Brahmamudi June 24th Episode: టార్గెట్ స్వప్న.. యామిని గేమ్ స్టార్ట్.. అక్క కోసం కావ్య టెన్షన్

Photo Courtesy: JioHotstar

యామినిపై చేసిన ఆరోపణలకు తగ్గ ఆధారాలు చూపించలేకపోవడంతో అప్పూపై రాజ్ కోప్పడతాడు. ఇంతలో కనకం జోక్యం చేసుకుని ఆ యామిని గురించి ఆధారాలెందుకు నాలుగు తగిలిస్తానని మండిపడుతుంది. దాంతో కనకంను తీసుకుని వెళ్లిపోమని అప్పూకి చెబుతుంది కావ్య. యామిని తప్పు చేయడం లేదని మీరు నమ్ముతున్నారా? లేదా? అని రాజ్‌ని అడుగుతుంది. దానికి రాజ్ నమ్మడం లేదని చెప్పడంతో మీరిద్దరూ సంతోషంగా పెళ్లిచేసుకోమని చెబుతుంది కావ్య.

యామిని మెడలో రాజ్ మూడు ముళ్లు వేయబోతుండగా కావ్యతో గడిపిన క్షణాలు గుర్తు రావడంతో అతను పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లిపోతాడు. దాంతో యామిని, ఆమె పేరెంట్స్ షాక్ అవ్వగా.. దుగ్గిరాల ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటుంది. రాజ్ ఇంకా యామిని దగ్గరే ఉన్నాడని, మనింటికి తిరిగి రాలేదని కావ్య చెప్పడంతో అంతా టెన్షన్ పడతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 24వ తేదీ ఎపిసోడ్ 756లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial June 24th 2025 Episode 756 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

నేను పెళ్లికి నో చెబితే యామిని ఏమైపోతుందోనన్న భయంతోనే ఈ పెళ్లికి ఒప్పుకున్నానని అంటాడు రాజ్. కానీ మూడు ముళ్లు వేసే సమయంలో తనని మోసం చేస్తున్నానేమో అనిపించిందని అందుకే పీటల మీద నుంచి వచ్చేశానని చెబుతాడు. ఇప్పుడు నువ్వు ఏం సాధించావని రాజ్‌ని నిలదీస్తుంది వైదేహి. అది ప్రాణం తీసుకుంటోందని అనేసరికి యామిని బట్టలు మార్చుకుని బయటికి వస్తుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ప్రాణం తీసుకోవడానికి వెళ్లిన నీ కూతురు ఇలా బయటికి వచ్చిందేంటీ అని ఆశ్చర్యపోతున్నావా? అని అడుగుతుంది.

బావ నాతో పెళ్లి ఇష్టం లేదని చెప్పగానే ఆ క్షణంలోనే నేను చనిపోవాలని అనిపించిందని, కానీ అదే క్షణంలో బావ ఏమైపోతాడోనని ఆలోచించానని అంటుంది. చివరి క్షణంలో తాళి కట్టడానికి ఎందుకు నో చెప్పాడా అని ఆలోచించా.. అసలు బావకి ఈ పెళ్లి అంటేనే ఇష్టం లేదని చెబుతుంది. నాకు ఏమవుతుందోనన్న భయంతోనే ఈ పెళ్లికి ఒప్పుకున్నాడని, బావ మనసులో ఇంకెవరో ఉన్నారని అంటుంది యామిని. అందుకే నా మెడలో తాళి కట్టలేకపోయాడని చెబుతుంది.

నాకు ఏమీ కాకూడదని, తన ఇష్టాన్ని చంపుకుని ఈ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని అంటుంది యామిని. నాకు కావాల్సింది బావ జాలి కాదని, ప్రేమ అని చెబుతుంది. నీ మనసులో మరొకరు ఉండగా, నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావని రాజ్‌తో అంటుంది. నువ్వే జీవితమని ఇన్నాళ్లు అనుకున్నానని.. అలాంటిది నేనంటే ఇష్టం లేదనే నిజాన్ని జీర్ణించుకోవడం కొంచెం కష్టమనే అంటుంది యామిని. నిన్ను పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ బాధపడటం కంటే నీకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతుంది. ఆ మాటలతో రాజ్, యామిని తల్లిదండ్రులు షాక్ అవుతారు. నువ్వు ఎవరినైతే ఇష్టపడ్డావో, వాళ్లనే పెళ్లి చేసుకోమ్మని అంటుంది.

నీకు నా మీద కోపం లేదా అని రాజ్ ప్రశ్నించగా.. నువ్వంటే నాకు ఎంత ఇష్టమంటే? కోపాన్ని కూడా మరిచిపోయేంత అని చెబుతుంది. ఈ పెళ్లి చేసుకోనని చెప్పి నిన్ని అవమానించానని అంటాడు రాజ్. జరిగినదంతా మరిచిపో.. ఇక జరగాల్సినది ఆలోచించమని చెబుతుంది యామిని. ఇంతకీ నీ మనసులో ఉన్న అమ్మాయెవరు? అని ప్రశ్నిస్తుంది. కళావతి అని వెంటనే ఆన్సర్ ఇస్తాడు రాజ్. కళావతి చాలా మంచి అమ్మాయని.. ఈ విషయం తనకి తెలుసా అని ప్రశ్నిస్తుంది యామిని. ఇలా ఇన్‌డైరెక్ట్‌గా చెప్పడాలు.. ముసుగులో గుద్ధులాటలు వద్దని అంటుంది. వెంటనే వెళ్లి నీ మనసులో ఉన్న మాటను చెప్పేయ్, పెళ్లి చేసుకోమని డైరెక్ట్‌గా అడుగు అని చెబుతుంది.

