Brahmamudi June 2nd Episode: వెంకీ ఆత్మహత్యాయత్నం.. తలుపులు బద్ధలుకొట్టి కాపాడిన నందూ..
Photo Courtesy: JioHotstar
ఇందూ- రాజ్‌ల ఫస్ట్ నైట్ ఆపడానికి రేఖ ప్లాన్ చేసి.. నిద్రమాత్రలను భ్రమరాంబకి ఇస్తుంది. కానీ ఇందూ- రాజ్‌లని కలపాలని అనుకున్న భ్రమరాంబ నిద్రమాత్రలకు బదులుగా రాజ్‌ని రెచ్చగొట్టే మాత్రని పాలలో కలిపి ఇస్తుంది. స్వాతి, అపర్ణలు కలిసి ఇందూని రెడీ చేస్తారు. ఇంతలో అక్కడిక వచ్చిన భ్రమరాంబను చూసి షాక్ అవుతారు. పాలలో ఏమైనా కలిపావా అని భ్రమరాంబపై డౌట్ పడుతుంది అపర్ణ.
గదిలో బెడ్ మొత్తం పూలు, పండ్లు, స్వీట్లతో అందంగా డెకరేట్ చేయడంతో రాజ్ సంబరపడిపోతాడు. మనది మామూలు లక్ కాదు.. పెళ్లికాకుండానే శోభనం చేసుకోపోతున్నానని ఖుషి అవుతాడు. ఇంతలో పాల గ్లాసు తీసుకుని, అందంగా రెడీ అయి గదిలోకి వస్తుంది ఇందూ. ఆమెను చూడగానే సిగ్గుపడతాడు రాజ్. పాల గ్లాసు ఇవ్వమని అడగ్గానే పాలు మొత్తం డస్ట్‌బిన్‌లో పారబోస్తుంది ఇందూ. ఈరోజు నిన్న వదలను అంటూ రాజ్ మీదకు వస్తుండగా అతని బిహేవియర్‌కి ఇందూ కంగారుపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 2వ తేదీ ఎపిసోడ్ 1048లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నీ కళ్లలో ఏదో మాయ ఉందని ఇందూకి ఐ లవ్ యూ చెబుతూ ముద్దు పెట్టుకోబోతాడు రాజ్. ఆ వెంటనే గట్టిగా నవ్వుతూ.. నీలో ఇలాంటి కంగారు చూడాలని ఇలా యాక్ట్ చేశా. పోయి పోయి నీతో కమిటయ్యే రకం కాదు. ప్రాణం పోతుందని తెలిసినా సరే క్యారెక్టర్ చంపేసుకోడు, మాటంటే మాటే. నేను నీ అద్దె మొగుడిని.. నా హద్దుల్లో ఉంటానని అంటాడు రాజ్. నా మీద చేయి వేసుంటే అప్పుడే చెప్పేదానిని వార్నింగ్ ఇస్తుంది ఇందూ. నేను ఆడవాళ్ల మీద చేయి చేసుకోను.. నా క్యారెక్టర్ బ్యాడ్ అయిపోతుందని అంటాడు రాజ్. నీ యాక్టింగ్, ఓవర్ యాక్టింగ్ చాలు.. వెళ్లి పడుకోమని చెబుతుంది ఇందూ. ఇలాంటి పూల పాన్పు మీద పడుకోవాలని అనుకున్నాను, అది నిజమైందని అనుకుంటాడు రాజ్.
ఇదంతా చూసిన ఇందూ.. నువ్వు కిందపడుకో, నేను బెడ్ మీద పడుకుంటానని అంటుంది. ఈ ఒక్కరోజు బెడ్ మీద పడుకుంటా, రేపు మాత్రం నేల మీద పడుకుంటానని రిక్వెస్ట్ చేస్తాడు రాజ్. అయితే వేడి వేడి అట్లకాడ వాతలు పడతాయని వార్నింగ్ ఇస్తుంది ఇందూ. కింద పడుకుంటావా? వాతలు పెట్టమంటావా అని ఫైర్ అవుతుంది. దాంతో చేసేదేం లేక కిందపడుకోవడానికి ఒప్పుకుంటాడు రాజ్. పూల పాన్పు ఉన్నా కూడా నేల మదే పడుకోవాల్సి వస్తోంది.. ఇక నా మధ్యతరగతి జీవితం మారదని బాధపడతాడు.
