆ రాజ్‌గాడు ఏది జరగనివ్వడం లేదని భ్రమరాంబ అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X