Brahmamudi June 29th Episode: లక్కీతో లేడీ గెటప్.. రేఖ నుంచి శృతిని కాపాడిన రాజ్, ఇందూ గ్రాండ్ విక్టరీ
Photo Courtesy: JioHotstar
ఇందూ గీసిన డిజైన్లు చూసి రాజ్ నవ్వుకుంటాడు, ఇంతలో అపర్ఱ వచ్చి మీరిద్దరూ గొడవ పడతారు, మళ్లీ తిట్టుకుంటారు, ఒక్కటి అవుతారు నాకేం అర్ధం కావడం లేదని అంటుంది. డిజైన్లు చూసి మీ కన్నా చిన్నపిల్లలు బాగా వేస్తారని చెబుతుంది. నేను మా అమ్మలా టాలెంటెడ్ కాకపోవచ్చు, కానీ టాలెంట్ ఉన్న వ్యక్తుల నుంచి ఔట్‌పుట్ తీసుకుంటానని చెప్పి శృతికి కాల్ చేస్తుంది. ఆవిడ పంపించిన డిజైన్లు బాగున్నాయని మెచ్చుకుంటుంది ఇందూ. శృతికి రేఖ ఫోన్ చేసి మీ అమ్మ హాస్పిటల్‌లో ఉంది, ఆమెను నేను కాపాడతాను అని కానీ నేను చెప్పినట్లు నువ్వు చేయాలని కండీషన్ పెడుతుంది. ఇందూ అడిగిన డిజైన్లు ఆలస్యంగా ఇవ్వమని చెబుతుంది.
బోర్డ్ మీటింగ్ కోసం వచ్చిన హర్షను చూసి శృతికి కాల్ చేస్తుంది ఇందూ. ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో రేఖ వచ్చి శృతి రాలేదా అని అడుగుతుంది. శృతిని గమనిస్తూ ఉండాలని ఇద్దరు రౌడీలకు చెబుతుంది రేఖ. అయితే వాళ్లిద్దరికి మస్కా కొట్టి ఆఫీస్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంది శృతి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 29వ తేదీ ఎపిసోడ్ 1071లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
శృతి రాకపోవడంతో రాజ్, ఇందూలు టెన్షన్ పడుతుంటారు. ఇదంతా చూసిన రేఖ నవ్వుకుంటుంది. నాతోనే సవాల్ చేస్తే ఇలా ఉంటుంది, ఈరోజు నేను కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని అనుకుంటుంది. హర్షగారు సీరియస్ అవుతున్నారు తనకు అర్జెంట్ మీటింగ్ ఉందట అంటుంది రేఖ. ఇంకో 5 నిమిషాల్లో శృతిగారు వచ్చేస్తారని రాజ్ చెబుతాడు. ఇందాకటి నుంచి అదే చెబుతున్నారు, తను కనీసం మన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని అంటుంది రేఖ. తను టైంకి వస్తానన్నారు కదా? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదో అర్ధం కావడం లేదని అంటుంది ఇందూ. నేను వెళ్లి హర్షా గారిని వెళ్లమని చెబుతానని అంటుంది రేఖ.
ఈ డీల్‌ను క్యాన్సిల్ చేయాలని అనుకుంటున్నావా? హర్షా గారిని ఎందుకు వెళ్లమని చెబుతాను అంటున్నావు? అని రాజ్ ప్రశ్నిస్తాడు. శృతి రావడం లేదు కదా? అసలే హర్షగారు చాలా స్ట్రిక్ట్, అతనికి ఇంపార్టెంట్ మీటింగ్ ఉందట, మనవల్ల ఆ మీటింగ్‌కి అటెండ్ కాకపోతే మళ్లీ మనమీదే సీరియస్ అవుతారు. మళ్లీ భవిష్యత్తులో మన కంపెనీతో డీల్ చేయాలని అనుకోడని చెబుతుంది రేఖ. ఇంతలో శృతి రావడం చూసిన రేఖ షాక్ అవుతుంది. ఇంతసేపు ఏం చేస్తున్నారు అని ఇందూ అడగ్గా.. టెన్షన్‌లో ఫోన్ చూసుకోలేదని చెబుతుంది శృతి. దాంతో రౌడీలకు ఫోన్ చేసి మండిపడుతుంది రేఖ. శృతిని సోడా అడిగితే ఇస్తానని లోపలికి వెళ్లింది.. ఇంత వరకు బయటకు రాలేదని చెబుతారు రౌడీలు. శృతి వచ్చేసిందని రేఖ చెప్పడంతో రౌడీలు షాక్ అవుతారు. మనం జాగ్రత్తగా కాపలా కాస్తున్నాం కదా? మరి మేడం అలా అంటున్నారేంటీ అని రౌడీలు అనుకుంటూ ఉండగా ఓ లేడీ గెటప్‌లో ముసుగు వేసుకుని లక్కీ సోడా తీసుకుని రావడంతో ఇద్దరూ షాక్ అవుతారు.
హర్షాకి ఇందూ డిజైన్లు చూపిస్తుండగా రేఖ లోపలికి వస్తుంది. ఇదంతా చూసి నీ మైండ్ బ్లాక్ అయ్యిందా? నువ్వు నీ ప్లాన్‌లో ఉంటే.. నేను నా ప్లాన్‌లో ఉన్నానని అనుకుంటాడు రాజ్. డిజైన్‌లో ఓ తప్పు ఉండటంతో దానిని సరిచేయమని చెబుతాడు హర్ష. మీరు చెప్పింది నిజమేనని ఇందూపై సీరియస్ అవుతుంది. ఇప్పుడు హర్షాగారు డీల్ క్యాన్సిల్ చేసుకుంటారని అంటుంది. ఎలాగైనా ఈ డీల్ క్యాన్సిల్ చేయాలని చూస్తున్నావా? నీ ప్లాన్ జరగనివ్వనని అనుకుంటాడు రాజ్. నేను ఇందూ, శృతిగారు కలిసి ఒకటికి పదిసార్లు డిస్కస్ చేసుకున్న తర్వాతే వీటిని ఫైనల్ చేశామని, మీ డౌట్‌ని ఇందూ క్లారిఫై చేస్తుందని అంటాడు రాజ్.
నేను ఏమో అనుకున్నాను కానీ, మొన్న మీ అమ్మగారి డిజైన్లు పంపినప్పుడు ఇలా పాతవి పంపిస్తున్నారు? మనం ఈవిడకి డీల్ ఇచ్చి ఏమైనా మిస్టేక్ చేశామా? అని డౌట్ పడ్డాను, కానీ ఈ డిజైన్ చూశాక నేను కరెక్ట్ పర్సన్‌కే డీల్ ఇచ్చాను అనిపించింది, డిజైన్లు చాలా బాగున్నాయని మెచ్చుకుంటాడు హర్షా. మీ అమ్మగారు కనుక డిజైన్లు వేస్తే ఎలా ఉంటాయో అచ్చం అలాగే ఉన్నాయని చెబుతాడు. 3 నెలల్లోగా ఈ డిజైన్లు మాకు ఇవ్వగలిగితే మా కంపెనీ తరపున వచ్చే కాంట్రాక్ట్స్ అన్నీ మీకే ఇస్తామని ఆఫర్ ఇస్తాడు హర్షా. మీరు మాట నిలబెట్టుకున్నారు, బిజినెస్‌లో ఉండాల్సిన మొదటి క్వాలిటీ ఇదే, మీరు ఖచ్చితంగా చాలా పెద్ద బిజినెస్ ఉమెన్ అవుతారని చెబుతాడు హర్షా. ఆ మాటలతో రేఖ షాక్ అవుతుంది.
తాను చెప్పిన మాట శృతి వినకపోవడంతో రేఖ మండిపడుతుంది. మీ అమ్మ ప్రాణాలంటే లెక్కలేదా అంటూ ఫైర్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఎన్ని తప్పులు చేసినా చూస్తూ వస్తున్నా, మీరు నన్ను తిట్టినా కూడా భరించాను, నా మనసు ఒప్పుకోకపోయినా సైలెంట్‌గా ఉన్నాను. కానీ ఇప్పుడు అలా ఉండలేను, ఇందూ మేడం నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించారు, తనను మోసం చేయలేనని చెబుతుంది శృతి. నీ జీవితం కంటే తనని గెలిపించడమే నీకు ముఖ్యమా అని రేఖ ప్రశ్నించగా.. ఔను అని అంటుంది శృతి. కష్టాల్లో ఉన్న నా ఫ్యామిలీ తిరిగి నిలబడిందంటే దానికి కారణం రాజ్ సార్- కావ్య మేడం.. వాళ్ల కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, నేను మీలాగా తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం కాదని అనడంతో రేఖ ఫైర్ అవుతుంది.
