Brahmamudi June 28th Episode: రాజ్ శత్రువుని ట్రాప్ చేసిన యామిని.. కంపెనీ నుంచి కావ్యని గెంటేసేలా కుట్ర
Photo Courtesy: JioHotstar
ఆఫీసు నుంచి వచ్చిన వెంటనే బయటికి వెళ్తున్న అప్పూని ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది ధాన్యలక్ష్మీ. అర్జెంట్‌గా వెళ్లే పని ఉందని చెప్పడంతో ఇలా అయితే కళ్యాణ్‌తో ఎలా గడుపుతావు? అని ప్రశ్నిస్తుంది. ఇంట్లో వాళ్లంతా అప్పూకి సపోర్ట్ చేయడంతో ఆమె కావ్య దగ్గరికి బయల్దేరుతుంది. రేవతి ఇంట్లో ఉన్న కావ్య, స్వప్నలు తాము ఇక్కడే ఉంటే ఆ రౌడీలు లోపలికి వచ్చేస్తారని భయపడతారు. ఇంతలో రేవతి భర్త రావడంతో వారిద్దరినీ లోపలి నుంచి పిలిచి పరిచయం చేస్తుంది. ఆ కాసేపటికీ అప్పూ అక్కడికి వచ్చి కావ్య, స్వప్నలను తీసుకెళ్తుంది.
నాకు చావు భయం పరిచయం చేసిన ఆ యామినిని వదలొద్దని అప్పూకి చెబుతుంది స్వప్న. అలాంటి పిచ్చి పనులు చేయొద్దని కావ్య వార్నింగ్ ఇస్తుంది. ఇంటికి రాగానే తాను కిడ్నాప్ అయిన విషయాన్ని చెబుతుంది స్వప్న. దీంతో ఆ యామిని మీద కంప్లయంట్ ఇవ్వాలని బయల్దేరుతున్న ప్రకాశం, సుభాష్‌లను కావ్య ఆపుతుంది. యామిని ఇంటికి వెళ్లిన అప్పూ ఆమెను లాగి పెట్టి కొడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 28వ తేదీ ఎపిసోడ్ 760లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
యామినిని కొట్టిన అప్పూ.. నువ్వు చేసిన పనికి చంపినా తప్పు లేదని మండిపడుతుంది. అంత తప్పు నేనేం చేశానని యామిని అంటుంది. మా స్వప్న అక్కని కిడ్నాప్ చేయించి మా కావ్య అక్కని బెదిరించింది నువ్వేనని నాకు తెలుసని అప్పూ అనడంతో యామిని షాక్ అవుతుంది. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్.. ఇంకోసారి మా అక్కల జోలికి వస్తే నీ తుక్కురెగ్గొడతానని అంటుంది అప్పూ. నేను మా కావ్య అక్కలా క్లాస్ అనుకుంటున్నావేమో.. మాస్, ఊరమాస్ అంటుంది. మా అక్కల జోలికి వచ్చినా, వాళ్లకి ఏదైనా అపాయం తలపెట్టాలని చూసినా నిన్ను, నిలువునా చీరేస్తానని చెబుతుంది.
అప్పూ మాటలతో యామిని నవ్వుతుంది. పోలీస్ డ్రెస్ వేసుకొచ్చి డైలాగులు చెప్పగానే వణికిపోతానని అనుకున్నావా? అంటుంది. నీకంత సీన్ లేదని.. నా పెళ్లి ఆపేస్తానని కలలు కన్నారు, నేను ఆ రౌడీకి డబ్బులు ఇస్తుంటే దొంగతనంగా వీడియోలు తీశారు. కానీ చివరికి ఏం జరిగింది, నువ్వు సంపాదించుకున్న సాక్ష్యాన్ని నువ్వే కాపాడుకోలేకపోయావని చెబుతుంది. ఆ రోజు నిన్ను అరెస్ట్ చేయకుండా వదిలేసింది సాక్ష్యం లేక కాదు.. మా అక్క వద్దు అని చెప్పడం వల్ల అని చెప్పడంతో యామిని షాక్ అవుతుంది. ఆ వీడియోని డిలీట్ చేయించడం వల్ల తప్పించుకున్నానని అనుకుంటున్నావా? అని ప్రశ్నిస్తుంది. ఎలాగూ పెళ్లి ఆగిపోయింది కదా? అరెస్ట్ చేయడం ఎందుకు? అని కావ్య అక్క చెప్పడం వల్ల వెనక్కి తగ్గినట్లు చెబుతుంది అప్పూ.
నేను నీకు మరీ అంత అమాయకురాలిలా కనిపిస్తున్నానా? సాక్ష్యాన్నే సంపాదించుకోవాలంటే నాకు ఐదు నిమిషాలు పట్టదని అంటుంది అప్పూ. డిలీటైన వీడియో మళ్లీ ఎలా సంపాదిస్తుందని అనుకుంటున్నావా? అని ప్రశ్నిస్తుంది అప్పూ. ప్రతి ఫోన్‌కి రిస్టోర్ ఆప్షన్ అని ఒకటి ఉంటుందని, దాని సాయంతో మళ్లీ వీడియో సంపాదించొచ్చు అని చెబుతుంది. మా అక్కని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం తను వదిలిపెట్టినా నిన్ను వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తుంది అప్పూ. చేతులకు సంకెళ్లు వేసి నిన్ను లాకప్‌లో పడేస్తానని.. ఈసారి లాఠీతో దెబ్బలు పడతాయని అంటుంది. అప్పూ వెళ్తుండగా రాజ్ లోపలి నుంచి వాళ్లిద్దరినీ చూస్తాడు.
