Brahmamudi June 25th Episode: ఐశ్వర్య కిడ్నాప్‌కి రాకేష్ యత్నం.. అక్కని కాపాడిన ఇందూ
Photo Courtesy: JioHotstar
ఇందూ సీఈవో అయ్యాక ఎదురు తిరుగుతుందని భయపడుతుంది భ్రమరాంబ. అయితే రేఖ మాత్రం అది ఎప్పటికీ నా కీలుబొమ్మ.. నాకు ఎదురుతిరిగితే ఏం జరుగుతుందో దానికి బాగా తెలుసని అంటుంది. నందూ అర్జెంట్‌గా ఒకచోట బోకేలు ఇవ్వడానికి వెళ్తుండగా బైక్ ఆగిపోతుంది, దాంతో వెంకీని పిలిపించి ఇద్దరూ ఒకే బైక్ మీద వెళ్తారు. బోర్డ్ మీటింగ్‌లో స్వరాజ్ కంపెనీకి 100 ఆలయాలలో విగ్రహాలకు బంగారు ఆభరణాలు తయారు చేసే కాంట్రాక్ట్ ఇస్తానని, కానీ ముందు శాంపిల్‌గా కొన్ని ఆభరణాలు చేయించాలని అంటాడు. అలాగే టైంకి డెలివరీ చేయకపోయినా, లేట్ అయినా పెనాల్టీ వేస్తానని అంటాడు. దాంతో ఇందూ, రాజ్‌లు షాక్ అవుతారు.
అగ్రిమెంట్ మొత్తం చదివి, దాని మీద ఇందూ వేలిముద్రలకు బదులుగా సంతకం చేయడంతో రేఖ, భూషణ్‌లు షాక్ అవుతారు. దీని సంగతి ఇంటి దగ్గర చూసుకుందామని అనుకుంటారు. అడ్వాన్స్ కింద హర్ష 50 లక్షల రూపాయలు ఇవ్వడంతో రేఖ సంబరపడిపోతుంది. ఈ డబ్బును నేను హ్యాండిల్ చేస్తానని రేఖ వెళ్లగా.. నేను చూసుకుంటానని రాజ్ బ్రీఫ్‌కేసును పట్టుకుంటాడు. కానీ వాళ్లిద్దరినీ చేయి తీయమని చెప్పి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి వెళ్తుంది ఇందూ. ఊహించని ట్విస్ట్‌తో రేఖ, భూషణ్‌లు షాక్ అవుతారు. ఫుడ్ ఆర్డర్ చేయడానికి వెళ్లిన వెంకీకి అక్కడ తన మాజీ గర్ల్‌ఫ్రెండ్ రోజా కనిపిస్తుంది. నీ బతుకు ఇదేనని నాకు తెలుసు, అందుకే నీ ప్రేమను రిజెక్ట్ చేశానని నానామాటలు అంటుంది. దాంతో నందూ రగిలిపోతూ.. ఇలాంటి వాడిని మిస్ అయినందుకు జీవితాంతం బాధపడతావు, ఏదో ఒకరోజున వీడు గొప్పొడు అవుతాడని చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 25వ తేదీ ఎపిసోడ్ 1068లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఎంప్లాయిస్‌కి శాలరీలు ఇచ్చిన ఇందూ.. ఇక మీదట కూడా మన కంపెనీ నుంచి ఎవ్వరికీ శాలరీలు మిస్ కావు, కరెక్ట్‌గా ఒకటో తారీఖున శాలరీలు పడిపోతాయని చెబుతుంది. ఆ మాటలతో రేఖ, భూషణ్‌లు షాక్ అవుతారు. ఇందూకి థ్యాంక్స్ చెప్పిన శృతి.. మా అమ్మగారికి ఆరోగ్యం బాలేదు, కొంచెం సీరియస్ కండీషన్‌లో ఉంది. హాస్పిటల్‌లో చెకప్ చేయించుకోవడానికి డబ్బులు సరిపోవడం లేదు. శాలరీ రాకపోతే ఏం చేయాలా అని కంగారు పడ్డాను అని బాధపడుతుంది. మరో ఎంప్లాయి మాట్లాడుతూ.. ఈరోజు మా పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడానికి ఆఖరి రోజు, జీతం రాకపోతే ఏం చేయాలా అని టెన్షన్ పడ్డాను, ఆన్‌లైన్‌లో లోన్ తీసుకోవాలా? తీసుకుంటే ఎలా కట్టాలి? అని బాధపడ్డాను. టైంకి శాలరీ ఇచ్చి పుణ్యం కట్టుకున్నారని ఇందూకి దండం పెట్టి కాళ్ల మీద పడతాడు.
మీ జీతం మీరు పనిచేసిన దానికి ఫలితం. మీకు న్యాయబద్ధంగా అందించాల్సింది అందించామని అంటుంది ఇందూ. మిమ్మల్ని చూస్తుంటే రాజ్- కావ్య మేడంలను చూసినట్లుగా ఉంది, మళ్లీ కంపెనీకి పూర్వ వైభవం వస్తుందని అంటుంది శృతి. అలా జరగాలంటే మనకి వచ్చిన కాంట్రాక్ట్‌ని మనం నిలబెట్టుకోవాలి, క్లయింట్‌కి నచ్చిన విధంగా పనిచేసి మంచి ఔట్‌పుట్ ఇవ్వాలని చెబుతుంది ఇందూ. వాళ్లు అడిగిన డిజైన్స్‌ని రేపు పంపిస్తానని అంటుంది శృతి.
బాకీ తీర్చాలంటూ నేరుగా దుగ్గిరాల ఇంటికి వచ్చి ఐశ్వర్యతో గొడవ పడతాడు రాకేష్. నాకు కొంచెం టైం ఇవ్వు.. నీ డబ్బులు నీకు తిరిగి ఇస్తానని అంటుంది ఐశ్వర్య. నువ్వు కలియుగం అంతం అయ్యే వరకు టైం అడుగుతావు, నిన్ను ఎత్తుకెళ్లిపోతే మీ ఇంట్లో వాళ్లే డబ్బులిస్తారని ఐశ్వర్యని లాక్కెళ్తుండగా ఇందూ వచ్చి రాకేష్‌ని లాగిపెట్టి కొడుతుంది. నాకేమీ మీ ఐశ్వర్యని తీసుకెళ్లాలని సరదా లేదు.. అప్పు తీసుకున్నాకా డబ్బులు ఇవ్వాలి కదా? ఇవ్వకపోతే నన్నేం చేయమంటావని రాకేష్ ప్రశ్నించడంతో అంతా షాక్ అవుతారు.
మీ ఐశ్వర్య నా దగ్గర పది లక్షలు తీసుకుందని రాకేష్ చెప్పడంతో రేఖ షాక్ అవుతుంది. అంత డబ్బు ఎందుకు తీసుకున్నావు? నువ్వు అడిగినప్పుడల్లా మీ రేఖ ఆంటీ డబ్బులు ఇస్తోంది కదా మళ్లీ అప్పు చేయడం ఏంటీ అని భూషణ్ నిలదీస్తాడు. నువ్వు ఇలా అప్పు చేస్తావని ఎవరూ ఊహించలేదు.. ఆఖరికి నేను కూడా అంటాడు శేషం. నువ్వు నిజంగానే అప్పు చేశావా అని ఐశ్వర్యని నిలదీస్తుంది రేఖ. అప్పు తీసుకున్నానని ఐశ్వర్య చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్లిపోతానని రాకేష్ చెప్పడంతో ఇందూ డబ్బులు ఇచ్చేస్తుంది. మళ్లీ మా ఇంటి జోలికి కానీ, మా ఐశ్వర్య జోలికి కానీ వస్తే బాగోదని వార్నింగ్ ఇస్తుంది.
నీ యాక్టింగ్ సూపర్ అంటూ ఐశ్వర్య చప్పట్లు కొడుతుంది. డబ్బులు ఇవ్వను, ఏం చేస్తావో చేసుకోమని నాతో ఛాలెంజ్ చేశావు కదా? ఇప్పుడు వీళ్లందరి ముందు నువ్వు గొప్పదానివి, మంచిదానివి.. నేను చెడ్డదానిని, అప్పులు చేసేదానిని అని ప్రూవ్ చేయాలని ఇలా చేశావని నానామాటలు అంటుంది ఐశ్వర్య. ఇందూ గురించి అనవసరంగా నోరుజారితే బాగోదని వార్నింగ్ ఇస్తాడు రాజ్. నువ్వు చేసిన తప్పుకి సిగ్గుపడాల్సింది పోయి నా మనవరాలిని తప్పుపడుతున్నావా? అసలు ఈ దుగ్గిరాల ఇంటి గురించి ఏమనుకుంటున్నావని మండిపడుతుంది అపర్ణ. ఇంత గొప్పింటిలో పుట్టి, ఎవరి దగ్గర పడితే వాళ్ల దగ్గర అప్పులు చేస్తావా? ఇలా మా ఇంటి పరువు తీయడం ఏంటని సుభాష్, అపర్ణలు ఫైర్ అవుతారు.
ఈ రోజు నా పెంపకం కంపెనీకి సీఈవో అయ్యింది, ఈ ఇంటి పరువు కాపాడింది. నీ పెంపకం నిన్ను నట్టింటిలో నిలబెట్టిందని రేఖపై ఫైర్ అవుతుంది అపర్ణ. ఆ వెంటనే ఇందూని తీసుకుని పక్కకి వెళ్లి డబ్బులు నాకెందుకు ఇవ్వలేదని క్లాస్ పీకుతుంది రేఖ. డబ్బులు రాగానే ఆఫీస్‌లో అందరికీ పంచేస్తావా? ఐశ్వర్య అప్పు తీర్చడం కోసం వాడి ముఖాన 10 లక్షలు కొట్టావు? అంతా నా ఇష్టమేనా? నీపాటికి నువ్వు సొంత నిర్ణయాలు తీసుకుంటావా అంటూ మండిపడుతుంది. నేను మీ మాటకి ఎదురుచెబుతానా? మీరు ఏం చెబితే అది చేస్తానని డ్రామా ఆడుతుంది ఇందూ. ఆఫీసులో ఎంప్లాయిస్‌కి జీతాలు ఇవ్వకపోతే మనం వాళ్లతో ఎలా పనిచేయించగలం, కానీ ఈ విషయం కాంట్రాక్ట్ ఇచ్చినవాడికి తెలిస్తే మనతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తారని చెబుతుంది ఇందూ. ఐశ్వర్యని ఆ పరిస్ధితుల్లో వదిలేయలేక డబ్బులు ఇచ్చానని అంటుంది. ఇక నుంచి ఇంటి విషయాల్లో, ఆఫీస్ విషయాల్లో మిమ్మల్ని అడగకుండా ఏ నిర్ణయం తీసుకోనని మిగిలిన 5 లక్షలు రేఖకి ఇచ్చేస్తుంది ఇందూ.
నువ్వు కాంట్రాక్ట్ మీద సైన్ చేయమంటే వేలిముద్రకు బదులు సంతకం ఎలా పెట్టావు? నీకు అసలు చదవడం, రాయడం రాదు కదా? అని నిలదీస్తుంది రేఖ. ఆ మాటలతో ఇందూ, రాజ్‌లు షాక్ అవుతారు. సంతకం విషయం తనకేం తెలుసు.. నేను చెబుతానని మధ్యలో జోక్యం చేసుకుంటాడు రాజ్. తనకి సంతకం పెట్టడం నేనే నేర్పించానని చెబుతాడు. ఇలా నా ఒడిలో కూర్చోబెట్టుకుని రాత్రంతా నేర్పించానని చూపిస్తాడు రాజ్. తను వేలిముద్రలు వేస్తే ఆ హర్ష ఏమనుకుంటాడు, చదువు కూడా రాని వ్యక్తికి కాంట్రాక్ట్ ఇవ్వాలా? తనని నమ్మి అంత డబ్బు ఇన్వెస్ట్ చేయాలా అని ఆలోచిస్తాడు కదా? అందుకే అలాంటి పరిస్ధితి రాకూడదని అలా చేశానిన అంటాడు రాజ్.
టైంకి నువ్వు భలే సేవ్ చేశావు లేదంటే దొరికిపోయేదానిని అని రాజ్‌తో అంటుంది ఇందూ. నువ్వు తప్పించుకుని నన్ను ఇరికించేశావు? నా ఆశలన్నీ తుంచేశావు? మొత్తం డబ్బులు తీసుకెళ్లి మీ రేఖ ఆంటీ చేతిలో పెట్టేశావు? ఇక నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏముందని నిలదీస్తాడు రాజ్. రాజు మంచోడు, ప్రతి ప్రాబ్లమ్ నుంచి నన్ను కాపాడుతున్నాడు అని కొంచెం కూడా లేదని మండిపడతాడు. చావు బతుకుల సమస్య అని చెప్పినా నువ్వు పట్టించుకోవడం లేదని మండిపడతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications