Brahmamudi June 27th Episode: యామినిని లాగికొట్టిన అప్పూ.. యామిని నిజస్వరూపం తెలుసుకున్న రాజ్
Photo Courtesy: JioHotstar
స్వప్నను వెతుకుతుండగా కావ్యకి రాజ్ ఫోన్ చేసి నన్ను పట్టించుకోకుండా వెళ్లిపోతారా? అని మండిపడతాడు. తాను అర్జెంట్ పని మీద ఉన్నానని మళ్లీ చేస్తానని ఫోన్ పెట్టేస్తుంది కావ్య. ఆ వెంటనే కావ్యకి యామిని ఫోన్ చేసి మీ అక్కతో ఐదు నిమిషాల్లో ఫోన్ చేయిస్తానని చెప్పావని సెటైర్లు వేస్తుంది. నీ జీపీఎస్ ప్లాన్ నాకు తెలిసిపోయిందని.. దాంతో నా ప్లాన్ మార్చేశానని అంటుంది యామిని. నా మనుషులు అసలే రౌడీ వెదవలని మీ అక్కని చంపేస్తారని అంటుంది యామిని. దాంతో కావ్య కంగారు పడుతుంది. రౌడీలు స్వప్నని కత్తితో పొడవబోతుండగా కర్రతో వెనుక నుంచి కొడుతుంది కావ్య.
ఆ వెంటనే స్వప్న,కావ్యలను రౌడీలు వెంటాడుతుండగా వీరిద్దరూ పరుగులు తీస్తారు. ఇంతలో ఓ స్త్రీ వారిద్దరినీ లోపలికి లాగుతుంది. నా పేరు రేవతి అని చెప్పి మీరు దుగ్గిరాల వారింటి కోడళ్లని పేర్లతో సహా చెప్పడంతో కావ్య, స్వప్నలు షాక్ అవుతారు. యామిని కిడ్నాప్ కుట్రను అప్పూకి కావ్య ఫోన్ చేసి చెప్పడంతో ఆమె రంగంలోకి దిగుతుంది.
ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 27వ తేదీ ఎపిసోడ్ 759లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కావ్య దగ్గరికి బయల్దేరుతున్న అప్పూని.. కావ్య ఏమైనా ఫోన్ చేసిందా అని అడుగుతాడు రాజ్. స్వప్న కిడ్నాప్ విషయం ఇంట్లో చెప్పొద్దన్న అక్క మాటలు గుర్తొచ్చి.. ఫోన్ చేయలేదని అంటుంది అప్పూ. నువ్వే ఫోన్ చేసి కళావతి ఎక్కడ ఉంది? ఎప్పుడు వస్తుంది? అని అడగమంటారు అపర్ణ, సుభాష్. కళావతిని ఇప్పటికే ఇబ్బంది పెట్టానని.. ఏదో ముఖ్యమైన పనిలో ఉంటేనే తను అలా మాట్లాడుతుందని చెబుతాడు. కళావతిని ఇబ్బంది పెట్టే ఏ పని తాను చేయనని అంటాడు రాజ్. కాబోయే భార్యని బాగానే అర్ధం చేసుకున్నావని మెచ్చుకుంటుంది ఇందిర. నీ ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసే అవకాశం ఆ దేవుడు ఇవ్వడం లేదని అంటుంది అపర్ణ. ఈరోజు కాకపోతే రేపైనా ఖచ్యితంగా నా ప్రేమను కళావతికి చెప్పే టైం ఇస్తాడని అంటాడు రాజ్.
ఇప్పటికే ఆలస్యమైందని తాను బయల్దేరతానని చెబుతాడు రాజ్. అమ్మాయికి ప్రపోజ్ చేయకుండానే వెళ్లిపోతావా? అని అందరూ అడుగుతారు. వచ్చిన అవకాశాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవడం, కాసేపు ఆగితే తను వచ్చేస్తుందని అంటుంది అపర్ణ. రేపు ఎప్పుడైనా ప్రపోజ్ చేస్తానని చెప్పి వెళ్లిపోతాడు రాజ్. ఇదంతా ఆ కావ్య వల్లే వచ్చిందని.. నోటి దాకా వచ్చిన ముద్దని తన చేత్తో తనే నేల రాల్చుకుందని అంటుంది అపర్ణ. మళ్లీ ఇలాంటి అవకాశం ఎప్పుడో కానీ రాదని చెబుతుంది. మొత్తానికి యామిని అనుకున్నది సాధించిందని.. కావ్యకు రాజ్ ప్రపోజ్ చేయకుండా ఆపేసిందని మనసులో అనుకుంటుంది రుద్రాణి.
స్వప్న, కావ్యలు ఉన్న రేవతి ఇంటి తలుపని ఎవరో అదే పనిగా కొడుతుంటారు. మీరు లోపల దాక్కోండి.. నేను ఏదో ఒకటి చెప్పి పంపించేస్తానని అంటుంది రేవతి. తలుపు తీసి చూడగా బయట తన భర్త ఉండటంతో రేవతి ఊపిరి పీల్చుకుంటుంది. ఎందుకు కంగారు పడతున్నావ్? ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ అని అతను రేవతిని అడుగుతాడు. కావ్య, స్వప్నలను పిలిచి వచ్చింది మా ఆయనే అని చెబుతుంది రేవతి. వాళ్లని చూడగానే రేవతి భర్త షాక్ అవుతాడు. కావ్య, స్వప్నలని ఎవరో వెంటాడుతుంటే నేనే కాపాడి మనింట్లో పెట్టానని భర్తకు చెబుతుంది రేవతి. ఇంతలో అప్పూ.. కావ్య పెట్టిన లోకేషన్ దగ్గరికి వచ్చి ఫోన్ వస్తుంది. మా అప్పూ వచ్చిందని మేం వెళ్తామని, ఎవరో తెలియక పోయినా మా ప్రాణాలు కాపాడారని రేవతికి థ్యాంక్స్ చెబుతుంది స్వప్న. ఈరోజు మీరు టైంకి రాకపోయుంటే ఏమయ్యే వాళ్లమో ఊహించుకోవడానికి కూడా భయంగా ఉందని అంటుంది.
స్వప్న, కావ్యలు బయటికి వస్తుండగా రౌడీలు చూస్తారు. అయితే పక్కనే పోలీసులు ఉండటంతో వాళ్లు భయపడతారు. కరెక్ట్ టైంకి రేవతి వచ్చి మమ్మల్ని కాపాడారని అప్పూకి చెబుతుంది కావ్య. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేమని అప్పూ అనగా.. మనది తీర్చుకుంటే తీరిపోయే రుణం కాదని అంటుంది రేవతి. ఆ మాటలతో కావ్య, స్వప్నలు షాక్ అవుతారు. ఏ జన్మలో ఏ రుణం మిగిలిపోయిందో? మీకు ఇలా సాయం చేసే అదృష్టం కలిగిందని అంటుంది రేవతి. కావ్య, స్వప్నలు కారెక్కి వెళ్లిపోవడంతో రేవతి కంటతడి పెడుతుంది. కావ్య, స్వప్నలు తప్పించుకున్నారని రౌడీలు యామినికి ఫోన్ చేసి చెబుతారు. నేను అనుకున్నది సాధించానని.. మీరు ఇంటికి వెళ్లిపోమ్మని యామిని వాళ్లతో అంటుంది. ఈ యామిని తలచుకుంటే ఏదైనా చేస్తుందని, నీకు రాజ్ ప్రపోజ్ చేయకుండా ఆపాలి అనుకున్నానని ఆపేశానని అనుకుంటుంది.
ఓ ఫోటో చూసుకుని రేవతి ఏడుస్తుంటుంది. మనింటికి వచ్చింది దుగ్గిరాల ఇంటి కోడళ్లని, నువ్వేవరో వాళ్లకి ఎందుకు చెప్పలేదని రేవతిని అడుగుతాడు భర్త. ఏ ముఖం పెట్టుకుని చెప్పను.. ఆ కుటుంబానికి నేనొక మాయని మచ్చనని చెప్పానా అని అడుగుతుంది రేవతి. దీనింతటికి కారణం నేనే అని.. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండి ఉంటే ఈరోజు మీరంతా కలిసి ఉండేవారని భర్త బాధపడతాడు. మిమ్మల్ని దూరం చేసుకోని నేను సంతోషంగా ఎలా ఉండేదాన్నని ప్రశ్నిస్తుంది రేవతి. ఏదో ఒకరోజు నిన్ను క్షమిస్తారని అనుకున్నానని.. కానీ ఇన్నేళ్లయినా వాళ్ల మనసు మారలేదంటే మనల్ని ఎప్పటికీ క్షమించరని అంటాడు భర్త.
ఆ యామినిని వదిలిపెట్టొద్దని అప్పూతో అంటుంది స్వప్న. నేను చెప్పే వరకు మీరు సైలెంట్‌గా ఉండండి అని కావ్య చెబుతుంది. ఇంటి దగ్గర కారు దిగకుండా నేరుగా యామిని దగ్గరికి వెళ్తుంది అప్పూ. దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కావ్యని రౌండప్ చేసి నానామాటలు అంటుంది. నీకు ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చేద్దామా అని రాజ్ ఎంతో ఆశతో ఇంటికి వచ్చాడని కానీ వెళ్లిపోయావని మండిపడుతుంది అపర్ణ. ఇందులో కావ్య తప్పేం లేదని తను నన్ను కాపాడటం కోసమే వచ్చిందని చెబుతుంది స్వప్న. ఫ్యామిలీ మొత్తం షాక్ అవ్వడంతో కిడ్నాప్, రౌడీలు వెంటడటం, కావ్య కాపాడిన విషయం చెబుతుంది స్వప్న.
ఇదంతా చేసింది ఆ యామియేనని కావ్య చెప్పడంతో దానిని అస్సలు వదలకూడదని అంటారు ప్రకాశం, సుభాష్. దాంతో కావ్య వారిని అడ్డుకుని యామిని మీద ఏ కేసు పెట్టొద్దని మన టైం వచ్చే వరకు మనం సైలెంట్‌గా ఉండటమే మంచిదని అంటుంది. స్వప్న కిడ్నాప్ విషయం నీకు ముందే తెలుసా అని రుద్రాణిని అడుగుతాడు రాహుల్. తెలుసు కాబట్టే నువ్వు హాస్పిటల్‌కు వెళ్లకుండా ఆపానని చెబుతుంది రుద్రాణి. రాజ్ తన సొంతం అయ్యే వరకు ఈ ఫ్యామిలీతో ఆడుతూనే ఉంటుందని అర్ధమైందని అంటాడు రాహుల్. యామిని దగ్గరికి అప్పూ వచ్చి లాగి పీకుతుంది. నా ఇంటికి వచ్చి నన్ను కొడతవా అంటూ అప్పూపై రగిలిపోతుంది యామిని. నువ్వు చేసిన తప్పుకి నిన్ను చంపినా తప్పులేదని అంటుంది అప్పూ. మా స్వప్న అక్కని కిడ్నాప్ చేసి.. మా కావ్య అక్కని బెదిరించింది నువ్వేనని నాకు తెలుసని చెబుతుంది అప్పూ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










