Brahmamudi June 26th Episode: ఇందూ గెలవకుండా రేఖ కుట్ర... పీఏ శృతికి డబ్బుతో ఎర

Photo Courtesy: JioHotstar

ఎంప్లాయిస్ అందరికీ శాలరీలు ఇచ్చిన ఇందూ.. ఇక మీదట కూడా ప్రతినెల ఫస్ట్ తారీఖున మీ జీతం అకౌంట్‌లో పడుతుందని చెబుతుంది. దాంతో ఉద్యోగస్తులంతా ఇందూని పొగుడుతూ, కాళ్ల మీద పడతారు. జీతం అనేది మీకు న్యాయంగా దక్కాల్సింది, మేం చట్టబద్ధంగా అందించాల్సిందేనని అంటుంది. ప్రతినెలా టైంకి శాలరీ పడాలంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్‌ని టైం ప్రకారం పూర్తి చేయాలని చెబుతుంది ఇందూ. బాకీ తీర్చాలంటూ నేరుగా దుగ్గిరాల వారింటికి వచ్చిన రాకేష్.. ఐశ్వర్యతో గొడవపడి ఆమెను కిడ్నాప్ చేసేందుకు లాక్కెళ్తుండగా ఇందూ వచ్చి లాగిపెట్టి కొడుతుంది. మీ ఐశ్వర్య నా దగ్గర 10 లక్షల రూపాయలు అప్పు చేసిందని రాకేష్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు.

దుగ్గిరాల కుటుంబంలో పుట్టి ఇలాంటి పనులు చేస్తావా అంటూ సుభాష్- అపర్ణలు మండిపడతారు. నీ పెంపకం చివరికి ఇలా తయారైందని రేఖని నానామాటలు అంటుంది అపర్ఱ. రాకేష్‌కి ఇవ్వాల్సిన 10 లక్షలు ఇచ్చి వెళ్లిపోమని చెబుతుంది ఇందూ. ఆ వెంటనే ఆమెను తీసుకుని రూమ్‌లోకి వెళ్తుంది రేఖ. నీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావు, డబ్బులు కూడా నా చేతికి రానివ్వడం లేదని ఇందూకి క్లాస్ పీకుతుంది రేఖ. మన కోసం, మన కుటుంబం కోసమే ఇలా చేశానని కవర్ చేస్తుంది ఇందూ. అయితే నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం ఎలా పెట్టావని రేఖ అడగ్గా.. ఇందూ, రాజ్ షాక్ అవుతారు. నేనే ఇందూకి సంతకం ఎలా పెట్టించాలో నేర్పించానని రాజ్ చెప్పి ఇందూని కాపాడతాడు. దాంతో రాజ్‌కి థ్యాంక్స్ చెబుతుంది ఇందూ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 26వ తేదీ ఎపిసోడ్ 1069లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial June 26th 2026 Episode 1069 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఉన్న డబ్బులన్నీ జీతాలకి, మీ ఐశ్వర్య బాకీకి, మీ రేఖ ఆంటీకి ఇచ్చేస్తే నాకు డబ్బులు ఇలా ఇస్తావు? నిన్ను నమ్ముకున్నందుకు నాకు అన్యాయం జరిగిందని మండిపడతాడు రాజ్. నీ డబ్బులు ఎక్కడికి పోవు, నేను ఇస్తానని చెబుతుంది ఇందూ. ఎలా ఇస్తావని రాజ్ అడుగుతుండగా పర్స్‌లో నుంచి నోట్ల కట్ట తీసి ఇస్తుంది. అది చూసిన రాజ్ చాలా సంతోషించి డబ్బులు లెక్కపెట్టుకుంటూ ఉంటాడు. ఐదు వేలో, పదివేలో నొక్కేసి ఎక్స్‌ట్రా లాగుదామని అనుకుంటాడు రాజ్. అయితే ఇది కనిపెట్టిన ఇందూ.. సరిగా లెక్కపెట్టు, లెక్క సరిగా రాకపోతే నేను లెక్కపెడతా, ఐదు వేలో పదివేలో కట్ చేస్తానని వార్నింగ్ ఇవ్వడంతో రాజ్ టెన్షన్ పడతాడు.

