Brahmamudi June 30th Episode: కావ్య చుట్టూ యామిని అష్ట దిగ్భంధనం .. ప్రమాదంలో కళావతి ఎండీ చైర్
Photo Courtesy: JioHotstar
స్వప్న, కావ్యలను ఇంటి దగ్గర దించేసి నేరుగా యామిని ఇంటికి వెళ్లి లాగిపెట్టి కొడుతుంది అప్పూ. మా అక్కల జోలికి వస్తే తీసుకెళ్లి లాకప్‌లో లాఠీలతో కొడతానని యామినికి వార్నింగ్ ఇస్తుంది అప్పూ. నా పెళ్లి ఆపుతానని, అరెస్ట్ చేస్తానని ఓవరాక్షన్ చేసి ఆధారం లేదని సైలెంట్ అయిపోయావని అప్పూతో అంటుంది యామిని. నిన్ను అరెస్ట్ చేయొద్దని మా కావ్య అక్క చెప్పింది కాబట్టే వదిలేశానని.. వీడియో డిలీట్ చేయించినంత మాత్రన ఆధారం కనుక్కోవడం నాకు చిటికెలో పని అని చెబుతుంది అప్పూ.
యామినితో అప్పూ సీరియస్‌గా మాట్లాడుతుండగా రాజ్ వాళ్లిద్దరి దగ్గరికి వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. ఓ కేసు గురించి ఇటువైపు వెళ్తూ యామినిని పలకరిద్దామని వచ్చానని చెబుతుంది అప్పూ. ఆమె వెళ్లిపోయాక కావ్యకి ఫోన్ చేసి నీ చెల్లిని పంపించి నాకు వార్నింగ్ ఇస్తే భయపడే రకం కాదని చెబుతుంది యామిని. ఇంటికొచ్చిన అప్పూపై కావ్య మండిపడగా.. అపర్ణ, ఇందిరలు అడ్డుకుంటారు. స్వరాజ్ కంపెనీ డైరెక్టర్ సిద్ధార్ధ్‌ని ఇంటికి పిలిపించి ఆ కంపెనీని కొట్టేసే ప్లాన్ చెబుతుంది యామిని. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 30వ తేదీ ఎపిసోడ్ 761లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నేనెందుకు వచ్చానో మీకు తెలియదా అని కావ్యను అడుగుతాడు రాజ్. నాకేమీ ఫేస్ రీడింగ్ లాంటిది రాదని రాజ్‌కి కౌంటర్ వేస్తుంది కావ్య. కళావతి తీరుపై దుగ్గిరాల కుటుంబం మండిపడుతుంది. ఈరోజు నీకెంత అర్జెంట్ పని ఉన్నాసరే గడపదాటడానికి వీల్లేదని ఇందిర తేల్చిచెబుతుంది. మీ ఇద్దరినీ ఒక్కటి చేయాలని మేం ఆరాటపడుతుంటే మీరు దాగుడుమూతలు ఆడుతున్నారా? అని మండిపడుతుంది అపర్ణ. మీరిద్దరికి ఒకరి తర్వాత ఒకరికి అర్జెంట్ కాల్స్ వస్తున్నాయంటే.. మాకు ఏ పని పాటా లేదా అని ఫైర్ అవుతుంది అపర్ణ. ఇలా ఎన్ని రోజులు పోస్ట్‌పోన్ చేసుకుంటూ వెళ్తారు.. ఏదో ఒక రోజు మీరిద్దరూ కలవాల్సిందే కదా అని అంటాడు సుభాష్. వాడు ఆ యామిని ఇంట్లో అంత ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదని వీలైనంత తొందరగా వాడి ప్రేమను యాక్సెప్ట్ చేయమంటాడు సుభాష్.
