Brahmamudi June 3rd Episode: యామిని అందాల ఎరకు లొంగని రాజ్.. భర్తను కాపాడుకున్న కావ్య

Photo Courtesy: JioHotstar

శోభనం గదిలో అప్పూ కోసం వెయిట్ చేస్తుంటాడు కళ్యాణ్. తనను పట్టించుకోకుండా ఫోన్‌లో ఛాటింగ్ చేస్తున్న భార్యపై మండిపడతాడు కళ్యాణ్. అప్పూ ఇచ్చిన పాల గ్లాస్‌ను పక్కకు నెట్టేయడంతో ఆమె అలుగుతుంది. భార్యను కూల్ చేసిన కళ్యాణ్ .. అప్పూ నడుము గిల్లి ఆమెను బెడ్‌పైకి తీసుకెళ్తాడు. కొట్టేసిన స్వప్న నగల్ని ప్రియురాలికి అలంకరించి హగ్ చేసుకోబోతాడు రాహుల్. తనకు విల్లా కొనిస్తేనే ఒంటి మీద చేయి వేయాలని తేల్చి చెబుతుంది. విల్లా అంటే 5 కోట్లు అవుతుందని తనకు కొంచెం టైం ఇవ్వమని అడుగుతాడు రాహుల్.

ఆ యామిని తన తెలివితేటలతో రాజ్‌ను ప్రపోజ్ చేయకుండా అడ్డుకుంది రేపు రిసార్ట్‌కి తీసుకెళ్తోందని కావ్యకి అపర్ణ, ఇందిరలు చెబుతారు. ఆ రిసార్ట్‌లో ఏదైనా తప్పు జరిగిందా రాజ్ నీకు శాశ్వతంగా దూరమైపోతాడని వార్నింగ్ ఇస్తారు. నువ్వు వెంటనే ఆపరేషన్ మాంగళ్య స్టార్ట్ చేసి రిసార్ట్‌కి వెళ్లి నీ భర్తను కాపాడుకోమని సలహా ఇస్తుంది ఇందిర. రిసార్ట్‌కు బయల్దేరుతున్న యామినిని చూసి శోభనం ఆలోచన మానుకోమని నచ్చచెబుతుంది వైదేహి. బావని దక్కించుకోవడానికి ఇంతకుమించి వేరే దారి లేదని అంటుంది యామిని. రిసార్ట్‌కి కావ్య వస్తున్న విషయాన్ని రాజ్‌కు ఫోన్ చేసి చెబుతుంది ఇందిర. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 3వ తేదీ ఎపిసోడ్ 738లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial June 3rd 2025 Episode 738 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రిసార్ట్‌కు వెళ్తూ సైలెంట్‌గా ఉన్న రాజ్‌ను ఏదో ఒకటి మాట్లాడమని అడుగుతుంది యామిని. మనం రిసార్ట్‌కి వెళ్లేది మాట్లాడటానికి కదా? అన్ని ఇక్కడే మాట్లాడితే అక్కడేం మాట్లాడుకుంటామని ప్రశ్నిస్తాడు రాజ్. మన మనసుకు నచ్చిన మనిషితో మాట్లాడేటప్పుడు ఫుల్‌స్టాపులు ఉండవని అంటుంది యామిని. ప్రేమలో ఉన్నవాళ్లు మాట్లాడే టాపిక్స్‌కి ఎండింగ్ అనేది ఉండదని, ఎంతసేపు మాట్లాడినా ఇంకా కాసేపు మాట్లాడితే బాగుండు అనిపిస్తుందని చెబుతుంది. చూసేవాళ్లకి చిరగ్గా ఉన్నా లవర్స్‌కి మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందని చెబుతుంది.

తాను ఎంత మాట్లాడుతున్నా రాజ్ మాత్రం సైలెంట్‌గా ఉండటంతో యామిని డల్‌గా ఉంటుంది. నీకు మాట్లాడటం ఇష్టం లేకపోతే నిన్ను ఇబ్బంది పెట్టనని అంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే యామిని.. మనం ఇష్టపడే వాళ్లతో ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడాలనిపిస్తుందని మనసులో అనుకుంటాడు రాజ్. కళావతి రిసార్ట్‌కి రాగానే నా గుండెల్లో ఉన్నది నువ్వేనని చెప్పి నా మనసులోని ప్రేమను బయటపెట్టి తన ప్రేమను గెలుచుకుంటానని అనుకుంటాడు. నిన్ను ఆ కావ్యకి ఎట్టి పరిస్ధితుల్లోనూ దగ్గర కానివ్వనని, ఏది ఏమైనా సరే నిన్ను ఈరోజు పూర్తిగా నా సొంతం చేసుకుని కావ్య నీ జీవితంలోకి రాకుండా చేస్తానని అనుకుంటుంది యామిని.

స్వప్న నగల్ని తన ప్రియురాలికి ఇచ్చిన రాహుల్.. అచ్చం అలాంటి వాటిని పోలినట్లుగానే గిల్ట్ నగలు చేయించి తీసుకొస్తాడు. వీటిని స్వప్న అస్సలు గుర్తుపట్టలేదని, వీటిని కబోర్డ్‌లో పెట్టేస్తే మిషన్ ఏడు వారాల నగలు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయినట్లేనని అనుకుంటాడు రాహుల్. కబోర్డ్‌కి లాక్ ఉండటంతో నగల్ని ఎలా పెట్టాలో తెలియక టెన్షన్ పడతాడు. ఇంతలో స్వప్న రావడంతో రాహుల్‌కి గుండె ఆగినంత పని అవుతుంది. బయటికి వెళ్తున్నానని పవన్ బ్యాంక్ కోసం వెతుకుతున్నానని స్వప్నకి చెబుతాడు రాహుల్. నీ పవర్ బ్యాంక్ నా లాకర్‌లో పెట్టావా అని ప్రశ్నిస్తుంది. కబోర్డ్ తాళాలు స్వప్న తన బొడ్డులో దాచుకోవడాన్ని రాహుల్ గమనిస్తాడు. మరిచిపోయావా? లేక మరిచిపోయినట్లు నటిస్తూ ఏదైనా ప్లాన్ మీద వచ్చావా? అని నిలదీస్తుంది స్వప్న.

నీ ముందు నా ప్లాన్స్ వర్కవుట్ కావని చెబుతాడు రాహుల్. నిన్ను చూస్తుంటే నాకేదో డౌట్‌గా ఉందని, మొన్న కూడా లాకర్ దగ్గరే నిలబడ్డావని అంటుంది స్వప్న. అప్పుడు మల్లెపూలు తీసుకొచ్చావ్, ఇప్పుడేమో పవర్ బ్యాంక్ అంటున్నావని ప్రశ్నిస్తుంది. నీ మీద ఒట్టు నేను నిజమే చెబుతున్నానని, తేడా వస్తే నువ్వు నన్ను బతకనిస్తావా? అని అడుగుతాడు రాహుల్. నీ గురించి తెలిసి కూడా నేను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తానా? అని అంటాడు. ఆ మాత్రం భయం ఉంటే చాలని చెప్పి స్వప్న వెళ్లిపోతుంది. ప్రస్తుతానికి దీని దగ్గరి నుంచి తప్పించుకున్నానని, కానీ ఎలాగైనా దీని దగ్గర ఉన్న తాళాలు కొట్టేసి డూప్లికేట్ నగల్ని కబోర్డ్‌లో పెట్టేయాలని అనుకుంటాడు రాహుల్.

వీరిద్దరి మాటలను రుద్రాణి దొంగచాటుగా విని లోపలికి వస్తుంది. ఏం చేస్తున్నావ్? ఏం చేయాలనుకుంటున్నావని రాహుల్‌ని నిలదీస్తుంది. కావ్య-రాజ్‌లను ఎలా విడగొట్టి యామినితో రాజ్‌కి పెళ్లి చేయాలా అని ఆలోచిస్తున్నానని అంటాడు రాహుల్. నీ బాడీ లాంగ్వేజ్ దొంగలా, నీ చూపు కూడా దొంగలాగే ఉందని అంటుంది రుద్రాణి. నేను నీ తల్లిని నా దగ్గర నీ వేషాలు వద్దు, మళ్లీ ఏం పనికిరాని పని చేశావని నిలదీస్తుంది. యామినిని పెళ్లి చేసుకుని రాజ్ వెళ్లిపోయాక కంపెనీకి మిగిలిన ఏకైక వారసుడివి నువ్వేనని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నానని రుద్రాణి చెబుతుంది. దానిని చెడగొడితే మాత్రం నిన్ను చంపేస్తానని రాహుల్‌కి వార్నింగ్ ఇస్తుంది.

రిసార్ట్‌కి వచ్చిన రాజ్- యామినిలు గదిలో దిగుతారు. అందరూ పెళ్లయిన తర్వాత లైఫ్ మొదలుపెడితే మనం మాత్రం పెళ్లికి ముందే స్టార్ట్ చేద్దామని రాజ్‌తో అంటూ అతని భుజంపై వాలిపోతుంది యామిని. నేను దగ్గరికొస్తే నీలో రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తున్నాయా? అని యామిని అడగ్గా.. నా లిమిట్స్ నాకు గుర్తొస్తున్నాయని చెబుతాడు రాజ్. మీ అమ్మనాన్న నన్ను నమ్మి నిన్ను నాతో పంపించారని, వాళ్ల నమ్మకాన్ని పొగొట్టుకోనని అంటాడు రాజ్. మనకి ఇంకా పెళ్లి కాలేదని రాజ్ చెప్పబోతుండగా యామిని అడ్డుకుని అతనికి ఇంకా దగ్గర అవుతుంది. దాంతో రాజ్ కోపంతో దూరంగా వచ్చేస్తాడు.

రిసార్ట్‌కి కళావతి రావడం చూసిన రాజ్ చాలా సంతోషిస్తాడు. మా ఆంటి వాళ్లు చెప్పడంతో ఇక్కడికి వచ్చానని కావ్యతో అంటాడు రాజ్. యామినితోనే ఇక్కడికి వచ్చానని ఆమెకు తెలియకూడదని అనుకుంటాడు. నాకు మీటింగ్ ఉందని అందుకే ఇక్కడికి వచ్చానని చెబుతుంది కావ్య. యామినిని చూసిన రాజ్.. కావ్యని పక్కగదిలోకి తీసుకెళ్తాడు. రాజ్ సర్ ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తానని అక్కడ పనిచేసే పండు యామినితో చెబుతాడు. మీరు ఏదో తప్పు చేసినవాడిలా టెన్షన్ పడుతున్నారని రాజ్‌తో అంటుంది కావ్య.

పోలీస్ స్టేషన్‌కి వెళ్లేందుకు రెడీ అవుతున్న అప్పూపై ధాన్యలక్ష్మీ మండిపడుతుంది. శోభనం జరిగిన మరుసటి రోజు ఇంట్లో పూజ పెట్టుకుంటారు, ఆ విషయం కూడా నీకు తెలియదా? అంటూ ప్రశ్నిస్తుంది. తను డ్యూటికీ వెళ్లడం లేదని మూడు రోజులు లీవ్ పెట్టిందని చెబుతాడు కళ్యాణ్. నాకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవడం రాదని అందుకే దానిని నేర్చుకుంటున్నానని చెబుతుంది అప్పూ. నువ్వు చేసిన ప్రాక్టీస్ చాలని వెళ్లి పూజ గది సిద్ధం చేసుకోమని అప్పూతో అంటుంది ధాన్యలక్ష్మీ. రాజ్‌తో కావ్యని చూసిన ఆఫీస్ బాయ్ పండు షాక్ అవుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X