Brahmamudi June 2nd Episode: శోభనంతో ఒక్కటైన అప్పూ- కళ్యాణ్.. యామినికి ఇందిర చెక్, రంగంలోకి కావ్య
Photo Courtesy: JioHotstar
దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బలవంతం చేయడంతో కావ్యకి తన మనసులోని మాటను చెబుతుండగా వైదేహి పదే పదే రాజ్‌కి ఫోన్ చేస్తుంది. ఏం జరిగిందోనని అతను ఫోన్ లిఫ్ట్ చేయగా యామిని స్పృహ తప్పిపడిపోయిందని చెప్పడంతో రాజ్ కంగారుగా వెళ్లిపోతాడు. కొద్ది క్షణాల్లో కావ్యకి రాజ్ ప్రపోజ్ చేయబోతుండగా యామిని ఆపిందని రుద్రాణి సంబరపడిపోతుంది. డిప్రెషన్‌లోకి వెళ్లడం వల్లే యామిని స్పృహ తప్పిందని ఆమెను జాగ్రత్తగా చూసుకోమని రాజ్‌కి డాక్టర్ వార్నింగ్ ఇస్తాడు.
మిమ్మల్ని పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడదామని అనుకున్న యామినిని పట్టించుకోకపోవడంతో తను డిప్రెషన్‌లోకి వెళ్లిందని రాజ్ దగ్గర బాధపడుతుంది వైదేహి. తనను మామూలు మనిషిని చేయడానికి ఎక్కడికైనా తీసుకెళ్లమని అడగడంతో రాజ్ తప్పనిసరి పరిస్ధితుల్లో మాటిస్తాడు. కావ్యకి ప్రపోజ్ చేయడానికి రేపు రావడం కుదరదని ఇందిర, అపర్ణలకి చెబుతాడు రాజ్. ఇంతకీ రాజ్‌ను ఏం చేయబోతున్నావ్? నీ ప్లాన్ ఏంటీ అని యామినిని అడుగుతుంది వైదేహి. రిసార్ట్స్‌లో బావతో నా శోభనం జరుగుతుందని .. ఇక నా పెళ్లికి లైన్ క్లియర్ అని యామిని చెప్పడంతో వైదేహి షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 2వ తేదీ ఎపిసోడ్ 737లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
శోభనం ముహూర్తం దాటిపోతున్నా.. ఫోన్ చూస్తూ ఉండిపోయిన అప్పూపై మండిపడతాడు కళ్యాణ్. దొంగ పారిపోయాడంటే వాడిని పట్టుకుని వచ్చాం నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది కదా ఇంకా మెసేజ్‌లు చేస్తూ కూర్చుంటావా అంటూ ఫైర్ అవుతాడు. మా సీఐ గారికి ఆ దొంగ దొరికాడని మెసేజ్ పెడుతున్నానని చెబుతుంది అప్పూ. నువ్విలా ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి ఏదో ఒక వంక చెబితే ఇక రెండేళ్లయినా మన శోభనం మాత్రం జరగదని అంటాడు కళ్యాణ్.
అలిగి మంచం మీద కూర్చొన్న కళ్యాణ్‌ని అప్పూ బ్రతిమలాడుతుంది. బావ అక్కకి ప్రపోజ్ చేసుంటే చాలా బాగుండేదని అంటుంది. వాళ్లు ఎప్పటికైనా కలిసిపోతారని, ముందు మన గురించి ఆలోచించమంటాడు కళ్యాణ్. ఆ తర్వాత చేతికి పాల గ్లాస్ ఇస్తుంది అప్పూ. నేను నీ భర్తని ఆ అడగటం ఏంటీ? జైళ్లో ఖైదికి ఇచ్చినట్లు కాకుండా ప్రేమగా అడుగు అంటాడు. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఎన్ని తిప్పలు పడ్డాను, ఇప్పుడు శోభనానికి కూడా ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోందని బాధపడతాడు కళ్యాణ్. అంటే నేను నీ దురదృష్టాన్ని అని ఇన్‌డైరెక్ట్‌గా చెబుతున్నావా? అని అలిగి పక్కకి వెళ్లిపోతుంది అప్పూ. ఈ టైంలో అలగడం ఏంటీ? అని కళ్యాణ్ అడగ్గా.. కోపం వస్తే నేను ఏ టైంలో అయినా అలుగుతానని చెబుతుంది అప్పూ. తర్వాత ఓ రొమాంటిక్ సాంగ్ పాడి అప్పూని కూల్ చేసి ఫస్ట్ నైట్ చేసుకుంటాడు కళ్యాణ్.
స్వప్న దగ్గర దొంగతనం చేసిన నగల్ని తన ప్రియురాలికి అలంకరిస్తాడు రాహుల్. ఈ నగలు ఆ స్వప్న కంటే నీకే అందంగా ఉన్నాయని ఆమెను పొగుడుతాడు. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందని నువ్వు అడిగిన నగల్ని తీసుకొచ్చాను, మా మమ్మీ అనుకున్నట్లు ఆ కావ్య- రాజ్ విడిపోయారని చెబుతాడు రాహుల్. ఆ రాజ్ కనుక యామినిని పెళ్లి చేసుకున్నాడంటే మా ఫ్యామిలీకి పర్మినెంట్‌గా దూరమైపోయినట్లేనని అంటాడు. రాజ్యానికి రాజు లేకపోతే సింహాసనం ఖాళీగానే ఉంటుంది కదా.. అది ఖాళీగా ఉంటే నా లాంటి సైన్యాధిపతి చూస్తూ ఊరుకుంటాడా? అని ప్రశ్నిస్తాడు రాహుల్. రాజ్యాన్ని సొంతం చేసుకుని సింహాసనం మీద ఎక్కి కూర్చొంటాడు కదా అని అంటాడు.
