Brahmamudi June 30th Episode: బయటపడ్డ వెంకీ డెలివరీ జాబ్.. చలపతి గుండె బద్ధలు, రాజ్‌పై ఇందూలో మొదలైన ప్రేమ

Photo Courtesy: JioHotstar

బోర్డ్ మీటింగ్‌కు శృతి రాకపోవడంతో ఇందూ, రాజ్‌లు టెన్షన్ పడుతుంటారు. ఇదంతా చూసిన రేఖ.. శృతి వచ్చేలా కనిపించడం లేదు హర్షా గారిని వెళ్లిపోమని చెబుతానని అంటుంది. ఆయన చాలా పెద్ద బిజినెస్‌మెన్.. మనకోసం అంత వెయిట్ చేయరు, లేదంటే పెనాల్టీ వేస్తారని భయపెడుతుంది రేఖ. ఇంతలో శృతి ఆఫీస్‌కు రావడంతో రేఖ షాక్ అవుతుంది. దాంతో రౌడీలకు ఫోన్ చేసి శృతిని జాగ్రత్తగా వాచ్ చేయమని చెప్పాను కదా అని ఫైర్ అవుతుంది. వారికి లోపలి నుంచి లేడీ గెటప్‌లో లక్కీ వచ్చి లెమన్ సోడా ఇస్తాడు. మనతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని లక్కీ నవ్వుకుంటాడు. శృతి వేసిన డిజైన్లు హర్షాకి బాగా నచ్చుతాయి. అయితే రేఖ మాత్రం ఏదో అడ్డుపుల్ల వేయాలని అనుకుంటుంది. కానీ ఇందూ క్లారిటీగా చెప్పడంతో అతను సంతృప్తి చెందుతాడు. మీరు నాకు అనుకున్న టైంకి డిజైన్లు తయారు చేసి ఇస్తే మా కంపెనీకి వచ్చే ప్రతి ఆర్డర్ మీకే ఇస్తానని చెబుతాడు హర్షా. ఆ మాటలు విన్న రేఖ రగిలిపోతుంది.

నేను రావొద్దు అన్నా ఎందుకు ఆఫీస్‌కి వచ్చావు? నా గురించి తెలిసికూడా ఇంత రిస్క్ తీసుకుంటావా? అని శృతిపై మండిపడుతుంది రేఖ. కావ్య- రాజ్‌ సార్‌లు మా కుటుంబానికి ఎంతో చేశారు. నా ప్రాణం పోయినా ఇందూ మేడంకి అన్యాయం చేయనని తేల్చేస్తుంది శృతి. ఆ మాటలు విన్న ఇందూ.. శృతిని హత్తుకుంటుంది. చలపతి- లక్ష్మీని ఇంటికి పిలిచి భోజనం పెట్టడంతో పాటు 5 నెలల బోనస్ ఇస్తాడు ఓనర్. ఇదే సమయంలో ఓనర్ కుమార్తె వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నానని ఓ కంపెనీ పేరు చెబుతుంది. మా అబ్బాయి కూడా అందులోనే వర్క్ చేస్తున్నాడని పేరు చెప్పగా.. వెంకీ పేరున్న వ్యక్తి ఎవరూ మా కంపెనీలో లేరని అంటుంది. ఇంతలో ఫుడ్ డెలవరీ చేయడానికి అదే ఇంటికి వచ్చిన వెంకీ.. తల్లిదండ్రులను చూసి షాక్ అవుతాడు. ముఖానికి మాస్క్ పెట్టుకుని డెలివరీ చేసి వెళ్లిపోతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 30వ తేదీ ఎపిసోడ్ 1072లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial June 30th 2026 Episode 1072 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రాజ్ దెబ్బకి రేఖ చెల్లెమ్మతో ఎలాంటి ఉపయోగం లేదని ప్రూవ్ అవుతుంది. అప్పుడు అల్లుడు, ఇందూ రాజు రాణిలాగా బృందావనం ఇంట్లో చిరునవ్వులతో వెలిగిపోతారు, ఆ ముసలోళ్ల జీవితాల్లో సంతోషాలు నింపుతారని చెబుతాడు శేషం. భవిష్యత్తులో రేఖ వంట మనిషిగా, భ్రమరాంబ పనిమనిషిగా ఉండగా.. వారితో అపర్ణ పనులు చేయిస్తున్నట్లుగా కలగంటారు. నీ ఇమేజినేషన్ చూస్తుంటే చాలా భయం వేస్తోందని అంటుంది భ్రమరాంబ. అసలే నేను ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాను, నన్ను రెచ్చగొట్టద్దని మండిపడుతుంది రేఖ. నువ్వు మా ఆయన మీద అరిచి ప్రయోజనం లేదు. ఆ రాజ్‌గాడు ఇందూకి సపోర్ట్‌గా ఉంటూ కంపెనీని తన చేతుల్లోకి తీసుకున్నాడని అంటుంది భ్రమరాంబ.