నీ ధైర్యం ఆ రాజ్‌గాడే కదా? వాడిని చూసుకునే కదా ఇలా ఎగెరిగిరి పడుతున్నావు? అసలు నువ్వు చేసిన పనికి నేనేం చేస్తానో తెలుసా అని ప్రశ్నిస్తుంది రేఖ. మహా అయితే నన్ను జాబ్‌లో నుంచి తీసేస్తారు అంతేకదా అంటుంది శృతి. జాబ్‌లో నుంచే కాదు కదా? నా ప్రాణాలు తీసినా నేను ఇందూ మేడంకి అన్యాయం చేయయని తేల్చేస్తుంది శృతి. నా గురించి నీకు పూర్తిగా తెలిసి కూడా నువ్వు ఇలా చేస్తున్నావంటే నేనంటే భయం పోయింది, త్వరలోనే నేనంటే ఏంటో అర్ధమయ్యేలా చేస్తానని వార్నింగ్ ఇస్తుంది రేఖ. ఈ మాటలన్నీ విన్న ఇందూ.. మీరెందుకు ఇంత రిస్క్ తీసుకున్నారు, మా రేఖ ఆంటీ మిమ్మల్ని లాక్ చేసిందని నాకు ముందే చెప్పొచ్చు కదా అని అంటుంది.
తను ఎలా రియాక్ట్ అయినా పర్లేదు, మీరు మాత్రం ఎవరి ముందు తలదించుకోవడానికి వీల్లేదు. మీ అమ్మగారు నాకు చేసిన హెల్ప్‌కి నేను ఎప్పటికీ రుణం తీర్చుకోలేను, మీ కోసం మీ ఫ్యామిలీ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అని అంటుంది శృతి. కంపెనీకి ముందు పూర్వవైభవం తీసుకొచ్చే పనిలో ఉండండి అని చెబుతుంది. ఈరోజు ఈ డీల్ ఓకే అయ్యిందంటే దానికి కారణం మీరే.. మా రేఖ ఆంటీకి భయపడి మీరు డిజైన్లు తీసుకురాకపోయుంటే డీల్ క్యాన్సిల్ అయ్యేది, మార్కెట్‌లో నాకు బ్యాడ్ నేమ్ వచ్చేదని శృతిని హత్తుకుంటుంది ఇందూ.
చలపతిని కంపెనీ ఓనర్ ఇంటికి పిలిచి 5 నెలలు బోనస్ ఇస్తున్నామని చెప్పడంతో చలపతి - లక్ష్మీలు సంతోషిస్తారు. మా కంపెనీ ఎదుగుదల కోసం కష్టపడ్డ నీకోసం ఏదో ఒకటి చేయాలని ఈ బోనస్ ఇస్తున్నామని చెబుతాడు ఓనర్. ఇంతలో ఓనర్ వాళ్ల అమ్మాయి ప్రియ వచ్చి తాను మూన్‌స్టార్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్లు చెబుతాడు. మా అబ్బాయి కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నాడని అతని పేరు వెంకీ అని చలపతి చెప్పడంతో... అలాంటి వాళ్లెవరూ లేరని ఆ అమ్మాయి చెప్పడంతో చలపతి- లక్ష్మీలు షాక్ అవుతారు. మా అబ్బాయి నాకు అదే పేరు చెప్పాడని చలపతి అనగా.. ఇంతలో అదే ఇంటికి ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వెంకీ వస్తాడు. అక్కడ తన తల్లిదండ్రులను చూసి వెంకీ షాక్ అవుతాడు. మాస్క్ పెట్టుకుని వాళ్లకి ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి ఇచ్చాడు. ఈ స్వీట్స్ మీ కోసమే తెప్పించానని చలపతికి ఇస్తాడు ఓనర్.
ఇందూ దగ్గర ఓడిపోవడంతో రగిలిపోతుంటుంది రేఖ. ఇంతలో శేషం స్వీట్స్ తీసుకుని వస్తాడు. మనం పూర్తిగా ఓడిపోయామని చెప్పడానికే ఈ స్వీట్స్ తీసుకొచ్చానని అంటాడు. ఈ దెబ్బతో అల్లుడు- ఇందూ ఎక్కడికో వెళ్లిపోతారు. ఎంప్లాయిస్ అంతా వాళ్లని దేవుళ్లలా చూస్తారు, ఇక క్లయింట్స్ అంతా వాళ్లని ఎవరెస్ట్ ఎక్కిస్తారు. ఇక వారికి ఓటమి అనేది ఉండదని సెటైర్లు వేస్తాడు. నీ ప్లాన్స్ అన్నీ ఆ రాజ్ గాడు తిప్పికొట్టాడు. ఇప్పుడు కంపెనీలో రేఖ చెల్లెమ్మతో పనిలేదని ప్రూవ్ చేసిన అల్లుడు.. ఇంట్లో కూడా రేఖ చెల్లెమ్మతో పనిలేదని తప్పకుండా ప్రూవ్ చేస్తాడని శేషం వార్నింగ్ ఇస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications