Brahmamudi June 25th Episode: యామిని ట్రాప్‌లో స్వప్న.. కావ్య ఎత్తులకు యామిని చిత్తు, రాజ్ ఆశలు ఆవిరి
Photo Courtesy: JioHotstar
గదిలో లాక్ చేసుకున్న యామిని కోసం అంతా టెన్షన్ పడతారు. రాజ్‌ను వైదేహి, రఘునాథ్‌లు నానామాటలు అంటారు. ఇంతలో యామిని డ్రెస్ చేంజ్ చేసుకుని బయటికి రావడంతో అంతా షాక్ అవుతారు. బావ పెళ్లి చేసుకోనని చెప్పడంతో నిజంగానే చనిపోదామని అనుకున్నానని.. కానీ రుద్రాణి ఫోన్ చేసి ధైర్యం నూరిపోయడంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు యామిని చెబుతుంది.నీ మనసులో ఉన్నది ఎవరు? అని అడగటంతో కళావతి అని పేరు చెబుతాడు.
ఇంకా తనకు ప్రపోజ్ చేయకుండా ఏం చేస్తున్నావని యామిని అడగటంతో టైం రాలేదని చెబుతాడు రాజ్. వెంటనే ఆమెకు నీ మనసులో మాటను చెప్పమని రాజ్‌కు చెప్పడంతో అతను చాలా సంతోషిస్తాడు. స్వప్న ఎక్కడికో బయల్దేరుతూ రాహుల్, రుద్రాణిలను తోడు రమ్మని అడుగుతుంది. వాళ్లు రాకపోవడంతో ఒంటరిగానే వెళ్తుంది. కావ్యకి యామిని ఫోన్ చేసి రాజ్ నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు ఐ హేట్ యూ అని చెప్పాలని వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 25వ తేదీ ఎపిసోడ్ 757లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
బావే నా సర్వస్వం అని బతుకుతున్న నా కలను నాశనం చేసిన మిమ్మల్ని అంత తేలిగ్గా వదలనని కావ్యతో అంటుంది యామిని. పెళ్లి ఆగిపోయిందని అంతా సంతోషంగా ఉన్నారని.. కానీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెబుతుంది యామిని. యామినిని అంత సింపుల్‌గా తీసుకోకూడదు.. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి కదా అని అంటుంది. ఇంట్లో అందరూ ఉన్నారు? మరి స్వప్న ఎక్కడ? అని మీరు ఆలోచించాలి కదా అని సెటైర్లు వేస్తుంది. అందరూ అనుకున్నట్లు స్వప్న హాస్పిటల్‌కు వెళ్లలేదు.. తను కిడ్నాప్ అయ్యిందని చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. మీ అక్కని సేవ్ చేసుకుంటావో? చంపుకుంటావో చూసుకో అని అంటుంది
రాజ్- యామినిల పెళ్లి ఆగిపోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మాట్లాడుకుంటుంది. రాజ్ ఎక్కడ ఆ యామిని మెడలో తాళి కడతాడో? ఎక్కడ కావ్య జీవితం నాశనం అయిపోతుందోనని? చాలా కంగారు పడ్డానని అపర్ణ అంటుంది. రాజ్ వచ్చి కావ్యకి ప్రపోజ్ చేశాడంటే వాళ్లిద్దరికి ముడిపెట్టడమే అని చెబుతుంది ఇందిర. ఇంతలో రాహుల్‌ని కావ్య పిలుస్తూ కంగారుగా ఉండటంతో అంతా షాక్ అవుతారు. స్వప్న ఎక్కడ అని అడగ్గా.. పాపకి డ్రాప్స్ వేయడానికి హాస్పిటల్‌కు వెళ్లిందని అంటాడు రాహుల్. భార్య బయటికి వెళ్తున్నప్పుడు తనకు తోడుగా వెళ్లాలని తెలియదా అని మండిపడుతుంది. నా కొడుకుని ఎందుకు తిడుతున్నావని కావ్యపై రుద్రాణి ఫైర్ అవుతుంది.
అసలు కోడలు ఇళ్లు దాటి బయటికి వెళ్తున్నప్పుడు కొడుకుని తోడుగా వెళ్లమని చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? అని రుద్రాణిఫై ఫైర్ అవుతుంది. మా అక్క అంటే కొంచెమైనా రెస్పాన్సిబులిటీ ఉందా? అని ప్రశ్నిస్తుంది. మీ అక్క చిన్నపిల్ల కాదని, ఇద్దరు పిల్లలకు తల్లి అని చెబుతుంది రుద్రాణి. చేతిలో పసిబిడ్డ ఉన్నప్పుడు తోడుగా వెళ్లాలన్న జ్ఞానం లేదా అని మండిపడుతుంది. సాయంత్రం వరకు వెయిట్ చేయమంటే మీ అక్కే వెళ్లిపోయిందని అంటుంది రుద్రాణి. మా అక్క వెళ్లిన విషయం తెలిసుంటే ఖచ్చితంగా తోడుగా వెళ్లేదాన్నని అంటుంది కావ్య. స్వప్న వెళ్లింది హాస్పిటల్‌కే కదా? తనని ఎవరో కిడ్నాప్ చేయబోతున్నారు అన్నట్లు అంత కంగారు పడుతున్నావేంటీ అని ప్రశ్నిస్తుంది ఇందిర.
అర్జెంట్‌గా అక్క దగ్గరికి వెళ్లాలని కావ్య బయల్దేరుతుండగా రాజ్ వస్తాడు. స్వప్న కిడ్నాప్ గురించి ఇంట్లో వాళ్లకి చెబితే కంగారుపడతారని తను ఒక్కటే వెళ్లాలని అనుకుంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదని, ఇంట్లోనే ఉండాలని అపర్ణ, ఇందిర చెబుతారు. నాకు మీతో మాట్లాడేంత టైం లేదని, నేను వచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందామని రాజ్‌తో చెబుతుంది కావ్య. ఇంట్లో వాళ్లంతా చెబుతున్నా వినిపించుకోకుండా కావ్య వెళ్లిపోతుంది. నేను ఎంతో ఆశతో వస్తే కళావతి అలా వెళ్లిపోయిందేంటీ అని రాజ్ ప్రశ్నిస్తాడు. నువ్వు కావ్యకి ప్రపోజ్ చేస్తావని కదా ఆ యామిని .. స్వప్నని కిడ్నాప్ చేసిందని మనసులో అనుకుంటుంది రుద్రాణి. కావ్యకి నిజంగానే ఏదో అర్జెంట్ పని పడినట్లుందని అందుకే అలా వెళ్లిపోయిందని రాజ్‌తో చెబుతుంది అపర్ణ.
స్వప్నని తన కారు డ్రైవర్ మరో రూటుకి తీసుకెళ్తుండగా ఆమెకు అనుమానం వస్తుంది. స్వప్న ఫోన్ కోసం వెతుకుతుండగా.. దీని కోసమే వెతుకుతున్నావా? అని డ్రైవర్ ఫోన్ చూపిస్తాడు. సైలెంట్‌గా ఉంటే సేఫ్‌గా ఉంటావని ఆమెను డ్రైవర్ బెదిరిస్తాడు. ఈలోగా కావ్య ఆసుపత్రికి వెళ్లి స్వప్న వచ్చిందా? లేదా? అని ఎంక్వైరీ చేస్తుంది. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుందని, ఆసుపత్రికి కూడా రాలేదని చెబుతున్నారని కావ్య టెన్షన్ పడుతుంది. స్వప్నని యామిని మనుషులు కారులోనే కిడ్నాప్ చేసి ఉంటారని కావ్యకి డౌట్ వస్తుంది. స్వప్న అక్కని ఎలా కనిపెట్టాలని ఆలోచిస్తుండగా జీపీఎస్ ట్రాకర్ గురించి గుర్తోస్తుంది. వెంటనే మేనేజర్‌కు ఫోన్ చేసి జీపీఎస్ ట్రాకర్ యాక్సెస్ గురించి అడుగుతుంది.
నాతో పెళ్లి అయిపోగానే బావ నీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేస్తాడని అనుకుంటున్నావా? నీ ఆశని ఈ యామిని నెరవేరనివ్వదని మనసులో అనుకుంటుంది యామిని. అక్క కోసం చెల్లెలు ఎంత కంగారు పడుతుందో? ఏంటో? అని కావ్యకి ఫోన్ చేస్తుంది. హాస్పిటల్‌కు వెళ్లావా? మీ అక్క రాలేదని చెప్పారా? అని మండిపడుతుంది. నువ్వు పెట్టుకుంది ఈ యామినితో అని ఆలోచించావా?థింక్ బిగ్ అని సెటైర్లు వేస్తుంది. ఇంకో ఐదు నిమిషాల్లో మా అక్క ఎక్కడుందో కనిపెట్టి.. తన చేత్తోనే నీకు హాయి చెప్పిస్తానని కావ్య చెప్పడంతో యామిని షాక్ అవుతుంది. నువ్వు సీఐడీ అనుకుంటున్నావా? మీ అప్పూలాగా పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నావా? అని మండిపడుతుంది. నీ లాంటి వాళ్ల ప్లాన్స్ డీకోడ్ చేయడానికి అంత ఇంటెలిజెన్స్ వాడాల్సిన అవసరం లేదని నా రేంజ్ చాలని అంటుంది కావ్య.
దుగ్గిరాల ఫ్యామిలీ అంతా టిఫిన్ చేస్తుండగా రాజ్ డల్‌గా కూర్చొని ఉంటాడు. కళావతి కోసం పీటల మీద పెళ్లిని వదిలేసి వచ్చానని.. నన్ను ఇక్కడికి పంపించింది యామినియేనని అంటాడు. నువ్వంటే తనకు ప్రాణం కాబట్టి కళావతికి ప్రపోజ్ చేస్తే ఊరుకుంటుందా అని అడుగుతుంది అపర్ణ. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. కళావతి అంటే నాకు ప్రాణామని కన్విన్స్ చేశానని దాంతో కళావతికి ప్రపోజ్ చేయమని యామినియే ఇక్కడికి పంపించిందని అంటాడు. యామిని అలా మాట్లాడిందంటే నాకు అనుమానంగా ఉందని ఇందిరతో అపర్ణ చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