ఇందూనీ నువ్వు సీఈవోని చేస్తే వాడు పెత్తనం చెలాయిస్తున్నాడు, ఈరోజు నీ అవసరం లేకుండానే సక్సెస్‌ఫుల్‌గా డీల్ కుదుర్చుకున్నాడు. ఇకపై వాడి ఆలోచన ఇంటిపై పడుతుందేమో, రేపటి నుంచి ఈ ఇంట్లో నీ పెత్తనం లేకుండా చేస్తాడేమోనని ప్రశ్నిస్తుంది భ్రమరాంబ. గెలవడం కోసం ఏదైనా చేస్తా.. వాడికి నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఛాలెంజ్ చేస్తుంది రేఖ. కాస్తుంటే అమ్మానాన్నలకు దొరికిపోయేవాడినని నందూ దగ్గర బాధపడతాడు వెంకీ. వాళ్లు నన్ను చూసుంటే నా పరిస్ధితి ఏంటీ? అని అడుగుతాడు. నా వల్ల కావడం లేదు.. నేను వాళ్లని మోసం చేస్తున్నాను, నేను అబద్ధాల కోరుని అయిపోయాను, సరిగా నిద్రకూడా పోవడం లేదని అంటాడు వెంకీ.

నువ్వు మెతక మనిషివి, అందుకే నీకు ముందే చెప్పాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైతే నువ్వు ఫేస్ చేయలేవని అంటుంది నందూ. నన్ను మా అమ్మనాన్న చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచారు. తాహతుకు మించి అప్పులు చేసి మరి చదివించారు.. నేను పై స్థాయిలో ఉండటం చూడాలని ఎంతో ఆశించారు. అలాంటి వాళ్లకు నేను డెలివరీ బాయ్‌గా బతుకుతున్నానని తెలిస్తే తట్టుకోలేరు. ఇన్నేళ్లుగా పడని కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని బాధపడతారు, జనం మధ్యలో తలెత్తుకోలేరు. అయినా నువ్వేమీ దొంగతనం చేయడం లేదు. కష్టపడి పనిచేసుకుని నీ డబ్బుతో నువ్వు చదువుకుంటున్నావని అంటుంది నందూ.

చిన్నప్పటి నుంచి మా అన్నయ్య నా కోసం వాడి ఇష్టాలను వదులుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఇంట్లో పరిస్ధితిని అర్ధం చేసుకుని, వాడు గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్లేవాడు, నన్ను మాత్రం ప్రైవేట్ స్కూల్‌కి పంపించేవాడు, నాకు కొత్త బుక్స్ కొనిపించేవాడు, వాడు మాత్రం సెకండ్ హ్యాండ్‌లో కొనుక్కునేవాడు. ఇలా అన్ని విషయాల్లో నాకు సపోర్ట్ చేస్తూ.. నా కోసం వాడి జీవితాన్నే త్యాగం చేస్తాడు. నేను ఇలాంటి పనిచేస్తున్నానంటే వాడు పెట్టుకున్న నమ్మకాన్ని తుడిచేసినట్లే, మా అన్నయ్య పెట్టుకున్న త్యాగానికి అర్ధం లేదని బాధపడతాడు. జీవితంలో అందరికీ కష్టాలు వస్తాయి.. నీకు ఈ రూపంలో వచ్చాయి, ఏదైనా పోరాడి సాధించాలి. నీ గోల్ మీద ఫోకస్ కూడా చేయలేవు, ఏదో ఒకరోజు వాళ్లు నీకు ఎదురుపడితే పరిస్ధితి ఏంటీ? బయటివాళ్లు చెబితే ఏం చేస్తావు? అందుకే నువ్వు ఏం చేస్తున్నావో ముందే నిజం చెప్పమని ధైర్యం నూరిపోస్తుంది నందూ.

నువ్వొచ్చాకే ఇందూలో ధైర్యం వచ్చింది.. ఈ డిజైన్స్ ఓకే చేయించుకోవడం కోసం మీరిద్దరూ ఎంతో కష్టపడ్డారని రాజ్, ఇందూలని మెచ్చుకుంటారు సుభాష్- అపర్ణ. నాకు పార్టీ కావాలని స్వాతి అడగ్గా.. ఏం కావాలన్నా చేస్తానని చెబుతాడు రాజ్. మీకు ఏం కావాలన్నా ఇంట్లోనే చేసి పెడతానని అంటుంది ఇందూ. ఇది మీ ఇద్దరి పెద్ద విజయం. మీకు శత్రువులు ఎక్కువ అవుతారు, మన కంపెనీ మీద కోపంతో ఉన్నవారు మీతో పోటీపడతారు. మిమ్మల్ని ఓడించాలని ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటారు.. కాబట్టి మీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తాడు సుభాష్. ఇందూకి తోడుగా, తన మొగుడిగా నేనున్నాను కదా అంటాడు రాజ్.

వెంకీ ఇంటికి రాగానే టిప్స్ బాగా వచ్చాయా? అని చలపతి అడగటంతో వెంకీ షాక్ అవుతాడు. నువ్వు ముఖం కవర్ చేసుకుంటే మేం గుర్తుపట్టలేమా అని అంటుంది లక్ష్మీ. మన పరిస్ధితులు బాలేదు, కోచింగ్ తీసుకోకపోతే ఎక్కడా జాబ్ దొరికే పరిస్ధితి కనిపించడం లేదు, ఇప్పటికే మీరు నా చదువుకి అప్పు చేశారు. నేను ఏదో ఒక పని చేసి ఎంతో కొంత సంపాదించాలని అనుకున్నాను అని చెబుతాడు వెంకీ. కోచింగ్ ఫీజుని, నీ ఖర్చుల్ని నేనే భరిస్తాను.. నువ్వు ఎవరితో పడితే వాళ్లతో మాటలు పడొద్దని తండ్రి చెప్పడంతో చలపతిని హత్తుకుంటాడు వెంకీ. రేపటి నుంచి ఆ పని మానేయమని చలపతి చెప్పగా.. అలా చేయొద్దని అంటుంది నందూ.

వాడికి ఇప్పుడిప్పుడే జీవితం అంటే ఏంటో తెలుస్తోంది, వెనక్కి లాగొద్దని అంటుంది నందూ. సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాల్సిన వాడు ఇలాంటి పనులు చేస్తే మా పరువు పోతుందని అంటాడు చలపతి. వాడు పని మానేస్తే మళ్లీ నలుగురు అనుకునే మాటల వల్ల వాడు డిస్ట్రబ్ చేస్తాడు. ఇలాంటి పరిస్ధితులు ఎదురైనా తట్టుకునేలా తయారవుతాడని చెబుతుంది నందూ. దాంతో చలపతి సరేనని అంటాడు. రాజ్‌కి స్వీట్ తినిపించాలని ఇందూ వస్తుంది. అయితే ఇదంతా కల అనుకుంటాడు రాజ్. కానీ ఇందూ తన వెనకే రావడంతో షాక్ అవుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X