నువ్వు చాలా మంచి దానివి, నీకు జాలి గుండె ఉందని ప్రశంసలు కురిపిస్తుండటంతో నీకెం కావాలని అడుగుతుంది ఇందూ. పేమెంట్ కొంచెం పెంచమని అడుగుతాడు రాజ్. ఇదే ఫిక్స్ అని తేల్చేస్తుంది ఇందూ. అయితే కంపెనీలో ఎక్కడో ఒక చోట డబ్బులు నొక్కేయొచ్చని అనుకుంటాడు రాజ్. రేపటిలోగా డిజైన్లు రెడీ చేసి ఇవ్వకపోతే లేటు పెనాల్టీ వేస్తాడు, డీల్ క్యాన్సిల్ చేసి ఎక్స్‌ట్రా డబ్బులు వసూలు చేస్తాడని ఇందూ చెప్పడంతో రాజ్ కంగారుపడతాడు. అలా జరగకూడదు.. నువ్వేం చేయమటే అలా చేస్తానని అంటాడు రాజ్.

ఇందూ ఇచ్చిన 5 లక్షలు చూసి షాక్ అవుతుంది భ్రమరాంబ. ఈరోజు మనకి లక్షల్లో డబ్బులు వచ్చేస్తాయి, చివరికి చూస్తే 5 లక్షలు, తలా ఒక లక్ష వస్తుందని సెటైర్లు వేస్తుంది. ఆ ఇందూ ఏం చెప్పినా చేస్తుంది, నువ్వేం చెప్పినా చేస్తుందని అన్నావు.. సీఈవో పదవి రాగానే తోక జాడించిందని మండిపడుతుంది భ్రమరాంబ. చిన్న చిన్న వాటికి ఎందుకు టెన్షన్ పడుతున్నావని ప్రశ్నిస్తుంది రేఖ. ఈ ఐదు లక్షలు కూడా ఇవ్వకపోతే బాగోదని నీకు ముష్టి పడేసింది, నువ్వు ఏం చెబితే అది ఇందూ చేస్తుంది అన్నావు కదా కానీ తనకు నీకు చెప్పలేదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోనని అంటాడు భూషణ్. గతంలో రాజ్- కావ్యలను స్టాఫ్ ఎలా నెత్తిన పెట్టుకున్నారో.. ఇప్పుడు వీళ్లని కూడా అలాగే నెత్తిన పెట్టుకునేలా ఉన్నారని హెచ్చరిస్తాడు. ఆ ఇందూ చేసిన పనుల వల్ల స్టాఫ్ మొత్తం తనకి సపోర్ట్‌గా ఉంటారు, ముందు ముందు తన మాటే చెల్లుతుందని చెబుతాడు. ఆఫీసులో అసిస్టెంట్ కూడా గుడ్ మార్నింగ్ అని చెప్పడు అంటాడు.

ఆ ఇందూ ఏం చేసినా ఒప్పుకుంటాను అని కాదు.. వీళ్ల తలరాతలు రాసేది నేనే అంటుంది రేఖ. కంపెనీలో మన అవసరం ఏ మాత్రం లేదని ఇందూకి అనిపించిందో ఆ క్షణం నుంచి కంపెనీకి దూరమైపోతాం, మనం లేకపోయినా ఇందూ సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తుందనే నమ్మకం స్టాఫ్‌కి వస్తే కష్టమని చెబుతాడు భూషణ్. డబ్బులు వస్తాయి కదా అని కాంట్రాక్ట్ ఫినిష్ చేయాలని అనుకున్నాను.. కానీ స్టాఫ్ అందరి ముందు అది గొప్పది అని ప్రూవ్ చేయడానికి ఎప్పుడైతే ట్రై చేసిందో అప్పుడో దాని తోక కత్తిరించాలని డిసైడ్ అయ్యాను. నన్ను కాదని అది ఏం చేయలేదని దానికి అర్ధమయ్యేలా చేస్తానని అంటుంది రేఖ. ఇచ్చిన టైంలోపు డిజైన్స్ పూర్తి చేసి చూపించకపోతే ఆ హర్ష గాడు పెనాల్టీ వేస్తాడు. అప్పుడు ఆ ఇందూ పెనాల్టీ ఎలా కడుతుందని చెబుతుంది రేఖ. ఆ ఇందూకి ఏం చేయాలో తెలియక మళ్లీ నా కళ్ల దగ్గరికే వస్తుంది. ఆ తర్వాత హర్షతో చేసే ప్రతి కాంట్రాక్ట్ మనల్ని అడిగే చేస్తుంది, వచ్చిన డబ్బుల్ని మన దగ్గరికే వచ్చి ఇస్తుందని అంటాడు భూషణ్.

ఆఫీసులో డిజైన్స్ చూపించమని శృతిని అడుగుతుంది ఇందూ, అలాగే ఎలా వేయాలో కూడా చెబుతుంది. ఇంతకుముందు ఇలాంటి పనులు చేశావా? బాగా నాలెడ్జ్ ఉన్నట్లు చెబుతున్నావని అడుగుతాడు రాజ్. నేను ప్రాక్టీకల్‌గా ఆలోచించి చెబుతున్నాను అంటుంది ఇందూ. మీరు మాట్లాడుతుంటే కావ్య మేడం మాట్లాడుతున్నట్లుగా ఉంది, ఆమె కూడా డిజైన్స్ విషయంలో చాలా ప్రాక్టీకల్‌గా ఉండేవారు. మా అమ్మ వేసిన డిజైన్స్ ఎక్కడున్నాయని అడిగి తెలుసుకుంటుంది ఇందూ. ఇందూ స్పీడు చూస్తుంటే ఫాస్ట్‌గానే పని పూర్తి చేసేలా ఉందని భూషణ్ భయపడతాడు. ఇందూ ఏమైనా కావ్య అనుకున్నావా? డిజైన్లు వేయలేదు.. వాళ్లమ్మకి ఉన్నంత టాలెంట్ ఇందూకి లేదని చెబుతుంది రేఖ.

కావ్య గతంలో వేసిన డిజైన్లను హర్ష గారికి పంపిద్దామని రాజ్‌తో అంటుంది ఇందూ. వాటిని చూసిన హర్ష.. అవి కావ్య వేసిన డిజైన్లు అని గుర్తుపట్టి కొత్తగా ట్రై చేయమని ఇందూకి క్లాస్ పీకుతాడు. ఆయనకి కొత్తవి కావాలట, శృతిగారిని చూస్తే ఆ పని చేసేలా కనిపించడం లేదని బాధపడుతుంది ఇందూ. మీ అమ్మగారు డిజైన్లు వేసినప్పుడు ఆ పని మనమెందుకు చేయకూడదని అడుగుతాడు రాజ్. డిజైన్స్ వేయడం చాలా కష్టమని అంటుంది ఇందూ.

మనందరం దుకాణం సర్దేసే టైం వచ్చిందని రేఖ, భ్రమరాంబలపై శేషం సెటైర్లు వేస్తాడు. ఇంతలో ఐశ్వర్య వచ్చి నాకు లక్ష రూపాయలు కావాలని అడగటంతో రేఖ మండిపడుతుంది. నువ్వు చేసిన అప్పులు చాలవు అన్నట్లు మళ్లీ డబ్బులు అడుగుతున్నావా? ఆ అపర్ణ ఆంటీ నానామాటలు అన్నదని చెబుతుంది రేఖ. మీరు డబ్బులు ఇవ్వకపోవడం వల్లే నేను అప్పులు చేశానని చెబుతుంది ఐశ్వర్య. ఆ పది లక్షలు ఏం చేశావని రేఖ నిలదీయగా.. ఏదో ఒకటి చేశాను, లక్ష ఇస్తే వెళ్లిపోతానని తేల్చేస్తుంది ఐశ్వర్య. నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని, ఇకపై బయట తిరగడానికి వెళ్లొద్దు, ఇంట్లో కూర్చోమని వార్నింగ్ ఇస్తుంది రేఖ.

ఆ ఇందూ కనుక డీల్ పూర్తి చేస్తే మనం ఓడిపోయినట్లేనని భూషణ్ చెబుతాడు. అసలు ఓటమి అనేది ఈ రేఖ హిస్టరీలోనే లేదు, ఆ ఇందూ ఫెయిల్ అయిందని అందరి ముందు ప్రూవ్ చేస్తానని చెబుతుంది రేఖ. ఇందూకి శృతి పంపిన డిజైన్లు నచ్చకపోవడంతో కొత్తగా ట్రై చేయమని చెబుతుంది. అప్పుడు నాకు మీ అమ్మగారు సలహాలు ఇచ్చేవారు, నాతో పాటు ఉన్నవారు కూడా సపోర్ట్ చేసేవారు. మేమంతా గ్రూప్ డిస్కషన్స్ చేసుకుని ఫైనల్‌గా నేనొక డిజైన్ వేసేదానిని, ఇప్పుడు నేనొక్క దానినే అయిపోయాను అంటుంది శృతి. మీరు చాలా టాలెంటెడ్ పర్సన్, మీరు కాసేపు ప్రశాంతంగా ఆలోచించి డిజైన్లు వేయమని చెబుతుంది ఇందూ. మీ అమ్మగారు ట్రై చేసినప్పుటు మనం కూడా డిజైన్లు వేద్దామని అంటాడు రాజ్. అంత అనుభవం ఉన్న శృతిగారే వేయలేకపోతున్నారు, మనమెంత అంటుంది ఇందూ. కానీ రాజ్ మాత్రం ప్రయత్నిద్దామని ఇందూలో ధైర్యం చెప్పి డిజైన్లు మనమే వేద్దామని ఒప్పిస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X