నేనేమీ కావాలని ఆయనకు దూరంగా వెళ్లడం లేదని పరిస్ధితులు అలా వస్తున్నాయని చెబుతుంది కావ్య. మీరిద్దరూ కలుస్తారో లేదోనని మీకు టెన్షన్‌గా ఉందో లేదో కానీ మాకు మాత్రం చాలా టెన్షన్‌గా ఉందని అంటుంది అపర్ణ. బావ నీకు ప్రపోజ్ చేస్తే చూడాలని మేమంతా ఎదురుచూస్తున్నామని చెబుతుంది అప్పూ. ఎప్పుడెప్పుడు ఆయన నోటి నుంచి ఐ లవ్ యూ అన్న మాట వింటానా అని ఎదురుచూస్తున్నానని అంటుంది కావ్య. నిజంగా వాడి కోసం నువ్వు అంతలా ఆరాటపడుతున్నావని మేం నమ్మాలంటే ఈరోజు నీకున్న పనులన్నీ క్యాన్సిల్ చేసుకోవాల్సిందేనని ఇందిర తేల్చి చెబుతుంది. నువ్వు చివరి నిమిషంలో ఎక్కడ జారుకుంటావోనని మా అందరి భయమని అంటుంది స్వప్న.
ఇంతలో రాజ్ వచ్చి కళావతికి అందరూ కలిసి కౌన్సిలింగ్ ఇస్తున్నారా? అని అడుగుతాడు. నేను మీతో మాట్లాడటం కుదరడం లేదని రాజ్‌కి సారీ చెబుతుంది కావ్య. మరేం పర్లేదని మీ పరిస్ధితిని నేను అర్ధం చేసుకుంటానిన అంటాడు రాజ్. బయటికి తీసుకెళ్లి కావ్యకి ఐ లవ్ యూ చెబుతానని అంటాడు రాజ్. బయటికి వెళ్తే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, ఇక్కడే చెప్పేశాయ్ అంటుంది ఇందిర. కావ్యకి రాజ్ ప్రపోజ్ చేస్తుండగా కంపెనీ మేనేజర్ అపర్ణకి ఫోన్ చేస్తాడు. దాంతో విసుక్కున్న అపర్ణ ఫోన్‌ని స్విచ్ఛాఫ్ చేస్తుంది. ఆ వెంటనే సుభాష్‌కి ఫోన్ చేసి కంపెనీలో జరిగినదంతా చెబుతాడు. సిద్ధార్ధ్ గారు సడెన్‌గా వచ్చి బోర్డ్ మీటింగ్ పెడుతున్నాడని చెప్పడంతో సుభాష్ షాక్ అవుతాడు.
ఈరోజు ఏమైనా బోర్డ్ మీటింగ్ ఉందా అని కావ్యని అడుగుతాడు సుభాష్. షెడ్యూల్‌లో ఏ మీటింగ్ లేవని.. కానీ ఆ సిద్దార్ధ్ గారు వచ్చి మీటింగ్ ఉందని చెప్పాడని కావ్యకి చెబుతాడు మేనేజర్. ఆ సిద్ధార్ధ్ ఏదో ప్లాన్ చేస్తున్నాడని అనిపిస్తోందని, మీరు అర్జెంట్‌గా ఆఫీస్‌కు రమ్మని అంటాడు మేనేజర్. నేను అర్జెంట్‌గా వెళ్లాలని రాజ్‌తో కావ్య అంటుంది. ఎక్కడికి వెళ్లేది ఈరోజు అటోఇటో తేల్చేయాలని ఇందిర చెబుతుంది. నువ్వు చెప్పాలనుకున్నది త్వరగా చెప్పమని రాజ్‌తో అంటుంది. నేను వెళ్లకపోతే రిస్క్‌లో పడతామని కావ్య ఎంత చెప్పినా వాళ్లు వినిపించుకోరు. దాంతో సుభాష్ జోక్యం చేసుకుని ఇప్పుడు కావ్య ఆఫీస్‌కి వెళ్లడం చాలా అవసరమని, లేదంటే మనకి చాలా నష్టం జరుగుతుందని అంటాడు. కావ్యకి ఎంతో అవసరం ఉండబట్టే అడుగుతుందని తనని వెళ్లనివ్వండని చెబుతాడు రాజ్.