చలపతి, లక్ష్మీలు వెంకీ గురించి బాధపడుతుండగా.. నందూ కంగారుగా ఇంటికొచ్చి వెంకీ ఎక్కడ అని అడుగుతుంది. నేను ఎన్నిసార్లు కాల్ చేసినా వెంకీ లిఫ్ట్ చేయడం లేదని చెబుతుంది. జాబ్ రాకపోతే వాడు లిఫ్ట్ చేయడం లేదని తలుపు కొడుతుంది. అయితే అప్పటికే వెంకీ ఆత్మహత్య చేసుకోవడానికి చేయి కట్ చేసుకుంటాడు. కిటికీ దగ్గరికి వెళ్లి చూడగా.. వెంకీ మణికట్టు కట్ చేసుకుని రక్తం కారుతుంది. నీ ప్రాణాలు పోతాయి.. తలుపు తీయమని చలపతి, లక్ష్మీలు బతిమలాడతారు. నాకు ఈ జీవితం మీద విరక్తి పుట్టింది.. బతకాలనే ఆశ, ఆసక్తి పోయిందని అంటాడు నందూ. నన్ను క్షమించండి, మీరు నా మీద పెట్టుకున్న ఆశల్ని మధ్యలోనే బద్ధలు కొడుతున్నానని అంటాడు వెంకీ.
దాంతో నందూ తలుపులు బద్ధలు కొడుతుంది. ఈ సమాజంలో నా లాంటి ఔట్‌డేటెడ్ పర్సన్ ఉండకూడదు, నన్ను కాపాడొద్దని అంటాడు వెంకీ. దాంతో ముఖం పగలగొడుతుంది నందూ. డాక్టర్ వచ్చి వెంకీకి గడ్డి పెడతాడు. ఇంకొంచెం అయ్యుంటే నరం కట్టేయ్యదని చెబుతాడు. డాక్టర్‌కి డబ్బులు తర్వాత ఇస్తానని చలపతి చెప్పగా.. మొన్నటి ఇంజెక్షన్ డబ్బులు కూడా ఇవ్వలేదని చెబుతాడు డాక్టర్. నాకున్న క్వాలిఫికేషన్‌కి ఎక్కడా జాబ్ రావడం లేదు.. అప్పుల వాళ్లు నాన్నని అవమానిస్తున్నారు. నా వల్ల ఆయన మాట పడటం తట్టుకోలేకపోయానని చెబుతాడు వెంకీ. నీకు ఏమైనా జరగరానిది జరుగుంటే మీ అమ్మనాన్న తట్టుకోగలరా? ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక అందరూ నీలాగా చచ్చిపోవాలని అనుకుంటే ఈ భూమ్మీద ఏ ఒక్కరూ ఉండరని క్లాస్ పీకుతుంది నందూ. పది కంపెనీలలో జాబ్ రాకపోతే నువ్వు ఫెయిల్యూర్ కాదు.. కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి, జాబ్ కోసం ట్రై చేయాలి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఈరోజు వద్దు అన్నవారే నిన్ను గౌరవిస్తారని చెబుతుంది నందూ.
జాబ్ లేకపోతే ఏమైంది? నేను ఉన్నాను కదా.. నీకు ఏమైనా జరిగితే మేం బతకలేమని అంటారు చలపతి- లక్ష్మీ. నీ ఒంటిపై దెబ్బ పడకుండా ఇన్నాళ్లూ కాపాడుకుంటూ వచ్చాం.. అలాంటిది నీకు ఏమైనా జరిగితే తట్టుకోలేమని అంటుంది లక్ష్మీ. నీకు ఉద్యోగం వచ్చే వరకు మేం తోడుగా ఉంటామని అంటాడు చలపతి. నువ్వు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి వాళ్ల కడుపున పుట్టావు.. కన్నవాళ్లని ఇలా బాధపెట్టకూడదని మండిపడుతుంది నందూ. వీడిని జాగ్రత్తగా చూసుకోండి అని నందూ చెప్పగా.. థ్యాంక్స్ అన్న మాట సరిపోదు, నువ్వే కనుక రాకపోయుంటే నా కొడుకుని మేం కాపాడుకునే వాళ్లం కాదని చేతులెత్తి దండం పెడతాడు చలపతి. వాడు మీకెంతో నాకు కూడా అంతే. వీడు అమాయకుడు.. నాకు నా జీవితం కంటే వాడి జీవితం మీదే ఎక్కువ కంగారు ఉంటుంది, అయినా నేను చూసుకుంటానని చెబుతుంది నందూ.
ఇందూ- రాజ్‌లకు శోభనం జరిగిందా? లేదా? అంటూ రేఖ- భ్రమరాంబలు టెన్షన్ పడతారు. ఇంతలో శోభనం గది నుంచి చెదిరిన జుట్టుతో ఇందూ.. మగాడిలా రాజ్ కిందకి రావడంతో రేఖ షాక్ అవుతుంది. భ్రమరాంబ మాత్రం సంబరపడిపోతుంది. రాజ్ దగ్గరికి వెళ్లి చెక్ చేస్తుంది భ్రమరాంబ. మీరంతా ఇంత పొద్దున్నే లేచి మీటింగ్ పెట్టారని ప్రశ్నిస్తాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications