Brahmamudi June 26th Episode: కథలోకి కొత్త క్యారెక్టర్.. కావ్య, స్వప్నలని కాపాడిన రేవతి.. అపర్ణతో బంధం

Photo Courtesy: JioHotstar

కావ్యకి ఫోన్ చేసిన యామిని.. రాజ్ ప్రపోజ్ చేయడానికి మీ ఇంటికి వస్తున్నాడని కానీ నువ్వు మాత్రం తనకి ఐ టూ లవ్ యూ అని చెప్పడానికి వీల్లేదని వార్నింగ్ ఇస్తుంది. మీ ఇంట్లో అందరూ ఉన్నారని అనుకుంటున్నావా.. మీ స్వప్న అక్క పరిస్ధితి ఆలోచించావా అని అడుగుతుంది యామిని. అందరూ అనుకున్నట్లు మీ స్వప్న అక్క ఆసుపత్రికి వెళ్లలేదు కిడ్నాప్ అయ్యింది. అని చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. నీకు టైం లేదు.. వచ్చి కాపాడుకో అని యామిని చెబుతుంది.

దీంతో కంగారుపడ్డ కావ్య.. రాహుల్‌పై మండిపడి స్వప్న కోసం వెళ్తుండగా రాజ్ ఎదురవుతాడు. నాకు అర్జెంట్ పని ఉందని హడావుడిగా వెళ్లిపోతుంది కావ్య. స్వప్నని కారు డ్రైవర్ కిడ్నాప్ చేస్తాడు. ఆసుపత్రికి వెళ్లి స్వప్న కోసం వెతికిన కావ్యకి ఆమె అక్కడ కనిపించదు.. అయితే కారులో జీపీఎస్ ట్రాకర్ ఉన్నట్లు తెలుసుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 26వ తేదీ ఎపిసోడ్ 758లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial June 26th 2025 Episode 758 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రాజ్ ఫోన్ చేసి మీరు నన్ను అవమానించారని మండిపడతాడు. అసలు అతిథిని చూసుకునే పద్ధతి ఇదేనా? గెస్ట్ ఇంటికొస్తే మీరు ఎలా చూసుకోవాలి? అతను వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అంటాడు. మీ పని అయిపోయిందా? లేదా? వస్తున్నారా? రావడం లేదా? అని నిలదీస్తాడు రాజ్. తనకు అర్జెంట్ వర్క్ ఉందని, నేను ఇప్పుడే రావడం లేదని అర్ధం చేసుకోమని చెబుతుంది కావ్య. ఎందుకలా కంగారుగా మాట్లాడుతున్నారు? ఏమైనా సమస్యా అని అడుగుతాడు రాజ్. ఫోన్‌లో మాట్లాడేంత టైం లేదని ఇంటికొచ్చాక తీరిగ్గా చెబుతానని అంటుంది కావ్య.

వారిద్దరి మాటలు విన్న అపర్ణ, ఇందిరలు ఏం జరిగిందని అడుగుతారు. కళావతి ఏదో సమస్యలో ఉందని వాళ్లతో రాజ్ చెబుతాడు. ఇంతలో స్వప్న కారు లోకేషన్ తెలుసుకున్న కావ్య.. లోపల చూడగా అందులో ఎవరూ కనిపించరు. స్వప్నను రౌడీలు వెంటాడుతూ ఉండగా ఆమె తప్పించుకునేందుకు పరుగులు తీస్తుంది. కావ్య టెన్షన్‌ పడుతుండగా యామిని ఫోన్ చేస్తుంది. మీ అక్కతో ఐదు నిమిషాల్లో కాల్ చేస్తానని చెప్పాను అన్నావ్.. 5 నిమిషాలు అయిపోయి అరగంట దాటుతోంది ఇంకా ఫోన్ రాలేదని నీకు చేశానని సెటైర్లు వేస్తుంది.

నువ్వు పెట్టుకుంది ఈ యామినితో .. అంత సింపుల్‌గా ఎలా దొరుకుతుంది? ఎలా దొరకనిస్తాను? అని మండిపడుతుంది. ఇది యామిని వేట.. అంత ఈజీగా ఎలా పూర్తవుతుంది, నువ్వు వెహికల్ జీపీఎస్ ట్రాక్ చేసినంత మాత్రాన మీ అక్క దొరుకుతుందా అని ప్రశ్నిస్తుంది యామిని. నీ ప్లాన్ నాకు అర్ధమవ్వగానే నా ప్లాన్ మొదలుపెట్టానని చెబుతుంది. నా మనుషులు అసలే రౌడీ వెదవలు లేటైతే స్వప్నని చంపేస్తారని వార్నింగ్ ఇస్తుంది యామిని. రౌడీల బారి నుంచి తప్పించుకుంటూ వినాయకుడి విగ్రహం వెనుక దాక్కుంటుంది స్వప్న.

స్వప్నని కత్తితో పొడవబోబుతుండా రౌడీని కావ్య వెనుక నుంచి వచ్చి కొడుతుంది. రౌడీల బారి నుంచి తప్పించుకుని వస్తుండగా ఓ అమ్మాయి వాళ్లిద్దరినీ కాపాడుతుంది. ఎవరు మీరు? మా ఇద్దరినీ ఎందుకు కాపాడారని అడుగుతుంది కావ్య. నా పేరు రేవతి అని మీరు, మీ కుటుంబం గురించి నాకు బాగా తెలుసని అంటుంది ఆ అమ్మాయి. మీరు చేసిన సాయానికి కృతజ్ఞతలు అని కావ్య చెబుతుంది. దుగ్గిరాల కుటుంబం, సీతారామయ్య గారు పేదవారికి చేసే సాయం ముందు ఇదెంత అని అంటుంది ఆ అమ్మాయి. నాకు భయంగా ఉందని, మళ్లీ రౌడీలు వచ్చి ఏమైనా చేస్తారని మనం ఇంటికి వెళ్లిపోదామని అంటుంది స్వప్న. ఆ రౌడీలు బయటే ఉన్నారని మీరు ఈ టైంలో బయటికి వెళ్లడం మంచిది కాదని చెబుతుంది ఆ అమ్మాయి.

ఇక్కడే ఉంటే వాళ్లికి దొరికిపోతామని భయంగా ఉందని, ఈ విషయం వెంటనే ఇంట్లో వాళ్లకి చెప్పమని అంటుంది స్వప్న. అలా చెబితే ఇంట్లో వాళ్లంతా కంగారు పడతారని చెబుతుంది. ఆ రౌడీలు వెళ్లే వరకు ఇక్కడే ఉండమని ఆ అమ్మాయి చెప్పడంతో కావ్య, స్వప్నలు అక్కడే ఉండిపోతారు. ఇంట్లో అందరినీ ఆ అమ్మాయి పేరు పేరునా అడగటంతో వాళ్లిద్దరూ షాక్ అవుతారు. అపర్ణ గారు ఎలా ఉన్నారు? ఆవిడ ఒక్కసారి ప్రేమిస్తే ప్రాణం పోయేవరకు వదిలిపెట్టదని, ద్వేషించినా అలాగే ఉంటుందని చెబుతుంది రేవతి. మీ మాటల్ని బట్టి చూస్తుంటే మా ఫ్యామిలీ గురించి బాగా తెలిసిన మనిషిలా ఉన్నారని అంటుంది కావ్య.

మీ ఇంట్లో మనిషినైతే మీతో పాటే ఉండాలి కదా? బస్తీలో ఎందుకుంటాను అని రేవతి అంటుంది. అపర్ణ గారికి ముక్కు మీద కోపమని ఇప్పటికీ అలాగే ఉన్నారా? కోడలు వచ్చాక కూడా అలాగే ఉన్నారా అని అడుగుతుంది. మా కావ్య కోడలిగా వచ్చాక కూడా అలాగే ఉంటుందా అని స్వప్న చెబుతుంది. స్వప్న, కావ్య టీ తాగుతూ ఉండగా ఇంతలో తలుపు కొట్టిన శబ్ధం రావడంతో వాళ్లిద్దరూ కంగారు పడతారు. మా ఆయనికి ఫోన్ చేస్తానని రేవతి చెప్పగా మేం ఇక్కడి నుంచి వెళ్లిపోతామని చెబుతుంది కావ్య. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కావ్య కోసం ఎదురుచూస్తుంటుంది.

కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసినా ఆ కావ్య రాదని మనసులో అనుకుంటుంది రుద్రాణి. అంతా టెన్షన్‌తో ఉండగా అప్పూ హడావుడిగా లోపలికి వెళ్తుంది. ఇంతలో అప్పూకి కావ్య ఫోన్ చేసి స్వప్నని కిడ్నాప్ గురించి చెబుతుంది. ఇంట్లో ఎవ్వరికీ ఈ విషయం చెప్పొద్దని తాము ఉన్న అడ్రస్‌ని అప్పూకి చెబుతుంది కావ్య. ఇప్పుడే వచ్చి అప్పుడే బయటికి వెళ్తున్నావేంటీ అని అప్పూపై మండిపడుతుంది ఇందిర. అప్పుడే ఓ ప్లేస్‌కి వెళ్లాలని, ఓ కిడ్నాప్ కేసు వచ్చిందని చెబుతుంది అప్పూ. నీ జీవితంలో కిడ్నాప్ కేసులు, మర్డర్ కేసులు తప్పితే ఇంకేం ఆనందాలు ఉంటాయని ధాన్యలక్ష్మీ మండిపడుతుంది.

ఎప్పుడూ ఉరుకులు, పరుగులే.. ఇలాంటి అమ్మాయి నీకు వద్దురా అని చెప్పానని కానీ వీడు వింటే కదా అని ఫైర్ అవుతుంది. వెళ్లి డ్యూటీ చేసుకో అని సెటైర్లు వేస్తుంది. అప్పూని ఎందుకు అలా తిడుతున్నావ్? కోడలిగా నిన్ను సంతోషంగా ఉంచకపోవచ్చు.. కానీ ఈ సమాజంలో చాలా కుటుంబాలలో సంతోషానికి కారణమవుతుంది కదా అని అంటుంది ఇందిర. ఇప్పుడు కూడా ఇంకో కుటుంబంలోని వ్యక్తిని కాపాడేందుకు నీ చేత తిట్లు కూడా తిని వెళ్తోందని చెబుతుంది. మీరంతా వెనకేసుకుని రాబట్టే ఆవిడ గారు అలా తయారవుతున్నారని అంటుంది ధాన్యలక్ష్మీ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X