స్టేషన్‌లో ఏదో అర్జెంట్ పని ఉందని వెళ్లావ్.. మా ఇంటి దగ్గర ఏం చేస్తున్నావ్? అని అడుగుతాడు రాజ్. ఆ విక్టిమ్ ఇక్కడే ఉన్నాడని తెలిసి వచ్చానని అప్పూ చెప్పడంతో.. ఆ విక్టిమ్ యామినియా అని రాజ్ అనడంతో అంతా షాక్ అవుతారు. యామినితో ఏదో సంకెళ్లు, లాఠీ అంటున్నావేంటీ? అని అంటాడు రాజ్. మా డిపార్ట్‌మెంట్‌లో నేరస్తులను ఎలా డీల్ చేస్తామో యామినితో చెబుతున్నానని అంటుంది అప్పూ. ఇంతకీ ఆ విక్టిమ్ దొరికాడా? అని రాజ్ అడగ్గా.. దొంగ దొరికాకే ఇక్కడికి వచ్చానని, వార్నింగ్‌లు కూడా ఇచ్చానని చెబుతుంది అప్పూ.
వెళ్లిన పని ఏమైందని రాజ్‌ని అడుగుతుంది యామిని.. కావ్యకి ప్రపోజ్ చేశావా? లేదా? అని ప్రశ్నిస్తుంది. ప్రపోజ్ చేద్దామనే వెళ్లానని.. కానీ కళావతి గారికి ఏదో అర్జెంట్ వర్క్ ఉండి వెళ్లిపోయిందని చెబుతాడు రాజ్. చాలాసేపు ఎదురుచూశానని తను రాకపోయేసరికి, ఈసారి ఎప్పుడైనా ప్రపోజ్ చేద్దామని వచ్చేశానని అంటాడు. ఈ కావ్యకి నీకంటే పనే ఎక్కువైందా? అని అడుగుతుంది యామిని. రాజ్ వెళ్లిపోగానే.. నీ నోటి నుంచి ఆ కావ్యకి ఐ లవ్ యూ అనే మాటను అస్సలు చెప్పనివ్వనని అనుకుంటుంది. కావ్యకి ఫోన్ చేసి నేను అనుకున్నది జరిగిందని చెబుతుంది యామిని. మీ అక్క స్వప్నని ఎరగా వేసి నిన్ను బావకి దూరంగా పంపించాలి అనుకున్నాను పంపించేశానని అంటుంది.
ఆయన నాకు ప్రపోజ్ చేయకుండా ఆపడానికి నువ్వు ఇంత దిగజారిపోతావని అనుకోలేదని అంటుంది కావ్య. ఆయన నాకు ప్రపోజ్ చేయకుండా ఎన్ని రోజులు దూరంగా ఉంచగలవని ప్రశ్నిస్తుంది కావ్య. ఏదో ఒకరోజు నీ అడ్డు తలిగిపోవడం ఖాయమని చెబుతుంది. నీ చెల్లిని పంపించి వార్నింగ్ ఇస్తే నేను భయపడిపోతానని అనుకున్నావా? అని ప్రశ్నిస్తుంది యామిని. ఒంటి మీద ఖాకీ చొక్కా ఉందన్న పొగరుతో నాకే వార్నింగ్ ఇచ్చిందని.. ఆ డ్రెస్‌తోనే దానికి సమాధానం చెబుతానని అంటుంది. అప్పూ ఇంటికి రాగానే ఆ యామిని ఇంటికి ఎందుకు వెళ్లావని నిలదీస్తుంది కావ్య. నా మాటంటే నీకు లెక్క లేకపోయిందని అంటుండగా అపర్ణ, ఇందిరలు అప్పూకి అండగా నిలబడతారు.
స్వరాజ్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో మెంబరైన సిద్ధార్ధ్ అనే వ్యక్తిని యామిని కలుస్తుంది. ఆ కంపెనీ పవర్ ఆఫ్ అటార్నీ కోసం మీరు శాయశక్తులా కృషి చేస్తున్నారని నాకు తెలుసని చెబుతుంది యామిని. కావ్యని ఎండీ చైర్ నుంచి దించడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌తో మీటింగ్ పెట్టమని సిద్ధార్ధ్‌కు చెబుతుంది యామిని. తన వల్ల కంపెనీకి ఎంత నష్టం, మీ వల్ల ఎంత లాభం అనేది చూపించండి అని వివరిస్తుంది. ఆ ప్రెజర్ తట్టుకోలేక కావ్యే చైర్ వదిలేసేలా చేస్తుందని చెబుతుంది యామిని. కావ్యకి రాజ్ ఫోన్ చేయడంతో ఆమె సారీ చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