బోర్డ్ మీటింగ్‌కు లేట్‌గా రావడం ఏంటని సిద్ధార్ధ్ మండిపడతాడు. ఇంతలో కావ్య అక్కడికి వస్తుంది. మీటింగ్ ఉందని తెలుసుంటే మీ అందరినీ వెయిట్ చేయించే దానిని కాదని చెబుతుంది కావ్య. ఈ కంపెనీలో బోర్డ్ మెంబర్ అయిన నాకే మీటింగ్ గురించి ఇన్ఫర్మేషన్ లేదంటే ఆశ్చర్యంగా ఉందని అంటుంది. సిద్ధార్ధ్ గారు మా అందరికీ సమాచారం ఇచ్చారని, మీకు చేయకపోవడం ఏంటని ఓ వ్యక్తి అడుగుతాడు. మీకు మెసేజ్ ఫార్వర్డ్ చేశానని అనుకున్నానని కానీ మిస్ అయ్యిందని అంటాడు సిద్ధార్ధ్. ఇప్పటి వరకు బోర్డ్ మీటింగ్‌కు మీ నాన్నగారే వచ్చేవారు.. మీకు మీటింగ్ కండక్ట్ చేసే అనుభవం లేదని మండిపడుతుంది కావ్య.
మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారని సిద్ధార్ధ్‌ని ఓ వ్యక్తి అడుగుతాడు. ఈ సిద్ధార్థ్ ఏం చేసినా కారణం ఉంటుందని.. మన కంపెనీ గ్రోత్ బాలేదని చెబుతాడు. నాగుపాములా పరిగెత్తాల్సిన మన కంపెనీ నత్తనడకన నడుస్తోందని, ఇండస్ట్రీలో నెంబర్ 1గా ఉన్న మన కంపెనీ పడిపోయిందని అంటాడు. ఇది ఇలాగే కొనసాగితే టాప్ 10లో కాదు కదా టాప్ 100లో కూడా ఈ కంపెనీ ఉండదని చెబుతాడు సిద్ధార్ధ్. నా దగ్గర అన్ని రకాల ప్రూఫ్స్ ఉన్నాయని అంటాడు. 500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అని ఓ ఫైల్‌ని కావ్యకి ఇస్తాడు. నన్ను నమ్మి మన కంపెనీకి ఇవ్వడానికి వాళ్లు ముందుకొచ్చారని అంటాడు. ఫారిన్‌లో ఉన్న టెంపుల్స్‌కి, విగ్రహాలకి ఆభరణాలు చేయించి ఇవ్వాలని చెబుతాడు. దీనిని అనుకున్న విధంగా చేసిస్తే ఇంకో 1000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కూడా రెడీగా ఉందని అంటాడు. కానీ ఈ ప్రాజెక్ట్స్ మన కంపెనీకి రావాలంటే ఎండీ చైర్ నుంచి కావ్య తప్పుకుని నాకు ఇవ్వాలని చెబుతాడు.
ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. మేడం ఆ సీటులో నుంచి తప్పుకోవడం ఏంటీ? అని ప్రశ్నిస్తారు. ఈ ప్రాజెక్ట్ నడిపించేంత సత్తా కావ్యకి లేదని సిద్ధార్థ్ అంటాడు. నేను ప్రాజెక్ట్ తీసుకొచ్చి కావ్యకి అప్పగిస్తానని.. కానీ ఆమె నాకంటే బెస్ట్ అని నిరూపించుకోవాలని సవాల్ విసురుతాడు సిద్ధార్ధ్. కావ్య కోపంగా బయటికి వచ్చేస్తుండగా శృతి, మేనేజర్ వచ్చి ఏదో ఒకటి చేసి మీరే బెస్ట్ అని నిరూపించుకోమని చెబుతారు. అంత తేలిగ్గా ఆ కుర్చీని వాడి చేతుల్లోకి వెళ్లనివ్వనని అంటుంది కావ్య. ఇంతలో యామిని ఆమెకు ఫోన్ చేసి బోర్డ్ మీటింగ్ అయిపోయిందా అని అడుగుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











