Brahmamudi June 24th Episode: 50 లక్షలు కొట్టేసేలా రేఖ కుట్ర... ఒక్క సంతకంతో తిప్పికొట్టిన ఇందూ
Photo Courtesy: JioHotstar
నువ్వు తాగి మీ ఫ్రెండ్ దగ్గర వాగడం వల్ల మనం ఇరుక్కుపోయేవాళ్లమని రాజ్‌పై మండిపడుతుంది ఇందూ. నీకు డబ్బు తప్పించి, ఎలాంటి ఎమోషన్స్ లేవని నానామాటలు అంటుంది. వీరిద్దరి గొడవ చూసి అపర్ణ.. అసలు మీరిద్దరూ నిజమైన భార్యభర్తలేనా కదా అని నాకే అనుమానంగా ఉందని మండిపడుతుంది. దాంతో ఇందూని దగ్గరికి తీసుకుని.. మీ మనవరాలు నా భార్య. అద్దె మొగుడిని అయితే మీ మనవరాలు ఊరుకుంటుందా? లాగిపెట్టి కొడుతుందని అంటాడు రాజ్.
రాజ్ ఆ దుగ్గిరాల కుటుంబానికి దగ్గరై.. తన తల్లిదండ్రులకు చంపిన రేఖపై పగతీర్చుకుంటాడు. అదే జరిగితే వాడి ప్రాణానికే ప్రమాదమని, దీని నుంచి ఎలాగైనా కొడుకుని కాపాడుకోవాలని చలపతి- లక్ష్మీ అనుకుంటారు. సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ ఆర్డర్ తీసుకోవడానికి వెళ్తూ.. సుభాష్- అపర్ణల ఆశీర్వాదం తీసుకుంటుంది ఇందూ. మందు పేరిట నన్ను ట్రాప్ చేసి నా సీక్రెట్స్ అన్ని బయటకు లాగుతావా? నిన్న వెర్రివాడిని చేసి ఆ ఐశ్వర్య ఆడుకుంటోందని లక్కీకి వార్నింగ్ ఇస్తాడు రాజ్. ఇంతలో ఐశ్వర్య వచ్చి నువ్వు, మీ ఫ్రెండ్ ఆ రోజు ఏం మాట్లాడుకున్నారో మా ఆంటీకి చెప్పమని లక్కీతో అంటుంది ఐశ్వర్య. రాజ్ చెప్పిన మాటలు గుర్తొచ్చి లక్కీ జారుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 24వ తేదీ ఎపిసోడ్ 1067లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
సీఈవో అయ్యాక ఇందూ ఎదురుతిరుగుతుందని భ్రమరాంబ, భూషణ్ చెప్పడంతో రేఖ ఫైర్ అవుతుంది. నోటిని కొంచెం అదుపులో పెట్టుకోండి.. మీరేం కంగారుపడొద్దు ఆ ఇందూ తోక జాడించదు, ఆ రాజ్‌గాడిని ఏం చేయాలో అది చేస్తాను. అది కంపెనీ సీఈవోగా మాత్రమే మారింది. అంతేకానీ, కంపెనీలో కానీ.. ఈ ఇంట్లో కానీ అందరూ ఈ రేఖ చెప్పినట్లు తూచా తప్పకుండా పాటిస్తారు. ఆ విషయం మీకు ఈరోజే అర్ధమవుతుందని చెబుతుంది రేఖ. మాకు కాదు నీకు అర్ధమవుతుంది, అక్కడ అల్లుడు ఎంట్రీతో పర్ఫార్మెన్స్ అదరగొడతాడు.. ఖచ్చితంగా మీ ఆశలు అడియాసలు చేస్తాడని అనుకుంటాడు శేషం.
నందూ బోకేలు ఇవ్వడానికి వెళ్తుండగా బైక్ ఆగిపోవడంతో వెంకీకి కాల్ చేస్తుంది. నువ్వు త్వరగా వచ్చి నన్ను తీసుకెళ్లమని అడుగుతుంది. నా వల్ల కాదు.. మా బాస్ గురించి నీకు తెలుసు కదా? ఒక్క నిమిషం ఆలస్యమైనా జాబ్‌లోంచి తీసేస్తాడని చెబుతాడు వెంకీ. నేను నీకు ఎన్నిసార్లు హెల్ప్ చేశాను, ఈ ఒక్కసారి నాకు హెల్ప్ చేయలేవా అని ప్రశ్నిస్తాడు నందూ. నువ్వు అడగ్గానే నా పని పక్కన పెట్టి మరి నీకు హెల్ప్ చేయాలి, జాబ్‌లో జాయిన్ అవ్వగానే సెల్ఫీష్ అయిపోయావని మండిపడుతుంది నందూ. దాంతో చేసేదేం లేక నందూని పిక్ చేసుకోవడానికి వస్తాడు వెంకీ. నా డెలివరీ అయ్యాకే నీ డెలివరి చేస్తానిన వెంకీ చెప్పడంతో నందూ సరేనని అంటుంది.
ఇప్పుడు మనం చేసుకోబోయే అగ్రిమెంట్ చిన్నదే కావొచ్చు.. కానీ 100 పురాతన ఆలయాల్ని పునర్నిర్మిస్తున్నారు, అక్కడ ప్రతిష్టించబోయే విగ్రహాలకు ఇప్పటి జనరేషన్‌కి తగ్గట్టుగా నగలు చేయించాలని అనుకుంటున్నామని చెబుతాడు క్లయింట్. ఈ మొదటి కాంట్రాక్ట్‌లో మేం అనుకున్న విధంగా మీరు నగలు చేయిస్తే మిగిలిన కాంట్రాక్ట్స్ అన్నీ మీకే ఇస్తానని చెబుతాడు క్లయింట్. ఆ మాటలు వినగానే ఇందూ, రాజ్‌లు సంతోషిస్తారు. ఇప్పుడు నేను అనుకున్న విధంగా డిజైన్స్ చేయిస్తే ఖచ్చితంగా మీకే ఇస్తామని క్లయింట్ చెబుతాడు.
రాజ్- కావ్య గారు ఎలా అయితే డిజైన్స్ ఇచ్చారో ఇందూ గారు కూడా అలాగే ఇస్తారని చెబుతాడు రాజ్. మీరు ఏ విధంగా డిజైన్స్ అనుకుంటున్నారో మాకు శాంపిల్స్ చూపిస్తారా అని ఇందూ అడుగుతుంది. ఈ హర్షా గాడు ఏదో చిన్న డీల్ ఇస్తాడు అనుకున్నాం కానీ.. ఇంత పెద్ద డీల్ ఇస్తాడని అస్సలు అనుకోలేదని భూషణ్‌తో అంటుంది రేఖ. వీడికి చాలా పెద్ద బిజినెస్ నెట్‌వర్క్ ఉన్నట్లుగా ఉందని భూషణ్ అనడంతో వీడిని మన గ్రిప్‌లో పెట్టుకుంటే మనకి చాలా బిజినెస్ వస్తుందని రేఖ అనుకుంటుంది. విగ్రహలకు తగ్గట్లుగా నగలు చేయిస్తాం.. ఈ రెండ్రోజుల్లో దానికి సంబంధించిన డిజైన్స్ అన్ని మీకు చూపిస్తాం, ఆ డిజైన్స్ మీకు నచ్చిన తర్వాతే మేం మాన్యుఫాక్చరింగ్‌కి పంపిస్తామని అంటుంది ఇందూ. దానికి క్లయింట్ హర్ష కూడా సరేనని అంటాడు.
ఇందూ మాట్లాడిన మాటలు, ఆమె ప్రవర్తన బాగా చదువుకున్న దానిలా, బిజినెస్ గురించి బాగా తెలిసిన దానిలా ఉందని రేఖకి అనుమానం వస్తుంది. సీఈవో అయ్యింది కదా? మేనేజ్ చేయాలని ఆన్‌లైన్ వీడియోలు చూసి మేనేజ్ చేసినట్లుగా ఉందని అంటాడు భూషణ్. అయితే మనం కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేసుకుందామని హర్ష సంతకం చేసి.. ఫైల్ ఇందూకి ఇస్తాడు. దానిని ఇందూ చదువుతున్నట్లుగా ఉండటంతో రేఖకి మళ్లీ అనుమానం వస్తుంది. చదువుతున్నట్లుగా నటిస్తోంది నువ్వేం కంగారు పడొద్దని భూషణ్ అంటాడు. అది నిజంగానే చదువుతోంది.. కాసేపట్లో మీకు మైండ్ బ్లాక్ అవుతుందని అనుకుంటాడు రాజ్.
డిజైన్స్ చేయడం లేట్ అయినా, డెలివరీ చేయడం లేట్ అయినా పెనాల్టీ వేస్తానని హర్ష వార్నింగ్ ఇవ్వడంతో రాజ్, ఇందూలు షాక్ అవుతారు. నా బిజినెస్, నా రూల్స్ నాకు ఖచ్చితంగా ఉంటాయి.. వీటిని ఎప్పుడూ బ్రేక్ చేయను అని చెబుతాడు హర్ష. ఇంతలో ఫైల్ మీద ఇందూ సంతకం చేయడంతో రేఖ, భూషణ్ షాక్ అవుతారు. అంటే తనకు చదవడం, రాయడం కూడా రాదు కదా అని భూషణ్ అడుగుతాడు. ఇంటి దగ్గర చూసుకుందామని చెబుతుంది రేఖ. హర్ష అడ్వాన్స్ కింద 50 లక్షల రూపాయలు ఇవ్వడంతో రేఖ, భూషణ్‌లు సంబరపడిపోతారు. ఇందూ దగ్గరున్న బ్రీఫ్ కేస్‌ని రేఖ లాక్కుంటూ ఉండగా.. రాజ్ మధ్యలో జోక్యం చేసుకుంటాడు.
ఇప్పుడు మన కంపెనీ ఎంప్లాయిస్‌కి శాలరీలు ఇవ్వాలని చెప్పి వెళ్లిపోతుంది ఇందూ. నువ్వు చెప్పింది ఏంటీ? ఇక్కడ జరిగింది ఏంటీ? డబ్బులు రాగానే ఇందూ ప్లేట్ మార్చేసింది.. జీతాలు ఇస్తే ఉద్యోగులు దానిని నెత్తిమీద పెట్టుకుంటారని రేఖపై మండిపడతాడు భూషణ్. ముందు తను ఎలా సైన్ చేసింది? ఇంటికి వెళ్లగానే తేల్చుకుందామని అంటుంది రేఖ. డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన నందూకి లోకేషన్ అర్ధం కాకపోవడంతో కస్టమర్‌కి కాల్ చేస్తాడు వెంకీ. అయితే అతని పక్కన వెంకీ మాజీ గర్ల్‌ఫ్రెండ్ రోజా కనిపించి నానామాటలు అంటుంది.
నీ ప్రేమను నేను యాక్సెప్ట్ చేయలేదు. ఒకవేళ చేసుంటే నీతో పాటే నేను కూడా ఇలా డెలివరీలు ఇస్తూ ఉండాలని అంటుంది. మధ్యలో నందూ జోక్యం చేసుకుని.. డ్రెస్సుల కోసం డబ్బుల కోసం బాయ్‌ఫ్రెండ్స్‌ని మారుస్తావని రోజాకి కౌంటర్ వేస్తుంది. కష్టపడి వీడి ఫ్యామిలీని చూసుకుంటున్న వాడి కాలిగోటికి కూడా సరిపోవు, ఎంతో పుణ్యం చేసుకుంటే ఇలాంటి వాడు లైఫ్‌లోకి వస్తాడని అంటుంది. ఈరోజు ఇలా ఉండొచ్చు.. కానీ వీడు ఖచ్చితంగా ఏదో ఒకరోజు గొప్ప పొజిషన్‌కి వెళ్తాడని చెబుతుంది నందూ. దాంతో నందూపై వెంకీకి ప్రేమ కలుగుతుంది. ఉద్యోగస్తులకి ఇందూ జీతాలు ఇవ్వడంతో అంతా సంతోషిస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications