Brahmamudi June 27th Episode: కావ్య గెలవకుండా రేఖ స్కెచ్.. పీఏ శృతికి రేఖ బెదిరింపులు
Photo Courtesy: JioHotstar
నీ దగ్గర డబ్బులు లేవు, నిన్ను నమ్ముకున్నందుకు నాకు గుణపాఠం నేర్పించావని ఇందూపై మండిపడతాడు రాజ్. దాంతో పర్స్‌లో నుంచి డబ్బులు తీసి రాజ్‌కి ఇస్తుంది ఇందూ. డబ్బులు లెక్కపెడుతూ కొంత నొక్కేయాలని రాజ్ అనుకుంటుండగా ఇందూ వార్నింగ్‌తో సైలెంట్ అయిపోతాడు. ఇందూ నీ చేయి దాటిపోతోంది.. తను కాంట్రాక్ట్ పూర్తి చేస్తే ఆఫీసులో మనల్ని ఎవ్వరూ లెక్క చేయరని భూషణ్ చెప్పడంతో రేఖ మండిపడుతుంది. ఇందూ ఎప్పుడైతే తోక జాడించిందో అప్పుడే దాని తోక కట్ చేయాలని అనుకున్నాను. హర్షకి ఆలస్యంగా డిజైన్స్ ఇస్తే వాడు కాంట్రాక్ట్ రద్దు చేయడంతో పాటు పెనాల్టీ కింద డబ్బులు వసూలు చేస్తాడు. అప్పుడు చచ్చినట్లు ఇందూ నా దగ్గరకే వస్తుందని రేఖ చెప్పడంతో భ్రమరాంబ, భూషణ్ సంతోషిస్తారు.
ఇంతలో ఐశ్వర్య వచ్చి తనకు లక్ష రూపాయలు కావాలని అడగటంతో రేఖ సీరియస్ అవుతుంది. నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను, నోరుమూసుకుని ఇంట్లో కూర్చోమని వార్నింగ్ ఇస్తుంది. ఆఫీసులో డిజైన్లు చూపించమని శృతిని అడుగుతుంది ఇందూ. అయితే అవి అంత బాగుండకపోవడంతో కావ్య వేసిన పాత డిజైన్లను హర్షకి పంపుతుంది. వాటిని అతను గుర్తుపట్టి.. మీ అమ్మ వేసినవి కాదు, కొత్తవి కావాలని అడుగుతాడు. దాంతో ఇందూతోనే డిజైన్లు గీయిస్తాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 27వ తేదీ ఎపిసోడ్ 1070లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఇందూ, రాజ్‌లు డిజైన్లు వేయమంటే పిచ్చిగీతలు గీస్తూ ఉంటారు. ఇందూ వేసిన డ్రాయింగ్ చూసి నవ్వుకుంటాడు రాజ్. నీకు ముగ్గులు పెట్టడం, మెహందీలు వేయడం రాదా అని అడగ్గా.. వచ్చు అని ఇందూ సమాధానం చెబుతుంది. మరి ఈ పిచ్చిగీతలు ఏంటీ అంటూ ఇందూపై సెటైర్లు వేస్తాడు. అయితే నువ్వు వేసిన డిజైన్లు చూపించమని అడుగుతుంది ఇందూ. రాజ్ దానిని చూపించగా.. అది డిజైన్ కాదు, పిచ్చిగీతలు అని పంచ్‌లు విసురుతుంది ఇందూ. ముగ్గులు, మెహందీలు వచ్చిన నువ్వే సరిగా వేయలేనప్పుడు ఆవారా గాడిని నాకేం తెలుస్తుందని అంటాడు రాజ్.
ఇంతలో అపర్ణ వచ్చి ఇద్దరూ ఏం చేస్తున్నారు? ఎందుకు గొడవ పడుతున్నారని అడుగుతుంది. క్లయింట్ అడిగిన డిజైన్లు వేస్తున్నామని చెబుతుంది ఇందూ. ఇద్దరూ వేసిన డిజైన్లను చూసిన అపర్ణ.. మీ కన్నా చిన్నపిల్లలు బాగా వేస్తారని సెటైర్లు వేస్తుంది. మీరిద్దరూ ఒకసారి గొడవ పడతాడు, ఒకసారి వెక్కిరించుకుంటారు, మరోసారి ప్రేమ కురిపించుకుంటారు. నాకేం అర్ధం కావడం లేదని అంటుంది అపర్ణ. జీవితంలో ఇవన్నీ ఉండాలని కవర్ చేస్తాడు రాజ్.
నేను మా అమ్మలా టాలెంటెడ్ కాకపోయినా, టాలెంట్ ఉన్న వారితో ఎలా పనిచేయించుకోవాలో నాకు బాగా తెలుసు అని చెబుతుంది ఇందూ. ఇంతలో శృతి ఫోన్ చేసి డిజైన్లు ఒకసారి చెక్ చేయమని అంటుంది. అది చూసిన ఇందూ చాలా బాగున్నాయని మెచ్చుకుని కొన్ని సలహాలు ఇస్తుంది. ఇందూ ఫోన్ పెట్టిన వెంటనే శృతికి రేఖ కాల్ చేస్తుంది. ఏం చేస్తున్నావని అడగ్గా... క్లయింట్స్‌కి ఇవ్వాల్సిన డిజైన్లు సిద్ధం చేస్తున్నానని అంటుంది శృతి. నువ్వు చాలా టాలెంటెడ్, అనుకున్న టైంలోగా వర్క్ ఫినిష్ చేస్తావు.. కానీ ఈసారి మాత్రం అలా ఇవ్వకూడదని చెబుతుంది రేఖ.
మీ అమ్మగారు హాస్పిటల్ బెడ్ మీద చావు బతుకుల్లో ఉన్నారు. ఆమెను కాపాడుకోవాలని నీకు లేదా? నేను చెప్పినట్లు చేస్తే ఆమె చికిత్సకు అయ్యే ఖర్చు నేనే భరిస్తానని ఆఫర్ ఇస్తుంది రేఖ. కంపెనీకి ద్రోహం చేయలేనని శృతి చెబుతుండగా.. నీలాంటి తెలివైన వారు అవకాశాల్ని వదులుకోరని అంటుంది రేఖ. డిజైన్లు మొత్తం పూర్తి చేసి క్లయింట్స్‌తో మీటింగ్ సమయానికి వాటిని ఇందూకి ఇవ్వొద్దని చెబుతుంది రేఖ. దాంతో ఆమె చెప్పినట్లుగానే చేస్తానని శృతి ఒప్పుకుంటుంది.
మరోవైపు.. అర్ధరాత్రి రాజ్‌కి నిద్రపట్టకపోవడంతో బెడ్ మీద అటు ఇటు తిరుగుతాడు. ఇందూ దగ్గరికి వెళ్లి ఆమె నిద్రపోతుందో లేదో చెక్ చేసి బయటకు వెళ్తాడు. తలుపు అలికిడికి నిద్రలేచిన ఇందూ.. రాజ్ వెనుకే ఫాలో చేస్తుంది. డాక్టర్ గారికి ఫోన్ చేసి అమౌంట్ పంపించాను, తీసుకున్నారా అని అడుగుతాడు. పేషెంట్ పేరు మీద పే చేశాం.. ఈసారి వచ్చినప్పుడు రిసిప్ట్ తీసుకోమని డాక్టర్లు చెబుతారు. తనకి ఎలా ఉందని రాజ్ అడగ్గా.. అప్పుడెలా ఉందో, ఇప్పుడు కూడా అలాగే ఉందని చెబుతాడు డాక్టర్. ఎలాగైనా తను కోలుకునేలా చేయమని రాజ్ రిక్వెస్ట్ చేస్తాడు. మా ప్రయత్నం మేం చేస్తామని డాక్టర్ చెబుతాడు.
రాజ్ ఫోన్ మాట్లాడి చూసేసరికి ఇందూ అక్కడే ఉండటంతో షాక్ అవుతుంది. ఎవరికి బాలేదు.. మీ అమ్మానాన్న, తమ్ముడి, లక్కీకి బాలేదా అని అడుగుతుంది ఇందూ. వాళ్లకేం కాలేదు, అందరూ బాగానే ఉన్నారని చెబుతాడు రాజ్. మరి హాస్పిటల్‌లో ఎవరున్నారు అని అడుగుతుంది ఇందూ. నువ్వు నాకు ఇంత సాయం చేస్తున్నావు కదా? నీ సమస్య ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంటుందని అంటుంది ఇందూ. నువ్వు ఎప్పుడు చూసినా చావు బతుకుల సమస్య అంటావు కదా? అది ఇదేనా అని అడుగుతుంది. నా పర్సనల్ విషయాల్లో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావని ప్రశ్నిస్తాడు రాజ్. అయితే మన మధ్య ఏ రిలేషన్ లేదా అని ఇందూ నిలదీస్తుంది. అద్దె మొగుడు అనే రిలేషన్ మాత్రమే మన మధ్య ఉంది.. నేను కష్టాల్లో ఉన్నానని నీకు ఇప్పటికైనా అర్ధమైందా? ఇప్పటికైనా నన్ను నమ్మితే నాకో సాయం చేయమని అడుగుతాడు. నా పేమెంట్ కరెక్ట్ టైంకి ఇస్తే చాలని చెబుతాడు రాజ్. నీ పని గురించి ఆలోచిస్తే చాలు.. హాస్పిటల్‌లో ఎవరున్నారో నీకు అనవసరమని నానామాటలు అంటాడు రాజ్. దాంతో ఇందూ బాధపడుతుంది.
ఉదయాన్నే డిజైన్ల కోసం హర్ష వెయిట్ చేస్తాడు.. ఇందూ ఎన్నిసార్లు ఫోన్ చేసినా శృతి లిఫ్ట్ చేయదు. ఇదంతా చూసిన రేఖ చాలా సంతోషిస్తుంది. ఏం జరిగిందని రేఖ అడగ్గా.. నీకు చెప్పాల్సిన అవసరం లేదని మండిపడతాడు రాజ్. మీరు చెప్పకపోయినా నాకు తెలుసు.. మీరు వెయిట్ చేస్తుంది శృతి కోసమేనని నాకు తెలుసని అంటుంది రేఖ. ఆ మాటలతో ఈ విషయం నీకెలా తెలుసు అని అడుగుతాడు రాజ్. హర్ష వచ్చి చాలాసేపు అయ్యింది, మీరిద్దరూ టెన్షన్ పడుతున్నారు, అప్పుడు డిజైన్ల కోసం, శృతి కోసమేనని నాకు తెలుసు అని కవర్ చేస్తుంది రేఖ. తనను క్లైయింట్ కంటే ముందే ఆఫీస్‌కి రమ్మని రాత్రి చెప్పాను కానీ రాలేదని కంగారుపడుతుంది ఇందూ. శృతిగారు కరెక్ట్ టైంకే వచ్చేస్తారు.. హర్షాగారు డిజైన్లు చూసి చాలా ఇంప్రెస్ అవుతారు, రెగ్యులర్‌గా కాంట్రాక్ట్‌లన్నీ మనకే ఇచ్చేస్తారని చెబుతాడు రాజ్. ఇదంతా చూసి రేఖ సంతోషిస్తుంది.


Click it and Unblock the Notifications