కళావతికి నా మనసులో మాటను చెప్పాలని చాలాసార్లు ట్రై చేశానని, కానీ తను ఏమనుకుంటుందోనని అంటాడు రాజ్. నీలాంటి వాడికి నో చెప్పే అమ్మాయి ఉండదని, తప్పకుండా ఒప్పుకుంటుందని వెంటనే ప్రపోజ్ చేయమని చెబుతుంది యామిని. మరి నీ పరిస్థితి ఏంటని రాజ్ అడగ్గా.. నాకేం తక్కువ, నువ్వే ఒక మంచి అబ్బాయిని సెలెక్ట్ చేయ్ తప్పకుండా చేసుకుంటానని చెబుతుంది. డ్రెస్ మార్చుకుని కళావతి దగ్గరికి వెళ్లమని చెప్పడంతో రాజ్ ఆమెకు థ్యాంక్స్ చెప్పి బయల్దేరతాడు. కళావతిని పెళ్లి చేసుకొమ్మని బావతో చెబుతానని యాక్సెపెక్ట్ చేయలేదు కదా అని అంటుంది యామిని.

రాజ్ లేకపోతే నాకు జీవితమే లేదని చెప్పినదానివి, ఇప్పుడెంటీ ఇలా మాట్లాడుతున్నావేంటీ అని నిలదీస్తుంది వైదేహి. ఇప్పుడు కూడా నాది అదే మాట.. రాజ్ లేకుండా నాకు జీవితమే లేదని, జీవితాంతం నేను రాజ్‌తోనే కలిసి బతుకుతానని చెబుతుంది. కావ్యని పెళ్లి చేసుకోమ్మని రాజ్‌ని పంపంచి ఇలా మాట్లాడుతున్నావేంటీ అని యామినిపై మండిపడతాడు రఘునాథ్. చచ్చిపోవాలని డిసైడ్ అయ్యానని, నిద్రమాత్రలు కూడా రెడీ చేసి పెట్టుకున్నానని యామిని చెప్పడంతో వాళ్లిద్దరూ షాక్ అవుతారు. యామిని నిద్రమాత్రలు మింగుతుండగా రుద్రాణి ఫోన్ చేస్తుంది. నువ్వు చావడానికి రెడీ అయ్యావని అర్ధమవుతోందని.. కానీ యామిని ఒక్కసారి అనుకుంటే అది దక్కించుకునే వరకు నిద్రపోదని ధైర్యం నూరి పోస్తుంది రుద్రాణి.

నువ్వు చస్తే కావ్య, రాజ్‌‌లు రెండ్రోజులు ఏడ్చి ఆ తర్వాత కలిసిపోయి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారని, మరి నీ చావు వల్ల కలిగే ప్రయోజనం ఏంటని నిలదీస్తుంది రుద్రాణి. పెళ్లి ఇష్టం లేదని రాజ్ చెప్పాక, ఇక చేసేదేం లేదని అంటుంది యామిని. కావ్య ఒప్పుకుంటుందన్న నమ్మకంతోనే తనకు ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నాడని చెబుతుంది రుద్రాణి. కావ్య రిజెక్ట్ చేసే పరిస్ధితి క్రియేట్ చేస్తే రాజ్ నీ సొంతం చేసుకోమ్మని సలహా ఇచ్చినట్లు తల్లిదండ్రులతో చెబుతుంది యామిని. ఈ రోజు నుంచి ఆ కావ్యకి కౌంట్‌డౌన్ మొదలైందని.. రాజ్ నుంచి కావ్య దూరంగా పారిపోయేలా చేస్తానని అంటుంది.

స్వప్న ఎక్కడికో బయల్దేరుతుండగా రాహుల్ ఎక్కడికి అని అడుగుతుంది. హాస్పిటల్‌కు వెళ్తున్నానని తోడు రమ్మని అడగ్గా రాహుల్, రుద్రాణిలు రామని చెబుతారు. నిన్ను స్వప్నతో పాటు పంపితే ఆ యామిని ఉచ్చులో ఇరుక్కుంటావని పంపలేదని రుద్రాణి మనసులో అనుకుంటుంది. కావ్యకి యామిని ఫోన్ చేసి నా పెళ్లి పీటల మీదే ఆగిపోయిందని సంబరపడిపోతున్నావా? అని అడుగుతుంది. నేను ఈ పెళ్లిని ఆపను, కానీ ఈ పెళ్లి జరగదని ముందే చెప్పాను కదా అని అంటుంది కావ్య. ఇకపై నీ మీద నాదే గెలుపు అని చెబుతుంది యామిని. మీ ఆయన నీకు ప్రపోజ్ చేయడానికి వస్తున్నాడని.. ఆయన నీకు ఐ లవ్ యూ అని చెప్పగానే ఐ లవ్ యూ టూ అని చెబుదామని అనుకుంటున్నావా? అని ప్రశ్నిస్తుంది యామిని. తను నీకు ప్రపోజ్ చేయగానే నువ్వు రిజెక్ట్ చేయాలని లేదంటే నీకు పిచ్చి పట్టేలా చేస్తానని మండిపడుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X