నువ్వేమో రాజుగా మారి కోటీశ్వరుడివి అయిపోతావు, నాకేమో ఈ ముష్టి నగలు తీసుకొచ్చి పెడతావా? అని మండిపడుతుంది రాహుల్ ప్రియురాలు. ఏడు వారాల నగలు 50 లక్షల పైన ఉంటాయని చెబుతాడు. నీకేమో కోట్లు .. నిన్ను నమ్ముకున్నందుకు నాకు లక్షలా అని ప్రశ్నిస్తుంది. ఆస్తి నా చేతికి రాగానే మా ఆవిడకి విడాకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెబుతాడు రాహుల్. ఆస్తి లేనప్పుడే నీకు ఇన్ని నగలు తీసుకొచ్చి ఇచ్చాను, అలాంటిది నా మనసు మారుతుందా అని ప్రశ్నిస్తాడు. ఇదంతా నా మీద మోజు తీరే వరకే ఆ తర్వాత నన్ను కూడా టిష్యూ పేపర్‌లా పక్కన పెట్టేస్తావని మండిపడుతుంది ప్రియురాలు. నీ హిస్టరీ మొత్తం వదిలేసిన అమ్మాయిలే తప్ప, లైఫ్ లాంగ్ కలిసున్న అమ్మాయిలు ఒక్కరు కూడా లేరు కదా అని చెబుతుంది.
ఆ ఒక్క అమ్మాయివి నువ్వేనని, లైఫ్ లాంగ్ నేను నీతో కలిసుంటానని చెబుతాడు. నువ్వేమో లంక అంత బంగ్లాలో ఉన్నావ్.. కనీసం నాకు విల్లా అయినా ఉండాలి కదా అని ప్రియురాలు అనడంతో రాహుల్ షాకవుతాడు. విల్లా అంటే 5 కోట్లు అవుతుందని అంటాడు. కాబోయే భార్యని నా కోసం ఆ మాత్రం చేయలేవా అని ప్రశ్నిస్తుంది. ముందు నేను అడిగింది చేస్తేనే నేను నీకు సొంతం అవుతానని చెబుతుంది. నీ నగలు నువ్వే తీసుకెళ్లిపో, ఈ రోజు నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో రాహుల్ షాక్ అవుతాడు. ఆస్తిని నా సొంతం చేసుకుని, నీ విల్లా నీకు ఇచ్చిన తర్వాతే, నీకు నా మీద నమ్మకం కలిగిన తర్వాతే నీ మీద చేయి వేస్తానని చెబుతాడు రాహుల్.
ఆస్తి మొత్తం నీ సొంతం ఎప్పుడవుతుందని అడుగుతుంది ప్రియురాలు. కనీసం హగ్ అయినా ఇస్తావా? అని అడుగుతాడు రాహుల్. ఏడువారాల నగలతో దీన్ని సొంతం చేసుకుందామనుకుంటే ఇది ఏకంగా విల్లాకే గాలం వేసిందని, ఏదో ఒకటి చేసి దీన్ని నా సొంతం చేసుకోవాలని అనుకుంటాడు రాహుల్. మరోవైపు.. ఇందిర, అపర్ణలు కావ్యని పిలిచి నువ్వొక ఆపరేషన్ చేయాలని చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. మేం చెప్పేది డాక్టర్లు చేసే ఆపరేషన్ కాదు, సైనికులు చేసే ఆపరేషన్ అంటుంది ఇందిర. రాజ్ నీకు ప్రపోజ్ చేయకుండా యామిని ప్లాన్ చేసి ఆపింది.. అలాగే వాడు మనింటికి రాకుండా రిసార్ట్‌కి తీసుకెళ్తోందని చెబుతుంది. ఆ రిసార్ట్‌లో ఏమైనా తప్పు జరిగిందా?.. రాజ్ నీకు శాశ్వతంగా దూరమైపోతాడని హెచ్చరిస్తుంది అపర్ణ. ఆ మాటలతో కావ్య షాక్ అవుతుంది.
ఆ యామిని నీ భర్తను, నీ మాంగళ్యాన్ని లాక్కొకముందే నువ్వు ఆపరేషన్ మాంగళ్యాన్ని అమలు చేయాలని అత్తాకోడళ్లు కలిసి కావ్యకి హిత బోధ చేస్తారు. ఖచ్చితంగా చేస్తానన్న కావ్య వాళ్లు ఏ రిసార్ట్‌కి వెళ్తున్నారో ఎలా తెలుసుకోవాలని అడుగుతుంది. ఫస్ట్ నైట్ జరిగి అలిసిపోయి నిద్రపోయిన కళ్యాణ్‌కి అప్పూ కాఫీ ఇస్తుంది. రిసార్ట్‌కి బయల్దేరుతున్న యామినిని మనం తప్పు చేస్తున్నామని ఈ ప్లాన్ వద్దని చెబుతుంది వైదేహి. నాకు రాజ్ అంటే ప్రాణమని, బావని సొంతం చేసుకోవడానికి ఏమైనా చేస్తానని అంటుంది యామిని. ఇంతలో రాజ్‌కి ఇందిర ఫోన్ చేసి కళావతి కూడా రిసార్ట్‌కి వస్తుందని మంచి టైం చూసుకుని తనకి ప్రపోజ్ చేయమని చెబుతుంది. ఆ మాటలతో రాజ్ సంతోషిస్తుండగా యామిని వచ్చి అంత సంతోషంగా ఉన్నావేంటీ? అని అడుగుతుంది. తర్వాత ఇద్దరూ కలిసి కారులో రిసార్ట్‌కి బయల్దేరతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











